సైన్స్ కోర్సుల వేదిక ఐసర్
రేపటి దేశ ప్రగతి నేటి తరగతి గదుల్లోని విద్యార్థుల మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచానికి, దేశానికి అవసరమయ్యే పరిశోధనలను చేస్తూ ఆధునిక సాంకేతికను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలో పరిశోధనలను మరింత పెంచి దేశానికి అవసరమైన శాస్త్రవేత్తలను రూపొందించే వేదికగా స్థాపించిన విద్యాలయాలే ఐసర్ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్). ప్రారంభం నుంచే వినూత్న కరికులంతో పరిశోధనాత్మకమైన కోర్సులను అందిస్తున్న ఈ ఐసర్‌లలో ప్రవేశాలకు సంబంధించిన తేదీలను ప్రకటించిన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా…
ఐఐఎస్ఈఆర్
సైన్స్ ఎడ్యుకేషన్, రిసెర్చ్ రంగాలను మిళితం చేసి అత్యున్నత విద్యను అందించడానికి కేంద్రం ఐఐఎస్‌ఈఆర్‌లను ఏర్పాటు చేసింది. మొదట 2006లో కోల్‌కతా, పుణెలలో ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలో ఏడు ఐసర్లు ఉన్నాయి.
ఐసర్ క్యాంపస్‌లు: భోపాల్, బెర్హంపూర్, కోల్‌కతా, మొహాలీ, పుణె, తిరువనంతపురం, తిరుపతిలలో ఉన్నాయి.
ఆఫర్ చేస్తున్న కోర్సులు: బీఎస్, బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ.
బీఎస్ డిగ్రీ- ఇంజినీరింగ్ సైన్సెస్, ఎకనామిక్స్ కోర్సులను కేవలం భోపాల్ క్యాంపస్ మాత్రమే అందిస్తుంది. ఇది నాలుగేండ్ల కోర్సు.
బీఎస్-ఎంఎస్ డిగ్రీ ఐదేండ్ల డిగ్రీ కోర్సు.
ఈ కోర్సులు పూర్తి రెసిడెన్షియల్ ఫుల్‌టైం కోర్సులు.
అర్హతలు: 2020/2021లో ఇంటర్ (సైన్స్ స్ట్రీమ్)ఉత్తీర్ణులు. ఆయా రాష్ట్ర బోర్డుల్లో నిర్దేశించిన మార్కులు వచ్చి ఉండాలి.
ప్రవేశాలు కల్పించే విధానం
మూడు విధానాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. కేవీపీవై, జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్, స్టేట్ అండ్ సెంట్రల్ బోర్డుల చానెల్ ద్వారా.
1. కేవీపీవై ఫెలోషిప్ 2021-22 విద్యాసంవత్సరం నుంచి పొందనున్నవారికి.
2. ఐఐటీ -జేఈఈ (అడ్వాన్స్డ్)లో 15 వేల ర్యాంక్‌లోపు వచ్చినవారికి.
3. స్టేట్, సెంట్రల్ బోర్డ్‌లలో ఐఐఎస్ఈఆర్ ప్రకటించిన కటాఫ్ మార్కులు సాధించినవారు సంస్థ నిర్వహించే ఐఐఎస్ఈఆర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఐఏటీ) ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
స్కాలర్షిప్లు
కేవీపీవై చానెల్ వారికి నిబంధన ప్రకారం కేవీపీవై స్కాలర్షిప్ ఇస్తారు. మిగిలిన రెండు చానెల్ విద్యార్థులకు పరిమిత సంఖ్యలో డీఎస్టీ అందించే ఇన్స్పైర్ స్కాలర్‌షిప్స్‌ను ఇస్తారు.
రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, వరంగల్.
బీఎస్ (ఇంజినీరింగ్) 73
బీఎస్ (ఎకనామిక్ సైన్సెస్) 42
బీఎస్ డిగ్రీ సీట్ల మొత్తం 115
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
కేవీపీవై, ఎస్సీబీ చానెల్‌కు చివరితేదీ: ఆగస్టు 31
నోట్: ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్ చానెళ్ల ద్వారా ప్రవేశానికి సంబంధించిన తేదీల కోసం వెబ్సైట్ చూడవచ్చు.
వెబ్సైట్: https://www. iiseradmission.in
పూర్తి వివరాల కోసం
The Chairperson
Joint Admissions Committee 2021
Indian Institute of Science Education and Research Kolkata
Mohanpur, Nadia – 741 246,
West Bengal, India
Email: ask-jac2021@ iiserkol.ac.in
Helpdesk Number: 022 61306265
(9 AM to 6 PM, Monday to Saturday)
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు