Telangana Schemes | ప్రగతి రథచక్రాలు – తెలంగాణ పథకాలు
అనేక విభిన్నతలు ఉన్న సమాజంలో అన్ని వర్గాల ప్రజల జీవితాలను ప్రగతిపథంలో నడిపించేందుకు ప్రభుత్వాలు ఏకరూప విధానాలను అనుసరిస్తే పెద్దగా ప్రయోజనాలు ఉండవు. ఎవరికి ఎలాంటి చేయూతనిస్తే ప్రగతిమార్గంలోకి వస్తారో క్షుణ్ణంగా తెలుసుకొని ఆ మేరకు పథకాలను ప్రారంభించాలి. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం అదే చేస్తున్నది. రాష్ట్రంలోని భిన్న వర్గాల ప్రజల అవసరాలు తీర్చి, వారి జీవితాల్లో మార్పు తెచ్చేందుకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగాల భర్తీ పరీక్షల్లో ఈ సంక్షేమ పథకాలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల నిపుణ పాఠకులకోసం తెలంగాణ సంక్షేమ పథకాల కొన్నింటి వివరాలు అందిస్తున్నాం…
భూ రికార్డుల ప్రక్షాళన
-రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళనను 2017, సెప్టెంబర్ 15న ప్రారంభించింది. 2017, డిసెంబర్ 31 నాటికి రెవెన్యూ గ్రామం యూనిట్‌గా భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేయాలనేది లక్ష్యం.
-రాష్ట్రంలో మొత్తం 568 మండలాల్లో 10,733 రెవెన్యూ గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళనను నిర్వహిస్తున్నారు.
-ఎలాంటి వివాదాలు లేని భూముల రికార్డులను తొలుత ప్రక్షాళన చేస్తారు. ప్రతి గ్రామంలో గ్రామసభ లేదా రైతుసభ పేరుతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రక్షాళన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
-భూముల సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు 54 అంశాల ద్వారా సమాచారాన్ని సేకరిస్తారు.
-భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమానికి ప్రత్యేక అధికారిగా వాకాటి కరుణను నియమించారు.
-రాష్ట్రంలో భూ వివరాలకు సంబంధించిన ప్రత్యేక పోర్టల్ మా భూమి.
-ఈ పథకం ఉద్దేశం భూ ప్రక్షాళనను పూర్తిచేసి నిజమైన రైతులను గుర్తించి, ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలను అందించడం.
రైతుబంధు పథకం
-ఈ పథకాన్ని FISS (Farmers Investment Support Scheme) అంటారు.
-2018, మే 10న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్‌లో సీఎం కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు.
-ఈ పథకానికి 2018-19 బడ్జెట్లో రూ. 12,000 కోట్లు కేటాయించారు.
-రైతుబంధు పథకం కింద లబ్ధి పొందే రైతులు – 58.33 లక్షలు
-ఖరీఫ్‌కు రూ. 4000, రబీకి రూ. 4000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తారు.
-విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, కూలి ఇతర పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు కింద సాయం అందిస్తున్నది.
-ఈ పథకానికి రాష్ట్రంలోని రైతులందరూ అర్హులే. కౌలు రైతులకు ఈ పథకం వర్తించదు. వ్యవసాయ భూమికి గరిష్ఠ పరిమితి లేదు.
రైతు బీమా పథకం
-రాష్ట్రంలో సన్న, చిన్నకారు రైతులే 93 శాతం ఉన్నారు. ఏదైనా పరిస్థితుల్లో ఆ రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. ఈ క్రమంలో తెంగాణ ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక పథకానికి శ్రీకారం చుట్టింది. అదే రైతు బీమా పథకం.
-2018, ఆగస్టు 15న రైతు బీమా పథకాన్ని ప్రారంభించి, రైతులకు బీమా సర్టిఫికెట్లను అందించనున్నారు.
-సాధారణ పరిస్థితుల్లో రైతు మృతిచెందితే ఆ కుటుంబానికి రూ. 5 లక్షల రూపాయలు అందుతాయి. ఇది ప్రమాద బీమా కాదు జీవిత బీమా.
-సాధారణ జీవిత బీమాకు 18 నుంచి 60 ఏండ్ల మధ్య వయస్సు గల వారు అర్హులు. ఈ నేపథ్యంలో 2018, ఆగస్టు 15 నాటికి రైతు 18 నుంచి 59 ఏండ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
-ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నది.
-ఈ పథకం కోసం రైతు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.
రైతు సమన్వయ సమితి
-రెవెన్యూ గ్రామంలో గ్రామ రైతు సమన్వయ సమితి సభ్యుల సంఖ్య 15 గాను, మండల రైతు సమన్వయ సమితి సభ్యుల సంఖ్య 24 గాను, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుల సంఖ్య 24 గాను, రాష్ట్ర రైతు సమన్వయ సమితి సభ్యుల సంఖ్య 42గాను నిర్ణయించారు. రైతులు గ్రామంలో నివసించే వారై, వ్యవసాయం చేస్తున్న వారై, పట్టాదారులై ఉండాలి. కమిటీల్లో మూడో వంతు మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలి.
-రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ నల్లగొండ జిల్లా ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి.
టీ-బ్రిడ్జి
-2016, అక్టోబర్ 15న టీ-బ్రిడ్జిని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ప్రారంభించారు.
-రాష్ట్రంలోని స్టార్టప్ కంపెనీలను ప్రపంచ మార్కెట్లోని అవకాశాలను అందుబాటులోకి తీసుకురావడం కోసం టీ-హబ్, ఉబర్, టీఐఈలు సంయక్తంగా ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించాయి.
-టీ-బ్రిడ్జి దేశ స్టార్టప్ కంపెనీలను ప్రపంచ మార్కెట్ అవకాశాలతో అనుసంధానం చేయడానికి, ప్రపంచంలోని స్టార్టప్‌లు దేశానికి రావడానికి సహకరిస్తుంది.
ఆహార భద్రత
-కుటుంబంలో ప్రతి ఒక్కరికీ 6 కిలోల బియ్యం అందించడం ఈ పథకం ఉద్దేశం.
-2015, జనవరి 1న ఈ పథకాన్ని ప్రారంభించారు.
-ఈ పథకం కింద నేత కార్మికుల కుటుంబానికి ఉచితంగా నెలకు 25 కిలోల బియ్యం, అన్నపూర్ణ కార్డుదారులకు కుటుంబానికి ఉచితంగా 10 కిలోల బియ్యం, అంత్యోదయ అన్నయోజన కార్డుదారులకు రూ. 1 కిలో చొప్పున కుటుంబానికి 35 కిలోలు, తెల్లకార్డుదారులకు రూ. 1 కిలో చొప్పున కుటుంబానికి 30 కిలోలు ఇస్తున్నారు.
హాస్టళ్లకు సన్న బియ్యం
-ఈ పథకాన్ని 2015, జనవరి 1 నుంచి అమలు చేస్తున్నారు.
-హాస్టళ్ల విద్యార్థులకు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించేందుకు సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు.
-ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి 100 గ్రాములు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి 150 గ్రాముల చొప్పున ప్రతిరోజు అందిస్తున్నారు.
సద్దిమూట
-ఈ పథకాన్ని 2014, అక్టోబర్ 13న సిద్దిపేట మార్కెట్ యార్డులో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు ప్రారంభించారు.
-రైతులు, హమాలీలకు రూ. 5లకే నాణ్యమైన భోజనం అందించడం ఈ పథకం ముఖ్యోద్దేశం.
-ఎంఐఈఎల్ కంపెనీ, హరేరామ-హరేకృష్ణ ట్రస్ట్ సహకారంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
-రైతు రూ. 5 చెల్లిస్తే, మార్కెట్ కమిటీ రూ. 5, మిగిలిన ఖర్చులను ఎంఐఈఎల్, హరేరామ-హరేకృష్ణ ట్రస్టు భరిస్తాయి.
చేనేత లక్ష్మి
-పొదుపు ద్వారా చేనేత వస్ర్తాలను రాయితీపై అందించేందుకు చేనేత లక్ష్మి పథకాన్ని టెస్కో ప్రవేశపెట్టింది.
-ఇందులో ఐదు నెలల పథకంలో ఎవరైనా వరుసగా నాలుగు నెలలు రూ. 500 చెల్లిస్తే, ఐదో నెల వాయిదా రూ. 500లను టెస్కో భరిస్తుంది. అంతేకాకుండా, వారికి రూ. 3000 విలువైన చేనేత వస్ర్తాలను అందిస్తుంది.
-10 నెలల పథకంలో ఎవరైనా వరుసగా 9 నెలలు రూ. 500 చొప్పున చెల్లిస్తే, పదో నెలలో రూ. 7200 విలువైన వస్ర్తాలను అందిస్తుంది.
టీ-హబ్
-నినాదం: ఆలోచనలతో రండి.. ఆవిష్కరణలతో వెళ్లండి..
-వినూత్న ఆవిష్కరణలు చేసే వారిని, వారికి ఆర్థికంగా సహకరించే పారిశ్రామికవేత్తలను అనుసంధానం చేసి, యువత కలలను నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం టీ-హబ్‌ను ప్రారంభించింది.
-2015, నవంబర్ 5న టీ-హబ్ భవనం కేటలిస్టును గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, టాటా గ్రూప్ చైర్మన్ రతన్‌టాటా ప్రారంభించారు.
-దేశంలో ప్రభుత్వరంగంలో ఏర్పాటు చేసిన తొలి ఇంక్యుబేటర్‌గా టీ-హబ్ ప్రసిద్ధిగాంచింది.
మిషన్ భగీరథ
-ఈ పథకాన్ని తెలంగాణ తాగునీటి సరఫరా ప్రాజెక్ట్ (టీడబ్ల్యూఎస్పీ) లేదా వాటర్‌గ్రిడ్ లేదా జలహారం అని కూడా అంటారు.
-2015, జూన్ 8న నల్లగొండ జిల్లా (ప్రస్తుతం యాదాద్రి భువనగిరి) చౌటుప్పల్‌లో మిషన్ భగీరథ పైలాన్‌ను సీఎం కే చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు.
-హైదరాబాద్ మినహా మిగిలిన పాత తొమ్మిది జిల్లాల్లోని 25,139 గ్రామీణ జనావాసాలు, 59 మున్సిపాలిటీలు, 5 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని ప్రజలకు నల్లా ద్వారా రక్షిత మంచినీటిని అందించేందుకు ఈ పథకం రూపొందించారు.
ప్రాజెక్టు లక్ష్యాలు
-ప్రతి ఇంటికి నల్లా ద్వారా సురక్షిత తాగునీరు అందించడం
-గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 100 లీటర్లు
-మున్సిపాలిటీల్లో 135 లీటర్లు
-మున్సిపల్ కార్పొరేషన్లలో 150 లీటర్లు
-10 శాతం పారిశ్రామిక అవసరాలకు కేటాయింపు
-నల్లగొండ జిల్లా ప్రజలకు ఫ్లోరోసిస్ నుంచి విముక్తి కలిగించడం
-ఈ ప్రాజెక్టును 26 సెగ్మెంట్లుగా విభజించారు.
-కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల నుంచి మొత్తం 78.06 టీఎంసీల నీటిని మిషన్ భగీరథ ప్రాజెక్ట్ ద్వారా తాగునీటి అవసరాల కోసం సరఫరా చేస్తారు.
-ఈ ప్రాజెక్టును 42,853 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు.
-ఇందుకు అవసరమైన నిధులను హడ్కో, నాబార్డ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకుల నుంచి రుణసాయంగా సమకూరుస్తారు.
-ఈ ప్రాజెక్టు పనులను వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ పర్యవేక్షిస్తున్నది.
-ఈ పథకం అమలుకు 2015, ఫిబ్రవరి 26న తెలంగాణ తాగునీటి సరఫరా కార్పొరేషన్ లిమిటెడ్ (టీడబ్ల్యూఎస్సీఎల్)ను ఏర్పాటు చేశారు.
-2016, ఆగస్టు 7న మిషన్ భగీరథ తొలిదశను ప్రధాని నరేంద్ర మోదీ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కోమటిబండ గ్రామంలో ప్రారంభించారు. దీంతో దేశంలోనే ఇంటింటికీ నల్లా సౌకర్యం పొందిన తొలి నియోజకవర్గంగా గజ్వేల్ చరిత్ర సృష్టించింది.
పథకాలు – ప్రారంభ వివరాలు
-కార్యక్రమం ప్రారంభతేదీ స్థలం
-మిషన్ భగీరథ2015, జూన్ 8 చౌటుప్పల్
-భూ రికార్డుల ప్రక్షాళన 2017, సెప్టెంబర్ 15 రాష్ట్రవ్యాప్తంగా
-రైతుబంధు 2018, మే 10 శాలపల్లి-ఇందిరానగర్
-రైతు బీమా పథకం2018, ఆగస్టు 15 రాష్ట్రవ్యాప్తంగా
-టీ-హబ్ 2015, నవంబర్ 5 హైదరాబాద్
-ఆహార భద్రత 2015, జనవరి 1న రాష్ట్రవ్యాప్తంగా
-సద్దిమూట 2014, అక్టోబర్ 13న సిద్దిపేట
-దళితబంధు- 2021, ఆగస్టు 5న యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం, వాసాలమర్రి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు