ఫుడ్ టెక్నాలజీ కోర్సులు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్ (నిఫ్టెం) కింది కోర్సుల్లో భర్తీకి ప్రకటన విడుదలైంది.
కోర్సులు-అర్హతలు
బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్)
కోర్సు కాలవ్యవధి: నాలుగేండ్ల్లు
మొత్తం సీట్ల సంఖ్య: 189
అర్హతలు: ఇంటర్లో ఉత్తీర్ణతతోపాటు జేఈఈ మెయిన్-2021లో అర్హత సాధించాలి.
ఎంపిక: సీఏఎస్బీ నిర్వహించే సెంట్రల్ కౌన్సెలింగ్ ద్వారా
మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (ఎంటెక్)
కోర్సు కాలవ్యవధి: రెండేండ్లు
విభాగాలు: ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్, ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్, ఫుడ్ సప్లయ్ అండ్ చైన్ మేనేజ్మెంట్, ఫుడ్‌ప్లాంట్ ఆపరేషన్ మేనేజ్మెంట్.
సీట్ల సంఖ్య: ఒక్కో ప్రోగ్రామ్‌లో 18 ఉన్నాయి.
అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో నాలుగేళ్ల డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు చాలు.
ఎంపిక: గేట్ వ్యాలిడ్ స్కోరు ఆధారంగా. గేట్ స్కోరు లేని వారు నిఫ్టెం నిర్వహించే ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
పీహెచ్డీ ప్రోగ్రామ్
విభాగాలు: అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, బేసిక్, అప్లయిడ్ సైన్సెస్, ఫుడ్ ఇంజినీరింగ్, ఫుడ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
మొత్తం సీట్లు: 33
అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. నెట్ జేఆర్ఎఫ్లో క్వాలిఫై/రిసెర్చ్ ఎంట్రెన్స్ టెస్ట్‌లో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. సీఎస్ఐఆర్-యూజీసీ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిన వారు ప్రవేశ పరీక్ష రాయనవసరం లేదు. అయితే వీరు ఇంటర్వ్యూకు మాత్రం తప్పనిసరిగా హాజరు కావాలి.
ఎంబీఏ ప్రోగ్రామ్: డ్యూయల్ స్పెషలైజేషన్
విభాగాలు: ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ తప్పనిసరి. దీంతోపాటు మార్కెటింగ్ /ఫైనాన్స్ లేదా ఇంటర్నేషనల్ బిజినెస్‌లలో ఏదో ఒకటి.
మొత్తం సీట్లు: 32
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు చాలు.
ఎంపిక: క్యాట్/మ్యాట్ స్కోర్ ద్వారా
నోట్: ఈ కోర్సులకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) గుర్తింపు ఉంది.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఎంబీఏ, ఎంటెక్, పీహెచ్డీ కోర్సులకు ఆగస్ట్ 8
వెబ్సైట్: http://www. niftem.ac.in
- Tags
- cources
- food technology
- niftem
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు