మధ్యయుగ నిర్మాణాలు ఇండో-ఇస్లామిక్ వాస్తుశైలి
మొగలుల వాస్తు శైలి
మొగలుల రాకతో ఘనమైన పర్షియన్ శైలి భారతదేశంలో ప్రవేశించింది. విశాలమైన ప్రాంగణాలు, బాల్కనీలు, పెద్దపెద్ద గుమ్మటాలు, భవనాల చుట్టూ ఎత్తయిన మినార్లు ఈ శైలిలో ముఖ్య లక్షణాలు. మొగల్ వంశ స్థాపకుడైన బాబర్ తన సమాధిని కాబూల్ నిర్మించుకున్నాడు.
ఢిల్లీలో హుమాయున్ భార్య అయిన సలీమాబేగం నిర్మించిన సమాధి అసలైన మొగల్ సాంప్రదాయానికి చెందిన మొదటి కట్టడంగా పేర్కొనవచ్చు.
ఘనమైన మొగలుల వాస్తుశైలికి అక్బర్ పునాదులు వేశాడు. ఆగ్రాలో ఆయన ఎర్రకోట నిర్మాణాన్ని పూర్తిచేశాడు. కోటలోపల అక్బరీ మహల్, బీర్బల్ మహల్ వంటి నిర్మాణాలు చేపట్టాడు. తన శైలిలో అక్బర్ ఎక్కువగా హిందూ, బౌద్ధం, రాజపుత్ర శైలులను మిళితం చేశాడు. పూర్తిగా అక్బర్ దృక్పథాన్ని అనుసరించి ఫతేపూర్ సిక్రీలో నిర్మాణాలు చేపట్టారు. మతపరంగా తన ఆధ్మాత్మిక గురువైన షేక్ చిష్దీ దర్గాను, జామా మసీదును అక్బర్ ఫతేపూర్ సిక్రీలో నిర్మించాడు.
మత ప్రమేయంలేని లౌకికపరమైన కట్టడాలుగా బులంద్ దర్వాజాను ఫతేపూర్ సిక్రీ ప్రవేశ ద్వారంగా నిర్మించాడు. గుజరాత్ తాను సాధించిన విజయానికి గుర్తుగా ఈ నిర్మాణాన్ని చేపట్టాడు. ఇందులో పర్షియా సాంకేతిక పరిజ్ఞానమైన హాఫ్ పర్పుల్ డోమ్ ఉపయోగించాడు. జోదాబాయ్ మహల్, మరియా మహల్, నిర్మాణాలు చేపట్టా డు. తన మహల్ నిర్మాణంలో అక్బర్ ఎక్కువగా బౌద్ధ స్థూపాల నిర్మాణాలతో ప్రభావితుడయ్యాడు.
జహంగీర్ కాలంలో వాస్తు శైలిలో ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. వాస్తు శైలిలో ఇస్లామిక్ శైలి లక్షణాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మొదటిసారిగా మెజాయిక్ పనితనంతో కూడిన పీట్రడుర్రా అనే సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టారు. తెల్ల పాలరాయి వాడకం ప్రారంభమైంది.
జహంగీర్ తన తండ్రి అక్బర్ సమాధిని ఆగ్రా సమీపంలో సికింద్రా వద్ద నిర్మించాడు. నూర్జహాన్ బైరాన్ కొడుకైన అబ్దుల్ రహీంఖాన్ సమాధిని ఢిల్లీలో, తన తండ్రి ఇతమిద్ ఉద్దౌలా సమాధిని ఆగ్రాలో, జహంగీర్ సమాధిని లాహోర్ నిర్మించాడు. ఇతమిద్ ఉద్దౌలా సమాధి నిర్మాణంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానం పీట్రడుర్రా మొదటిసారిగా వాడారు. ఈ నిర్మాణమే తాజ్ నిర్మాణానికి ఆధారమైంది.
ఘనమైన మొగలుల వాస్తుశైలి షాజాహాన్ కాలంలో అత్యున్నత స్థాయికి చేరింది. షాజాహాన్ గొప్ప నిర్మాతగా పేరుగాంచాడు. ఇతని హయాంలో వాస్తు శైలిలో ముఖ్యమైన మార్పులు.. తెల్ల పాలరాయి వాడకం విస్తృతమైంది. అందమైన ఫ్లోరల్ డిజైన్ ఉపయోగించారు. వాస్తు శైలి పూర్తిగా ఇస్లాం సాంప్రదాయాలనే ప్రచురించింది.
ఆగ్రాలో షాజాహాన్ ఖాస్ పీష్ మహల్, అంగూలీ బాగ్, మోతీ మసీదు నిర్మించాడు. ప్రపంచ అద్భుతాలలో ఒకటైన తాజ్ తన రాణి ముంతాజ్ సమాధిగా నిర్మించాడు. షాజాహాన్ ప్రధాన శిల్పి ఉస్తా-ఇజాఖాన్ ఆధ్వర్యంలో 22 ఏండ్లపాటు నిర్మాణం సాగింది. దీనికోసం ఉపయోగించిన పాలరాయి మకరాన (రాజస్థాన్) నుంచి సేకరించారు.
ఢిల్లీలో షాజాహాన్ ఎర్రకోటను నిర్మించాడు. కోట లోపల దివాన్-ఎ-ఆమ్, దివాన్-ఎ-ఖాన్, రంగమహల్ ముఖ్యమైన కట్టడాలుగా నిర్మించాడు. రంగమహల్ ఫ్లోరల్ డిజైన్లకు ప్రసిద్ధి గాంచింది. అమీర్ ఖుస్రో తన వాక్యాలైన ‘ప్రపంచంలో అత్యంత అందమైన ప్రదేశం ఇదని దివాన్-ఎ-ఖాస్ ముద్రించి ఉంది. దేశంలోనే అతిపెద్దదైన జామా మసీదును ఢిల్లీలో నిర్మించాడు.
ఔరంగజేబు కాలంలో ఘనమైన వాస్తు శైలి ఆదరణ కోల్పోయింది. సనాతనవాది, నిరాడంబరుడైన ఔరంగజేబు కట్టడాల నిర్మాణాన్ని వ్యతిరేకించాడు. తన రాణి రహవూద్-దురానీ కోసం ఔరంగాబాద్ తాజ్ పోలిన కట్టడం బీబీకా మక్బారా నిర్మించాడు. చివరకు తానుకూడా ఔరంగాబాద్ సమాధి చేయబడ్డాడు.
- Tags
- nipuna special
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు