గంగానదిలో కలిసే ద్వీపకల్ప పీఠభూమి నది?
1. కింది వివరణలు చదవండి.
ఎ. భారతదేశ మొత్తం భౌగోళిక విస్తీర్ణం 3.2 మిలియన్ చదరపు కి.మీ
బి. భారతదేశపు దక్షిణ చివరి అంచు నికోబార్ దీవుల్లో ఉంది. ఇంతకు పూర్వం పిగ్మాలియన్ పాయింట్ అని పిలిచేవారు
సి. భారతదేశపు దాదాపు 2100 కిలోమీటర్ల పొడవుతో ఉత్తర దక్షిణంగా వ్యాపించి ఉంది
1) ఎ, సి 2) బి, సి 3) ఎ, బి 4) ఎ, బి, సి
2. కింది వాటిని జతపర్చండి.
రాష్ర్టాలు సరిహద్దులు
ఎ. తమిళనాడు 1. మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్
బి. త్రిపుర 2. జమ్ముకశ్మీర్, హర్యానా, రాజస్థాన్, పాకిస్థాన్
సి. పంజాబ్ 3. బంగ్లాదేశ్, మిజోరం
డి. తెలంగాణ 4. కేరళ, కర్నాటక
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-1, బి-2, సి-4, డి-3
3. కింది రాష్ర్టాల్లో మూడు దేశాలతో సరిహద్దు గల రాష్ర్టాలను గుర్తించండి?
1) పశ్చిమబెంగాల్, సిక్కిం, లద్దాఖ్, అరుణాచల్‌ప్రదేశ్
2) పశ్చిమబెంగాల్, గుజరాత్, మణిపూర్
3) త్రిపుర, సిక్కిం, పశ్చిమబెంగాల్, జమ్ముకశ్మీర్
4) నాగాలాండ్, పశ్చిమబెంగాల్, జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్
4. కింది వాటిలో అండమాన్నికోబార్ దీవులకు తూర్పున ఉన్న దేశం/దేశాలు ?
1) ఇండోనేషియా 2) శ్రీలంక
3) థాయ్‌లాండ్ 4) పైవన్నీ
5. రాడ్ క్లిఫ్ కమిషన్ దేని కోసం చేయబడింది?
1) ఇండిపెండెన్స్ బిల్లుకు ప్రభావాన్ని కలిగించడానికి
2) భారత్‌లోని మైనార్టీల సమస్యలను పరిష్కరించడానికి
3) భారత్, పాకిస్థాన్ సరిహద్దుల మధ్య పరిమితులు విభజించడానికి
4) తూర్పు బెంగాల్లో అల్లర్లపై దర్యాప్తు చేయడానికి
6. మూడు సముద్రాల తీరరేఖ గల రాష్ట్రం?
1) కర్ణాటక 2) తమిళనాడు
3) కేరళ 4) ఆంధ్రప్రదేశ్
7. భారతదేశ నైసర్గిక స్వరూపాలు ఏర్పడిన క్రమం?
ఎ. హిమాలయాలు
బి. గంగా-సింధూమైదానం
సి. ద్వీపకల్ప పీఠభూమి
1) ఎ, బి, సి 2) బి, సి, ఎ
3) సి, బి, ఎ 4) సి, ఎ, బి
8. భారత్‌తో ఈ దేశాలకు సరిహద్దు రేఖలు కలవు ?
ఎ. 0o అక్షాంశరేఖ 1. ఇండోనేషియా
బి. మెక్‌మోహన్‌రేఖ 2. మాల్దీవులు
సి. గ్రేట్ఛానల్ 3. మయన్మార్
డి. కొకో ఛానల్ 4. చైనా
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-4, సి-1, డి-3
3) ఎ-3, బి-4, సి-1, డి-2
4) ఎ-4, బి-3, సి-2, డి-1
9. ప్రతిపాదన (ఎ): పశ్చిమకనుమలో జన్మించిన నదులు కూడా తూర్పున (ఆగ్నేయ) ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి.
ప్రతిపాదన (ఆర్): ద్వీపకల్ప పీఠభూమి. కొంచెం తూర్పు (ఆగ్నేయ) వైపున వాలు కలిగి ఉంటుంది.
1) (ఎ), (ఆర్) రెండూ నిజం.(ఎ) కి (ఆర్) సరైన వివరణ
2) (ఎ) నిజం, (ఆర్) తప్పు
3) (ఎ) తప్పు (ఆర్) నిజం
4) (ఎ), (ఆర్) రెండూ నిజం, (ఎ) కు (ఆర్) సరైన వివరణ కాదు
10. కింది వాటిలో సరికాని జత?
ఎ. హిమాలయాలు- టెర్షియరి యుగంలో
బి. ద్వీపకల్ప పీఠభూమి- పూర్వ కేంబ్రియల్ యుగంలో
సి. గంగా సింధూ మైదానం- ప్లిస్టోసిన్ కాలంలో
డి. తీరమైదానం- పరప్లిస్టోసిన్ కాలంలో
1) ఎ, బి, సి, డి 2) బి, సి, డి
3) ఎ, బి, సి 4) ఏదీకాదు
11. కింది వాటిని దక్షిణం నుంచి ఉత్తరానికి వరుసగా?
ఎ. నర్మదానది బి. తపతినది
సి. వింధ్యపర్వతాలు డి. అజంతా కొండలు
ఇ. సాత్పూరా పర్వతాలు
1) ఎ, బి, సి, డి, ఇ 2) డి, బి, ఇ, ఎ, సి
3) బి, ఇ, ఎ, సి, డి 4) డి, బి, ఇ, సి, ఎ
12. కింది వాటిలో ప్రపంచంలో అత్యంత లోతైన ద్వీప సముదాయం ఏది?
1) మడగాస్కర్ 2) టోంగొదీవులు
3) మిండనౌ 4) ఆలూషియన్ దీవులు
13. అగ్ని పర్వతాలు లేని ఖండం
1) ఆసియా 2) యూరప్
3) ఆఫ్రికా 4) ఆస్ట్రేలియా
14. కింది వాటిని జతపర్చండి.
ఎ. తమిళనాడు
1. నదుల మధ్య విస్తరించినది
బి. త్రిపుర 2. తీస్తా- బ్రహ్మపుత్ర
సి. పంజాబ్ 3. సింధూ- సట్లెజ్
డి. తెలంగాణ 4. కాలి- తీస్తా
1) ఎ-3, బి-1, సి-4, డి-2
2) ఎ-3, బి-1, సి-2, డి-4
3) ఎ-2, బి-1, సి-3, డి-4
4) ఎ-4, బి-2, సి-3, డి-1
15. హిమాలయాలు ఉత్తరం నుంచి దక్షిణానికి వరుసగా..?
1) గ్రేటర్, మధ్య, బాహ్య, ట్రాన్స్
2) ట్రాన్స్, సెంట్రల్, మధ్య, బాహ్య
3) సెంట్రల్, మధ్య, ట్రాన్స్, బాహ్య
4) ట్రాన్స్, మధ్య, సెంట్రల్, బాహ్య
16. పీర్‌పంజల్, మహాభారత్ పర్వతశ్రేణులు ఏ హిమాలయాల్లోని భాగం?
1) టిబెట్ 2) అత్యున్నత
3) నిమ్న 4) శివాలిక్
17. కింది వాటిలో సరికాని జత?
1) మాక్డోక్లోయ- మేఘాలయ
2) నిశ్శబ్ధలోయ- కేరళ
3) కాంగ్రాలోయ- అసోం
4) పుష్కర్లోయ- రాజస్థాన్
18. ‘డూన్లు’ అనే భూస్వరూపాలు వేటి మధ్య విస్తరించి ఉన్నాయి?
1) శివాలిక్- హిమాద్రి 2) ట్రాన్స్- గ్రేటర్
3) నిమ్న- బాహ్య 4) బాహ్య- ట్రాన్స్
19. కింది వాటిలో సరికాని జత?
1) బంగర్- పురాతన ఒండ్రుమట్టి
2) బాబర్- సున్నపురాళ్ల నిక్షేపణ
3) టెరాయి- చిత్తడిప్రదేశం
4) ఖాదర్- నవీన ఒండ్రుమట్టి
20. కింది వాటిని జతపర్చండి.
ఎ. దుద్వా కొండలు 1. అసోం
బి. మిష్మికొండలు 2. సిక్కిం
సి. కచార్ కొండలు 3. ఉత్తరాఖండ్
డి. మురియ కొండలు 4. అరుణాచల్‌ప్రదేశ్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-1, డి-2
3) ఎ-1, బి-3, సి-2, డి-4
4) ఎ-3, బి-4, సి-2, డి-1
21. ప్రపంచంలో లోతైన సరస్సు?
1) టిటికా 2) లోనార్
3) బైకాల్ 4) సుపీరియర్
22. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ గల ప్రదేశం?
1) మిథిలా 2) డౌనపాలా
3) మర్మగోవా 4) ఏదీకాదు
23. పశ్చిమ తీరమైదానంలో తీరరేఖ రాష్ర్టాలు దక్షిణం నుంచి ఉత్తరానికి వరుసగా?
1) కెనరా, మలబారు, కైత్వార్, కొంకణ్
2) మలబారు, కెనరా, కొంకణ్, కైత్వార్
3) మలబారు, కెనరా, కైత్వార్, కొంకణ్
4) కైత్వార్, కొంకన్, కెనరా, మలబారు
24. కింది వాటిని చదవండి.
ఎ.దక్షిణ అండమాన్ బి. కోర్నికోబార్
సి. లిటిల్ నికోబార్ డి. నార్త్ అండమాన్
ఇ. గ్రేట్ నికోబార్
పై అండమాన్ నికోబార్ దీవులు ఉత్తరం నుంచి దక్షిణానికి వరుసగా సరైన క్రమం
1) ఎ, బి, సి, డి, ఇ 2) డి, ఎ, బి, సి, ఇ
3) డి, ఎ, బి, ఇ, సి 4) బి, సి, ఇ, ఎ, డి
25. లక్షద్వీప్దీవులు ఏ హైకోర్ట్ పరిధికి చెందుతాయి?
1) కర్ణాటక 2) తమిళనాడు
3) వెస్ట్‌బెంగాల్ 4) కేరళ
26. అండమాన్నికోబార్ దీవులతో సంబంధం లేని ఆదిమ తెగ?
1) జరావాలు 2) నికోబరీస్
3) డోంగా 4) సెంటినలీస్
27. లక్షద్వీప్‌లకు సంబంధించి కింది వాటిని చదవండి?
ఎ. ఇవి ప్రవాళబిత్తిక దీవులు
బి. ఈ దీవుల్లో దక్షిణ భాగాన పెద్ద దీవి ఉంది
సి. ఇది ఫ్లోరా, పొనాలకు ప్రసిద్ధి
డి. దీని రాజధాని మినికాయ్ దీవిలో ఉంది
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి
28. అండమాన్ నికోబార్ దీవులకు దగ్గరగా ఉన్న ఇతర దేశాలు?
1) పాకిస్థాన్, మాల్దీవులు
2) థాయ్‌లాండ్, ఇండోనేషియా
3) మయన్మార్, బంగ్లాదేశ్
4) ఇండోనేషియా, మాల్దీవులు
29. కింది వాటిలో క్రియాశిల అగ్ని పర్వతం కానిది?
1) మౌనలోవా 2) బారెన్
3) క్రాకటోవ 4) హెల్యాకోలా
30.డంకన్ కనుమ వేటిని కలుపుతుంది?
1) మాల్దీవులు- మినికాయ్ దీవి
2) దక్షిణ అండమాన్- లిటిల్ అండమాన్
3) లిటిల్నికోబార్- గ్రేట్‌నికోబార్
4) గ్రేట్నికోబార్కు దక్షిణాన కలదు
31. అండమాన్ నికోబార్ దీవులను వేరు చేస్తున్న అక్షాంశ రేఖ?
1) 6o అక్షాంశరేఖ 2) 8o అక్షాంశరేఖ
3) 11o అక్షాంశరేఖ 4) 10o అక్షాంశరేఖ
32. హిమాలయాల కంటే కింది వాటిలో ఏ నది పూర్వంగా ఏర్పడలేదు?
1) చీనాబ్ 2) అలకనంద
3) బ్రహ్మపుత్ర 4) ఇండస్
33. గంగానది పై భాగాన, గంగానది ఏర్పడే క్రమంలో కలిసే నదుల కలయిక ప్రదేశాలు?
ఎ. అలకనంద, పిండార్- కరుణ ప్రయాగ
బి. అలకనంద, మందాకిని- రుద్రప్రయాగ
సి. భగీరథి, అలకనంద- దేవ ప్రయాగ
కింది వాటిలో సరైనది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
34. కింది వాటిలో సరికాని జత
1) సైడంగ్- అసోం
2) త్సాంగ్పో- టిబెట్
3) దిహంగ్-మేఘాలయ
4) జమున- బంగ్లాదేశ్
35. యమునా నదికి సంబంధించి కింది వాటిని చదవండి
ఎ. యమునానది గంగానది ఉపనదుల్లో పొడవైనది
బి. ఈ నది తీరాన ఢిల్లీ, ఆగ్రా, మధుర పట్టణాలు ఉన్నాయి
సి. ఈ నది పరీవాహక ప్రాంతం వింధ్య పర్వతశ్రేణుల, మాల్వా పీఠభూమి ప్రాంతాన్ని కలిగి ఉంది
సరైనవి
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, సి
36. దేశంలో పొడవైన వంతెన ఏది?
1) ప్రకాశం వంతెన
2) భూపేన్ హజారికా
3) తెహ్రీ 4) హీరాకుడ్
37. కింది వాటిలో గంగానది తీరాన లేని నగరం?
1) ఘాగ్రా 2) కోసి
3) సోన్ 4) దామోదర
38. ద్వీపకల్ప పీఠభూమిలో జన్మించి గంగానదిలో కలిసే నది?
1) నేత్ర 2) హరిద్వార్
3) లక్నో 4) వారణాసి
39. కింది వాటిలో సరికాని జత?
1) కేన్నది- కర్ణావతి
2) బెట్వానది- నేత్రావతి
3) గండక్నది- నారాయణి
4) ఘాగ్రానది- మీనాంబర
40. ఢిల్లీ నగరానికి తాగునీటిని అందిస్తున్న నది?
1) భాగమతి 2) రామ్‌గంగా
3) యమున 4) గంగానది
41. బ్రహ్మపుత్ర నదికి ఎడమవైపు నుంచి కలవని నది ఏది?
1) బరాలి 2) డిబ్రూ
3) కపిలి 4) సాంక్సొ
42. పశ్చిమాన ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే నదుల్లో పొడవైనది?
1) ఇండస్ 2) నర్మద
3) తపతి 4) సబర్మతి
43. కింది వాటిలో గోదావరి ఉపనదులు పడమర నుంచి తూర్పుకు వరుసగా?
ఎ. మంజీర బి. కడెం
సి. ప్రాణహిత డి. మానేరు
44. సింధూనది ఉపనదుల్లో భారత్‌లో ప్రారంభం కాని నది ఏది?
1) సట్లెజ్ 2) చీనాబ్
3) బియాస్ 4) రావి
45. కింది వాటిలో సరికాని జత?
1) పశ్చిమ బెంగాల్- మయురాక్షి
2) ఉత్తరప్రదేశ్- శారీద
3) తమిళనాడు- పరాంబికుళం
4) మహారాష్ట్ర- రుద్రమాల
కాసం రమేష్
జాగ్రఫీ ఫ్యాకల్టీ
బీసీ స్టడీ సర్కిల్,
నిజామాబాద్
9440690883
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు