బీవోబీలో 105 స్పెషలిస్ట్ ఆఫీసర్లు
హైదరాబాద్: దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 24 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 105 పోస్టులను భర్తీ చేయనుంది. ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్, ఎంఎస్ఎంఈ, కార్పొరేట్ క్రెడిట్ డిపార్టుమెంట్లలో ఈ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష, గ్రూప్డిస్కషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 105
ఇందులో డిజిటల్ ఫ్రాడ్ మేనేజర్ 15, క్రెడిట్ ఆఫీసర్ (ఎంఎస్ఎంఈ) 40, క్రెడిట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ 20, ఫారెక్స్ అక్విసిషన్, రిలేషన్షిప్ మేనేజర్ 30 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. బీఈ, బీటెక్, ఎంసీఏ, సీఏ, సీఎంఏ చేసి ఉండాలి. అభ్యర్థులు 24 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండి, సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, గ్రూప్ డిస్కన్, పర్సనల్ ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు: రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు రూ.100
దరఖాస్తులు ప్రారంభం: మార్చి 4
దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 24
వెబ్సైట్: www.bankofbaroda.co.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు