ఎన్ క్యాట్-2021
నిక్మర్ క్యాంపస్లు పుణె, హైదరాబాద్, ఢిల్లీ, గోవా
మానవ జీవితంలో ముఖ్యమైన వాటిలో గూడు ఒకటి. రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు అవసరమైన మౌలిక వసతుల సౌకర్యాల కల్పనకు ప్రాముఖ్యత పెరుగుతుంది. జనాభాకు అనుగుణంగా భూమి పెరగదు. ఉన్న భూమిలోనే అందరికీ ఆవాస యోగ్యమైన నిర్మాణాలు చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం నిర్మాణ రంగ నిపుణుల అవసరం ఏటేటా పెరుగుతుంది. నిర్మాణ రంగానికి ముఖ్యమైనది నైపుణ్యం కలిగిన స్కిల్వర్కర్స్, మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్. దేశంలో వ్యవసాయం, వస్త్రపరిశ్రమ తర్వాత ఎక్కువ ఉపాధి కల్పిస్తున్నది నిర్మాణ రంగం. ఈ రంగానికి కావల్సిన మానవ వనరులను తయారుచేయడానికి 1984లో ఏర్పాటుచేసిన నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రిసెర్చ్ (నిక్మర్). ప్రస్తుతం నిక్మర్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైన
నేపథ్యంలో ఆ వివరాలు….
కోర్సులు- అందిస్తున్న క్యాంపస్లు
పీజీ ప్రోగ్రాం ఇన్ అడ్వాన్స్డ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ (రెండేండ్లు)
ఆఫర్ చేస్తున్న క్యాంపస్లు: పుణె, హైదరాబాద్, ఢిల్లీ, గోవా
అర్హత: బీఈ/బీటెక్ లేదా బీఆర్క్/ డిజైన్ ఎందులోనైనా 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
పీజీ ప్రోగ్రాం ఇన్ ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్ (రెండేండ్లు)
ఆఫర్ చేస్తున్న క్యాంపస్లు: పుణె, హైదరాబాద్.
అర్హత: 50 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
పీజీ ప్రోగ్రాం ఇన్ రియల్ ఎస్టేట్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ (రెండేండ్లు) అందిస్తున్న క్యాంపస్: పుణె
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బీఈ/బీటెక్ లేఆ బీఆర్క్.
పీజీ ప్రోగ్రాం ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్, డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ (రెండేండ్లు) అందిస్తున్న క్యాంపస్: పుణె
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బీఈ/బీటెక్ లేదా బీఆర్క్.
పీజీ ప్రోగ్రాం ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ ఓన్డ్ కన్స్ట్రక్షన్ బిజినెస్ (ఏడాది). అందిస్తున్న క్యాంపస్: పుణె
అర్హత: నిర్మాణ రంగంలో సేవలందిస్తున్న కుటుంబాలకు చెందినవారు ఈ కోర్సులో చేరడానికి అవకాశం ఉంది. కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
పీజీ ప్రోగ్రాం ఇన్ క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ (ఏడాది). ఆఫర్ చేస్తున్న క్యాంపస్: హైదరాబాద్
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బీఈ/బీటెక్
పీజీ ప్రోగ్రాం ఇన్ హెల్త్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ (ఏడాది). అందిస్తున్న క్యాంపస్: హైదరాబాద్
అర్హత: 50 శాతం మార్కులతో బీఈ/బీటెక్ లేదా ఇంజినీరింగ్ డిప్లొమాతోపాటు నాలుగేండ్ల్ల పని అనుభవం ఉండాలి.
నోట్: బీఈ/బీటెక్ లేదా బీఆర్క్, డిప్లొమా లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ లభిస్తుంది.
ఎంపిక: ఆన్లైన్ పరీక్ష (నిక్మర్ కామన్ అడ్మిషన్ టెస్ట్), ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా.
ఇంటి నుంచే పరీక్ష, ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
క్యాంపస్ ప్లేస్మెంట్స్
దేశ, విదేశాలకు చెందిన సుమారు 232 కంపెనీలు ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. వాటిలో కొన్ని.. అడార్ వెల్డింగ్ లిమిటెడ్, ఏఐ దర్వాజీ గ్రూప్, హెచ్డీఎఫ్సీ రియాలిటీ, ఐసీఐసీఐ, ఐటీసీ, రాంకీ, రిలయన్స్, డీ మార్ట్, దార్ గ్రూప్, సెంచరీ 21, ఎల్ అండ్ టీ, స్పేస్ మ్యాట్రిక్స్, స్వ్కేర్ యార్డ్, విప్రో వాటర్, పిట్రాన్ ఇంజినీరింగ్, హెచ్సీసీ, ఎంఈఐఎల్, ప్రికాస్ట్ ఇంజినీరింగ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, టాటా హిటాచి, టాటా బ్లూచిప్, సింటెల్, సినర్జీ, సాంసంగ్, రిలయన్స్ ఇండస్ట్రీ, షాపూర్జీ పల్లోంజీ కన్స్ట్రక్షన్స్, వోల్టాస్ కంపెనీలు.
2019-2020 ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం నిక్మర్ నాలుగు క్యాంపస్లలో 99.3 శాతం విద్యార్థులు ఆయా కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: డిసెంబర్ 10 ఆన్లైన్
పరీక్ష తేదీలు: 2022 జనవరి 8, 9
ఆన్లైన్ ఇంటర్వ్యూలు: 2022, జనవరి 13-18
తరగతులు ప్రారంభం: సెప్టెంబర్ 6
వెబ్సైట్: https://nicmar.ac.in
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు