బూతు వీడియోలు చూశారు.. ఫైన్ కట్టండి!
సైబర్ నేరగాళ్ల కొత్త పంథా.. మోసపోవద్దంటున్న పోలీసులు
హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు రోజుకో తరహాలో రెచ్చిపోతున్నారు. ‘ఇంటర్నె ట్లో మీరు బూతు వీడియోలు చూశారు. ఆ విషయం మా దృష్టి కొచ్చింది. మీ వివరా లన్నీ మా వద్ద ఉన్నాయి. మీరు వెంటనే జరిమానా చెల్లించాలి. లేదంటే మీ కంప్యూటర్ను బ్లాక్ చేస్తాం. మీపై చర్యలు తీసుకుంటాం. మీ ఇంటి కొచ్చి అరెస్టు చేస్తాం’ అంటూ పోలీసుల పేరిట బెదిరింపులకు దిగుతూ జనానికి పాప్అప్ నోటీ సులు పంపుతున్నారు. ఆ నోటీసుకు జతచేసిన క్యూ ఆర్ కోడ్ ద్వారా లేదా ఫోన్ పే, వాట్సాప్, ఫ్రీచార్జ్, గూగుల్‌పే, పేటీఎం, హెచ్డీ ఎఫ్‌సీ బ్యాంక్ యాప్, ఎస్ బీఐ పే, ఐసీఐసీఐ బ్యాంక్ యాప్, యాక్సిస్ పే, మై ఎయిర్టెల్ లాంటి యాప్‌ల ద్వారా జరిమానా చెల్లించవచ్చని ఆప్షన్లు ఇచ్చి బురిడీ కొట్టించేం దుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడాల్సిన పనిలేదని, ఆ నోటీసుల్లోని లింకులను క్లిక్ చేయవద్దని సైబర్ పోలీసులు స్పష్టంచేస్తున్నారు. ఎవరికైనా ఇలాంటి నోటీసు లొస్తే http://cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలన్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు