-గ్రూప్-2 ఇంటర్వ్యూ గైడెన్స్
రాష్ట్ర జనాభాలో వివిధ వర్గాల వాటా…
1. వెనుకబడిన వర్గాలు- 52.20 శాతం
2. షెడ్యూల్డ్ కులాలు- 15.44 శాతం
3. షెడ్యూల్డ్ తెగలు- 9.34 శాతం
4. ముస్లిం మైనార్టీలు- 12 శాతం
-అందువల్ల కులవృత్తులను ప్రోత్సహించడం మొదలు దళితులకు మూడెకరాల భూ పంపిణీ వంటి శాశ్వత ప్రయోజనాన్ని కల్పించే అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నది.
మిలీనియం డెవలప్మెంట్ గోల్స్
-దీన్ని ఐక్యరాజ్యసమితి రూపొందించింది.
-2000 నుంచి 2015 వరకు పేదరికం, ఆకలి, వ్యాధులకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు విధివిధానాలను రూపొందించి అమలు చేశాయి.
-2015లో ఐక్యరాజ్యసమితి ప్రపంచ అభివృద్ధి విజన్‌ను రూపొందించింది.
‘ప్రపంచ మార్పు సుస్థిరాభివృద్ధికి 2030 ఎజెండా’
-ప్రజల కోసం, భూగోళం కోసం, సౌభాగ్యం కోసం కార్యాచరణ ప్రణాళిక
-17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడం
-ఈ లక్ష్యాల సాధనకు ఎంచుకున్న విధానాలు..
1. మానవాభివృద్ధి
2. ఆర్థికాభివృద్ధి
3. పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి
4. సుపరిపాలన (స్మార్ట్ గవర్నమెంట్)
-మిలీనియం డెవలప్మెంట్ గోల్స్‌ను సాధించడానికి తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు, పథకాలను ప్రవేశపెట్టింది.
-ఈ లక్ష్యాలను నెరవేర్చడమే బంగారు తెలంగాణ లక్ష్యం
తెలంగాణలో శ్రామిక శక్తి (15-59 ఏండ్లు)
1. రోజువారీ కూలీలు- 31 శాతం
2. వ్యవసాయ కూలీలు- 23 శాతం
3. సొంత వ్యవసాయం చేసుకునే వారు- 11 శాతం
4. పని లభించనివారు- 7 శాతం
5. బీడీ కార్మికులు- 4 శాతం
6. డ్రైవర్లు- 3 శాతం
7. చిన్న వ్యాపారులు- 2 శాతం
8. వలస కూలీలు- 2 శాతం
9. ఇతరులు- 17 శాతం
రాష్ట్రంలోని శ్రామిక శక్తిలో విద్యాస్థాయి
1. నిరక్షరాస్యులు- 34 శాతం
2. సెకండరీ విద్య- 29 శాతం
3. ఇంటర్ విద్య- 10 శాతం
4. గ్రాడ్యుయేషన్- 14 శాతం
5. పోస్ట్‌గ్రాడ్యుయేషన్- 4 శాతం
6. డిప్లొమా విద్య- 2 శాతం
తెలంగాణలో భూ వినియోగం (2015-16)
1. నికర సాగు భూమి- 37.3 శాతం
2. బంజరు భూములు- 26.9 శాతం
3. అటవీ భూములు- 22.7 శాతం
4. వ్యవసాయేతర పనులకు వినియోగించే భూమి- 8 శాతం
5. ఇతర భూములు- 5.1 శాతం
-సగటు కమతం విస్తీర్ణం 1.12 హెక్టార్లు (2010-11)
సంక్షేమ యంత్రాంగం
-ప్రభుత్వాల అంతిమ లక్ష్యం అణగారిన వర్గాల అభ్యున్నతి
-యూరప్‌లో సంభవించిన పారిశ్రామిక విప్లవం, ఫ్రెంచి విప్లవం, అమెరికాలో ఏర్పడిన మహా ఆర్థికమాంద్యం ప్రభావం వల్ల దేశ ఆర్థిక వ్యవహారాల్లో రాజ్యం ఒక బలమైన శక్తిగా అవతరించింది.
-రాజ్యం ఆర్థిక లక్ష్యాలతోపాటు సామాజిక న్యాయం సమానత్వం వంటి లక్ష్యాలను సాధించే సాధనంగా పరిణామం చెందింది.
-సామాజిక సమస్యలు విసిరే సవాళ్లను అధిగమించడం కోసం రూపొందించిన విధానాలను సంక్షేమ యంత్రాంగం అంటారు.
-ఇంగ్లండ్‌లో 1834లో రూపొందించిన పూర్ లా సంక్షేమ యంత్రాంగానికి పునాది.
షెడ్యూల్డ్ కులాల సంక్షేమం
-రాజ్యాంగ రక్షణలు: 15(4), 16(4), 17, 23, 46, 330, 332, 338, 341
-రిజర్వేషన్ల కల్పన
-సంక్షేమ మంత్రిత్వ శాఖ- 1985
-సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ- 1998
-జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్
-జాతీయ షెడ్యూల్డ్ కులాల ఆర్థికాభివృద్ధి కమిషన్- 1989
షెడ్యూల్డ్ తెగల సంక్షేమం
-రాజ్యాంగ రక్షణలు: 15(4), 16(4), 19(5), 23, 46, 164, 244, 330, 332, 335, 338, 339(1)
రిజర్వేషన్ల కల్పన
-గిరిజన ఉప ప్రణాళిక- 5వ ప్రణాళిక
-సమగ్ర గిరిజనాభివృద్ధి ప్రాజెక్టులు
-గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ- 1999
-జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (89వ రాజ్యాంగ సవరణ- 2003)
-గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమాఖ్య- 1987
-జాతీయ షెడ్యూల్డ్ తెగల ఆర్థికాభివృద్ధి సంస్థ- 2001
వెనుకబడిన తరగతుల సంక్షేమం
-రాజ్యాంగం: 340వ నిబంధన
-కమిషన్లు- కాకా కాలేల్కర్- 1953
-మండల్ కమిషన్- 1978
-జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థికాభివృద్ధి సంస్థ- 1992
-జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్- 1993
మైనార్టీల సంక్షేమం
-రాజ్యాంగం: 29, 30, 347, 350(ఎ), 350(బి) నిబంధనలు
-మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ- 2005
-ప్రధానమంత్రి నూతన 15 సూత్రాల కార్యక్రమం- 2006
-జాతీయ అల్పసంఖ్యాక వర్గాల కమిషన్- 1993
-జాతీయ మైనారిటీ ఆర్థికాభివృద్ధి కమిషన్- 1994
-కేంద్ర వక్ఫ్ బోర్డ్- 1964
-మౌలానా ఆజాద్ ఫౌండేషన్- 1989
మహిళా శిశు సంక్షేమం
-రాజ్యాంగం: 15, 37(ఎ), 39(డి), 42 నిబంధనలు
చట్టాలు:
-ప్రత్యేక వివాహ చట్టం- 1954
-హిందూ వివాహ చట్టం- 1955
-హిందూ వారసత్వ చట్టం- 1956
-హిందూ దత్తత చట్టం- 1956
-మహిళలు, బాలికలతో నీతిబాహ్య వ్యాపార నిరోధ చట్టం- 1956
-ప్రసూతి సౌకర్యాల చట్టం- 1961
-వరకట్న నిషేధ చట్టం- 1961
-కుటుంబ కోర్టు చట్టం- 1984
-మహిళల పట్ల అమర్యాద సవరణ నిరోధక చట్టం- 1986
-సతీసహగమన నిషేధ చట్టం- 1987
-గృహహింస నిరోధక చట్టం- 2005
-బాలికలపై లైంగిక దాడుల నియంత్రణ చట్టం- 2012
-నేర న్యాయ సవరణ చట్టం- 2013
-పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేదింపుల నిషేధ చట్టం- 2013
-నిర్భయ చట్టం- 2013
దివ్యాంగుల సంక్షేమం
-రాజ్యాంగం: 7వ షెడ్యూల్లోని రాష్ట్ర జాబితాలో వైకల్యం అనే అంశాన్ని చేర్చారు.
-నిబంధనలు: 14, 16, 21, 41, 46, 47, 253లలో దివ్యాంగుల సంక్షేమం అభివృద్ధికి చర్యలు
-వికలాంగుల చట్టం- 1995
-వికలాంగుల పునరావాస కేంద్రాలు- 1992
-కృత్రిమ అవయవాల ఉత్పత్తి సంస్థ- 1972
-జాతీయ వికలాంగుల ఆర్థికాభివృద్ధి కార్పొరేషన్
-జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం- 1982
-దీన్ దయాల్ వికలాంగుల పునరావాస కార్యక్రమం- 1999