డెమొక్రసీ ఇండెక్స్
అంతర్జాతీయం
ప్రపంచ డెమొక్రసీ ఇండెక్స్‌ను ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఫిబ్రవరి 10న విడుదల చేసింది. దీనిలో నార్వే మొదటి స్థానంలో నిలువగా.. న్యూజిలాండ్ 2, ఫిన్లాండ్ 3, స్వీడన్ 4, ఐస్లాండ్ 5వ స్థానంలో నిలిచాయి.ఈ జాబితాలో భారత్ 46, పాకిస్థాన్ 104వ స్థానాల్లో ఉన్నాయి.
క్వాడ్ సమావేశం
క్వాడ్ దేశాల 4వ విదేశాంగ మంత్రుల సమావేశం మెల్బోర్న్లో ఫిబ్రవరి 11, 12 తేదీల్లో నిర్వహించారు. భారత్ నుంచి సుబ్రమణ్యం జైశంకర్ ఈ సమాశంలో పాల్గొన్నారు. స్వేచ్ఛ, ఇండోపసిఫిక్, ఉగ్రవాదం వంటి వాటిపై చర్చించారు. భారత్, జపాన్, జర్మనీ, అమెరికా క్వాడ్ దేశాలు. 2007లో క్వాడ్ ఏర్పడింది.
టర్కీ అధ్యక్షుడి యూఏఈ పర్యటన
టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ ఫిబ్రవరి 14న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పర్యటించారు. 2013 తర్వాత టర్కీ అధ్యక్షుడు యూఏఈలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అబు ధాబి ప్రిన్స్ షేక్ మొహమ్మద్ జాయేద్ అల్ నహ్యాన్తో కోట్ల డాలర్ల విలువైన పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
క్విట్ టొబాకో యాప్
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ‘క్విట్ టొబాకో’ యాప్‌ను ఫిబ్రవరి 16న ప్రారంభించింది. డబ్ల్యూహెచ్‌వో ద్వారా అన్ని రకాల పొగాకు వాడకం నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ యాప్‌ను రూపొందించారు. పొగాకు వాడకం వల్ల ప్రతి ఏడాది సుమారు 8 మిలియన్ల మంది చనిపోతున్నారు.
ఎయిర్ షో
సింగపూర్‌లోని చాంగీ విమానాశ్రయంలో ఫిబ్రవరి 15 నుంచి 18 వరకు ఎయిర్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 44 మంది సభ్యులతో కూడిన భారత వైమానిక దళం పాల్గొన్నది. భారత తేలికపాటి యుద్ధ విమానం తేజస్ పాల్గొంది.
పుస్తకావిష్కరణ
‘హ్యూమన్: హౌ ది యునైటెడ్ స్టేట్స్ అబాండన్డ్ పీస్ అండ్ రీ ఇన్వెంటెడ్ వార్’ అనే పుస్తకాన్ని ఫిబ్రవరి 17న ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని శామ్యూల్ మోయిన్ రచించారు. యుద్ధాలను ఎదుర్కోవడంలో అమెరికా అనుసరిస్తున్న వ్యూహాన్ని ఈ పుస్తకంలో వివరించారు.
గేట్ వే ఐటీ పార్క్
మేడ్చల్ జిల్లా కండ్లకోయ జంక్షన్లో 6 లక్షల చదరపు అడుగుల ‘గేట్ వే’ ఐటీ పార్క్ నిర్మాణానికి ఐటీ మంత్రి కేటీఆర్ ఫిబ్రవరి 17న శంకుస్థాపన చేశారు. దీని ద్వారా 50 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
సింగరేణికి అవార్డు
సింగరేణి సంస్థకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద అంతర్జాతీయ అవార్డు ఫిబ్రవరి 17న లభించింది. ఆన్లైన్లో నిర్వహించిన 12వ ఇంటర్నేషనల్ పెట్రోకోల్ సదస్సులో సింగరేణి డైరెక్టర్ ఎన్ బలరాంనకు ప్లాటినం విభాగంలో మొదటి బహుమతి దక్కింది.
జాతీయం
3 ఉపగ్రహాలు
పీఎస్ఎల్వీ సీ-52 రాకెట్ ద్వారా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఫిబ్రవరి 14న 3 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించారు.
1) ఆర్ఐ శాట్-1: ఈ ఉపగ్రహం జీవితకాలం 10 సంవత్సరాలు. బరువు 1710 కేజీలు. వ్యవసాయం, అటవీ, నీటి వనరుల నిర్వహణ మొదలైన వాటి విలువైన సమాచారం తెలుసుకోవడం దీని లక్ష్యం.
2) ఐఎన్ఎస్-2టీడీ: దీని జీవిత కాలం 6 నెలలు. బరువు 17.5 కేజీలు. ఇండో-భూటాన్ ఉమ్మడిగా దీనిని రూపొందించాయి.
3) ఇన్స్పైర్ శాట్-1: దీని జీవిత కాలం 6 నెలలు. బరువు 8.1 కేజీలు.
శ్రీలంకకు భారత్ సాయం
భారత్ శ్రీలంకకు 90 కోట్ల డాలర్ల సాయాన్ని ఫిబ్రవరి 14న ప్రకటించింది. నిత్యావసరాల కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్న శ్రీలంకను ఆదుకునేందుకు ఈ ఆర్థిక రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించింది. వీటిని ఆహార దిగుమతులు, విదేశీ నిల్వల కోసం వినియోగించనున్నారు.
రైల్ రోడ్ బ్రిడ్జి
బీహార్‌లోని ముంగేర్ ప్రాంతంలో నేషనల్ హైవే 333బీ, గంగానదిపై నిర్మించిన రైల్-రోడ్ బ్రిడ్జిని కేంద్ర ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే మంత్రి నితిన్ గడ్కరీ ఫిబ్రవరి 14న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. 14.5 కి.మీ. పొడవు గల దీనిని రూ.690 కోట్లతో నిర్మించారు.
జీ-20
2022, డిసెంబర్ 1 నుంచి 2023, నవంబర్ 30 వరకు జీ-20 18వ సమావేశానికి భారత్ అధ్యక్షత వహించేందుకు కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 15న ఆమోదించింది. ఇది 1999, సెప్టెంబర్ 25న ఏర్పడింది. ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ వ్యవస్థను కలిగిన దేశాల కూటమి ఇది. 17వ సమావేశాన్ని 2022లో జకార్తలో నిర్వహించారు.
17వ వార్షికోత్సవం
సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 17వ వార్షికోత్సవ వేడుకలు ఫిబ్రవరి 16న నిర్వహించారు. ఈ వేడుకలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పంచతంత్రపై రూపొందించిన మొదటి కలర్ సావెనీర్ కాయిన్‌ను ఆవిష్కరించారు.
భారత్-ఆస్ట్రేలియా
భారత్-ఆస్ట్రేలియా 4వ ఎనర్జీ డైలాగ్ వర్చువల్ సదస్సును ఫిబ్రవరి 16, 17 తేదీల్లో నిర్వహించారు. కేంద్ర విద్యుత్, న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ శాఖ మంత్రి ఆర్కే సింగ్, ఆస్ట్రేలియా ఎనర్జీ అండ్ ఎమిసన్స్ రిడక్సన్ మంత్రి ఆంగస్ టేలర్‌ల మధ్య ఈ సదస్సు జరిగింది. పునరుత్పాదక శక్తి, శక్తి సామర్థ్యం, నిల్వ ఈవీలు, క్లిష్టమైన ఖనిజాలు వంటి వాటిపై చర్చించారు.
సస్టెయినబుల్ డెవలప్మెంట్
21వ వరల్డ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ సమావేశాన్ని ఫిబ్రవరి 16 నుంచి 18వ తేదీ వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సమావేశ థీమ్ ‘సుస్థిరమైన, సమానమైన భవిష్యత్తును నిర్ధారించడం’.
వార్తల్లో వ్యక్తులు
మునీశ్వర్ నాథ్
జస్టిస్ మునీశ్వర్ నాథ్ భండారీ మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఫిబ్రవరి 10న నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన గతేడాది నవంబర్‌లో చీఫ్ జస్టిస్ సంజీబ్ బెనర్జీ మేఘాలయ హైకోర్టుకు బదిలీ అయిన తర్వాత మద్రాస్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
రాహుల్ బజాజ్
ప్రముఖ పారిశ్రామికవేత్త, బజాజ్ ఆటో మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్ న్యుమోనియాతో ఫిబ్రవరి 12న మరణించారు. ఆయన 2001లో పద్మభూషణ్ స్వీకరించారు.
లూక్ మాంటాగ్నియర్
ప్రముఖ ఫ్రెంచ్ వైరాలజిస్ట్ లూక్ మాంటాగ్నియర్ ఫిబ్రవరి 8న మరణించారు. 1983, పారిస్‌లో హెచ్ఐవీని గుర్తించిన ఘనత ఈయనకు దక్కింది. ఎయిడ్స్‌కు కారణమయ్యే వైరస్‌ను కనుగొన్నందుకు 2008లో ఈయనకు వైద్యరంగంలో నోబెల్ ప్రైజ్ లభించింది.
ఫ్రాంక్ వాల్టర్
జర్మనీ అధ్యక్షుడిగా మరోసారి ఫ్రాంక్ వాల్టర్ స్టీన్మియర్ ఫిబ్రవరి 13న ఎన్నికయ్యారు. జర్మనీలోని 16 రాష్ర్టాల ప్రతినిధులు ఫ్రాంక్ను అధ్యక్షుడిగా భారీ మెజారిటీతో ఎన్నుకున్నారు. ఈ పదవిలో ఆయన ఐదేండ్ల పాటు ఉంటారు.
ఇల్కర్ ఐసీ
ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా ఇల్కర్ ఐసీ ఫిబ్రవరి 14న నియమితులయ్యారు. ఈయన 1971లో ఇస్తాంబుల్‌లో జన్మించారు. 1994లో బిల్కెంట్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిచేశారు. టర్కీ ఎయిర్ లైన్స్ చైర్మన్‌గా పనిచేశారు.
ఎలాన్ మస్క్
ఎలాన్ మస్క్ తన 50 లక్షల టెస్లా షేర్లను చిన్నారుల ఆకలిని తీర్చేందుకు ఫిబ్రవరి 14న చారిటీకి దానం చేశారు. వీటి విలువ 5.7 బిలియన్ డాలర్లు (సుమారు రూ.43 వేల కోట్లు). ఈ డబ్బుతో 4 కోట్ల మంది చిన్నారుల ఆకలి తీర్చవచ్చు. ప్రపంచ అతిపెద్ద విరాళాల్లో ఇది ఒకటి.
వినీత్ జోషి
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్‌గా వినీత్ జోషి ఫిబ్రవరి 14న నియమితులయ్యారు. ఆయన మణిపూర్ 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.
అశోక్‌కుమార్
భారత మొదటి నేషనల్ మారిటైం సెక్యూరిటీ (జాతీయ సముద్ర తీర భద్రత) కోఆర్డినేటర్‌గా నేవీ మాజీ వైస్ అడ్మిరల్ జీ అశోక్‌కుమార్‌ను కేంద్రం ఫిబ్రవరి 16న నియమించింది. సముద్ర భద్రతను బలోపేతం చేసేందుకు నేషనల్ మారిటైం సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.
మనోజ్ తివారీ
ఖాదీ బ్రాండ్ అంబాసిడర్‌గా భోజ్‌పురి గాయకుడు, ఎంపీ అయిన మనోజ్ తివారీని బిహార్ ప్రభుత్వం ఫిబ్రవరి 17న నియమించింది. బీహార్ ఖాదీ, ఇతర హస్తకళలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, అవగాహన కల్పించడం కోసం మనోజ్‌ను అంబాసిడర్‌గా ఎంపిక చేసింది.
క్రీడలు
క్రికెట్ అకాడమీబెంగళూరులో నూతన జాతీయ క్రికెట్ అకాడమీ నిర్మాణానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఫిబ్రవరి 13న శంకుస్థాపన చేశాడు.
గీతా మిట్టల్టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (టీటీఎఫ్ఐ) అడ్మినిస్ట్రేటర్స్ చైర్‌పర్సన్‌గా జస్టిస్ గీతా మిట్టల్ ఫిబ్రవరి 14న నియమితులయ్యారు. ఈమె జమ్ముకశ్మీర్ హైకోర్టులో తొలి మహిళా చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు.
హెండర్సన్
క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చైర్మన్‌గా లచ్లాన్ హెండర్సన్ ఫిబ్రవరి 17న నియమితులయ్యాడు. తాత్కాలిక చైర్మన్ రిచర్డ్ స్థానంలో అతడు బాధ్యతలు చేపట్టాడు.
- Tags
- meeting
- nipuna news
- Quad
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు