Xiaomi | ఫాస్టెస్ట్ చార్జింగ్ డివైజ్ : జనవరి 6న భారత్‌లో షియోమి 11ఐ హైపర్‌చార్జ్ లాంఛ్..ధర ఎంతంటే!
Xiaomi : భారత్‌లో ఫాస్టెస్ట్ చార్జింగ్ స్మార్ట్‌ఫోన్‌గా చెబుతున్న షియోమి 11ఐ హైపర్‌చార్జ్ జనవరి 6న లాంఛ్ కానుంది. లాంఛ్‌కు ముందు టీజర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్స్‌ను షియోమి వెల్లడిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో చైనాలో ప్రవేశపెట్టిన రెడ్మి నోట్ 11 ప్రొ+ రీబ్రాండెడ్ వెర్షన్‌గా షియోమి 11ఐ హైపర్‌చార్జ్ ఎంట్రీ ఇవ్వనుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ డైమెన్సిటీ 920 చిప్సెట్తో 120డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్‌తో కస్టమర్ల ముందుకు రానుంది. 120డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో ఈ ఫోన్ కేవలం 15 నిమిషాల్లో చార్జింగ్ పూర్తవుతుంది. భారత్‌లో ఇదే అత్యంత వేగవంతమైన చార్జింగ్ డివైజ్ అని షియోమి చెబుతోంది. షియోమి 11ఐ హైపర్‌చార్జ్ పసిఫిక్ పెర్ల్, స్టీల్త్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది.
ధర ఎంతంటే..!
షియోమి 11ఐ హైపర్‌చార్జ్ 108 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెట్, 4500ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో కస్టమర్ల ముందుకు రానుంది. ఎఫ్‌హెచ్‌డీ+ 6.67 ఇంచ్ అమోల్డ్ ప్యానెల్‌తో రానున్న ఈ స్మార్ట్‌పోన్ ధర రూ 22,000 నుంచి రూ 26,000 మధ్య అందుబాటులో ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
- Tags
- new launch
- SMARTPHONE
- Xiaomi
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు