ప్రాజెక్టు పద్ధతి ఏ సూత్రంపై ఆధారపడుతుంది?
బోధనా పద్ధతులు
- గణితం అమూర్తమైనది కాబట్టి గణిత బోధనా విధానం ఏ విధంగా ఉండాలి?
1) అమూర్తం నుంచి మూర్తం
2) మూర్తం నుంచి అమూర్తం
3) 1, 2 4) మూర్తం నుంచి మూర్తం - కింది వాటిలో భావనలను పిల్లలకు నేరుగా ప్రాథమిక స్థాయిలో నేర్పించే విధానం కానిది?
1) మూర్త వస్తువుల ద్వారా బోధించడం
2) పలు ఉదాహరణలివ్వడం
3) వస్తువులను పరిశీలింపజేయడం
4) నేరుగా నిర్వచనం చెప్పడం - తెలంగాణ రాష్ట్రంలో కరోనా కాటుకు బలైన వ్యక్తుల వివరాలను విద్యార్థి వైద్యారోగ్య శాఖ నుంచి సేకరించి, వాటిని సుదీర్ఘంగా పరిశీలించి, యధార్థాలను చెప్పగలగడం అనేది?
1) ఆగమనాత్మక దృక్పథం
2) నిగమనాత్మక దృక్పథం
3) విశ్లేషణాత్మక దృక్పథం
4) సంశ్లేషణాత్మక దృక్పథం - కింది వాటిలో ఏ దశలో క్రమం అనే భావన ఏర్పడటం వల్ల ఆరోహణ, అవరోహణ క్రమాల భావనలు నేర్పించవచ్చు?
1) మూర్త ప్రచాలక దశ
2) నియత ప్రచాలక దశ
3) పూర్వ భావన దశ
4) ఇంద్రియ చాలక దశ - తెలంగాణ సాగునీటి కష్టాలను తీర్చే ‘కాళేశ్వరం ప్రాజెక్టు’ను సందర్శించి జ్ఞానాన్ని పొందడంలో ఇమిడి ఉన్న బోధనా పద్ధతి?
1) ప్రాజెక్టు పద్ధతి 2) అన్వేషణా పద్ధతి 3) క్రీడా పద్ధతి 4) కృత్యా పద్ధతి - ఒక ఉపాధ్యాయుడు ఒకేరకమైన వివిధ కొలతలతో ఉన్న అనేక దీర్ఘచతురస్రాలను నల్లబల్లపై గీసి ప్రతి పటంలో దీర్ఘచతురస్ర పొడవు, వెడల్పుల లబ్దం ఆ దీర్ఘచతురస్రం మొత్తం గళ్ల సంఖ్యకు సమానమవుతుందని గణింపజేసి అప్పుడు దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని బోధించాడు. అయినా ఉపాధ్యాయుడు అనుసరించిన బోధనా పద్ధతి?
1) అన్వేషణ 2) ప్రాజెక్టు
3) ఆగమన 4) నిగమన - ‘కృత్యం లేనిదే పాఠ్యాంశం లేదు’ అనే దృక్పథమైన విశ్వాసం కలిగిన విద్యావేత్త?
1) జాన్ డూయీ 2) పియాజే
3) ఆర్మ్‌స్ట్రాంగ్ 4) కొమినియస్ - శాంసన్ ప్రతి ఆదివారం బైబిల్ పఠిస్తాడు. బైబిల్ పఠనానికి అత్యంత పవిత్ర ప్రదేశమైన ‘చర్చి’ మూలాధార పద్ధతిని అనుసరించి ఏ రకమైన వనరుగా పరిగణించబడుతుంది?
1) భౌతిక వనరు 2) లిఖిత వనరు
3) అలిఖిత వనరు 4) గౌణ వనరు - కింది వాటిలో ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ద్వారా బోధించలేని అంశం?
ఎ. కార్బన్ డై ఆక్సైడ్ తయారీ
బి. స్థానిక స్వపరిపాలన
సి. సౌర కుటుంబం
డి. జలియన్‌వాలాబాగ్
1) ఎ, డి 2) బి, సి
3) ఎ, సి 4) బి, డి - కృత్రిమ వాతావరణంలో ప్రయోగాత్మక కృత్యాల్లో విద్యార్థి ప్రత్యక్షంగా పాల్గొనే బోధనా పద్ధతి?
1) ప్రాజెక్టు పద్ధతి 2) క్రీడాపద్ధతి
3) అన్వేషణాపద్ధతి 4) ఉపన్యాస పద్ధతి - ఎందువల్ల నిగమన పద్ధతి గణిత బోధనకు అంత ఉపయుక్తమైనది కాదు?
1) స్మృతి, ధారణకు ప్రాధాన్యం ఇస్తుంది
2) కాలం, శ్రమ పొదుపు చేస్తుంది
3) వేగం, కచ్చితత్వం అనుసరిస్తుంది
4) సులువుగా, సంక్షిప్తంగా ఉంటుంది - మాంటిస్సోరి విధానం గురించిన వాస్తవం?
1) క్రమశిక్షణ ఉంటుంది
2) తరగతులు ఉంటాయి
3) సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది
4) వ్యాయామ విద్య సామూహికంగా ఉంటుంది - విద్యార్థి తన పాఠశాలలో ‘నాడు-నేడు’ కార్యక్రమ ప్రారంభోత్సవంలో నాట్యం చేయడానికి ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయినా ఆ విద్యార్థి చేసే కృత్యం?
1) భౌతిక కృత్యం 2) బౌద్ధిక కృత్యం
3) మౌఖిక కృత్యం 4) మౌఖికేతర కృత్యం - ‘వాద-సంవాద’ పద్ధతిలో బోధించడానికి అనువైన అంశం?
1) స్వాతంత్య్ర సాధనలో కీలకమైన క్విట్ ఇండియా ఉద్యమం
2) ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మూడు రాజధానులు అవసరం
3) విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి సీవీ రామన్ చేసిన కృషి
4) కొవిడ్-19 నివారణలో డాక్టర్ల పాత్ర - 5E నమూనాలో విద్యార్థి పూర్వజ్ఞానాన్ని పరీక్షించే అంశానికి ప్రాధాన్యం ఇచ్చే దశ?
1) Engage 2) Explore
3) Explain 4) Elaborate - ప్రాజెక్టు పద్ధతి కింది ఏ సూత్రంపై ఆధారపడుతుంది?
1) జీవించడానికి నేర్చుకోవడం
2) జీవిస్తూ నేర్చుకోవడం
3) జీవించలేక నేర్చుకోవడం
4) జీవితాంతం నేర్చుకోవడం - మానవ మేధస్సులోని అత్యున్నత ప్రజ్ఞా నిష్పాదనమే?
1) ప్రాజెక్టు 2) కృత్యం
3) అన్వేషణ 4) విశ్లేషణ - పూర్వకాలంలో నలంద విశ్వవిద్యాలయంలో ఉపయోగించడమే కాకుండా, గ్రీకు తత్వవేత్తలు కూడా తమ శిష్యులకు కింది పద్ధతిలోనే బోధించేవారు?
1) కృత్యాపద్ధతి 2) క్రీడాపద్ధతి
3) చర్చాపద్ధతి 4) ఉపన్యాస పద్ధతి - ప్రయోగశాల పద్ధతికి సంబంధించిన అంశం కానిది?
1) ప్రయోగరూపంలో విషయాన్ని కనుగొంటారు
2) పరిశీలన ద్వారా విషయ నిర్ధారణ జరుగుతుంది
3) అమూర్త భావనలు పొందుతారు
4) ప్రత్యక్ష, మూర్త అనుభవాలు కలుగుతాయి - క్రీడాపద్ధతిలోని అంశాలను జతచేయండి?
- కథలు ఎ. భావవ్యక్తీకరణ, అవయవాల మధ్య సమన్వయం
- అభినయం బి. నేర్పుగా పనిచేయడంలో సృజనాత్మకత
- ఆటలు సి. అవధాన శక్తి, ఊహాశక్తి పెరుగుతుంది
- నిర్మాణ కృత్యాలు డి. సాంఘికీకరణ, మానసిక ఉల్లాసం
1) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
2) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
3) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎAnswers
1-2, 2-4, 3-3, 4-1, 5-1, 6-3, 7-2, 8-1, 9-4, 10-3, 11-1, 12-3, 13-4, 14-2, 15-1, 16-2, 17-4, 18-3, 19-3, 20-2
‘స్కావెంజర్స్ ఆఫ్ అక్వేరియం’ అంటే?
బోధనోపకరణలు-ఉపాధ్యాయుడు-పాఠ్యపుస్తకం
- వార్తా పత్రికలు, మ్యాగజైన్లలో వచ్చే పజిల్స్, వైజ్ఞానిక విషయాలకు సంబంధించిన చిత్రాలను ప్రదర్శించడానికి ఉపయోగపడే బోర్డు?
1) బ్లాక్‌బోర్డు 2) ప్యానెల్ బోర్డు
2) జియో బోర్డు 4) బెలిటెన్ బోర్డు - హంటర్ స్కోర్ కార్డులో ఎక్కువ పాయింట్లు కేటాయించిన అంశం?
1) భాషాశైలి 2) మనోవైజ్ఞానిక సూత్రం
3) అభ్యాసాలు 4) భౌతికరూపం - లెక్కించడం, సంఖ్యాభావన, సంఖ్యలు ఏర్పర్చడం, సంకలన, వ్యవకలన, గుణకార, భాగహారం గుండ్రని ఆకారం వంటి భావనలు బోధించడానికి కింది అభ్యసన సామగ్రిలో దేనిని ఎంపిక చేసుకుంటావు?
1) సంఖ్యాచార్టు 2) అగ్గిపుల్లలు
3) గోళీలు 4) బంకమట్టి - కింది వాటిలో ప్రత్యక్ష అనుభవానికిఉదాహరణ?
1) కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూడటం
2) బిగ్‌బాస్ ఫైనల్ ఎపిసోడ్ టీవీలో చూడటం
3) రాజధానిలోని రైతు దీక్షలో పాల్గొనడం
4) ఆన్లైన్లో వీడియో క్లాసులు వీక్షించడం - క్షేత్ర పర్యటనల ద్వారా సేకరించిన శిలాజాలతో విద్యార్థులు విజ్ఞాన శాస్త్ర వస్తుప్రదర్శన శాలను ఏర్పాటు చేశారు. ఇది కింది ఏ అభ్యసన అనుభవంగా చెప్పవచ్చు?
1) కృత్య పరికరాలు, పరోక్ష అనుభవాలు
2) శ్రవణ పరికరాలు, ప్రత్యక్ష అనుభవాలు
3) ప్రత్యామ్నాయ అనుభవాలు, దృశ్య పరికరాలు
4) ప్రత్యక్ష అనుభవాలు, స్పెసిమన్లు - దేశ సరిహద్దులు పాఠ్యాంశం బోధించడానికి ప్రపంచ పటాన్ని ఉపయోగించిన ఉపాధ్యాయుడు ఎడ్గార్ డేల్ శంఖువులో దేనిని అనుసరించినట్లు?
1) శాబ్దిక చిహ్నాలు 2) దృశ్యసాధనాలు
3) క్షేత్రపర్యటనలు 4) కల్పిత అనుభవాలు - భూగోళ శాస్త్ర అంశాలైన నదులు, పర్వతాలు, లోయలు, మైదానాలు, ఎడారులు, అడవులు మొదలైన వాటిని ఉత్తమంగా వివరించి బోధించడానికి అనువైన పటాలు?
1) భౌతిక పటాలు 2) రాజకీయ పటాలు
3) రిలీఫ్ పటాలు 4) ఆవరణరేఖా పటాలు - పూసల చట్రం ఉపయోగం?
1) స్థాన విలువలు గణింపచేయవచ్చు
2) భిన్నాలను వివరించవచ్చు
3) వైశాల్యాలు లెక్కించవచ్చు
4) గుణకారాలు నేర్పించవచ్చు - వృత్త గ్రాఫ్ ద్వారా సులువుగా బోధించే అంశం?
1) జనాభా పెరుగుదల
2) అక్షరాస్యత వ్యత్యాసాలు
3) గాలిలోని వాయువు
4) డిమాండ్-సప్లయ్ - గణిత, విజ్ఞాన శాస్త్ర సంఘాల విధి కానిది?
1) నిపుణులతో ఉపన్యాసాలిప్పించడం
2) ఉపాధ్యాయులకు సలహాలివ్వడం
3) పోటీపరీక్షలకు సన్నద్ధం చేయడం
4) బులిటెన్ బోర్డు నిర్వహణ - ‘నేను ఏదైతే వింటానో అది మర్చిపోతాను. నేను ఏదైతే చూస్తానో అది గుర్తుంచుకుంటాను. నేను ఏదైతే చేస్తానో అది అవగాహన చేసుకుంటాను’. అని బోధనలో ఉపకరణాల ప్రాధాన్యాన్ని వివరించిన విద్యావేత్త?
1) కొఠారి 2) కార్టన్ వీ గుడ్
3) బర్టన్ 4) కన్ఫ్యూషియస్ - ప్రతిభావంతుడైన విద్యార్థులను విజ్ఞానశాస్త్ర అధ్యయనాలవైపు ఆకర్షించడమే లక్ష్యంగా 2007-08 విద్యాసంవత్సరం నుంచి అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం?
1) Inspire 2) Inspite
3) Impact 4) Invent - స్ట్రిప్‌టీజ్ చార్టు ఉపయోగం?
1) అనుబంధ విషయాలను ఎగువ నుంచి దిగువకు వివరిస్తుంది
2) అంశాల మధ్య పోలికలు భేదాలను విశ్లేషిస్తుంది
3) అభ్యసనలో విద్యార్థి ఏకాగ్రతను నిలిపి ఉంచుతుంది
4) భాగాలు-దాని ఉపభాగాల వివరణను తెలియజేస్తుంది - ఎడ్గార్ డేల్ శంఖువులో అగ్రభాగం నుంచి ఆధార భాగానికి?
ఎ. మూర్తం నుంచి అమూర్తం
బి. అనుభవాల విస్తృతి తగ్గుతుంది
సి అమూర్తం నుంచి మూర్తం
డి. అనుభవాల విస్తృతి పెరుగుతుంది
1) ఎ, బి 2) బి, సి
3) సి, డి 4) డి, ఎ - ‘స్కావెంజర్స్ ఆఫ్ అక్వేరియం’ అని వేటిని పిలుస్తారు?
1) నత్తగుల్లలు 2) చేపలు
3) నీటిమొక్కలు 4) గులకరాళ్లు - సౌరకుటుంబం పాఠ్యాంశాన్ని X అనే ఉపాధ్యాయుడు ఫిల్మ్‌ల ద్వారా Y అనే ఉపాధ్యాయుడు పనిచేసే నమూనాల ద్వారా బోధించారు. అయినా వారు ఉపయోగించిన ఉపకరణాలు వరుసగా?
1) గ్రాఫిక్-త్రిమితీయ
2) ప్రక్షేపక-త్రిమితీయ
3) త్రిమితీయ-ప్రక్షేపక
4) త్రిమితీయ-గ్రాఫిక్ - ‘నల్లబల్ల’ పథకం ముఖ్య ఉద్దేశం?
1) నల్లబల్లలు సరఫరా చేయడం
2) మధ్యాహ్న భోజన వసతి కల్పించడం
3) ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడం
4) విద్యాప్రమాణాలు మెరుగుపర్చడం - మొదటి పుస్తకంగా భావించే థామస్ డిల్వర్త్ రచించిన పుస్తకం (1797)?
1) The Education Objectives
2) The School Master’s Assistant
3) Practical Curriculum Study
4) Second hand book of Research on Teaching - విద్యార్థికి అభ్యసనలో అత్యధిక ప్రభావాన్ని చూపేది?
1) నమూనాలు
2) స్పెసిమన్లు
3) మాక్అప్లు
4) వాస్తవ వస్తువులు - జతపర్చండి.
- రుచి ఎ. 3.5%
- స్పర్శ బి. 1%
- వాసన సి. 1.5%
- వినడం డి. 83%
- చూడటం ఇ. 11%
1) 1-బి, 2-సి, 3-డి, 4-ఇ, 5-ఎ
2) 1-బి, 2-సి, 3-ఎ, 4-ఇ, 5-డి
3) 1-సి, 2-బి, 3-ఇ, 4-డి, 5-ఎ
4) 1-సి, 2-ఇ, 3-బి, 4-డి, 5-ఎAnswers
1-4, 2-2, 3-3, 4-3, 5-4, 6-2, 7-1, 8-1, 9-3, 10-2, 11-4, 12-1, 13-3, 14-3, 15-1, 16-2, 17-4, 18-2, 19-4, 20-2
ఏఎన్ రావు, విషయ నిపుణులు
- Tags
- nipuna
- teaching methods
Previous article
కళావంతులు అనే పదం ఏ అర్థంలో వాడుతున్నారు?
Next article
ఫుడ్ టెక్నాలజీ కోర్సులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు