పదితో కానిస్టేబుల్ కొలువు
మొత్తం ఖాళీల సంఖ్య 25271
పదోతరగతి పాసయ్యారా? మంచి శరీర దారుఢ్యం ఉందా ? దేశ సేవ చేయాలనుకుంటున్నారా? భద్రమైన కొలువు, భరోసానిచ్చే జీతభత్యాలు గల ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే వీటన్నింటి సమాహారమే కేంద్ర పారామిలిటరీ దళాల్లో కానిస్టేబుల్ పోస్టులు. 25 వేలకు పైగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఖాళీలు, అర్హతలు, ఎంపిక తదితర వివరాలు సంక్షిప్తంగా..
సీఏపీఎఫ్
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)లో భాగమైన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ (సీఐఎస్ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్బీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్ఎస్ఎఫ్), అస్సాం రైఫిల్స్ (ఏఆర్)లలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి హోంశాఖ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) చేసుకున్న ఒప్పందం మేరకు ఎస్ఎస్సీ కానిస్టేబుల్ (జీడీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు: కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)
మొత్తం ఖాళీలు: 25,271
జీతభత్యాలు: పేస్కేల్3 ప్రకారం రూ.21,700 రూ.69,100/-
అర్హతలు: 2021, ఆగస్ట్ 1 నాటికి పదోతరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు: 2021, ఆగస్ట్ 1 నాటికి 18 – 23 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (సీబీఈ), సీఏపీఎఫ్ నిర్వహించే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ సాండర్ట్ టెస్ట్ (పీఎస్టీ), మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
సీబీఈ
ఆన్లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు, 100 మార్కులు.
పరీక్ష కాలవ్యవధి 90 నిమిషాలు.
పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు-25 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు-25 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 25 ప్రశ్నలు- 25 మార్కులు, ఇంగ్లిష్/హిందీ నుంచి 25ప్రశ్నలు -25 మార్కులు
పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోత విధిస్తారు.
పీఎస్టీ (ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్)
ఎత్తు: పురుషులు- 170 సెం.మీ, మహిళలు- 157 సెం.మీ
ఛాతీ: పురుషులకు 80 సెం.మీ ఉండాలి. గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించాలి.
బరువు: ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
పీఈటీ (ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్)
పురుషులు 5 కి.మీ. దూరాన్ని 24 నిమిషాల్లో, 1.6 కి.మీ దూరాన్ని 6 1/2 నిమిషాల్లో పరుగెత్తాలి. మహిళలు 1.6 కి.మీ. దూరాన్ని 8 1/2 నిమిషాల్లో, 800 మీటర్ల దూరాన్ని 4 నిమిషాల్లో పరుగెత్తాలి.
నోట్: పీఈటీ, పీఎస్టీలలో అర్హత సాధించినవారికి వైద్యపరీక్షలు నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి తుది ఎంపిక చేస్తారు.
రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఆగస్ట్ 31
వెబ్సైట్: https://ssc.nic.in
-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు