సవివరంగా సమాధానాలు రాద్దామిలా!
అక్షరాభ్యాసం మొదలయ్యేది అక్షరాలు దిద్దించడంతోటే. చకని అందమైన చేతిరాతను చూసినప్పుడు ముత్యాల వలే అందంగా ఉన్నాయనడం వినే ఉంటారు. ఆ పోలికతోనే మనం రాసిన అక్షరాలకు ఎంత విలువిస్తామనేది అర్థమవుతుంది. అలాగే కలం కత్తి కంటే శక్తిమంతమైనదని ఊరికే అనలేదు. ప్రపంచంలో ఉన్న గొప్ప పుస్తకాలన్నీ గొప్పగా ఆలోచించగలిగిన మేధావులు రాశారు. తమ ఆలోచనలను రాతపూర్వకంగా మలిచి, తాము చెప్పాలనుకున్నది సరిగ్గా చెప్పి, అంతే కరెక్టుగా పాఠకులు అర్థం చేసుకునేలా ఉండే ప్రయత్నం చేస్తారు. నేటి అంతర్జాల యుగంలో చకని రచనా శక్తి కలిగి ఉండటం ఎంతో ఉపయోగకరం.
రైటింగ్ సిల్స్ ఎంతో ముఖ్యం. అలాగే చాలావరకు పరీక్షలు ఇప్పుడు రాత పూర్వకంగానే ఉన్నాయి. వివరంగా అడిగిన ప్రశ్నలకు జవాబులు రాయాలి. ఎన్నో సందర్భాల్లో అనుకున్నన్ని మారులు రాలేదని బాధపడుతారు. ఎందుకలా జరిగిందనే ఆలోచనలు వస్తాయి. వివరణాత్మక జవాబులతో పాటు సరైన చేతిరాత కూడా అవసరమే.
వివరణాత్మక జవాబులకు ఎందుకంత ప్రాముఖ్యం?
- పాఠశాలలో చాలావరకు వివరణాత్మక జవాబుల రూపంలోనే పరీక్షలు జరుగుతుంటాయి. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉన్నప్పుడు, కేవలం సమాధానాన్ని బట్టి మారులు ఉంటాయి. నెగెటివ్ మారింగ్ లేనప్పుడు ఉహించి కూడా జవాబులు రాసే అవకాశం ఉంది. ఇవి ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, అన్ని పేపర్లను ఒకేవిధంగా ఎవాల్యుయేషన్ చేస్తారు. చివరగా వచ్చిన జవాబు సరైనదైతేనే మారులు వస్తాయి. లేకపోతే లేదు.
- కాంపిటేటివ్ పరీక్షలు ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఎకువగా ఉన్నాయి. అందులో కూడా వ్యాసాలు వంటివి ఉంటున్నాయి. ఉదాహరణకు గ్రాడ్యుయేట్ రికార్డు పరీక్ష (జీఆర్ఈ)లో అనలిటికల్ రైటింగ్ అసెస్మెంట్ ఉంది. అలాగే సివిల్స్ పరీక్షలో కూడా వివరంగా జవాబులు రాయాలి.
- ఒక ప్రశ్నను ఎలా అర్థం చేసుకున్నారు, ఎలా ప్రశ్నను సాల్వ్ చేశారన్నది మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల్లో తెలుసుకోలేం.
- బోర్డు పరీక్షలు, గ్రాడ్యుయేట్ కాలేజీ పరీక్షల్లో వివరణాత్మక జవాబుల రూపంలోనే జరుగుతున్నాయి. పాండమిక్ వల్ల కొన్ని మార్పులున్నా ఆన్లైన్లో కూడా రిటన్ సబ్మిషన్లు జరుగుతున్నాయి. విద్యార్థుల నాలెడ్జ్‌ను పరీక్షించే వీటిలో కేవలం చదువుకొని వెళ్తే సరిపోదు. ఎలా జవాబులు రాయాలన్నది కూడా సాధన చేయాలి.
- ఈ పరీక్షలు పరిమిత సమయంలో కరెక్ట్‌గా.. ఆర్గనైజ్డ్గా సమాధానాలు రాయగలరా అని విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి.
జవాబులు ఎలా రాయాలి?
- భాష మీద పట్టు ఉందనుకునే వారు కూడా సహజంగా రాయలేకపోవచ్చు. పుస్తకం చదివాం కదా అని అనుకున్నా సరిపోదు. చదవడంతో పాటు దానిని మూల్యాంకనం చేసేవారికి అర్థమయ్యేలా రాయడం అంతే ముఖ్యం. రెగ్యులర్ ప్రాక్టీస్ ద్వారా మంచి సమాధానాలు రాయగల సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది.
- ప్రశ్నను జాగ్రత్తగా చదవండి. ముందుగా ప్రశ్నను సరిగ్గా చదవడం చాలా ముఖ్యం. విద్యార్థి ప్రశ్నలోని ముఖ్యమైన పదాలను హైలైట్ చేయవచ్చు. ప్రశ్నను చదివి ఎటువంటి జవాబు రాయాలని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు ప్రశ్నలోని కొన్ని పదాలు విశదీకరించడం, విమర్శనాత్మకంగా విశ్లేషించడం, ఉదాహరణలు మొదలైన వాటిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. అవి లేకపోతే ప్రశ్న అసంపూర్తిగానే ఉంటుంది.
- ప్రశ్నను బట్టి జవాబును ఆర్గనైజ్ చేసుకోవాలి. ప్రశ్నను జాగ్రత్తగా చదవడం వల్ల విద్యార్థి సంబంధిత సమాధానం రాయడానికి సహాయపడుతుంది.
- ఆర్గనైజ్డ్ జవాబు: జవాబులు వివరంగా ఉండటంతో పాటు చదవడానికి సులభంగా ఉండాలంటే ఒక పద్ధతి ప్రకారం రాయాలి. ఉదాహరణకు ఒక మంచి సమాధానం ఒక ఇంట్రడక్షన్, ఒక చిన్న పరిచయంతో ప్రారంభమైతే బాగుంటుంది.
- సాధారణంగా ఒకరు ఇంట్రడక్షన్లోని కీలక పదాలను నిర్వచించవచ్చు. ఇటీవల నివేదికను, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ లేదా కొన్ని సంబంధిత వాస్తవాలను హైలైట్ చేయవచ్చు.
- విద్యార్థి ప్రశ్నలోని ప్రతి భాగానికి తగిన ఉపశీర్షికలను (సబ్ హెడ్డింగ్‌లు) ఇవ్వచ్చు. సులభంగా చదవడానికి వీలుగా కంటెంట్ పాయింట్ల రూపంలో ప్రదర్శించబడుతుంది. చివరగా కంక్లూజన్ సమాధానంలోని ప్రధాన వాదనలను సంగ్రహించవచ్చు. ప్రతి ప్రశ్నకు రాసే విధానం ఉంటుంది. గణితంలో సిద్ధాంతాలు నిరూపించడానికి లాంగ్వేజ్ ప్రశ్నలకు వాటికనుగుణంగా రాయాలి.
- సమయాన్ని దృష్టిలో పెట్టుకొని జవాబులు రాయడం అవసరం. మొదట రాసినవి డిటెయిల్డ్గా రాసి చివరగా రాసేవి చిన్నగా రాస్తే బాగోదు.
హ్యాండ్ రైటింగ్ టిప్స్
- రైటింగ్ అసెస్మెంట్ ప్రశ్నలు కూడా టైప్ చేయబడుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లో చాటింగ్, అంతర్జాలంలో ఈ-మెయిల్, ప్రజంటేషన్, మైక్రోసాఫ్ట్ వర్డ్ వంటి వివిధ టూల్స్ వల్ల పరీక్షలు మినహాయించి రాయడం ఆవశ్యకత తగ్గిపోయే సూచనలున్నాయి. అప్పటివరకు చేతిరాత మంచిగా ఉండేలా చూసుకోవాలి.
- పెన్ సరిగా ఉందో లేదో చూసుకోండి. బరువుగా ఉందా? లావుగా ఉందా? లేదా టిప్ స్మూత్‌గా ఉందా రఫ్‌గా ఉందా? లేదా చూసి ఏది నచ్చితే దానిని ఎంచుకోండి.
- సూళ్లో చేతిరాతకోసం గీతల నోట్‌బుక్స్ ఉంటాయి. సమయం ఉంటే ఉపయోగించండి.
- అంత సమయం లేకపోతే ముందు అక్షరాల పొడవులు చూడండి. పదాల పొడవు ఇతర పదాలకనుగుణంగా ఉండేలా చూసుకోండి.
- చదవడానికి కష్టంగా ఉన్న అక్షరాలు ఎంచుకొని వాటి మీద ఫోకస్ చేయండి.
- కొన్ని పదాలు దగ్గిర పోలికతో ఉన్నట్టు కనిపిస్తే వాటిపై కూడా దృషిపెట్టండి.
- స్పీడ్ వల్ల రైటింగ్ పాడవకుండా చూసుకోండి.
- రోజు డైరీ లేదా జర్నల్ రాయడం అలవాటు చేసుకోండి.
క్రియేటివ్ ప్రజంటేషన్
- బొమ్మలు వేయాలనుకుంటే స్పష్టంగా డిటెయిల్డ్గా ఉండాలి. గ్రాఫ్స్ ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఉండాలి.
- ఫ్లో చార్టులు, రేఖాచిత్రాలు వంటి సృజనాత్మక ప్రజంటేషన్ సాధనాలను ఉపయోగించడం ద్వారా సమాధానాలు పరీక్షకుడికి మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి సమయాన్ని ఆదా చేయడంలో కూడా సహాయపడుతాయి. అందువల్ల వాటిని ఉపయోగిస్తున్నప్పుడు వినూత్నంగా ఉండటం ముఖ్యం. కాకపోతే వీటిని కూడా ముందే సాధన చేయాలి. లేకుంటే పరీక్షలో ఇబ్బంది పడవచ్చు.
- మీకు మాత్రమే అర్థమయ్యే షార్ట్ ఫామ్స్‌ని వాడకండి.
- రంగు రంగుల పెన్నులు వాడటం వల్ల జవాబులు అందంగా ఉంటాయని కొంతమంది డెకరేషన్ చేస్తూ ఉంటారు. అది సమయాన్ని వ్యర్థం చేస్తుంది. సరిగ్గా రాసే పెన్నులు పెట్టుకోండి.
- బొమ్మలు వేసేటప్పుడు మంచి పెన్సిల్ ఉపయోగించండి. నీట్‌గా, క్లియర్‌గా బొమ్మలు ఉండాలి.
- హైలైట్: సమాధానంలోని కీలకపదాలను అండర్లైన్ చేయడం లేదా పెద్ద అక్షరాలతో రాసి హైలైట్ చేయవచ్చు. సాధారణంగా హైలైట్ చేసిన పదాల్లో పండితుల పేర్లు, కీలక వాస్తవాలు, ప్రభుత్వ నివేదికలు, ముఖ్యమైన అంశాలు ఉంటాయి. ఇది జవాబులోని ముఖ్యమైన అంశాలను సులభంగా గుర్తించడానికి పరీక్షకుడికి సహాయపడుతుంది.
- వర్డ్ లిమిట్‌కు కట్టుబడి ఉండండి: ఏది రాయాలో మాత్రమే కాదు ఏది రాయకూడదో కూడా తెలుసుకోవడం ముఖ్యం. జవాబును పెంచడం కోసం అనవసరమైనవి రాస్తే మారులు రావు. పైగా మీరు విలువైన సమయాన్ని కోల్పోతారు. దానివల్ల ఇతర ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానమివ్వడం మీకు కష్టమవుతుంది. ప్రశ్నలకు ఎన్ని మారులున్నాయో దానికనుగుణంగా వర్డ్ లిమిట్ ఉండేలా చూసుకోండి.
- ప్రశ్నపత్రం ఇచ్చిన తరువాత కాస్త ప్రశాంతంగా దానిని చూడండి. ప్రాక్టీస్ పరీక్షలో రాసిన ఆర్డర్ లేదా ఎకువ నమ్మకంగా ఉన్న ప్రశ్నలను ఎంచుకొని జవాబులు రాయడం మొదలుపెట్టండి.
- సరైన ప్రశ్నలు ఎంచుకోండి: చాలావరకు ప్రశ్నపత్రంలో ఉన్న ఆర్డర్‌లోనే సమాధానాలు రాయాల్సిన అవసరం లేదు. సూచనలు చదివిన తరువాత రాయండి.
- బాగా వచ్చిన సమాధానాలను ముందుగా రాయండి. ఇది ఆత్మవిశ్వాసం పొందడంలో సహాయపడుతుంది. మనస్సులో కొంచెం అస్పష్టంగా ఉన్న ఇతర ప్రశ్నలకు సమాధానాలు ఆలోచించడానికి తగినంత సమయం కేటాయించడంలో సహాయపడుతుంది.
- చాయిస్ ఉన్నచోట జాగ్రత్తగా ప్రశ్నలను ఎంచుకోండి.
- కరెక్ట్ పదాలను వాడండి: కొన్ని టెర్మినాలజీ లేదా టెక్నికల్ జార్గాన్ అవసరమైన చోట సరిగా ఉపయోగించాలి.
- పేపర్ నింపడం కోసం రాయడం వల్ల ఫలితం ఉండదు. రాసే ప్రతి జవాబు ఆ ప్రశ్నకు తగినదై ఉండాలి. అలాగే రాసే వ్యాఖ్యలు అవసరమైనవిగా ఉండాలి.
- చేతిరాత చదవగలిగేలా ఉండాలి: రాసే పదాల మధ్య ఖాళీ ఉండేలా నిర్ధారించుకోండి. ఒకే వరుసలో ఎకువ పదాలను ఇరికించవద్దు. ఇది గ్రేడ్ల పతనానికి కారణం కావచ్చు. కొట్టివేతలు వీలైనంత తకువగా ఉండాలి. సమాధాన పత్రం చకగా, శుభ్రంగా కనిపించాలి.
- సమాధానాలను పాయింట్లలో రాయడానికి ప్రయత్నించండి.
- అన్ని వాక్యాలను కలపడం మానుకోండి. పేపర్ మేనేజ్మెంట్ కూడా అవసరమే.
- ప్రశ్నలకు మధ్య క్లియర్‌గా డిఫరెన్స్/గ్యాప్ చూపించండి.
- పరీక్ష సమయంలో మన పెద్ద శత్రువు భయం, టెన్షన్. ప్యానిక్ అసలు అవ్వకూడదు. ఎందుకంటే ఏ కారణం వల్ల అయినా టెన్షన్ పడితే అనవసరంగా స్ట్రెస్ అయ్యి రాయగలిగేవి కూడా సరిగా రాయలేరు. తెలివిగా ఆలోచించండి, ప్రశాంతంగా ప్రశ్నలపై దృష్టిపెట్టండి. అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఆలోచించడానికి, ఫ్రేమ్ చేయడానికి చాలా సమయం ఉంటుంది. కావలసిందల్లా మిమ్మల్ని మీరు పూర్తిగా నమ్మి ఆత్మవిశ్వాసంతో, తెలివిగా వ్యవహరించడం.
- బాగా చదువుకొని ఉండవచ్చు. కాన్సెప్ట్స్ సరిగ్గా అర్థమయ్యి ఉండవచ్చు. కానీ ఇదంతా జవాబుపత్రాన్ని మూల్యాంకనం చేసేవారికి తెలియాలంటే జవాబులు స్పష్టంగా, పూర్తిగా ఉండాలి. ఇది రైటింగ్ సిల్స్‌పై ఆధారపడి ఉంటుంది. అందుకే చదవడంతో పాటు ఎలా జవాబులు రాయాలన్న దానికి కూడా సాధన అవసరం. మీరు సాధన చేసిన వాటిని ఎవాల్యుయేట్ చేసి తప్పులు తెలుసుకోవాలి. అప్పుడే ఫైనల్లో బాగా రాయగలుగుతారు.
Sirisha Reddy
Director – Academics
Abhyaas Edu Technologies
+91 9100545452
www.abhyaas.in
GRE | IELTS | CAT
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు