వైయక్తిక భేదాలకు గల ప్రధాన కారకం?
వైయక్తిక భేదాలు
శారీరక అంశాలైన ‘రంగు, ఎత్తు, రూపు, ఆకృతి’
మానసిక అంశాలైన ‘ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, సృజనాత్మకత, ఆలోచనలు’
ఉద్యోగ అంశాలైన ‘భయం, కోపం, ప్రేమ, కరుణ
సాంఘిక అంశాలైన ‘విలువలు పాటించడం, సర్దుబాటు, సఖ్యత, స్నేహభావం’
నైతిక అంశాలైన ‘మంచి, చెడు, తప్పు, ఒప్పు’ వంటి అంశాలకు సంబంధించి వ్యక్తికి, వ్యక్తికి మధ్య ఉండే తేడాలను/భేదాలను ‘వైయక్తిక భేదాలు’ అంటారు.
మిలియన్లకొద్దీ వ్యక్తులను పోల్చినా వారి మధ్య భేదాల్ని చూడవచ్చు అని అన్నాడు ‘చార్లెస్ డార్విన్’.
ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉండరు.
ఈ సృష్టిలో ఏ ఇద్దరి వేలిముద్రలు కూడా ఒకేలా ఉండవు. ఆఖరికి సమరూప కవలల్లో కూడా ఈ తేడా కనిపిస్తుంది.
ఈ విధంగా బయటకు కనిపించే శారీరక లక్షణాల నుంచి జన్మతః పొందిన లక్షణాలు, పరిసరాల ప్రభావం వల్ల ఆర్జించిన లక్షణాలు ఇలా అన్ని విషయాల్లో ఒక వ్యక్తికి, మరొక వ్యక్తికి మధ్య కచ్చితమైన భేదం ఉంటుంది.
వ్యక్తుల మధ్య ఎన్ని తేడాలున్నప్పటికీ ఈ తేడాలకు కారణమైన లక్షణాలు సంక్రమించడంలో ఒక క్రమపద్ధతి ఉంటుంది. దీనినే ‘భిన్నత్వంలో ఏకత్వం’ అంటారు.
వ్యక్తుల్లో భేదాలతో పాటు భిన్నత్వంలో ఏకత్వం మాదిరిగా సారూప్యతలు కూడా ఉంటాయి.
సారూప్యతలు ఉన్నప్పటికీ ప్రతి వ్యక్తికి తనకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతే అతడిని మిగతా వ్యక్తుల నుంచి విడదీస్తుంది. ఈ ప్రత్యేకతే వైయక్తిక భేదానికి కారణం.
శాస్త్రవేత్తల అభిప్రాయాలు
ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఆ ప్రకారంగానే విద్యాబోధన జరగాలి- ప్లేటో
వ్యక్తుల మధ్యగల భౌతిక భేదాలనే కాకుండా మానసిక భేదాలను కూడా పరిగణనలోకి తీసుకొని బోధన ప్రక్రియ కొనసాగాలి- రూసో (ఫ్రాన్స్)
బెంజిమన్ ఎస్ బ్లూమ్స్ విద్యకు, పాఠశాలకు విద్యాప్రక్రియకు ప్రాధాన్యాన్ని ఇచ్చే సమాజం ప్రతి అభ్యాసకునికి ఆకర్షణీయమైన, అర్థవంతమైన విద్యను అందించే విధానాల అవసరాన్ని గుర్తించాలని చెప్పారు.
మాపనం చేయగల ఏ మూర్తిమత్వ అంశమైనా వైయక్తిక భేదంగా పరిగణించాలి- చార్లెస్ ఈ స్కిన్నర్
వైయక్తిక భేదాలు – రకాలు
ఒకే వ్యక్తిలో ఉండే భేదాలు, వ్యక్తికి, వ్యక్తికి భేదాలను ఆధారంగా చేసుకొని వైయక్తిక భేదాలను రెండు రకాలుగా వర్గీకరించారు. అవి..
1) వ్యక్తంతర భేదాలు/ అంతరవ్యక్తిగత భేదాలు/ వ్యక్తి అంతస్థ భేదాలు (Inter Individual Differences)
2) వ్యక్తంతర్గత భేదాలు/ వ్యక్తి అంతర భేదాలు/ అంతస్థ వ్యక్తిగత వైవిధ్యాలు (Intra Individual Differences)
వ్యక్తంతర భేదాలు
వ్యక్తికి, వ్యక్తికి మధ్య ఉండే తేడాను/ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తుల మధ్య కనిపించే తేడాలు/ వివిధ వ్యక్తుల సామర్థ్యాల్లో, అభిరుచుల్లో గల భేదాలను/తేడాలను ‘వ్యక్తంతర భేదాలు’ అంటారు. ఉదా: ఈశ్వర్ తరగతి గదిలో మిగతా విద్యార్థుల కంటే తెలివైనవాడు.
వ్యక్తంతర్గత భేదాలు
ఒకే వ్యక్తిలో వివిధ సన్నివేశాల్లో, సామర్థ్యాల్లో కనిపించే వ్యత్యాసాలను/ భేదాలను ‘వ్యక్తంతర్గత భేదాలు’ అంటారు. ఉదా: ఈశ్వర్ అనే విద్యార్థి చదువులో చూపే ఆసక్తిని, ఆటల్లో చూపలేకపోవడం
నోట్:
ఒకే అంశానికి సంబంధించి ‘వివిధ వ్యక్తుల’ మధ్య భేదాలు- వ్యక్తంతర భేదాలు
‘వేర్వేరు అంశాలకు’ సంబంధించి ‘ఒకే వ్యక్తిలో’ తేడాలు- వ్యక్తంతర్గత భేదాలు
ఉదా: 1) గణితం శివ (80 శాతం) ఈశ్వర్ (90 శాతం)రవి (95 శాతం) ఇక్కడ ఒకే అంశం వేర్వేరు వ్యక్తులు(వ్యక్తంతర భేదం)
ఉదా: 2) శివ గణితం (80 శాతం) ఆంగ్లం (50 శాతం) తెలుగు (70 శాతం) ఒకే వ్యక్తి వేర్వేరు అంశాలు (వ్యక్తంతర్గత భేదం)
వైయక్తిక భేదాలు కనిపించే అంశాలు
ప్రజ్ఞ -> శారీరక లక్షణాలు
సహజ సామర్థ్యాలు -> ఉద్వేగ లక్షణాలు
సృజనాత్మకత -> సాంఘిక వికాసం
ఆలోచన -> నైతిక వికాసం
వివేచన -> విద్యార్థుల వైఖరులు
ఊహాశక్తి -> అభిరుచులు
స్మృతి -> విద్యార్థుల సాధన
మొదలైనవి
వైయక్తిక భేదాలకు గల కారణాలు
1) అనువంశికత
2) పరిసరాలు
పై రెండు వైయక్తిక భేదాలకు ప్రధాన కారకాలు
3) వయస్సు
4) లైంగిక భేదాలు
5) సాంఘిక, ఆర్థిక స్థితి
6) జాతి
వైయక్తిక భేదాలను ప్రభావితం చేసే రంగాలు
1) అభిరుచి 2) వైఖరి
3) విలువలు 4) కాంక్షాస్థాయి
5) ఆత్మభావన 6) సాధన
7) ప్రజ్ఞ 8) సహజ సామర్థ్యం
9) సృజనాత్మకత
అభిరుచి
ఒక విషయం లేదా ఒక కృత్యం, ఒక వ్యక్తికి అతి ముఖ్యమనిపించే ఒక అనుభూతే అభిరుచి- జేపీ చాప్లిన్
అభిరుచులు సహజ సిద్ధంగా వ్యక్తి స్వభావం వల్ల ఏర్పడవచ్చు లేదా పరిసరాల పరస్పర చర్య వల్ల ఏర్పడవచ్చు.
వ్యక్తుల్లో కొందరు ఆటలాడటం, మరికొందరు పాటలు పాడటం వల్ల ఒక్కొక్కరు ఒక్కో అంశంపై అభిరుచిని కలిగి ఉంటారు.
ఈ విధంగా అభిరుచి అనేది వ్యక్తుల్లో వైయక్తిక భేదాలకు కారణమవుతుంది.
వైఖరి
ఒకానొక పరిస్థితికి, వ్యక్తికి లేదా వస్తువు పట్ల పొందికగా ప్రతిస్పందించడానికి వ్యక్తికి ఉండే సంసిద్ధతే వైఖరి- ఫ్రీమన్
వైఖరిని కులం, మతం, జాతి, ప్రాంతం, సమాజం, సంస్కృతి, వర్గం ప్రభావితం చేస్తాయి.
కాబట్టి వైఖరి అనేది మానసిక శక్తులు, ఉద్వేగాలతో కలిసి పనిచేస్తుంది.
ఈ విధంగా వైఖరి, వైయక్తిక భేదాలకు కారణమవుతుంది.
విలువలు
విలువ అనేది లక్ష్యంవైపు సుస్థిరంగా నడిపే ఒక ప్రేరణ- జోన్స్, గెనార్డ్
విలువ ఒక మానసిక అవసరం- మాస్లో
లక్ష్యాలు, అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి వైయక్తిక భేదాన్ని సూచిస్తాయి.
కాంక్షాస్థాయి
విజయం సాధించాలనే మానసికమైన కోరికే కాంక్షాస్థాయి.
ఒక వ్యక్తి తన పనిలో విజయవంతమైతే కాంక్షాస్థాయి పెరుగుతుంది. అపజయాల్ని ఎదుర్కొంటే కాంక్షాస్థాయి తగ్గుతుంది.
ఎన్నో కారకాలు కాంక్షాస్థాయిని ప్రభావితం చేయడంవల్ల ఇది వ్యక్తుల వైవిధ్యతకు కారణమవుతుంది.
ఆత్మభావన
తన గురించి తనకు గల ఒక ఆలోచనే ఆత్మభావన.
తనేమై ఉన్నాడో, తన బలం, బలహీనతలు ఏమిటో తెలుసుకొని ఉండటమే ఆత్మభావన.
ఆత్మభావన ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.
ఆత్మ విశ్వాసం వ్యక్తుల్లో వైవిధ్యతను ప్రభావితం చేస్తుంది.
సాధన
తరగతిలో అందరికీ ఒకే విధంగా బోధించినప్పటికీ వారి సాధనలో తేడాలుంటాయి.
దీనిలో పరిమాణాత్మక మార్పు వ్యక్తిగత భేదాలను సూచిస్తుంది.
గుణాత్మక మార్పు వ్యక్తంతర్గత భేదాలను సూచిస్తుంది.
నోట్: ప్రజ్ఞాలబ్ధి సూత్రం లాగే ‘విద్యాలబ్ధి’కి కూడా సూత్రాన్ని కనుగొనవచ్చు. ఒక స్థాయి విద్యను పొందడం ఆ స్థాయి వయస్సును సూచిస్తుంది. దీని ఆధారంగా విద్యాలబ్ధిని కనుక్కోవచ్చు.
వైయక్తిక భేదాలు రకాలు (Applications)
- ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో అందరికీ ఒకేలా బోధిస్తున్నాడు. అయితే రాము అనే విద్యార్థి తరగతి గదిలో అందరు విద్యార్థుల కంటే నిష్పాదనలో ముందున్నాడు. సోము అనే విద్యార్థి నిష్పాదనలో అందరికంటే వెనుకబడి ఉన్నాడు. కాగా ఉపాధ్యాయుడు పరిగణనలోకి తీసుకొని, రాము, సోముల నిష్పాదనపై ప్రభావం చూపిన కారకం ఏది?
1) అనువంశికత 2) పరిసరాలు
3) వైయక్తిక భేదాలు
4) తరగతి వాతావరణం - కింది వాటిలో వైయక్తిక భేదాలు కనిపించే అంశం?
1) శారీరక లక్షణాలు
2) సహజ సామర్థ్యాలు
3) నైతిక వికాస అంశాలు 4) పైవన్నీ - వైయక్తిక భేదాలకు గల ప్రధాన కారకం?
1) అనువంశికత 2) పరిసరాలు
3) 1 లేదా 2 4) 1, 2 - నవీన బొమ్మలు బాగా గీయగలదు. చదవడం, రాయడంలో ఆమె నిష్పాదన తరగతిలోని మిగిలిన వారితో పోలిస్తే సగటుగా ఉంది. నవీన కింది ఏ వైయక్తిక భేదాన్ని కలిగి ఉంది?
1) వ్యక్తంతర వైయక్తిక భేదం
2) వ్యక్తంతర్గత వైయక్తి భేదం
3) వ్యక్తంతర్గత, వ్యక్తంతర వైయక్తిక భేదం
4) ఏదీకాదు - అంతర వైయక్తిక భేదానికి సంబంధించి
సరైనది?
1) శివ ఆటలు ఆడటం ఇష్టపడినంతగా
చదువును ఇష్టపడడు
2) ఉపాధ్యాయులిచ్చిన ఇంటిపనిని
వీణ చక్కగా చేస్తుంది
3) వనజ డాన్స్ బాగా చేయడం కంటే
పాటలు బాగా పాడగలదు
4) అఖిల లెక్కలు బాగా చేస్తుంది. కానీ
చదరంగం బాగా ఆడలేదు - పరీక్ష పత్రాన్ని తయారుచేసేటప్పుడు కఠినతాస్థాయికి ఇచ్చే భారత్వ పట్టికను రూపొందించడంలో పరిగణనలోకి తీసుకునే అంశం కింది వాటిలో ఏది?
1) అంతర వ్యక్తిగత భేదాలు
2) వ్యక్తంతర్గత భేదాలు
3) వ్యక్తి అంతర భేదాలు
4) అంతస్థవ్యక్తిగత వైవిధ్యాలు - ఒక ఉపాధ్యాయుడు తన తరగతిలోని విద్యార్థులందరి నుంచి సరైన నిష్పాదన రాబడుతున్నాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు తన బోధనలో అనుసరించిన విధానంలో కింది వాటిలో సరైనది?
1) ఆ ఉపాధ్యాయుడు బోధన పట్ల ఆసక్తి, ఉత్సుకత కలిగి ఉన్నాడు
2) అతడు తరగతిగదిని అందంగా ఆకర్షణీయంగా మార్చాడు
3) బోధనోపకరణాలను విరివిగా ఉపయోగించాడు
4) బోధనను వైయక్తిక భేదాలననుసరించి చేశాడు
- Tags
- nipuna
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు