జేఈఈ అడ్వాన్స్డ్ -2021
దేశంలో ఇంజినీరింగ్ విద్యకు ఐఐటీలు మేటి సంస్థలుగా పేరుగాంచాయి. వీటిలో సీటు సంపాదించడానికి హైస్కూల్ స్థాయి నుంచే లక్షలాదిమంది విద్యార్థులు శ్రమిస్తుంటారు. ఈ పరీక్ష ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన పరీక్షల్లో ఒకటిగా పేరుగాంచింది. మిగిలిన ప్రవేశపరీక్షల కంటే భిన్నమైనది జేఈఈ అడ్వాన్స్డ్. జేఈఈ మెయిన్ పరీక్షలో టాప్‌లో నిలిచిన సుమారు రెండున్నర లక్షలమంది రాసే పరీక్ష ఇది. ఈ పరీక్షలో వచ్చిన మార్కులు, ర్యాంక్ ఆధారంగా దేశంలోని 23 ఐఐటీల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈసారి ఈ పరీక్ష నిర్వహణ బాధ్యత ఐఐటీ ఖరగ్‌పూర్ తీసుకుంది. అడ్వాన్స్డ్ పరీక్ష వివరాలు సంక్షిప్తంగా …
ఐఐటీలు
దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇంజినీరింగ్ విద్యకు పేరుగాంచిన సంస్థలు. అంతేకాదు దేశంలో జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రఖ్యాత సంస్థలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ).
స్వాంత్రత్యం వచ్చిన తర్వాత ప్రామాణికమైన ఇంజినీరింగ్ విద్య కోసం ఐఐటీ ప్రతిపాదన వచ్చింది. దీంతో 1954లో మొట్టమొదట ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రారంభించారు. తర్వాత ఒక్కొక్కటిగా పెంచుకుంటూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 23 ఐఐటీలను కేంద్రం నెలకొల్పింది.
ఐఐటీల లక్ష్యం: ఇది జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలు. ఇక్కడ డిగ్రీ, పీజీ, పీహెచ్డీ కోర్సులతో పాటు దేశానికి అవసరమైన పరిశోధనలు, రకరకాల ప్రాజెక్టులతోపాటు పలు అంశాలపై ఈ సంస్థలు పనిచేస్తాయి.
జేఈఈ అడ్వాన్స్డ్
ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష ఇది. మొదట అభ్యర్థులు జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించాలి. మెయిన్ పరీక్షలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా టాప్-20 అంటే సుమారు 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారు.
అర్హతలు
2020, 2021లో ఇంటర్ ఉత్తీర్ణులు. ఇంటర్లో ఎంపీసీ చదివి ఉండాలి. జేఈఈ మెయిన్-2020లో టాప్ 2,50,000లో ఉండాలి. (రిజర్వేషన్లు వరిస్తాయి)
నోట్: గరిష్ఠంగా రెండుసార్లు మాత్రమే రాయడానికి అర్హులు.
పరీక్ష విధానం
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తారు.
రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు నిర్వహిస్తారు. అభ్యర్థులు రెండు పేపర్లను తప్పనిసరిగా రాయాలి. పీహెచ్సీ అభ్యర్థులకు ఒక గంట అదనపు సమయాన్ని ఇస్తారు.
నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. వివరాలు ప్రశ్నపత్రంలో ఇస్తారు.
రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు
ఆదిలాబాద్, హైదరాబాద్, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, పాల్వంచ, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్.
అందించే కోర్సులు:
నాలుగేండ్ల బీటెక్, బీఎస్
ఐదేండ్ల బీఆర్క్
ఐదేండ్ల డ్యూయల్ డిగ్రీ (బీటెక్-ఎంటెక్), బీఎస్-ఎంఎస్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ.
ఏఏటీ-2021
ఐఐటీ (బీహెచ్‌యూ) వారణాసి, ఖరగ్‌పూర్, రూర్కీలు ఆర్కిటెక్చర్ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ). దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు. అడ్వాన్స్డ్ ఫలితాలు వచ్చిన తర్వాత బీఆర్క్ చేయాలనుకునేవారు అక్టోబర్ 15, 16 తేదీల్లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష తేదీ అక్టోబర్ 18. ఫలితాలు అక్టోబర్ 22న విడుదల చేస్తారు. పూర్తి వివరాలు జేఈఈ
అడ్వాన్స్డ్ వెబ్సైట్లో చూడవచ్చు.
జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ ద్వారా ప్రవేశాలు కల్పించే సంస్థలు
23 ఐఐటీలు, బెంగళూరులోని ఐఐఎస్స్సీ, దేశంలోని ఏడు ఐ ఐఎస్ఈఆర్లు, తిరువనంతపు రంలోని ఐఐఎస్టీ, రాయబరేలీ లోని ఆర్‌జీఐపీటీ,విశాఖపట్నంలోని ఐఐపీఈ.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
అడ్మిట్ కార్డుల డౌన్లోడింగ్:
సెప్టెంబర్ 25 నుంచి
పరీక్ష తేదీ: అక్టోబర్ 3 (ఆదివారం)
ఫలితాల వెల్లడి: అక్టోబర్ 15
వెబ్సైట్: https://jeeadv.ac.in
-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ
- Tags
- Education News
- JEE Main
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు