తల్లి గర్భమున తొలుత చదివిన తెలుగు!
అమ్మ అందరితో మాట్లాడుతుంటే గర్భంలోనే నేను ఎన్నెన్ని పదాలు
నా లేలేత నాల్కతో ఊ కొడుతూ నేర్చుకున్నానో అప్పుడే పండితుడనైనట్లు మరి!
అమ్మ పాడుతుంటే గర్భంలోనే నేను మెలకువగా మేలుగా ఎన్నెన్ని రాగాలు నేర్చానో
సంగీత విద్వాంసుడనైనట్లు మరి!
తల్లి కడుపులోనే తన్మయంగా నాకు మాతృభాషా అభ్యాసయోగం!
పుట్టినాక అమ్మ ఒడిలో
చెక్క పలక మీద అమ్మ సుద్ద ముక్కతో అఆలు దిద్దిస్తుంటే వింటూ అంటూ రాస్తూ
ఎంతెంత మహా ప్రాణంగా నేర్చుకున్నానో!
అమ్మ ఆనందంతో నా చెంపలపై
ఎన్నెన్ని ముద్దులను మహారాజ ముద్రలుగా చేసిందో ప్రశంసిస్తూ.. పెద్దబాల శిక్ష నేర్పుతూ
నన్ను పెద్దగా చేసింది ఆది గురువై!
ఎదుగుతున్నా కొద్ది నాకు తెలుగు భాషా
సౌందర్యం సాక్షాత్కరించింది..
నానా అర్థాలుగా కావ్యాలుగా కథలుగా!
గుండ్రటి ముత్యాల అక్షరాల
అజంతా విద్య నా తెలుగు మాతృభాష!
పరభాషలు ఎన్ని నేర్చుకున్నా
మాతృభాషే స్పందనలుగా హృదయం!
కందాళై రాఘవాచార్య
87905 93638
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు