ఏ స్థిరాస్తి మంచిది
పవన్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం. నెల తిరిగేసరికి చేతిలో కళ్లు చెదిరే జీతం. అన్ని ఖర్చులూ పోనూ మిగులుతున్న డబ్బుతో ఏదైనా ఇన్వెస్ట్మెంట్
చేయాలనుకున్నాడు. అన్ని విధాలా ఆలోచించి, చివరికి రియల్ ఎస్టేట్లో పెట్టుబడికి నిర్ణయించాడు
స్థిరాస్తి రంగంలో డబ్బులను ఇన్వెస్ట్ చేయాలన్న నిర్ణయానికైతే వచ్చాడు.కానీ, అది ఏ రూపంలో అనేది అంతుబట్టడం లేదు. అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలా? లేక ఎక్కడైనా ఇంటిస్థలం కొనుగోలు చేయాలా? అది కాకుంటే డిమాండ్ ఉన్న ఏరియాలోని వాణిజ్య సముదాయంలో స్థలం కొనాలా? ఎందులో పెట్టుబడి పెడితే భవిష్యత్లో మంచి ధర పలుకుతుంది? ఎక్కడ ఎక్కువ లాభాలు వస్తాయి? అనే గందరగోళంలో పడ్డాడు. దీనిపై ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు.
స్థిరాస్తి రంగంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారిలో రకరకాల మనస్తత్వాలు, రకరకాల అంచనాలు ఉంటాయి. కొందరు నివసించడం కోసం ఇల్లు కొంటారు. మరికొందరు పెట్టుబడి కోణంలో ఆలోచించి అడుగు వేస్తారు. అయితే చాలామంది పెట్టుబడి అనేసరికి నివాస గృహాలపైనే దృష్టి పెడుతారు. కానీ, పెట్టుబడి కొంచెం ఎక్కువే అయినా వాణిజ్య సముదాయాల్లోనే అధిక రాబడి వస్తుందని అనేక అధ్యయనాల్లో తేలింది. వాణిజ్య సముదాయాల్లో పెట్టే పెట్టుబడికి మంచి రిటర్న్స్ వస్తున్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి.
సొంతిల్లు ఉంటే..
అప్పటికే సొంతిల్లు ఉండి, పెట్టుబడి కోణంలో ఆలోచించేవారు మంచి రాబడి అందుకోవడానికి రెండోసారి ఇల్లు కొనడం బదులు వాణిజ్య లేదా కార్యాలయ సముదాయాల్లో పెట్టుబడి పెట్టడం మేలు చేస్తుంది. అయితే పెట్టుబడిదారులు, ప్రమోటర్లే స్వయంగా నిర్వహించే వాణిజ్య సముదాయాలకు ప్రాధాన్యమివ్వాలి. ఏటా కొంత మొత్తాన్ని సేవా రుసుముగా తీసుకొని, ప్రాపర్టీ మేనేజ్మెంట్ సేవల్ని అందించేవాటిని ఎంచుకోవడం మేలు. వీటితో అందుబాటులో ఉన్న స్థలానికి తగ్గట్టుగా అద్దెదారుల్ని ఎంపిక చేయడం, వారు కోరుకున్న సైజుల్లో స్థలాన్ని సమకూర్చడం, దస్తావేజుల్ని సిద్ధం చేయడం, క్రమం తప్పకుండా అద్దెలను వసూలు చేయడం, ఆ సొమ్మును పెట్టుబడిదారుడి ఖాతాలో జమ చేయడం.. ఇలా ప్రతి అంశాన్నీ ప్రాపర్టీ మేనేజర్లే దగ్గరుండి పర్యవేక్షిస్తారు. దీనివల్ల పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ప్రాజెక్ట్ ఏదైనా అందుబాటులో ఉన్న ప్రాంతంలో నిర్మాణాల్ని చేపడితే కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తారు. అందుకే హైదరాబాద్లోని మాదాపూర్, కొండాపూర్, జూబ్లీహిల్స్, మదీనాగూడ, గచ్చిబౌలి, మణికొండ, నానక్రాంగూడ్, కేపీహెచ్బీ కాలనీ వంటి ప్రాంతాల్లో నిర్మాణ సంస్థలు పెద్ద సంఖ్యలో వాణిజ్య సముదాయాల్ని నిర్మిస్తున్నాయి.
సొంతిల్లు లేకుంటే..
..ఇక సొంతిల్లు లేనివారు మాత్రం వాణిజ్య సముదాయానికి బదులుగా నివాస సముదాయాన్ని కొనుగోలు చేయడమే ఉత్తమం. ఇండ్ల కొనుగోళ్లకు అన్ని బ్యాంకులు 80శాతం వరకూ గృహ రుణాలిస్తున్నాయి. 20శాతం సొంత పెట్టుబడి సమకూర్చుకుంటే ప్రాపర్టీ సొంతమైపోతుంది. బ్యాంకు రుణం చెల్లింపు కోసం 20 నుంచి 30 ఏండ్ల వరకూ వాయిదాల్ని కట్టే వెసులుబాటు ఉంటుంది. వడ్డీ, అసలుపై ఆదాయ పన్ను రాయితీ లభిస్తుంది. ఇక ఏటేటా ఆస్తి విలువ పెరుగుతూ పోతుంది.
శ్రీనివాస్ గౌడ్ ముద్దం (రియల్ ఎస్టేట్ వ్యాపారి, మార్కెట్ నిపుణుడు)
- Tags
- Hyderabad
- real estate
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు