సిఫ్నెట్లో ప్రవేశాలు
కొచ్చిలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ నాటికల్ అండ్‌ఇంజినీరింగ్ ట్రెయినింగ్ (సిఫ్నెట్) 2021-22 విద్యాసంవత్సరానికిగాను కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ (నాటికల్ సైన్స్)
మొత్తం సీట్ల సంఖ్య 45
ఈ కోర్సు కాలవ్యవధి నాలుగేండ్లు (8 సెమిస్టర్లు)
ఈ కోర్సుకు యూజీసీ గుర్తింపు ఉంది. దీంతోపాటు ముంబైలోని డీజీ షిప్పింగ్ అనుమతి కూడా ఉంది.
ఈ సంస్థకు కొచ్చిలోని సీయూఎస్ఏటీ అఫిలియేషన్ ఉంది.
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ (బైపీసీ) లేదా ఎంపీసీ ఉత్తీర్ణులైనవారు లేదా 2021లో పరీక్షలు రాయనున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలు ఇంటర్ పాసైతే సరిపోతుంది.
వయస్సు: 2021, అక్టోబర్ 1 నాటికి 17- 20 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
మెరైన్ ఫిట్టర్ కోర్సు (ఎంఎఫ్సీ)/వెజెల్ నావిగేటర్ కోర్సు (వీఎన్‌సీ)
సీట్ల సంఖ్య: ఎంఎఫ్సీ- 20, వీఎన్‌సీ- 20
కోర్సు కాలవ్యవధి: రెండు సంవత్సరాలు (నాలుగు సెమిస్టర్లు)
ఈ కోర్సును సిఫ్నెట్ కొచ్చి, చెన్నై, విశాఖపట్నం ఆఫర్ చేస్తున్నాయి.
అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత. మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో కనీసం 40 శాతం మార్కులు వచ్చి ఉండాలి. 2021లో పదోతరగతి పరీక్షలు రాయనున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు: 2021, ఆగస్టు 1 నాటికి 15- 20 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఈ కోర్సుకు ఎంపికైన వారికి నెలకు రూ.1500 స్టయిఫండ్ ఇస్తారు. విజయవంతంగా ఈ కోర్సు పూర్తిచేసుకున్న అభ్యర్థులకు పోస్ట్ ఇన్స్టిట్యూషనల్ ట్రెయినింగ్ ఉంటుంది. ఈ శిక్షణ సమయంలో నెలకు రూ.20,500 స్టయిఫండ్ ఇస్తారు. యూనిఫాం అలవెన్స్ కింద రూ.2500 ఇస్తారు.
ఎంపిక విధానం: పదోతరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోట్: మత్స్యకారుల కుటుంబాలకు చెందిన విద్యార్థులకు నాలుగు సీట్లు కేటాయిస్తారు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
చివరితేదీ: జూలై 15
వెబ్సైట్: https://cifnet.gov.in
ఐఐఏలో
బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐఐఏ)లో కింది ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
ప్రోగ్రామ్స్: ఇంటిగ్రేటెడ్ ఎంటెక్-పీహెచ్డీ (టెక్నాలజీ), పీహెచ్డీ
అర్హతలు: జూలై-2021 నాటికి ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ లేదా ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణతతోపాటు గేట్/జెస్ట్ లేదా సీఎస్ఐఆర్ నెట్లో అర్హత సాధించి ఉండాలి.
వయస్సు: 2021, జూలై 1 నాటికి 25 ఏండ్లు మించరాదు
ఎంపిక: ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ తేదీలు: జూలై 19-23
దరఖాస్తు: ఆన్లైన్లో.. చివరితేదీ: జూలై 13
వెబ్సైట్: https://www.iiap.res.in/phd_2021
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు