టెట్ గ్రాండ్ టెస్ట్-4
మ్యాథ్స్
1. గణిత శాస్త్ర బోధనా విలువల వర్గీకరణలో ‘గణిత శాస్త్రం ఒక ఆలోచనా విధానం’ అని పేర్కొన్న గణిత శాస్త్రవేత్త?
1) బ్రెస్లిచ్ 2) యంగ్
3) మున్నిక్ 4) బ్లాక్ హారెస్ట్
- కింది వాటిలో ఏక కేంద్ర విధానానికి సంబంధించినవి?
ఎ. ఘాతాలు, ఘాతాంకాలలోని అంశాలు, వాటి క్లిష్టత ప్రకారం 6, 7, 8 తరగతులకు విభజించారు
బి. సంకలనానికి సంబంధించిన అన్ని భావనలు పూర్తిగా రెండో తరగతిలోనే బోధించడం
సి. ఒక తరగతిలో ప్రవేశపెట్టిన అంశం, పాఠశాల స్థాయిలో మళ్లీ ఏ తరగతిలోనూ బోధించరు
డి. పరిచయం లేని విషయాలు నేర్చుకుంటున్నామన్న భావన ఉండదు
1) ఎ, బి 2) బి, సి
3) సి, డి 4) డి, ఎ - పాఠ్యపుస్తకం
1) గణిత ఉపాధ్యాయునికి కుడిచేయి
2) గణిత ఉపాధ్యాయునికి ఎడమ చేయి
3) గణిత ఉపాధ్యాయునికి తలలో నాలుక
4) గణిత ఉపాధ్యాయునికి ఊతకర్ర - విలోమానుపాతానికి సంబంధించి నిత్యజీవిత సమస్యల సాధనకు తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఏ బోధనాపద్ధతిని పాటిస్తాడు?
1) ఆగమన 2) నిగమన
3) విశ్లేషణ 4) సంశ్లేషణ - కింది వాటిలో ఏ అంశం ‘వ్యక్తపరచడం’ అనే గణిత విద్యాప్రమాణాన్ని సూచిస్తుంది?
1) గణితపరమైన ఆలోచనలను సొంత మాటల్లో వివరించడం
2) దశలవారీగా ఉన్న సోనాలకు కారణాలను వివరించడం
3) దత్తాంశంలో ఇచ్చిన అంశాలను గుర్తించడం
4) దైనందిన జీవితానికి గణితాన్ని అనుసంధానం చేయడం - అభ్యాసకుడు వృత్తాన్ని గీయడానికి సరైన ఉపకరణాన్ని ఎంపిక చేస్తాడు?
1) చిత్రలేఖన నైపుణ్యం
2) పట్టికలను చదివే నైపుణ్యం
3) హస్తలాఘవ నైపుణ్యం
4) గణన నైపుణ్యం
సైన్స్+సోషల్
- ఉభయచర జీవుల జీవన విధానాన్ని ప్రత్యక్షంగా చూపించే కృత్యోపకరణం?
1) హెర్బేరియం 2) అక్వేరియం
3) వైవేరియం 4) టెర్రేరియం - కింది వాటిలో శాస్త్రీయ వైఖరికి సంబంధించిన స్పష్టీకరణ?
1) సేవాకార్యక్రమాల్లో ఆసక్తిగా పాల్గొనడం
2) ప్రకృతి రమణీయతను ప్రశంసించడం
3) ఆధారం లేని ముగింపులను విశ్వసించడం
4) క్షీరదాలకు ఉదాహరణలివ్వడం - ప్రస్తుత పరిస్థితుల్లో ‘కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచడం ఎంతవరకు సమంజసం?’ అనే అంశాన్ననుసరించి విద్యార్థిలో విషయ పరిజ్ఞానం పెంపొందించడానికి అనువైన పద్ధతి?
1) ప్రాజెక్టు పద్ధతి 2) కృత్యాధార పద్ధతి
3) అన్వేషణ పద్ధతి 4) చర్చాపద్ధతి - నిర్ణీత కాల వ్యవధిలో లక్ష్యసాధన కోసం గుణాత్మకంగా, నిర్మాణాత్మకంగా, సమగ్రంగా ఆచరణ సాధ్యమయ్యే పథకాన్ని తయారు చేస్తాడు కాబట్టి ఉపాధ్యాయుడు ఒక?
1) ప్రణాళికా రచయిత 2) సమన్వయకర్త
3) అన్వేషకుడు 4) నిర్వాహకుడు - ఒక రాష్ట్ర ప్రభుత్వం ‘మహిళా దినోత్సవం’ సందర్భంగా మహిళలకు 10 శాతం రాయితీతో సెల్ఫోన్లు అందజేస్తుంది. ఈ సెల్ఫోన్లోని ‘కార్టూన్లు, చిత్రాలు’ ఉపయోగించి విద్యార్థులకు విషయ వివరణ చేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలు ఎడ్గార్ డేల్ శంఖువులో ఏ స్థానాన్ని అనుసరించినట్లు?
1) శాబ్దిక చిహ్నాలు 2) దృశా సాధనాలు
3) ప్రత్యక్ష అనుభవాలు 4) చలన చిత్రాలు - ఏ రకపు ప్రశ్నల్లో సరైన సమాధానాన్ని ఊహించే అవకాశం 50 శాతం ఉంటుంది?
1) బహుళైచ్ఛిక ప్రశ్నలు 2) జతపరచడం
3) వర్గీకరణ 4) తప్పు-ఒప్పులు
గ్రాండ్ టెస్ట్-5
మ్యాథ్స్
- భవిష్యత్తులో నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యల సాధనకు గణిత అభ్యసనం విద్యార్థికి దోహదపడుతుంది. దీనిలో ఇమిడి ఉన్న గణిత విలువ?
1) సాంస్కృతిక విలువ 2) ప్రయోజన విలువ
3) సాంఘిక విలువ 4) క్రమశిక్షణ విలువ - గణిత బోధనలో ప్లానెల్ బోర్డు ఉపయోగం?
1) నియోజనాలకు సమస్యలు రాయడానికి
2) త్రిభుజం చతురస్రాల సూత్రాలు రాబట్టడానికి
3) రేఖాచిత్రాలు గీయడానికి
4) జ్యామితీయ పటాల నిర్మాణాలు ప్రదర్శించడానికి - b/c = d/c అయితే b+c/b-c = d+e/d-e అని నిరూపించడానికి ఉపయోగించే బోధనా పద్ధతి?
1) ఆగమన పద్ధతి 2) సంశ్లేషణ పద్ధతి
3) ప్రాజెక్టు పద్ధతి 4) సమస్యాపరిష్కార పద్ధతి - గణిత సంఘం నిర్వహించే ఏ క్షేత్ర పర్యటన విద్యార్థులకు ఎక్కువ గణిత జ్ఞానం కలిగిస్తుంది?
1) జంతు ప్రదర్శన శాల సందర్శన
2) సహకార బ్యాంకు సందర్శన
3) చారిత్రక ప్రదేశాల సందర్శన
4) వ్యవసాయ క్షేత్రాల సందర్శన - ‘విద్యార్థి ఇచ్చిన గణిత వాక్యాలు, భావనలు, ప్రక్రియల్లో దోషాలు కనుగొని సరిదిద్దుతాడు’ అనే వ్యాసక్తి ఏ లక్ష్యాన్ని సూచిస్తుంది?
1) అవగాహన 2) వినియోగం
3) జ్ఞానం 4) ఆసక్తి - సంవత్సరాంత పరీక్షల్లో గణిత నిష్పాదన ఆధారంగా విద్యార్థులను వర్గీకరించే మూల్యాంకనం?
1) సంకలన మూల్యాంకనం
2) రూపణ మూల్యాంకనం
3) ప్రాగుక్తీక మూల్యాంకనం
4) లోపనివారణ మూల్యాంకనం
సైన్స్+సోషల్
- ఆగమన, నిగమన పద్ధతులు వరుసగా ఏ దశల్లో అనువైనవి?
1) ఆచరణ దశ, ఆరంభ దశ
2) ఆరంభ దశ, ఆచరణ దశ
3) రెండూ ఆవరణ దశ
4) రెండూ ఆచరణ దశ - ‘సంక్షేమ కార్యక్రమాలు’ అనే పాఠ్య బోధనకు ఉత్తమమైన పద్ధతి?
1) ప్రాజెక్టు పద్ధతి 2) చర్చాపద్ధతి
3) మూలాధార పద్ధతి
4) సమస్యాపరిష్కార పద్ధతి - కింది వాటిలో ద్విపార్శ ఉపకరణాలు కానివి?
ఎ. తోలుబొమ్మలు బి. ఫ్లాష్కార్డులు
సి. కార్టూన్లు డి. డయోరమ
1) ఎ, బి 2) బి, సి 3) సి, డి 4) డి, ఎ - ఏది పాఠ్యపథక లక్షణాల్లో ఒకటి కాదు?
1) బోధనాభ్యసన ప్రక్రియలో పొదుపు పాటిస్తుంది
2) ఉపాధ్యాయుడు సరైన విషయాన్ని ఎంచుకోవడానికి దోహదపడుతుంది
3) ఉపాధ్యాయుడు సరైన వ్యూహాలను ఎంపిక చేసుకునేలా చేస్తుంది
4) పూర్వజ్ఞాన ఆవశ్యకత లేకుండానే నూతన జ్ఞానాన్ని ఆపాదించుకునే అవకాశం కల్పిస్తుంది - ‘మీ నగరంలోని మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ శాతం మెరుగుపరచడానికి తీసుకోవల్సిన చర్యలను సూచించండి?’ అనే ప్రశ్న ఏ లక్ష్యాన్ని పరీక్షిస్తుంది?
1) జ్ఞానం 2) అవగాహన
3) వినియోగం 4) నైపుణ్యం - ‘స్కావెంజర్స్ ఆఫ్ అక్వేరియం’ అని వేటిని పిలుస్తారు?
1) నీటిమొక్కలు 2) చేపలు
3) కప్పలు 4) నత్తలు
గ్రాండ్ టెస్ట్-6
మ్యాథ్స్
- మంచి గణిత పుస్తకానికి ఉండాల్సిన ఒక ముఖ్యమైన ఆధారగుణం?
1) పాఠ్యపుస్తకం కఠినత్వ క్రమంలో సమర్పించడం
2) అన్ని అభ్యాసాలను సాధించి ఒక గైడుగా ఉండటం
3) భాషా పదకోశం విద్యార్థుల్లో పెంపొందించడం
4) నిర్దేశించిన విద్యాప్రణాళిక కంటే అదనపు సమాచారాన్ని ఇవ్వడం - పాఠ్యపథక రచనకు సంబంధించి హెర్బార్టియన్ సోపానాల్లో సాధారణీకరణ సోపానానికి ముందు, వెనుక సోపానాలు?
1) సమర్పణ, పునశ్చరణ 2) సంసర్గం, అన్వయం
3) సమర్పణ, సంసర్గం 4) సంసర్గం, పునశ్చరణ - ప్రతీ సంఖ్య మూడు త్రిభుజాకార సంఖ్యలు, నాలుగు వర్గ సంఖ్యలు ఐదు పంచభుజాకార సంఖ్యలు మొదలైన వాటి మొత్తాలుగా రాయవచ్చుననే సిద్ధాంతాలు వివరించిన గణితవేత్త?
1) యూక్లిడ్ 2) భాస్కరాచార్య
3) బ్రహ్మగుప్త 4) ఫెర్మా - విద్యార్థులకు నిర్దిష్ట కాల వ్యవధిలో చతుర్విధ పరిక్రియలకు సంబంధించిన సమస్యలను సాధింపచేయడానికి ఒక పరీక్ష నిర్వహిస్తే ఆ పరీక్ష ముఖ్య ఉద్దేశం?
1) విద్యార్థుల జ్ఞానాన్ని పరీక్షించడం
2) విద్యార్థుల గణన నైపుణ్యాన్ని పరీక్షించడం
3) విద్యార్థుల అవగాహన పరీక్షించడం
4) విద్యార్థుల సహనాన్ని పరీక్షించడం - విద్యా ప్రక్రియలో ప్రధానమైనవి?
1) అభ్యసన అనుభవాలు 2) సామర్థ్యాలు
3) విద్యా లక్ష్యాలు 4) పాఠ్య పథకాలు - సమతల పటాలు, వాటి ధర్మాలను విశదపరిచి ప్రదర్శించడానికి అనువైన ఉపకరణం?
1) బులిటెన్ బోర్డు 2) జియో బోర్డు
3) ప్లానెల్ బోర్డు 4) రోలింగ్ బోర్డు
సైన్స్+సోషల్
- బోధనా సమయంలో పరిపుష్టి
1) లోపనిర్ధారణ మూల్యాంకనం
2) నిర్మాణాత్మక మూల్యాంకనం
3) సంకలన మూల్యాంకనం
4) వ్యవకలన మూల్యాంకనం - ‘విహార యాత్రల పట్ల ఆసక్తి కలిగిన విద్యార్థి విశాఖపట్నంలోని కైలాసగిరి, బొర్రా గుహలను సందర్శించి, యాత్రా విశేషాలను సొంత మాటల్లో వివరిస్తున్నాడు’. దీనిలో ఇమిడి ఉండే లక్ష్యాలు?
1) జ్ఞానం, అవగాహన 2) అవగాహన, వినియోగం
3) అభిరుచి, అవగాహన 4) అవగాహన, నైపుణ్యం - ఉత్తమ బోధనా పద్ధతి ముఖ్య లక్షణం?
1) సిలబస్ సకాలంలో పూర్తిచేయడానికి దోహదం చేయాలి
2) స్వీయ అభ్యసనానికి అవకాశం కల్పించాలి
3) ఉపాధ్యాయుడు తేలికగా బోధించడానికి అనువుగా ఉండాలి
4) విద్యార్థులు తరగతి గదిలోనే అభ్యసించేలా ఉండాలి - క్షేత్ర పర్యటన ద్వారా అర్థవంతంగా బోధించే పాఠ్యాంశం?
1) పంటలు-తెగుళ్లు 2) రక్తం-నిర్మాణం
3) రసాయన సమీకరణాలు 4) జీర్ణక్రియ - ఒక ముడి సరుకును అందమైన కళాఖండంగా తీర్చిదిద్దడానికి ఒక కళాకారుని వలే ఉపాధ్యాయుడు ఉపయోగించే సాధనం?
1) ప్రకల్పన 2) యూనిట్
3) కరికులం 4) కృత్యం - కింది వాటిలో శబ్ద సంకేతానికి సరైన ఉదాహరణ?
1) కరోనా లక్షణాలను తెలియజేసే చార్టును ప్రదర్శించడం
2) రాజధానిలో రైతు నిరసనకు మద్దతుగా మౌన దీక్ష చేయడం
3) శ్రీహరి కోట రాకెట్ ప్రయోగాన్ని టీవీలో చూపించడం
4) ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అని నినదించడం
ఏఎన్ రావు
విషయ నిపుణులు
- Tags
- TET Grand Test-4
Previous article
DEET ఉద్యోగాలు
Next article
సవివరంగా సమాధానాలు రాద్దామిలా!
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు