నిర్మల్ పెయింటింగ్స్, బొమ్మలు ఈ పరిశ్రమను 1955లో స్థాపించారు. నిర్మల్ పెయింటింగ్స్ బంగారు వర్ణానికి ప్రసిద్ధి. ఈ బొమ్మలు సజీవంగా, సహజంగా కనిపిస్తాయి. వీటికి తయారీకి పునికి కర్రను ఉపయోగిస్తారు. పెయింటింగ్స్ కోసం డ్యూకో పెయింట్స్ వాడుతారు. ఈ కళాకారులు గనిజ్షా అనే ప్లేయింగ్ కార్డులను తయారుచేస్తారు. వీటిపై 2010 పేటెంట్ లభించింది. ఇది 2009లో భౌగోళిక గుర్తింపు పొందింది.
ఔషధ పరిశ్రమలు
దేశంలో బల్క్‌డ్రగ్, టీకాలకు రాజధానిగా హైదరాబాద్ పేరొందింది. రాష్ట్రంలోని ఔషధ పరిశ్రమలను గురించి తెలుసుకుందాం..
ఐడీపీఎల్
-ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఐడీపీఎల్)కు మొత్తం ఆరు యూనిట్లు ఉన్నాయి.
-హైదరాబాద్‌లోని బాలానగర్‌లో 1967లో స్థాపించారు. ఈ సంస్థ విటమిన్లు, క్లోరోక్విన్, మిథైల్ డొపమైన్ మొదలై న 47 రకాల సింథటిక్ మందులను తయారుచేస్తుంది.
-ఈ సంస్థలో నైపర్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్)ని 2007, అక్టోబర్ 19న స్థాపించారు.
-ఇది భారత ఫార్మా పరిశ్రమకు కావలసిన నిపుణులను తయారుచేస్తున్నది.
రెడ్డీస్ ల్యాబొరేటరీ
-1984లో హైదరాబాద్‌లో డా.అంజిరెడ్డి స్థాపించారు.
-న్యూయార్క్ స్టాక్ ఎక్చ్సేంజీలో నమోదైన మొదటి భారతీయ కంపెనీ.
శాంతా బయోటెక్
-1993లో మెదక్ జిల్లా ముప్పిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేశారు.
-ఇది దేశంలో మొదటిసారి హెపటైటిస్ బీ టీకాను విడుదల చేసింది.
హెటిరో ఫార్మసీ
-స్థాపన- 1993 (హైదరాబాద్)
-స్థాపకులు- బీ పార్థసారథి రెడ్డి
-ఇది దేశంలో అతిపెద్ద ఔషధ పరిశ్రమల్లో ఒకటి.
-ఇది ఒక పేరెంట్ కంపెనీ
అరబిందో ఫార్మా లిమిటెడ్
-1986లో పీవీ రాంప్రసాద్ రెడ్డి స్థాపించారు
-సెమి సింథటిక్ పెన్సిలిన్, హృదయ చికిత్స, న్యూరోసైన్స్ చికిత్స విభాగాల్లో ఔషధాలను తయారుచేసి పేరొందింది.
-ఈ సంస్థ 125 దేశాలకు తన ఉత్పత్తులను ఎగుమతిస్తున్నది. తన ఆదాయంలో 70 శాతం అంతర్జాతీయ కార్యకలాపాలవల్ల సమకూరుతుంది.
జీనోమ్ వ్యాలీ
-స్థాపన- 1999 (శామీర్‌పేట, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా)
-ఇది దేశంలో అతిపెద్ద మొదటి ప్రపంచస్థాయి బయోటెక్ పార్కుల సమూహం.
-ఇక్కడ జీవవైవిధ్యపరమైన పరిశోధన, ఉత్పాదక కార్యకలాపాలు, శిక్షణ ఇస్తారు.
-ఆసియాలోనే అతిపెద్ద సృజనాత్మక లైఫ్‌సైన్స్ క్లస్టర్‌గా జీనోమ్ వ్యాలీ పేరుగాంచింది.
షాపూర్ జీ పల్లోంజీ బయోటెక్ పార్క్
-విస్తీర్ణం- 300 ఎకరాలు
-ప్రదేశం- తుర్కపల్లి (శామీర్‌పేట)
-ఇది మొదటి దశలో ఏర్పాటుచేసిన పార్క్
-రెండో దశ (2009)- లాల్‌గడి మలక్‌పేట గ్రామం
శామీర్‌పేట
-ఇది TSIIC అభివృద్ధిపర్చిన సెజ్.
-మూడో దశ- కర్కపట్ల గ్రామం, ములుగు మండలం,
సిద్దిపేట జిల్లా
-ఇది TSIIC అభివృద్ధిపర్చిన సెజ్.
-నాలుగో దశ- ములుగు, సిద్దిపేట జిల్లా
-ఇది TSIIC అభివృద్ధిపర్చిన సెజ్.
నోట్: రంగాలవారీగా తెలంగాణ ఎగుమతుల్లో ఫార్మా, రసాయన ఉత్పత్తులే అగ్రభాగాన్ని ఆక్రమించాయి. దేశ వాణిజ్య ఎగుమతుల్లో మిగిలిన రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తెలంగాణ 11వ స్థానంలో ఉంది.
-2015-16 తెలంగాణ ఎగుమతుల్లో అత్యధిక ఆదాయం ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల ద్వారానే లభించింది.
-మొత్తం ఫార్మా ఎగుమతుల విలువ- 12,837 కోట్లు కాగా రాష్ట్రం నుంచి వాణిజ్య ఎగుమతుల్లో ఇవి 36 శాతం ఆక్రమించాయి.
-తెలంగాణ నుంచి వాణిజ్య వస్తువులను పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకునే దేశం- అమెరికా
-మొత్తం రాష్ట్ర ఎగుమతుల్లో అమెరికా వాటా- 30 శాతం
-వైద్యపరికరాల ఉత్పత్తి పార్క్: దీన్ని సుల్తాన్పూర్ (సంగారెడ్డి)లో 2017, జూన్ 17న మంత్రులు కేటీఆర్, టీ హరీష్ రావు ప్రారంభించారు. ఇది దేశంలో అతిపెద్దది.
కుటీర పరిశ్రమలు
-వృత్తి కళాకారులు, వారి ఇండ్లలో ఏర్పాటుచేసే చేతివృత్తుల పరిశ్రమలను కుటీర పరిశ్రమలు అంటారు.
-దేశంలోనే వ్యవసాయరంగం తర్వాత చేనేత పరిశ్రమ అత్యంత పెద్ద కుటీర పరిశ్రమ.
-చేనేత పరిశ్రమ గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది.
-తెలంగాణకు చెందిన హ్యాండ్లూమ్ డిజైన్లు భారత వారసత్వాన్ని, సంస్కృతిని ప్రోత్సహించేవిగా ఉన్నాయి.
-పోచంపల్లి: చేనేత, నూలు, పట్టుచీరలకు ఇతర వస్ర్తాలకు ప్రసిద్ధి.
-ఈ చీరలపై ఇక్కత్ స్టయిల్ రంగుల అద్దకం అనేది రేఖాగణిత నమూనా కలిగి ఉంటుంది.
-ఈ చీరలు 1800 నుంచి ప్రాముఖ్యతను పొందాయి.
-భూదాన్ పోచంపల్లిని సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ/సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు.
-భౌగోళిక గుర్తింపు పొందిన ఏడాది- 2005
చేనేత వస్ర్తాలు
1) సిరిసిల్ల (రాజన్న సిరిసిల్ల)
2) పోచంపల్లి (యాదాద్రి భువనగిరి)
3) గద్వాల, అయిజ (గద్వాల)
4) సిద్దిపేట (సిద్దిపేట)
సిల్వర్ ఫిలిగ్రీ (కరీంనగర్)
-వెండి తీగ పనిని సిల్వర్ ఫిలిగ్రీ అంటారు.
-ఇది పురాతనమైనది.
-వెండి/బంగారు లోహాలతో మృదువైన ఆభరణాలను తయారుచేస్తారు.
-దీన్ని రూపొందించినది- కడార్ల రామయ్య
ఎలగందుల గ్రామం
-కరీంనగర్లో అభివృద్ధి చెంది ప్రపంచ గుర్తింపు పొందింది.
-భౌగోళిక గుర్తింపు పొందిన ఏడాది- 2007
పెంబర్తి ఇత్తడి పరిశ్రమ
-ఇది జనగామ జిల్లాలో ఉంది. ఇత్తడి మెటల్ షీట్‌పై అద్భుతంగా కళాఖండాలను చెక్కే కళ.
-ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది.
-భౌగోళిక గుర్తింపు పొందిన ఏడాది- 2010
స్క్రోల్ పెయింటింగ్స్ (చేర్యాల, సిద్దిపేట)
-భౌగోళిక గుర్తింపు పొందిన ఏడాది- 2010
గొల్లభామ చీరలు (సిద్దిపేట)
-భౌగోళిక గుర్తింపు పొందిన ఏడాది- 2011
చేతిమగ్గం చీరలు
-వీటిని నారాయణపేట, మహబూబ్నగర్కాటన్, జరీ చీరలు నేస్తారు. 2012లో భౌగోళిక గుర్తింపు లభించింది.
గద్వాల చీరలు
-భౌగోళిక గుర్తింపు పొందిన ఏడాది- 2011