బౌద్ధమతం, జైనమతాలు భారతదేశానికి చేసిన సేవలు
ఇరు మతాలు భారతదేశ చరిత్రలో ప్రతి అంశాన్ని ప్రభావితం చేసేలా తమ సేవలను అందించాయి. ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా తమ సేవలను అందించాయి.
భారతీయ వాస్తు శాస్ర్తానికి బౌద్ధం-జైనం దశ, దిశ నిర్దేశించాయి. తమ వాస్తు సంప్రదాయంలో భాగంగా బౌద్ధులు స్థూపం, చైత్యం, విహారాలు నిర్మించి హిందూ వాస్తు శైలిలోని ఆలయాల నిర్మాణానికి పరోక్షంగా కారకులయ్యారు. జైనులు తమవైన దేవాలయాలు బసదిలు నిర్మించారు. మౌంట్ అబూలోని దిల్వారా ఆలయం జైనవాస్తు శైలిలోని ఘనతను చాటుతుంది.
శిల్పం ఒక కళగా అభివృద్ధి చెందడానికి ఇరుమతాలు దోహదపడ్డాయి. బౌద్ధం తన శిల్ప సంప్రదాయంలో గాంధార, మధుర, అమరావతి శిల్ప శైలులను ప్రవేశపెట్టినది. జైనం ఏకశిలా నిర్మితాలైన విగ్రహాలను రూపొందించడాన్ని ఒక కళగా తీర్చిదిద్దినది. శ్రావణబెళగోళలోని గోమఠేశ్వరుని విగ్రహం జైన శిల్పకళకు ప్రధాన నిదర్శనంగా చెప్పవచ్చు.
చరిత్రలో తొలి గుహాలయాలను జైనులు నిర్మించారు. ఒరిస్సాలోని స్కందగిరి, కుమారగిరి గుహాలయాలు శ్రావణ బెళగొళలోని ఇంద్రగిరి, చంద్రగిరి ఆలయాలు, బాదామి, సిత్తన్నవాసల్ గుహాలయాలు జైనులు రూపొందించారు.
సాహిత్యపరంగానూ ఇరు మతాలు గొప్ప సేవలందించాయి. ముఖ్యంగా బౌద్ధం.. పాళీ, సంస్కృతం అభివృద్ధి చెందడానికి తోడ్పడింది. సంస్కృతంలో తొలి కావ్యమైన బుద్ధచరిత్రను అశ్వఘోషుడు రచించాడు. ఆచార్య నాగార్జునుడు తన విస్తృతమైన రచనలతో సంస్కృత భాషాభివృద్ధికి తోడ్పడ్డాడు. వసుబంధుడు సంస్కృతంలో బౌద్ధతత్వంపై మొట్టమొదటి నిఘంటువు అభిదమ్మ కోశంను రచించాడు. దిగ్నాగుడు, ధర్మకీర్తి బౌద్ధ సాహిత్యంలో తర్కాన్ని ప్రవేశపెట్టారు. అదేవిధంగా జైనం ప్రాంతీయ భాషలైన అర్ధమాగధి, కానరాసి, సౌరసేని అభివృద్ధికి తోడ్పడినది జైన గ్రంథాలన్నీ ప్రాకృతంలోనే లిఖించబడ్డాయి.
విద్యారంగ వ్యాప్తికి ఇరుమతాలు గొప్ప కృషిచేశాయి. ముఖ్యంగా బౌద్ధం శ్రీపర్వత, నలంద, విక్రమశిల, ఉద్ధండపుర, జగదల విశ్వవిద్యాలయాల స్థాపనకు కారణమైనది. అదేవిధంగా జైనం ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తొలి విద్యాలయాల స్థాపనకు కృషి చేసింది.
సాంస్కృతిక పరంగా భారతీయ సంస్కృతి ఆగ్నేయ ఆసియా దేశాలకు విస్తరించడంలో ఇరు మతాలు కృషిచేశాయి. కుమారదేవుడు చైనాలో, విజయ సింఘన సింహళంలో మొదటిసారిగా బౌద్ధాన్ని ప్రవేశపెట్టారు. అశ్వఘోషుడు, కనిష్కుడు, బౌద్ధ్దాన్ని మధ్యఆసియాలో వ్యాప్తిచేసి భారతదేశ సాంస్కృతిక సంబంధాలను పటిష్టపరిచారు.
రాజకీయ రంగంలోనూ బౌద్ధ జైనాలు తమ సేవల ద్వారా ఉనికిని చాటుకున్నాయి. శ్రేయోరాజ్యం అనే భావన బౌద్ధతత్వం నుంచి వచ్చింది. గొప్ప పాలకులైన అశోక, హర్షవర్ధనుడు బౌద్ధంతో ప్రభావితులయ్యారు.
ఆర్థికరంగంలో వ్యాపార, వాణిజ్యాలు విస్తరించడానికి కూడా ఇరు మతాలు కారణమయ్యాయి. ముఖ్యంగా జైనులు వృత్తిపరంగా వ్యాపారాన్నే ఎంచుకున్నారు. బౌద్ధం చొరవతో తీరప్రాంతాల్లో, పట్టణాలు వ్యాపార కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి.
తత్వచింతన మరింతగా అభివృద్ధి చెందడానికి ఇరు మతాలు దోహదపడ్డాయి. కర్మమార్గం ప్రాధాన్యాన్ని చాటిచెప్పాయి. హేతువాదానికి గట్టి పునాదులు వేశాయి. బౌద్ధంలో ఆచార్య నాగార్జునుడు శూన్యవాదాన్ని ప్రవేశపెట్టాడు. చివరకు ఇది తత్వచింతనలో గొప్ప వాదమైన శంకరాచార్యుని అద్వైత సిద్ధాంతానికి మూలం.
- Tags
- nipuna special
- TET
- TSLPRB
- TSPSC
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు