‘వర్క్ ప్లేస్’కూ వాటా
డిమాండ్ పెరిగింది
కరోనా తర్వాత చాలా మంది వర్క్ ప్లేస్ కావాలని కోరుతున్నారు. దీనికి తగ్గట్టుగా 2.5 బీహెచ్‌కే, 3.5 బీహెచ్‌కే కల్చర్ పెరుగుతున్నది. కొత్త ప్రాజెక్టుల్లో ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయిస్తున్నాం. నిర్మాణంలో ఉన్నవాటిలో, పూర్తయినవాటిలో ఉడెన్ పార్టిషన్ చేసి ఇస్తున్నాం. కొందరు బాల్కనీలో గ్లాస్ ఫిటింగ్ చేసుకొని, వర్క్ ప్లేస్‌గా మార్చుకుంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌తో చాలా మంది సిటీకి దూరంగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. నగరంలో ఇంటికోసం పెట్టే డబ్బుతో, కాస్త దూరమైనా సరే విస్తీర్ణం ఎక్కువగా ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారు.
ప్రభాకర్‌రావు అధ్యక్షుడు, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్
ప్రపంచాన్ని వణికించిన కరోనా విపత్తు.. రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త అవకాశాలనూ తీసుకొచ్చింది. గృహ నిర్మాణ ప్రణాళికల్లో గణనీయ మార్పులు చోటు చేసుకున్నాయి. కరోనాకు ముందు, కరోనా తర్వాత వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్లను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. కరోనాతో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ పని సంస్కృతి పెరిగింది. భవిష్యత్తులోనూ ఈ ధోరణి కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో, కొత్తగా ఇల్లు లేదా ఫ్లాట్ కొనాలని భావిస్తున్నవారిలో 60 శాతం మందికిపైగా కచ్చితంగా ఇంట్లో ఆఫీస్ స్పేస్/వర్క్ ప్లేస్ ఉండాలని కోరుకుంటున్నారు. కొత్తగా లాంచ్ అవుతున్న ప్రాజెక్టులను సంప్రదిస్తున్న వినియోగదారుల్లో చాలా మంది ‘ఆఫీస్ స్పేస్ సౌలభ్యం ఉందా?’ అని ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. అయితే, ఇందుకోసమే అదనంగా మరొక గదిని నిర్మించడం ఆర్థికంగా భారం అవుతుంది. 2 బీహెచ్‌కే లేదా 3 బీహెచ్‌కే కొనాలనుకున్నవారు, అదనంగా మరో గది కోసం ప్రయత్నిస్తే.. కనీసం రూ.5-6 లక్షలు అదనంగా చెల్లించాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో అదనంగా ఒక గదికి బదులు, సగం గది చాలని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘2.5 బీహెచ్‌కే.. 3.5 బీహెచ్‌కే….’ తెర మీదికి వచ్చాయి.
దాదాపు 150 చదరపు అడుగుల్లో..
వర్క్ ప్లేస్‌లో కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ పెట్టుకునేందుకు ఒక టేబుల్, కుర్చీ, ఫైల్స్ పెట్టుకొనేందుకు క్యాబిన్ ఉంటే చాలని చాలా మంది వినియోగదారులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బిల్డర్లు సైతం కొత్త ప్రాజెక్టుల్లో ఆఫీస్ స్పేస్‌ను కలుపుతున్నారు. 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కేకి అదనంగా సగటున 150 చదరపు అడుగుల స్థలాన్ని ఆఫీస్ స్పేస్ కోసం కేటాయిస్తున్నారు. కొందరు బిల్డర్లు వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా ఈ విస్తీర్ణాన్ని పెంచుతున్నారు. కొందరు వెలుతురు ఎక్కువగా వచ్చేలా ఎలివేషన్ కావాలంటే, మరికొందరు ఎలాంటి అలికిడీ లేకుండా ఒక మూలన ఉంటే చాలని కోరుతున్నారు.
నిర్మాణ దశలోని భవనాల్లోనూ..
కొత్త ప్రాజెక్టులే కాదు, ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభమైన ఇండ్లల్లోనూ వర్క్ స్పేస్ కోసం డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఆ ఇంటి/అపార్ట్మెంట్ డిజైన్‌పై ప్రభావం చూపే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో బిల్డర్లు నిర్మాణం పూర్తయిన తర్వాత ఆఫీస్ స్పేస్ గురించి ఆలోచించాలని సూచిస్తున్నారు. వారికి ఇష్టమైన చోట కొంత ప్రాంతానికి, పార్టిషన్ చేసి ఇస్తామని ఒప్పిస్తున్నారు. కొందరు బాల్కనీని ఆఫీస్ స్పేస్‌గా మార్చుకుంటే, మరికొందరు హాల్లో కొంత ప్రాంతాన్ని ఆఫీస్ క్యాబిన్ మాదిరిగా విడగొడుతున్నారు.
కాసాని మహేందర్‌రెడ్డి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు