సీఏ ర్యాంకర్ల విజయ రహస్యాలు
సీఏ కోర్సు కొంతమందికే సాధ్యం. సీఏ చదవాలంటే శక్తి వంచన లేకుండా కృషి చేయాలని అనుకుంటారు. కానీ కృతనిశ్చయంతో ఉండి విశ్లేషణాత్మకత, సమయస్ఫూర్తి ఉంటే సీఏ ఎవరైనా పూర్తిచేయవచ్చని ఇటీవల సీఏ ఫైనల్ ఫలితాల్లో ఆల్ఇండియా ర్యాంకులు సాధించిన విద్యార్థులు నిరూపించారు. సీఏలో సక్సెస్ సాధించడానికి, అందుకు దోహదపడిన అంశాలు, సలహాలు, సూచనలు వారి మాటల్లో తెలుసుకుందాం..
గొప్ప వ్యాపారవేత్త అవ్వాలన్నదే ఆశయం
పేరు: రియా గోయల్
స్వస్థలం: గుంటూరు
సీఏ-సీపీటీ: 192 మార్కులు
సీఏ ఇంటర్: 584, ఆలిండియా ర్యాంక్ 37
సీఏ ఫైనల్: 537, ఆలిండియా ర్యాంక్ 43
- నాన్న పేరు ప్రసాద్ గోయల్ వ్యాపారం చేస్తారు. అమ్మ నీతా గోయల్ గృహిణి. స్కూల్ విద్య గుంటూరులోనే సాగింది. టెన్త్‌లో 10/10 గ్రేడ్ పాయింట్లు సాధించాను. సీఏ చేయాలనే కోరిక మొదటి నుంచి ఉంది. అందుకే ఇంటర్లో కామర్స్ అండ్ అకౌంట్స్ సబ్జెక్టులు ఉన్న ఎంఈసీ గ్రూప్ తీసుకొని మాస్టర్‌మైండ్స్‌లో చేరాను. ఇంటర్లో 96.8 గ్రేడ్ పాయింట్లు సాధించాను. తర్వాత సీఏలో జాయిన్ అయ్యాను.
- సీఏ మొదటి దశ సీఏ-సీపీటీలో 192 మార్కులు వచ్చాయి. సీఏ ఇంటర్లో మొదటి ప్రయత్నంలోనే 584 మార్కులతో ఆలిండియా 37వ ర్యాంకు, సీఏ ఫైనల్లో 537 మార్కులతో ఆలిండియా 43వ ర్యాంకు సాధించాను. సీఏ పెద్దగా ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో పూర్తిచేయవచ్చు. దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ కోర్సును సెలెక్ట్ చేసుకున్నాను.
- ప్రిపరేషనల్లో ఫైనల్ సబ్జెక్టులకు సీఏ ఇన్స్టిట్యూట్ స్టడీ మెటీరియల్, ఐసీఏఐ మెటీరియల్‌తో పాటు గత ఎంటీపీఎస్, ఆర్టీపీఎస్ అన్నింటిని చదివాను. ఒకేసారి వివిధ రకాల పుస్తకాలను చదివి గందరగోళ పరిస్థితిని ఎదుర్కోవడం బదులు మొదటి నుంచి ఒకే మెటీరియల్ బాగా పునశ్చరణ చేయడం మంచిది. ఒక్కోసారి మనకు ఫలితాలు అనుకూలంగా రాకపోవచ్చు. అలాంటి సమయంలో నిరాశ చెందకుండా కొత్త ఉత్సాహంతో మళ్లీ చదవాలి. మంచి మార్కులు రావాలంటే అన్ని సబ్జెక్టుల్లో కనీసం 80 శాతం సిలబస్ మీద పట్టు సాధిస్తే చాలు. సీఏ ఫైనల్ పరీక్షకు సన్నద్ధమయ్యేటప్పుడు ఇన్స్టిట్యూట్ స్టడీ అవర్స్, రివిజన్ ఎగ్జామ్స్ ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆర్టికల్‌షిప్ చేసేటప్పుడు వారాంతాలను వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకొని సీఏ ఫైనల్‌కు ప్రిపేరయ్యాను.
- తల్లిదండ్రులు, సోదరి ఎంతో ప్రేరణ అందించారు. రోజుకు 12 నుంచి 14 గంటలు చదివాను. అంకితభావం, క్రమశిక్షణ నా విజయ రహస్యాలు. ప్రస్తుతం బిగ్‌ఫోర్ సంస్థ ఈ అండ్ వై లో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాను. ఎగ్జామ్స్ గురించి భయపడి అనవసరంగా ఆందోళన చెందవద్దు. కఠోరమైన శ్రమ, సరైన ప్రణాళిక ఉంటే ఎవరైనా సీఏలో విజయం సాధించవచ్చు.
- దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఐఐఎం నుంచి ఎంబీఏ చేయాలన్నదే లక్ష్యం. భవిష్యత్తులో గొప్ప వ్యాపారవేత్త అవ్వాలన్నదే ఆశయం.
తక్కువ ఖర్చుతో సీఏ పాస్ కావచ్చు
పేరు: ఎస్. అఖిల్ నందన్
స్వస్థలం: భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా
సీఏ-సీపీటీ: 195 మార్కులు
సీఏ ఇంటర్ మార్కులు: 511, ఆలిండియా ర్యాంక్ 37
సీఏ ఫైనల్: 541, ఆలిండియా ర్యాంక్ 40
- నాన్న అచ్యుతరామయ్య వ్యాపారం చేస్తారు. అమ్మ గీత గృహిణి. స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా భీమవరంలో సాగింది. టెన్త్‌లో 10/10 గ్రేడు పాయింట్లు సాధించాను. అప్పటి నుంచే ఎంతో ప్రత్యేకమైన, ఎక్కువ ఉపాధి అవకాశాలు కలిగిన సీఏ కోర్సు చదవాలని ఆశయంతో ముందుకెళ్లాను. అందుకు ఇంటర్లో ఎంఈసీ గ్రూప్ చదవడానికి అనువైనదని తెలుసుకొని మాస్టర్‌మైండ్స్‌లో జాయిన్ అయ్యాను. ఇంటర్ 955 మార్కులతో పాసయ్యాను. సీఏ-సీపీటీలో 195 మార్కులు, సీఏ ఇంటర్ 511, సీఏ ఫైనల్లో 541 మార్కులతో ఆలిండియా 40వ ర్యాంక్ సాధించాను.
- సీఏ చదవాలంటే టాలెంట్ బాగా ఉండాలని ఏమీలేదు. కష్టపడేతత్వం, పటిష్ట ప్రణాళిక, సమయపాలన, తప్పులను సరిదిద్దుకోవడం వంటి విషయాలను అవగాహన చేసుకుంటే ఎవరైనా సీఏలో సక్సెస్ కావచ్చు. సీఏ ఫైనల్లో ప్రతి సబ్జెక్ట్‌కు క్విక్ రివిజన్ నోట్స్ తయారు చేసుకోవడం చాలా ముఖ్యం.
- సీఏ ఫైనల్‌కు రోజుకు 12-14 గంటలు చదివాను. సన్నద్ధత సమయంలో 100 శాతం సిలబస్ పూర్తిచేయకపోయినా భయపడవద్దు. కనీసం 70 నుంచి 80 శాతం సిలబస్ పూర్తిచేసినా ఉత్తీర్ణత సాధించవచ్చు. ప్రాథమిక, ముఖ్యమైన అంశాలు మాత్రం చదవడం మరిచిపోవద్దు. పరీక్ష రాసే 3 గంటలు చాలా కీలకం. ఆ 3 గంటల్లో ఏ క్షణంలోనూ మీ పై మీకున్న నమ్మకాన్ని కోల్పోవద్దు.
- ఐఐటీకి పెట్టే ఖర్చుతో పోలిస్తే సీఏ చదవడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ.
- ఇన్స్టిట్యూట్ రివిజన్ ఎగ్జామ్, స్టడీ అవర్స్ షెడ్యూల్స్‌ను పక్కాగా అనుసరించాను. ఇవన్నీ ఆలిండియా ర్యాంక్ రావడంలో తోడ్పాటును అందించాయి. తల్లిదండ్రులు, ఇన్స్టిట్యూట్ వారి ప్రేరణ నా విజయానికి కారణం. ఐఐఎమ్స్ నుంచి ఎంబీఏ చేయాలన్నదే లక్ష్యం. గొప్ప వ్యాపారవేత్తగా రాణించాలన్నదే ఆశయం.
అంతర్జాతీయ స్థాయి సీఏగా గుర్తింపే లక్ష్యం
పేరు: ఉషా స్నేహలత
స్వస్థలం: అనకాపల్లి, వైజాగ్
సీఏ-సీపీటీ: 177 మార్కులు
సీఏ ఇంటర్ మార్కులు: 584
సీఏ ఫైనల్: 538, ఆల్ఇండియా ర్యాంక్ 10
- నాన్న బుచ్చిబాబు లైన్‌మన్‌గా వర్క్ చేస్తున్నారు. అమ్మ గృహిణి. మాది మధ్యతరగతి కుటుంబం. జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలనే సంకల్పం, పట్టుదలతో జవహర్ నవోదయ విద్యాలయంలో సీటు సంపాదించి అక్కడే టెన్త్ వరకు చదివాను. టెన్త్ చదువుతున్నప్పుడే మాస్టర్ మైండ్స్ స్టాఫ్ మా స్కూల్‌కు వచ్చి సీఏ చేస్తే ఉపాధి అవకాశాల గురించి వివరించారు. సీఏ చేయడం వల్ల జీవితంలో ఉన్నతస్థాయికి ఏ విధంగా చేరుకోవచ్చనేది తెలిపారు. అప్పుడే సీఏ చదవాలని నిర్ణయించుకున్నాను. టెన్త్‌లో 10/10 గ్రేడ్ పాయింట్లు, ఇంటర్ ఎంఈసీలో 973, సీఏ-సీపీటీలో 177 మార్కులు సాధించాను. సీఏ కోచింగ్ గుంటూరులో తీసుకున్నాను. వ్యక్తిగత శ్రద్ధ, అకడమిక్ ప్రోగ్రామ్ ఎంతో నచ్చింది. చదువు ద్వారానే కుటుంబానికి సపోర్ట్‌గా నిలబడవచ్చు. చదువు ఉంటేనే జీవితంలో గొప్పస్థాయి వస్తుందని నమ్మాను.
- సీఏ ఇంటర్లో చేరినప్పుడు ఒత్తిడికి గురైనా.. తర్వాత ఏమంత కష్టమనిపించలేదు. ఎందుకంటే సీఏ చాలా కష్టం అనుకున్నాను. కానీ అంత కష్టమనిపించలేదు. సీఏ పరీక్షలో అడిగే ప్రశ్నల పద్ధతి కొంచెం వేరుగా ఉంటుంది. దానిని అర్థం చేసుకోవాలి. అదే పద్ధతిలో కాన్సెప్ట్వైజ్గా ప్రిపేరవడం నేర్చుకున్నాను. టీచింగ్ ఫ్యాకల్టీ కూడా కాన్సెప్ట్ ఓరియంటేషన్తో బోధించడం వల్ల సబ్జెక్ట్ తేలికగా అర్థమయ్యింది. లక్ష్యాన్ని ప్రేమించి, ఇష్టపడి మనస్ఫూర్తిగా సీఏ చదివాను. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు లేచి కష్టమైన సబ్జెక్టులను ప్రిపేరవ్వడం, ఏదైనా డౌట్స్ వస్తే వెంటనే ఫ్యాకల్టీల ద్వారా క్లారిఫై చేసుకోవడం పాటించిన ముఖ్యమైన సూత్రం.
- కొన్ని సందర్భాల్లో పరీక్షలకు ప్రిపేరవుతున్నప్పుడు ఒత్తిడికి గురయ్యాను. కానీ ప్రిపరేషన్ పెంచుకుంటూ వెళ్లాను. ఆ సాధన వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి.. ఒత్తిడి తగ్గింది. కాన్సెప్ట్‌ను బేస్ చేసుకొని ప్రిపేర్ అయ్యాను. ముఖ్యంగా 10వ ర్యాంక్ రావడానికి ఇన్స్టిట్యూట్ అకడమిక్ ప్రోగామే కారణం.
- ఎట్టి పరిస్థితుల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. మనకు ఎప్పుడైనా డౌట్స్ వస్తే ఒక బుక్ తీసుకొని.. అందులో డౌట్స్ రాసుకొని.. వాటిని ఎప్పటికప్పుడు ఫ్యాకల్టీల ద్వారా క్లియర్ చేసుకుంటే ఎగ్జామ్స్ పెద్దగా కష్టం అనిపించదు. ఈజీగా సీఏ పాస్ అవచ్చు. ప్రతి రోజు క్లాసులు వినాలి. ప్రిపరేషన్ విషయంలో రోజూ 10 నుంచి 12 గంటలు కచ్చితంగా చదవాలి. ఏ రోజు క్లాస్‌ను ఆ రోజు కరెక్ట్‌గా ఫాలో అవ్వాలి. జాగ్రత్తగా విని అదేరోజు ఆ కాన్సెప్ట్‌ను రివైజ్ చేసుకోవాలి.
- సీఏ, కెరీర్ పై ఇంట్రస్ట్ పెంచుకోవాలి. ఎందుకంటే ఇష్టం, కష్టం రెండూ ఉంటాయి. ఎప్పుడూ కష్టం అనుకుంటే కాదు, ఇష్టంతో చదివితే కచ్చితంగా పాస్ అవుతాం. సీఏ కంప్లీట్ అయిన వెంటనే అంతర్జాతీయ స్థాయిలో ఉన్నతమైన చార్టెర్డ్ అకౌంటెంట్‌గా గుర్తింపు పొందాలన్నదే లక్ష్యం.
సీఏ ఏమంత కష్టం కాదు
పేరు: షణ్ముఖ ప్రియ
స్వస్థలం: అంతర్వేది, ఈస్ట్ గోదావరి జిల్లా
సీఏ-ఫౌండేషన్: 297 మార్కులు
సీఏ ఇంటర్ మార్కులు: 557, ఆలిండియా ర్యాంకు 22
- నాన్న వై సుబ్బారావు వ్యాపారం చేస్తారు. అమ్మ గృహిణి. స్కూల్ విద్య అంతర్వేదికి దగ్గరలో ఉన్న మల్కీపురంలో చదివాను. టెన్త్‌లో 10/10 గ్రేడ్ పాయిట్లు సాధించాను. చిన్నప్పటి నుంచి చదువుకోవాలనే ఆత్రుత, ఉన్నతస్థాయికి చేరాలనే దృక్పథం ఉండేవి. టెన్త్ పూర్తయిన వెంటనే సీఏ చదవాలనే ఉద్దేశంతో ఎంఈసీ గ్రూప్ కోసం ప్రయత్నించాను. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఎంపీసీలో జాయినయ్యాను. అయినా బాగా చదివి 982 మార్కులు తెచ్చుకున్నాను.
- ఎంపీసీ చేసినప్పటికీ సీఏ చదవాలని నిర్ణయించుకున్నాను. స్నేహితులు బీటెక్ చదవాలని ఎంతో ఒత్తిడి తెచ్చారు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే నా ఇష్టానికి సపోర్ట్‌గా నిలిచారు. తల్లిదండ్రులు, కజిన్ ఎంతో ప్రోత్సాహం అందించారు.
- సీఏ కోసం మాస్టర్‌మైండ్స్‌లో జాయినయ్యాక సీఏ ఫౌండేషన్‌లో 297 మార్కులు సాధించాను. ఇక్కడి అకడమిక్ ప్రోగ్రాం బాగా నచ్చింది. తర్వాత ఇంటర్ సీఏలో అడ్మిషన్ తీసుకున్నాను. లక్ష్యం మీద దృష్టి సారించి రోజుకు 13 గంటలు చదివాను. సబ్జెక్టులో వచ్చిన ప్రతి సందేహాన్ని నివృత్తి చేసుకొని పాఠ్యాంశాల పై పట్టు సాధించాను. ఇన్స్టిట్యూట్ వారి మోటివేషన్, కచ్చితమైన షెడ్యూల్, రివిజన్ ఎగ్జామ్స్, స్డడీ అవర్స్ ఇలా ప్రణాళికాబద్ధంగా చదివాను. ఆ కష్ట ఫలితంగానే ఆలిండియా 22వ ర్యాంక్ వచ్చింది.
- ఏ కోర్సును అయినా సరే కష్టం అనే పదం తీసేసి ఇష్టపడి చదవాలి. సీఏ చదవాలని నిర్ణయించుకున్నాక మంచి ఇన్స్టిట్యూట్ను ఎంచుకోవాలి. పట్టుదలతో టార్గెట్ పై లక్ష్యం ఉంచాలి. అదే ధ్యాసతో చదివితే సీఏ ఈజీగా పాస్ కావచ్చు. 10 నుంచి 12 గంటలు సరైన పద్ధతిలో చదివితే సక్సెస్ సాధించవచ్చు. సీఏ పూర్తయిన తర్వాత పేదలకు, సమాజానికి మరింత సేవ చేయడానికి సివిల్ సర్వీసెస్‌కు వెళ్లాలన్నదే లక్ష్యం.
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు