-స్టాటిస్టిక్స్ లేదా గణాంక శాస్త్రం అంటే ఒక విషయం గురించిన సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి, వ్యాఖ్యానించి, డాటా రూపంలో ప్రదర్శించడం. ఇది గణిత శాస్త్రంలో భాగం. శాస్త్రీయ, పారిశ్రామిక లేదా సాంఘిక సమస్యలకు గణాంకాలను వర్తింపజేసి, జనాభాతో గణాంక నమూనా ప్రక్రియను అధ్యయనం చేయడమే గణాంకశాస్త్రం. దీనిని కెరీర్‌గా ఎంచుకోవాలనుకునేవారికి సోషల్, ఎకనామిక్స్‌లో సమస్యలకు గణాంక, గణిత శాస్ర్తాన్ని వర్తింపజేసే నేర్పు, తెలివి ఉండాలి.
-పరిశ్రమల్లో వివిధ రంగాల్లోని విషయాలను గణాంకాల్లో సేకరించి, డిజైన్ చేసి, విశ్లేషించే వారినే స్టాటిస్టీషియన్స్ (గణాంక నిపుణులు)గా పిలుస్తారు. మార్కెటింగ్, ఎకనామిక్స్, బయాలజీ, పబ్లిక్ హెల్త్, స్పోర్ట్స్, మెడిసిన్స్, సైకాలజీ, శాస్త్రీయ పరిశోధన వంటి రంగాల్లో ఈ గణాంక నిపుణుల అవసరం చాలా ఉంది. అంతేగాక ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు, లేబర్ యూనియన్లు, రాజకీయ నాయకులకు, సోషల్ వర్కర్స్, ట్రేడ్ అసోసియేషన్స్, వివిధ చాంబర్లలో కూడా వీరికి బాగా డిమాండ్ ఉంది.
కోర్సులు
సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు
-సర్టిఫికెట్ ఇన్ స్టాటిస్టికల్ మెథడ్స్ అండ్ అప్లికేషన్స్
-డిప్లొమా కోర్స్ ఇన్ స్టాటిస్టిక్స్
డిగ్రీ కోర్సులు
-బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ స్టాటిస్టిక్స్
-బ్యాచిలర్ ఇన్ స్టాటిస్టిక్స్
-బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (ఆనర్స్) ఇన్ స్టాటిస్టిక్స్
-బీఎస్సీ (ఎంఎస్సీఎస్)
పీజీ కోర్సులు
-మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ స్టాటిస్టిక్స్
-మాస్టర్ ఇన్ స్టాటిస్టిక్స్
-మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఆనర్స్) ఇన్ స్టాటిస్టిక్స్
డాక్టోరల్ కోర్సులు
-మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ స్టాటిస్టిక్స్
-పీహెచ్డీ ఇన్ స్టాటిస్టిక్స్
-అర్హత: స్టాటిస్టికల్ డిగ్రీ చేయాలనుకునే విద్యార్థులు ఇంటర్లో మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్ను తప్పనిసరిగా ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. పీజీ చేయాలనుకునేవారు డిగ్రీలో స్టాటిస్టిక్స్ సబ్జెక్టుగా చదవాలి. డాక్టోరల్ కోర్సులు చేయాలనుకునేవారు ఎం.స్టాట్, ఎమ్మెస్సీ ఇన్ స్టాటిస్టిక్స్ చేసి ఉండాలి.