ఎన్విజన్ను ప్రారంభించనున్న అంతరిక్ష సంస్థ?
- కింది వాటిలో జీ-7 కూటమిలో లేని దేశం? (డి)
ఎ) అమెరికా బి) జపాన్
సి) యూకే డి) రష్యా
వివరణ: జీ-7 కూటమిలో అమెరికా, కెనడా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. జూన్ రెండో వారంలో ఈ కూటమి సమావేశాలు యూకేలో నిర్వహించారు. ఒకప్పుడు ఇది జీ-8గా ఉంది. అయితే క్రిమియా వ్యవహారానికి సంబంధించి రష్యాను తొలగించడంతో జీ-7గా మారింది. ఇటీవల నిర్వహించిన సమావేశాలకు అతిథులుగా భారత్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా దేశాలు
పాల్గొన్నాయి. - ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలు ఎన్ని ఉంటాయి? (బి)
ఎ) 5 బి) 10 సి) 15 డి) 20
వివరణ: ఐక్యరాజ్య సమితి ఆరు అంగాల్లో భద్రతా మండలి కూడా ఒకటి. ఇందులో మొత్తం సభ్య దేశాల సంఖ్య 15. అయిదు శాశ్వత ప్రాతిపదికన ఉంటాయి. అవి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా. మరో 10 దేశాలు రెండు సంవత్సరాలకుగాను ఎన్నికవుతాయి. ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో అల్బేనియా, బ్రెజిల్, గాబన్, ఘనా, యూఏఈ దేశాలు సభ్యత్వాన్ని పొందాయి. 2022-23 దేశాలకుగాను అవి భద్రతా మండలికి ఎన్నికయ్యాయి. భారత్ సభ్యత్వం 2021-22 సంవత్సరాలకుగాను ఉంది. - క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్‌లో ‘టాప్-200’లో స్థానం పొందని భారత విద్యా సంస్థ కింది వాటిలో ఏది? (సి)
ఎ) ఐఐటీ-బాంబే బి) ఐఐటీ-ఢిల్లీ
సి) జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ
డి) ఐఐఎస్సీ (బెంగళూర్)
వివరణ: క్యూఎస్ యూనివర్సిటీ వరల్డ్ ర్యాంకింగ్‌లో టాప్-200లో భారత్‌కు చెందిన కేవలం మూడు విద్యాసంస్థలు మాత్రమే చోటు సంపాదించాయి. అలాగే టాప్-1000లో 22 భారత విద్యాసంస్థలు ఉన్నాయి. టాప్-1000లోకి తొలిసారిగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, పుదుచ్చేరి యూనివర్సిటీ, ఐఐటీ-భువనేశ్వర్, శిక్షా వో అనుసంధాన్ (ఎస్వోఏ)లు ప్రవేశించాయి. ప్రపంచంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిలిచింది. ఈ విశ్వవిద్యాలయం ఈ స్థానంలో ఉండటం వరుసగా ఇది పదో సారి. - బిట్ కాయిన్‌కు చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న తొలి దేశం ఏది? (ఎ)
ఎ) ఎల్సెల్వడార్ బి) గౌతమేళ
సి) కోస్టారికా డి) ఏదీకాదు
వివరణ: బిట్ కాయిన్ అనేది ఒక క్రిప్టోకరెన్సీ, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారంగా ఇది పనిచేస్తుంది. దీనిని చట్టబద్ధ ద్రవ్యంగా ఆమోదిస్తూ మధ్య అమెరికా ఖండంలోని ఎల్సెల్వడార్ అనే దేశం నిర్ణయం తీసుకుంది. ఈ దేశం ఎక్కువగా రెమిటెన్స్‌లపై ఆధారపడి ఉంది. బిట్ కాయిన్ ఆమోదంతో వీటిని తమ దేశానికి వేగంగా పంపుకోవచ్చన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే సమ్మిళిత ఆర్థిక వృద్ధిని సాధించడానికి ఉపయోగపడుతుందని ఆ దేశం భావిస్తుంది. బిట్ కాయిన్‌కు చట్టబద్ధత కల్పించిన తొలి దేశం ఎల్సెల్వడార్. - అట్లాంటా చార్టర్‌తో ఏర్పడిన వ్యవస్థ ఏది? (డి)
ఎ) నానాజాతి సమితి
బి) ఆసియాభివృద్ధి బ్యాంక్
సి) యూరోపియన్ యూనియన్
డి) ఐక్యరాజ్య సమితి
వివరణ: 1941లో అట్లాంటా చార్టర్ మూలంగా ఏర్పడిందే ఐక్యరాజ్య సమితి. ఈ చార్టర్ ఒప్పంద పత్రాలను ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌లు ఆ పత్రాలను ఇటీవల పరిశీలించారు. ఈ ఒప్పందం చేసుకున్నప్పుడు అమెరికా అధ్యక్షుడిగా రూజ్వెల్ట్, యూకే ప్రధానిగా విన్స్టన్ చర్చిల్ ఉన్నారు. ఐక్యరాజ్య సమితికి ఆ పేరును సూచించింది కూడా రూజ్వెల్టే. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో శాంతి స్థాపన కృషిలో భాగంగా అట్లాంటా చార్టర్‌పై సంతకాలు చేశారు. - ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ విడుదల చేసిన నివాస యోగ్యతా సూచీలో అగ్రస్థానంలో ఉన్న నగరం? (డి)
ఎ) వియన్నా బి) టోక్యో
సి) మెల్బోర్న్ డి) ఆక్లాండ్
వివరణ: ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ విడుదల చేసిన నివాస యోగ్యతా నగరాల సూచీలో న్యూజిలాండ్‌కు చెందిన ఆక్లాండ్ అగ్రస్థానంలో ఉంది. మొత్తం 140 నగరాలను వివిధ అంశాల ప్రాతిపదికన పరిశీలించారు. స్థిరత్వం, ఆరోగ్య సంరక్షణ, సంస్కృతి-పర్యావరణం, విద్య, మౌలిక సదుపాయాలు తదితరాల ఆధారంగా ర్యాంకులను కేటాయించారు. 2018, 2019లో ఈ సూచీలో అగ్రస్థానంలో ఉన్న వియన్నా ఈసారి తన స్థానాన్ని కోల్పోయింది. ఇందులో చివరగా ఉన్న దేశం డమాస్కస్. - భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ జూన్ రెండో వారంలో మూడు రోజుల పాటు పర్యటించిన ఆఫ్రికా ఖండంలోని దేశం? (డి)
ఎ) ఘనా బి) దక్షిణాఫ్రికా
సి) జిబౌటీ డి) కెన్యా
వివరణ: భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, జూన్ రెండో వారంలో తూర్పు ఆఫ్రికా దేశం అయిన కెన్యాను సందర్శించారు. ఆ దేశ ప్రభుత్వాధినేతలతో చర్చలు జరిపారు. నైరోబీ విశ్వవిద్యాలయంలో మహాత్మాగాంధీ గ్రంథాలయాన్ని పునరుద్ధరించారు. ఇదే విశ్వవిద్యాలయంలో 1956లో మహాత్ముడి విగ్రహాన్ని నెలకొల్పారు. దాదాపు 4000 మంది కెన్యా విద్యార్థులకు ఏటా స్కాలర్షిప్లను భారత్ ఇస్తుంది. - ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉంది? (బి)
ఎ) అమెరికా బి) ఇటలీ
సి) బ్రిటన్ డి) ఫ్రాన్స్
వివరణ: ఆహార వ్యవసాయ సంస్థ (ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, ఎఫ్ఏవో) ప్రధాన కార్యాలయం ఇటలీలోని రోమ్‌లో ఉంది. ఈ సంస్థ 42వ వార్షికోత్సవం జూన్ 14న నిర్వహించారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సమావేశాలను ఏర్పాటు చేస్తారు. ఈ దఫా వర్చువల్ పద్ధతిలో ఇది కొనసాగింది. సంస్థ విధానాలు, బడ్జెట్, ఆహారం, వ్యవసాయ సంబంధ అంశాలపై నిర్ణయాలు తీసుకుంటారు. భారత వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా ఇందులో ప్రసంగించారు. వ్యవసాయాభివృద్ధికి భారత్ అమలు చేస్తున్న ప్రధాన మంత్రి కృషి సించయ్ యోజన, కిసాన్ రైలు, పీఎం కిసాన్ తదితర పథకాలను ప్రస్తావించారు. - ‘బిలీవ్: వాట్ లైఫ్ అండ్ క్రికెట్ టాట్ మీ’ అనేది ఏ క్రికెటర్ స్వీయచరిత్ర? (సి)
ఎ) మహేంద్ర సింగ్ ధోని
బి) అంబటి తిరుపతి రాయుడు
సి) సురేశ్‌రైనా
డి) రాహుల్ ద్రవిడ్
వివరణ: అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లలో సెంచరీ సాధించిన భారత తొలి బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా ‘బిలీవ్: వాట్ లైఫ్ అండ్ క్రికెట్ టాట్ మీ’ అనే పుస్తకాన్ని రచించారు. ఇది ఆయన స్వీయ చరిత్ర. టీ-20లో భారత్ తరఫున సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్ కూడా సురేశ్ రైనానే. ప్రపంచంలో మాత్రం ఈ ఘనత సాధించిన మూడో బ్యాట్స్‌మెన్ ఆయన. ఆగస్ట్ 15, 2020న ఆయన క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్లో ఆయన చెన్నై సూపర్‌కింగ్స్ సభ్యుడిగా ఎన్నో ఘన విజయాలను అందించాడు. - ఎన్విజన్ను ప్రారంభించనున్న అంతరిక్ష సంస్థ? (ఎ)
ఎ) యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ
బి) ఇస్రో సి) నాసా డి) బైడు
వివరణ: శుక్రగ్రహం అధ్యయనానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈఎన్వీఐఎస్ఐవోన్ (ఎన్విజన్)ను 2030లో ప్రయోగించనుంది. ఆ గ్రహం అంతర్భాగం నుంచి ఉపరితలంలోని వాతావరణాన్ని కూడా ఈ ప్రయోగం ద్వారా అధ్యయనం చేయనుంది. భూమి, శుక్రగ్రహం ఎందుకు భిన్నంగా ఉన్నాయో కూడా పరిశీలించనున్నారు. - రెబెకా గ్రిన్‌స్పన్ ఇటీవల వార్తల్లో నిలిచారు. ఎందుకు? (బి)
ఎ) ప్రపంచ వాణిజ్య సంస్థకు ఆమె నియామకమయ్యారు బి) యూఎన్సీటీఏడీకి నేతృత్వం వహించేందుకు ఆమె పేరును యూఎన్జీఏ ఆమోదించింది
సి) యూఎన్జీఏకు నేతృత్వం వహించేందుకు యూఎన్ఎస్సీ ఆమోదించింది
డి) ఏదీకాదు
వివరణ: రెబెకా గ్రిన్‌స్పన్ కోస్టారికా దేశానికి చెందిన మహిళ. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ సంస్థకు నేతృత్వం వహించేందుకు ఆమె పేరును ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ ఆమోదించింది. పదవి చేపట్టాక నాలుగు సంవత్సరాల పాటు ఆమె కొనసాగనుంది. ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా, తొలి మధ్య అమెరికా వాసిగా ఆమె చరిత్ర సృష్టించబోతుంది. ఆమె ఆర్థికవేత్త. రెబెకా పేరును యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రతిపాదించారు. - తెలంగాణలోని ఎన్ని జిల్లాల్లో హాల్ మార్కింగ్ అమలులోకి వచ్చింది? (సి)
ఎ) 5 బి) 6 సి) 7 డి) 8
వివరణ: 2021 జూన్ నెలలో హాల్ మార్క్ నిబంధనలు అమలులోకి వచ్చాయి. దేశ వ్యాప్తంగా ఇవి 256 జిల్లాల్లో, అందులో తెలంగాణలో 7 జిల్లాల్లో వీటిని పాటించాలి. ఆ జిల్లాలు మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం. ఈ జిల్లాల్లో రూ.40 లక్షలకు మించి టర్నోవర్ ఉన్న నగల వ్యాపారులు హాల్ మార్క్ నగలను మాత్రమే విక్రయించాలి. ఆ లోపు ఉన్న వారికి మినహాయింపు ఉంటుంది. హాల్ మార్క్‌లో ఆరు అంకెల కోడ్‌తో పాటు బీఐఎస్ మార్కు, స్వచ్ఛతకు భరోసా ఇచ్చే ఓచర్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు మినహా మిగతా అన్ని జిల్లాల్లో ఇది అమలులోకి వచ్చింది. - పీఎం స్వనిధి పథకం అమలులో దేశంలో రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ పట్టణం? (డి)
ఎ) రంగారెడ్డి బి) వరంగల్ అర్బన్
సి) హైదరాబాద్ డి) సిద్దిపేట
వివరణ: వీధి వ్యాపారులను ఆదుకొనేందుకు కేంద్రం ప్రారంభించిన పీఎం స్వనిధి పథకంలో దేశంలో సిద్దిపేట జిల్లా రెండో స్థానంలో ఉంది. కరోనా మూలంగా లాక్డౌన్ విధించడంతో వీధి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీరిని ఆదుకొనేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా రూ.10వేల చొప్పున వీధి వ్యాపారులకు రుణం ఇచ్చారు. సిద్దిపేట పట్టణంలోని 4815 మంది వీధి వ్యాపారులకు రూ.4.81 కోట్ల మేర రుణం రూపంలో లబ్ధి చేకూరింది. - ఎడారీకరణ, కరవు కట్టడి రోజును ఏ తేదీన నిర్వహిస్తారు? (బి)
ఎ) జూన్ 16 బి) జూన్ 17
సి) జూన్ 18 డి) జూన్ 19
వివరణ: ఏటా జూన్ 17న ఎడారీకరణ, కరవు కట్టడి రోజును నిర్వహిస్తారు. భూగోళంలో 38% మెట్ట భూములు ఉన్నాయి. ఇక్కడ 270 కోట్ల మంది నివసిస్తున్నారు. అయితే భూతాపం పెరుగుతూ ఉండటం, ఇష్టారీతిన చెట్లు నరుకుతూ ఉండటంతో ఎడారి ప్రాంతం నానాటికి విస్తరిస్తుంది. దీని మూలంగా 270 కోట్ల ప్రజలకు ముప్పు పొంచి ఉంది. మొత్తం సాగుభూమిలో సుమారుగా 44% మెట్ట ప్రాంతాల్లోనే ఉంది. ఎడారీకరణతో వచ్చే ఇబ్బందులను సాధారణ ప్రజలకు కూడా చెప్పడానికే ఈ రోజును కేటాయించారు. ఈ ఏడాది ఇతివృత్తం ‘పునరుద్ధరణ భూమి, పునరుజ్జీవం’. - ప్రపంచంలో తొలిసారిగా ‘ఉడెన్ (చెక్క)’ శాటిలైట్‌ను ఏ దేశం నుంచి ప్రయోగించనున్నారు? (సి)
ఎ) ఫ్రాన్స్ బి) అర్జెంటీనా
సి) న్యూజిలాండ్ డి) దక్షిణాఫ్రికా
వివరణ: తొలిసారిగా చెక్కతో తయారుచేసిన ఉపగ్రహాన్ని ఈ ఏడాది చివరినాటికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించనుంది. దీనిని ఫిన్లాండ్లో తయారు చేశారు. దీని పేరు డబ్ల్యూఐఎస్ఏ ఉడ్ శాట్. న్యూజిలాండ్‌లోని మహియా ద్వీపం నుంచి దీనిని ప్రయోగించనున్నారు. భవిష్యత్తులో చెక్కతో ఉపగ్రహాలు తయారు చేస్తే ఎంత మేరకు మన్నికగా ఉంటాయి. అంతరిక్షంలోని ఉష్ణోగ్రత, చల్లదనం, రేడియేషన్, శూన్యాలను ఎంత కాలం పాటు తట్టుకోగలవు. ఈ తరహా అంశాలన్నీ కూడా ఈ ప్రయోగం ద్వారా పరిశీలిస్తారు.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ ,9849212411
- Tags
- Education News
Previous article
సింగరేణి కాలరీస్ కంపెనీ పూర్వనామం?
Next article
వికాసం ఏ దశ నుంచి ప్రారంభమవుతుంది?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు