ఆసియాలో ముఖ్యమైన భూస్వరూపాలు ఏవంటే..?
మైదానాలు
-సమతలమైన భూభాగం ఉండి అక్కడక్కడ కొంచెం ఎత్తుగా ఉండేవి మైదానాలు.
-సైబీరియా మైదానం: ఇది రష్యాలో ఉన్నది. యూరాల్ పర్వతాల నుంచి పసిఫిక్ మహాసముద్రం వరకు విస్తరించి ఉన్నది.
-చైనా మైదానం: చైనాలోని హొయాంగ్‌హో, యాంగ్ట్సికియాంగ్, సికియాంగ్ నదుల మధ్య ఉన్నది.
-మెసపటోమియా మైదానం: ఇది ఇరాక్‌లోని టైగ్రిస్, యూప్రటిస్ నదుల మధ్య ఉన్నది.
-ఐరావతి మైదానం: ఇది మయన్మార్‌లో ఉన్నది.
-గంగా-సింధు మైదానం: ఇది భారతదేశంలో ఉన్నది. ఇది ప్రపంచంలో అతి విశాలమైన ఒండ్రుమట్టితో కూడిన మైదానం.
-మెకాంగ్ నదీ మైదానం: ఇది ఆగ్నేయాసియాలో ఉన్నది.
-తురానియన్ మైదానం: ఇది కజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల్లో ఆముదార్య, సిరిదార్య నదుల మధ్య ఉన్నది.
పీఠభూములు
-కొంచెం ఏటవాలుగా ఉండి ఉపరితలం విశాలంగా ఉండే భూభాగాన్ని పీఠభూమి అంటారు.
ఆసియా ఖండంలో అనేక పీఠభూములు ఉన్నాయి. అవి..
-టిబెట్ పీఠభూమి: ప్రపంచంలోనే ఎత్తయిన, అతి పెద్ద పీఠభూమి అయిన ఇది టిబెట్‌లో ఉన్నది. దీన్ని ప్రపంచ పైకప్పు (Roof of world) అని పిలుస్తారు. ఇది కైలాసనాథ-కున్లున్ పర్వత శ్రేణుల మధ్య విస్తరించి ఉన్నది.
-దక్కన్ పీఠభూమి: ఇది భారతదేశంలో ఉన్నది. ద్వీపకల్ప పీఠభూమిలో భాగంగా ఉన్నది. నర్మదానదికి దక్షిణా భాగాన విస్తరించి ఉన్న ఈ పీఠభూమి దేశంలో అతిపెద్దది.
-మెసపటోమియా పీఠభూమి: ఇది ఇరాక్‌లోని యుప్రటిస్-టైగ్రిస్ నదుల మధ్య విస్తరించి ఉంది.
-ఇరానియన్ పీఠభూమి: ఇది ఇరాన్‌లోని జాగ్రోస్-ఎల్‌బ్రజ్ పర్వతాల మధ్య విస్తరించి ఉంది.
-యునాన్ పీఠభూమి: ఇది టిబెట్ పీఠభూమికి ఈశాన్యభాగంలో ఉన్నది.
-తక్లమకాన్ ఎడారి పీఠభూమి: ఇది చైనాలోని టియన్షాన్-కున్లున్ పర్వతాల మధ్య విస్తరించి ఉంది.
-ట్రైకాన్ పీఠభూమి: ఇది చైనాలోని టియాన్షాన్-కింగన్ పర్వతాల మధ్య విస్తరించి ఉన్నది.
-షాన్ పీఠభూమి: ఇది మయన్మార్‌లోని పెగుయెమా-అరకాన్ యెమా పర్వతాల మధ్య విస్తరించి ఉంది.
-టియాన్ షాన్ పీఠభూమి: ఇది టిబెట్‌లోని కారకోరం పర్వత శ్రేణుల్లో ఉంది. ఇది పర్వతాంతర పీఠభూమి.
-కాబ్టో పీఠభూమి: ఇది మంగోలియాలో ఉన్నది.
-అనటోలియా పీఠభూమి: ఇది టర్కీలో ఉన్నది. దీన్ని ఆసియా మైనర్ పీఠభూమి అంటారు.
-ఆర్మేనియా పీఠభూమి: ఆర్మేనియాలోని కాస్పియన్, నల్ల సముద్రాల మధ్య ఉన్నది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు