ఐఐటీల్లో పీజీ కోర్సులు !

జామ్-2022
దేశంలోని ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సులు చదవాలని ఉందా..? పరిశోధనకు నెలవులైన ఐఐఎస్సీ, ఐఐటీల్లో పీహెచ్డీ చేయాలనుకుంటున్నారా..? అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఐఐటీల్లో సీట్లు తప్పిపోయి.. ఐఐటీల్లో చదవాలన్న కల నెరవేర్చుకోవాలనుకునే వారందరికో అపూర్వ అవకాశం. దేశవ్యాప్తంగా ఐఐటీ, ఐఐఎస్సీల్లో పీజీ, పీహెచ్డీ, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాల కోసం ఏటేటా నిర్వహించే ‘జామ్’ ప్రకటన విడుదలైంది. వివరాలు సంక్షిప్తంగా…
జామ్
- జాయింట్ అడ్మిషన్ టెస్ట్. ఈ పరీక్షను ఐఐటీల్లో ఎమ్మెస్సీ, పీహెచ్డీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తారు. ఈ పరీక్షను 2004-05 నుంచి ఐఐటీలు నిర్వహిస్తున్నాయి. ఈ టెస్ట్ ద్వారా ఎమ్మెస్సీ (రెండేండ్లు), జాయింట్ ఎమ్మెస్సీ-పీహెచ్డీ, ఎమ్మెస్సీ-పీహెచ్డీ, డ్యూయల్ డిగ్రీ, ఇతర పోస్ట్-బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.
- అండర్గ్రాడ్యుయేట్ లెవల్ సైన్స్ ఎడ్యుకేషన్‌కు జామ్ బెంచ్‌మార్క్‌గా
- పరిగణిస్తారు.
ప్రవేశాలు కల్పించే సంస్థలు
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- భిలాయ్, భువనేశ్వర్, బాంబే, ఢిల్లీ, ధన్‌బాద్, గాంధీనగర్, గువాహటి, హైదరాబాద్, ఇండోర్, జోధ్‌పూర్, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, మండి, పాలక్కడ్, పట్నా, రూర్కీ, రోపర్, తిరుపతి, వారణాసి. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్.
- వీటితోపాటు నిట్, శివపూర్‌లోని ఐఐఈఎస్టీ, పంజాబ్‌లోని ఎస్‌ఎల్‌ఐఈటీ, ఐఐఎస్ఈఆర్(ఐసర్)లు జామ్ స్కోర్ ఆధారంగా ఎమ్మెస్సీ/
- ఎమ్మెస్సీ (టెక్) ప్రవేశాలు కల్పిస్తాయి.
- నోట్: జామ్ -2022ను ఐఐటీ రూర్కీ నిర్వహిస్తుంది.
పరీక్ష విధానం
ఏడు సబ్జెక్టుల్లో దీన్ని నిర్వహించనున్నారు. వీటిని టెస్ట్ పేపర్లుగా పిలుస్తారు. బయోటెక్నాలజీ (బీటీ), కెమిస్ట్రీ (సీవై), ఎకనామిక్స్ (ఈఎన్), జియాలజీ (జీజీ), మ్యాథమెటిక్స్ (ఎంఏ), మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ (ఎంఎస్), ఫిజిక్స్ (పీహెచ్).
జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఆన్లైన్ పద్ధతిలో దీన్ని నిర్వహిస్తారు.
పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. దీనిలో మల్టిపుల్ చాయిస్ (ఎంసీక్యూ), మల్టిపుల్ సెలక్ట్ (ఎంఎస్క్యూ), న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు ఇస్తారు.
జామ్ ఎవరు రాయవచ్చు..?
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులు లేదా తత్సమానమైన సీజీపీఏ వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
పరీక్ష విధానం
పరీక్ష షెడ్యూలు
- 2022 ఫిబ్రవరి 13న జామ్ నిర్వహిస్తారు. రెండు సెషన్లలో ఉంటుంది.
- సెషన్-1 ఉదయం 9 నుంచి 12 వరకు. ఈ సెషన్లో బయోటెక్నాలజీ, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్ నిర్వహిస్తారు.
- సెషన్-2 మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు. దీనిలో కెమిస్ట్రీ, ఎకనామిక్స్, జియాలజీ, మ్యాథమెటిక్స్ పేపర్లను నిర్వహిస్తారు.
- అభ్యర్థులు ఒకటి/రెండు టెస్ట్ పేపర్లను రాయవచ్చు. అయితే ఆ సబ్జెక్టులు ఒకే సెషన్లో ఉండకూడదు.
- ఫీజు: జనరల్/ఓబీసీలకు ఒక్క టెస్ట్ పేపర్‌కు రూ. 1,500/- రెండు టెస్ట్ పేపర్లు అయితే రూ. 2,100/-
- మహిళ (అన్ని కేటగిరీలకు చెందినవారు), ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు ఒక్క పేపర్ రూ. 750/-, రెండు పేపర్లు అయితే
- రూ. 1,050/-
- రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో ఆగస్టు 30 నుంచి
చివరితేదీ: అక్టోబర్ 11
పరీక్షతేదీ: 2022 ఫిబ్రవరి 13
ఫలితాల వెల్లడి: 2022, మార్చి 22
వెబ్సైట్: https://jam.iitr.ac.ina
కేశవపంతుల వేంకటేశ్వరశర్మ
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






