ఇంటి వద్దకే విద్య
మూడున్నర దశాబ్దాల కింద వయస్సు, ప్రాంతం, మతం, జెండర్‌తో సంబంధం లేకుండా అందరికీ సమానంగా విద్యను అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటుచేసిన దూరవిద్య నేడు కొవిడ్-19తో ప్రత్యామ్నాయంగా మారుతుంది. యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్‌ను అందిస్తూ ఇగ్నో దూరవిద్యను అందించడంలో అగ్రగామిగా ఉంది. జూలై 2021 సెషన్లో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువు జూలై 15న ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇగ్నో గురించి సంక్షిప్తంగా….
ఇగ్నో
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో)ని 1985 పార్లమెంట్ చట్టం ప్రకారం ప్రారంభించారు.
ప్రపంచంలో అతిపెద్ద ఓపెన్ యూనివర్సిటీగా అవతరించింది.
కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ ద్వారా 1993, 1999లో అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను పొందింది.
ఇగ్నో నోడల్ ఏజెన్సీగా 24 గంటల ఎడ్యుకేషనల్ చానెల్ (జ్ఞాన్ దర్శన్)ను ప్రారంభించింది.
రిజిస్టర్ అయిన విద్యార్థుల సంఖ్య మూడు మిలియన్లు.
2010లో ఉన్నతవిద్యా సంస్థల్లో అతిపెద్ద సంస్థగా ఇగ్నోను యునెస్కో ప్రకటించింది.
దేశంలో పలు ప్రాంతాల్లో సుమారు 67 రీజినల్ సెంటర్ల ద్వారా పలు కోర్సులను అందిస్తుంది. ఇవే కాకుండా పలు ఆర్ఆర్సీల ద్వారా సేవలు అందిస్తుంది.
ఈ కోర్సులు రెగ్యులర్ కోర్సులతో సమానం. సివిల్స్, గ్రూప్స్, రైల్వే తదితర ఉద్యోగాలన్నింటికి ఈ కోర్సులు చేసిన వారు అర్హులే.
ప్రస్తుతం యూజీసీ నిబంధనల ప్రకారం ఒకేసారి రెండుకోర్సులను అంటే ఒకటి రెగ్యులర్ విధానంలో రెండోది దూరవిద్యా విధానంలో చదువుకోవచ్చు.
ఆసక్తి ఉండి ఒకేసారి రెండు డిగ్రీలను లేదా కోర్సులను చదువాలనుకునేవారికి ఇగ్నో కోర్సులు కల్పవృక్షం అని చెప్పవచ్చు.
కోర్సుల విశేషాలు
ఇగ్నో సెల్ఫ్ ఇన్స్ట్రక్షనల్ ప్రింటెడ్ మెటీరియల్ (థియరీ, ప్రాక్టికల్స్), ఆడియో-విజువల్ మెటీరియల్ ఎయిడ్స్, ఈజ్ఞాన్ కోశ్ ద్వారా వీడియో కంటెంట్ (డిజిటల్ లెర్నింగ్), జ్ఞాన్ దర్శన్, జ్ఞానవాణి, స్వయంప్రభ వెబ్బేస్డ్ ద్వారా పలు క్లాసులను అందిస్తుంది. వీటితోపాటు ఆల్ ఇండియా రేడియో ద్వారా ఆడియో ప్రోగ్రామ్స్‌ను అందిస్తుంది.
అవసరమైన సబ్జెక్టులకు సంబంధించి ప్రాక్టికల్స్/ప్రాజెక్ట్‌లను స్టడీ సెంటర్లు అందిస్తాయి.
పలు కోర్సులను క్రెడిట్ సిస్టమ్ (చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్) ద్వారా ఇగ్నో అందిస్తుంది.
ప్రస్తుతం సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, డాక్టోరల్ తదితరాలకు సంబంధించి 200కుపైగా కోర్సులను ఆఫర్ చేస్తుంది. వీటిలో 13 ఆన్లైన్ కోర్సులు ఉన్నాయి.
ఆఫర్ చేస్తున్న కోర్సులు
యూజీ కోర్సులు: బీఏ, బీకాం, బీసీఏ, బీఎల్ఐఎస్సీ, బీబీఏ, బీఏ (ఆనర్స్) తదితర కోర్సులు ఉన్నాయి. కాలవ్యవధి- మూడేండ్లు.
అర్హతలు: ఇంటర్ ఉత్తీర్ణత. బోధనా మాధ్యమం ఇంగ్లిష్/హిందీ.
పీజీ కోర్సులు: ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఏ ఎడ్యుకేషన్, ఎంఏ సైకాలజీ, ఎంసీఏ, ఎంకాం, ఎంఎల్ఐఎస్సీ తదితరాలు ఉన్నాయి.
వీటితోపాటు పలు పీజీ డిప్లొమాలు, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు ఉన్నాయి.
అర్హత: పీజీ, పీజీ డిప్లొమా/ డిప్లొమా/ సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్‌కు సంబంధిత విభాగాల్లో డిగ్రీ /ఇంటర్. పీహెచ్డీ, మేనేజ్మెంట్ కోర్సులను కూడా ఇగ్నో అందిస్తుంది.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: జూలై 15
వెబ్సైట్: http://ignou.ac.in
హైదరాబాద్ రీజినల్ సెంటర్ చిరునామా:M J Road Nampally, HYDERABAD
PH.OFF : 040-23117550-5,3
E-MAIL : rchyderabad@ignou.ac.in
-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు