అతిపెద్ద ‘బన్ని’ గడ్డిభూములు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
- ‘ఏ-76’ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి? (సి)
ఎ) ఇటీవల గుర్తించిన ఒక తోకచుక్క
బి) కొత్త కొవిడ్ రకం
సి) ఐస్‌బర్గ్ (మంచుకొండ)
డి) మధ్యధరా సముద్రంలో కనుగొన్నకొత్త దీవి
వివరణ: ఒక పెద్ద హిమానీనదం నుంచి విడిపడే వాటిని ఐస్‌బర్గ్ లేదా మంచుకొండగా చెబుతారు. ఇటీవల అంటార్కిటికాలో ఈ తరహా ఐస్‌బర్గ్ ఒకటి ఏర్పడింది. దీనికి ఏ-76 అని పేరుపెట్టారు. ఇది ఫిల్చ్నర్-రోన్ ఐస్ షెల్ఫ్ నుంచి ఏర్పడింది. ఇది ప్రస్తుతం వెడ్డెల్ సముద్రంలో తేలియాడుతుంది. ప్రస్తుతం ప్రపంచంలో తేలియాడుతున్న అతిపెద్ద ఐస్‌బర్గ్ ఇదే. 170 కిలోమీటర్ల పొడవు, 25 కిలోమీటర్ల వెడల్పు ఉంది. దీనిని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ గుర్తించింది. వెడ్డెల్ అనేది పశ్చిమ అంటార్కిటికాలో ఒక అఖాతం. - ఏ దేశం నిష్క్రమణతో 17+1 ఫోరం, 16+1 ఫోరంగా మారింది? (డి)
ఎ) చైనా బి) క్రొయేషియా సి) చెక్ రిపబ్లిక్ డి) లిథువేనియా
వివరణ: చైనా ఆధ్వర్యంలోని 17+1 కూటమి నుంచి నిష్క్రమించాలని లిథువేనియా నిర్ణయించింది. ఈ ఫోరం విభజనను ప్రోత్సహిస్తుందని లిథువేనియా ఆరోపించింది. 2012 బుడాపెస్ట్‌లో 17+1 ఏర్పాటయ్యింది. చైనా, తూర్పు యూరప్ దేశాలతో కలిసి దీనిని ప్రారంభించింది. 12 యూరోపియన్, అయిదు బాల్కన్ దేశాలు ఇందులో ఉన్నాయి. సభ్య దేశాల్లో వంతెనలు, రైల్వే లైన్లు, నౌకాశ్రయాల ఆధునీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో పరస్పర సహకారం కోసం దీనిని ఏర్పాటు చేశారు. చైనా ప్రారంభించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌కు ఇది అనుబంధంగా చెప్పొచ్చు. - ‘1,36,054’ టాటా కన్సల్టెన్సీ ఇటీవల ఈ సంఖ్యను ప్రచురించింది. ఇది ఏంటి? (సి)
ఎ) టాటా సంస్థ సాధించిన మొత్తం లాభం (కోట్లలో)
బి) ఆ సంస్థ సాధించిన మార్కెట్ ఈక్విటీ
(కోట్లలో)
సి) కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో పాల్గొన్న వారి సంఖ్య
డి) దేశ వ్యాప్తంగా ఆ సంస్థకు ఉన్న వ్యాపార శాఖల సంఖ్య
వివరణ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ గిన్నిస్ పుస్తకంలో చోటు సంపాదించింది. తన ‘కోడ్‌విటా’ తొమ్మిదో సీజన్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కాంపిటీషన్ ఘనతను దక్కించుకుంది. మొత్తం 34 దేశాల నుంచి 1,36,054 మంది ఇందులో పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు పెంచుకొనే వారి కోసం ‘ది 2021 టీసీఎస్ కోడ్‌విటా కాంపిటీషన్’ కింద విద్యార్థులకు ఆహ్వానం పలికారు. సంక్లిష్టమైన వాస్తవ ప్రపంచ సమస్యలను ఆరుగంటల్లో పరిష్కరించే విషయంలో విద్యార్థుల కోడింగ్ నైపుణ్యాలను ఇందులో పరీక్షించారు. - చైనా ఇటీవల ప్రయోగించిన హైయాంగ్-2డి ప్రయోగ లక్ష్యం? (ఎ)
ఎ) సముద్ర పర్యవేక్షణ
బి) అరుణ గ్రహంపై వనరుల అన్వేషణ
సి) చంద్ర మండలంపై నీటి జాడ కనుగొనడం
డి) అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ ఏర్పాటు
వివరణ: సముద్ర పర్యవేక్షణకు ఒక ఉపగ్రహాన్ని చైనా విజయవంతంగా ప్రయోగించింది. దీని పేరు హైయాంగ్-2డి. లాంగ్ మార్చ్-4బి రాకెట్‌ను ఇందుకు ఉపయోగించింది. ఇప్పటికే చైనా హెచ్‌వై-2బి, హెచ్‌వై-2సిలు కూడా ఉపయోగిస్తూనే ఉంది. ఇవన్నీ కలిసి ఒక కాన్స్టిలేషన్గా ఉన్నాయి. సముద్రంలో విపత్తుల గుర్తింపు, అక్కడి వనరుల సుస్థిరాభివృద్ధితో పాటు పర్యావరణ మార్పులను కూడా అధ్యయనం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.
5.‘4371’ ఇటీవలి కాలంలో ఈ సంఖ్య వార్తల్లో ఉంది. ఇది దేనికి సంబంధించింది? (బి)
ఎ) భారత్‌లో ఒకరోజు నమోదైన గరిష్ట కొవిడ్ మరణాల సంఖ్య
బి) భారత సముద్ర జలాల్లో ఉండే జంతు రాశి
సి) మొత్తం భారత దేశంలో ఉండే గిరిజన జాతులు
డి) భారత్‌లో ఉండే భాషల సంఖ్య
వివరణ: 4371 రకాల జంతు జాతులకు భారత సముద్రపు జలరాశి ఆవాసం అని జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో 1032 జాతులు ప్రొటిస్టాకు, 3339 జాతులు ఎనిమిలియాకు చెందినవి. భారత్ చుట్టూ అరేబియా, బంగాళాఖాతాలు ఉన్నాయి. 2765 మేర అరేబియా సముద్రం లోతుల్లో 1964 జాతులు బంగాళాఖాతంలో కనిపించాయి. 1396 జాతులు అండమాన్ సముద్రంలో, మరో 253 లక్షదీవుల సముద్రంలో జంతువులు ఉన్నాయి. భారత సముద్రపు జలాల్లో 31 సముద్రపు క్షీరదాలు ఉన్నాయి. - కింది వాటిలో సరైనవి? (సి)
- మహారాష్ట్రలోని గోల్వాద్ గ్రామంలో పండే సపోటాలను యూకేకు ఎగుమతి చేస్తున్నారు
- బీహార్‌లోని షాహీ లిచి పండ్లను కూడా యూకేకు ఎగుమతి చేస్తున్నారు
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) 1, 2 సరికాదు
వివరణ: భౌగోళిక గుర్తింపు (జాగ్రఫికల్ ఇండికేషన్-జీఐ)ను పొందిన బీహార్ షాహీ లిచి పండ్లు, అలాగే మహారాష్ట్రలో గోల్వాద్ సపోటాలను యూకేకు ఎగుమతి చేస్తున్నారు. లిచి పండ్ల ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉంది. చైనా మొదటి స్థానాన్ని ఆక్రమించింది. మహారాష్ట్రలో పాల్ఘర్ జిల్లాలో గోల్వాద్ గ్రామంలో పండే సపోటా ప్రత్యేకమైంది. ఇక్కడ భూము ల్లో అధికంగా క్యాల్షియం ఉంటుంది. సపోటాల ఉత్పత్తిలో దేశంలో కర్నాటక అగ్రస్థానంలో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉన్నాయి.
- ఆసియాలోనే అతిపెద్ద గడ్డి భూములు ‘బన్ని’ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? (డి)
ఎ) మధ్య ప్రదేశ్ బి) ఉత్తరాఖండ్
సి) హిమాచల్ ప్రదేశ్ డి) గుజరాత్
వివరణ: ఆసియాలోనే అతిపెద్ద బన్ని గడ్డి భూములు గుజరాత్లో ఉన్నాయి. రాణ్ ఆఫ్ కచ్‌కు ఇవి సమీపంలో ఉంటాయి. ఇటీవల ఈ భూములు వార్తల్లో నిలిచాయి. ఇక్కడ ఉన్న అన్ని ఆక్రమణలను ఆరునెలల్లోగా తొలగించాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) తీర్పు చెప్పింది. స్థానిక మాల్దారీలు (పశుపోషకులు) ఈ అడవి ప్రాంతంపై ‘అటవీ హక్కుల చట్టం-2006’లో సెక్షన్-3 ప్రకారం హక్కులు కలిగి ఉంటారని ఎన్జీటీ పేర్కొంది. - కింది వాటిలో సరైన వాక్యం ఏది? (బి)
- 2020-21లో భారత్‌కు అతి ఎక్కువ
ఎఫ్‌డీఐలు అమెరికా నుంచి వచ్చాయి - 2020-21లో భారత్‌కు అతి ఎక్కువ
ఎఫ్‌డీఐలు సింగపూర్ నుంచి వచ్చాయి - 2020-21లో అతి ఎక్కువ ఎఫ్‌డీఐలను ఆకర్షించిన రాష్ట్రం మహారాష్ట్ర
- 2020-21లో అతి ఎక్కువ ఎఫ్‌డీఐలను ఆకర్షించిన రాష్ట్రం గుజరాత్
ఎ) 1, 3 బి) 2, 4 సి) 1, 4 డి) 2, 3
వివరణ: 2020-21 ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) భారత్‌లో 10% మేర పెరిగాయి (అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే). ఎక్కువ ఎఫ్‌డీఐలు సింగపూర్ నుంచి వచ్చాయి. ఆ తర్వాత స్థానంలో అమెరికా ఉంది. అతి ఎక్కువగా ఎఫ్‌డీఐలను ఆకర్షించిన రాష్ట్రం గుజరాత్. రెండో స్థానంలో మహారాష్ట్ర, మూడో స్థానంలో కర్నాటక ఉన్నాయి. ఎక్కువ మొత్తంలో ఎఫ్‌డీఐలను ఆకర్షించింది సాఫ్ట్వేర్-హార్డ్‌వేర్. రెండో స్థానంలో నిర్మాణ రంగం ఉంది.
- 2020-21లో భారత్‌కు అతి ఎక్కువ
- ఫిఫా నిర్వహించే అండర్-17 ప్రపంచ మహిళల ఫుట్‌బాల్ కప్-2022 ఏ దేశంలో నిర్వహించనున్నారు? (సి)
ఎ) స్పెయిన్ బి) చైనా
సి) భారత్ డి) బ్రెజిల్
వివరణ: ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచ ఫుట్‌బాల్ టోర్నీని 2022లో అక్టోబర్ 11 నుంచి 30 వరకు భారత్‌లో నిర్వహించనున్నారు. ఈ టోర్నీ ఇప్పటి వరకు భారత్‌లో ఒకసారి నిర్వహించారు. ఇది 2021లోనే జరగాల్సి ఉన్నా కొవిడ్ నేపథ్యంలో వాయిదా పడింది. ఈ చాంపియన్‌షిప్‌ను ఇప్పటి వరకు ఎనిమిది సార్లు నిర్వహించారు. ఫిఫా అండర్-20 మహిళల ప్రపంచకప్ 2022 ఆగస్ట్ 10 నుంచి 28 వరకు కోస్టారికాలో నిర్వహించనున్నారు. 2022 ఫిఫా ప్రపంచకప్ మాత్రం ఖతార్‌లో నిర్వహిస్తారు. ఇందులో 32 జట్లు పోటీపడుతున్నాయి. - సీబీఐ డైరెక్టర్ ఎంపిక కమిటీలో కింది వాటిలో ఉండనిది ఎవరు? (డి)
ఎ) ప్రధాన మంత్రి
బి) సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి
సి) లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు లేదా లోక్‌సభలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నాయకుడు
డి) హోంమంత్రి
వివరణ: సీబీఐ డైరెక్టర్‌ను త్రిసభ్య కమిటీ ఎంపిక చేస్తుంది. ఇందులో ప్రధానమంత్రితో పాటు సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభలో విపక్ష నేతలు సభ్యులుగా ఉంటారు. విపక్ష నేత లేని పక్షంలో, ప్రతిపక్షంలో అతి ఎక్కువ సీట్లు సాధించిన పార్టీ నాయకుడు ఉంటారు. ఇటీవల ఈ కమిటీ సీబీఐ డైరెక్టర్‌గా సుబోధ్ కుమార్ జైస్వాల్‌ను ఎంపిక చేసింది. ఆయన మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. - యునెస్కో వారసత్వ సంపదలో ఎంపికకు భారత్ ఎన్ని సైట్లను ప్రతిపాదించింది?
- (ఎ) ఎ) 6 బి) 7 సి) 8 డి) 9 వివరణ: యునెస్కో వారసత్వ ప్రదేశాల ‘టెంటేటివ్ జాబితాలో’ మరో ఆరు ప్రదేశాలను చేర్చారు. అవి.. 1) వారణాసిలో గంగా ఘాట్లు 2) తమిళనాడు కంచిపురం దేవాలయాలు 3) మధ్యప్రదేశ్‌లో సాత్పూర పులుల రిజర్వ్ 4) మహారాష్ట్రలో మరాఠా మిలిటరీ వాస్తు శైలి 5) కర్నాటకలో హైర్ బెంకాల్ మెగాలిథిక్ 6) మధ్యప్రదేశ్‌లో నర్మదా లోయలో భేదాఘాట్-లామేటాఘాట్. వివరణ: 1) వారణాసిలోని గంగానది ఒడ్డున ఉండే ప్రదేశాలను సాంస్కృతిక ప్రదేశాలుగా/ప్రకృతి రమణీయ దృశ్యాల జాబితాలో చోటు కోసం యత్నిస్తున్నారు.
- ప్రాచీన భారత దేశ చరిత్రలో కంచిలో నిర్మించిన ఆలయాలు ప్రసిద్ధమైనవి. ఆద్భుతమైన వాస్తు శిల్పకళకు ఇవి నిదర్శనాలు. వేదవతి నది ఒడ్డున ఇవి ఉన్నాయి. ఒకప్పుడు 1000 దేవాలయాలు ఉండేవి. కానీ ప్రస్తుతం 126 మాత్రమే ఉన్నాయి. ఇందులో 108 శైవ దేవాలయాలు కాగా 18 వైష్ణవానివి.
- సాత్పూర టైగర్ రిజర్వ్ మధ్య ప్రదేశ్‌లో ఉంది. హిమాలయాలకు చెందిన 26, నీలగిరికి చెందిన 42 జాతులకు ఇది నిలయం. పులులు ఆక్రమించిన వైశాల్యం పరంగా ఇది మూడో స్థానంలో, పులుల సంఖ్య ఆధారంగా అగ్రస్థానంలో ఉంది. అలాగే ఇక్కడ 50 రాతి గుహలు ఉన్నాయి. 10,000 ఏండ్ల నాటి చిత్రకళ ఈ గుహల్లో కనిపిస్తుంది.
- మరాఠా మిలిటరీ వాస్తుకళ 17వ శతాబ్దంలో ప్రారంభమైంది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కాలం నాటి 12 దుర్గాలు ఉన్నాయి.
- కర్నాటకలో హైర్ బెంకాల్లో పురాతన మెగాలిథిక్ ప్రదేశం ఉంది. పూర్వ చారిత్రక యుగానికి చెందింది. ఇక్కడ రాతి నిర్మాణాలు, ఖననానికి సంబంధించిన ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి.
- భేదాఘాట్-లామేటాఘాట్ మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి. భేదాఘాట్ను ‘గ్రాండ్ కెన్యాన్ ఆఫ్ ఇండియా’గా కూడా పిలుస్తారు. జబల్పూర్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. నల్ల చలువరాయి, వాటికి సంబంధించిన వేర్వేరు రూపాలకు ఇది ప్రసిద్ధి. ఇక్కడ డైనోసార్ శిలాజాలు కూడా లభించాయి.
- ‘ఆఫ్రికన్ వయోలెట్’ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి? (సి)
ఎ) బ్లాక్ ఫంగస్‌లాంటి కొత్త వ్యాధి
బి) ఆఫ్రికాలో గుర్తించిన కొత్త వైరస్
సి) భారత్‌లో కనుగొన్న వృక్ష జాతి
డి) ఏదీకాదు
వివరణ: ఆఫ్రికన్ వయోలెట్ అనే కొత్త వృక్ష జాతిని భోపాల్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ శాస్త్రజ్ఞులు మిజోరంలో కనుగొన్నారు. ఈశాన్య భారతంలోని జీవ వైవిధ్యానికి ఇవి నిదర్శనం. కొత్త జాతి శాస్త్రీయ నామం ‘డిడిమోకార్పస్ వికిఫంకియా’. ప్రస్తుతం మిజోరంలో కేవలం మూడు ప్రాంతాల్లోనే ఇది కనిపించింది. - కింది వాటిలో సరైనవి గుర్తించండి? (డి)
- సుందర్‌లాల్ బహుగుణ పర్యావరణ ఉద్యమాలతో ముడిపడి ఉన్నారు
- యువాన్ వ్యవసాయ రంగంలో ముడిపడి ఉన్నారు
ఎ) 1 బి) 2 సి) 1, 2 సరికావు డి) 1, 2
వివరణ: ప్రఖ్యాత పర్యావరణ ఉద్యమకారుడు సుందర్‌లాల్ బహుగుణ ఇటీవల మృతిచెందారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వృక్షాలను కాపాడుకొనేందుకు ఆయన చిప్కో ఉద్యమాన్ని ప్రారంభించారు. అడవుల పరిరక్షణకు భారత్‌లో కొనసాగిన ఉద్యమాల్లో ఇది కూడా ఒకటి. ఆ తర్వాత తెహ్రీ డ్యామ్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలోనూ ఆయన చురుగ్గా పాల్గొన్నారు. అలాగే యువాన్ లాంగ్పింగ్ను చైనాలో వరి వంగడ పితామహుడిగా పిలుస్తారు. ఆయన కూడా ఇటీవల మృతిచెందారు. 1970ల్లో ఆయన సృష్టించిన హైబ్రిడ్ వరి వంగడాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమందిని ఆకలి చావుల నుంచి కాపాడాయి. చైనాతో సహా ప్రపంచ దేశాల ఆహార కొరతను తీర్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు
- ఎగ్జిబిషన్-కన్వెన్షన్ సెంటర్లకు ‘మౌలిక సదుపాయాల’ స్థాయిని కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ప్రయోజనం? (ఎ)
ఎ) బ్యాంక్‌ల నుంచి రుణాలు అందుతాయి
బి) పర్యావరణ అనుమతుల అవసరం ఉండదు
సి) అంతర్జాతీయ సమావేశాలు
నిర్వహించుకోవచ్చు డి) ఏదీకాదు
వివరణ: ఎగ్జిబిషన్-కన్వెన్షన్ సెంటర్లకు మౌలిక సదుపాయాల స్థాయిని కల్పిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ తరహా ప్రాజెక్టులకు బ్యాంక్‌ల నుంచి రుణం అందే వెసులుబాటు ఉంటుంది. మౌలిక సదుపాయాల ఉప రంగాల్లో ‘సాంఘిక-వాణిజ్య మౌలిక సదుపాయాలు’ అన్న కొత్త విభాగాన్ని చేర్చారు. అందులో ఎగ్జిబిషన్-కన్వెన్షన్ కేంద్రాలు కూడా ఉన్నాయి. మౌలిక సదుపాయాల విభాగాన్ని హార్మోనైజ్డ్ మాస్టర్ లిస్ట్ అంటారు. - కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి కొత్త నిబంధనల షరతులో కింది వాటిలో సరైనది? (సి)
ఎ) ఇతర అవసరాలకు పథకాల నగదును వినియోగించుకోవచ్చు
బి) అన్ని పథకాల నగదును ఒక బ్యాంక్ ఖాతాలోకి జమచేస్తారు
సి) ఇతర అవసరాలకు కేంద్ర ప్రాయోజిత పథకాల నగదును వినియోగించరాదు
డి) ఏదీకాదు
వివరణ: కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులకు గాను కేంద్రం కొత్త షరతులను విధించింది. ఇవి ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఇకపై నిధులను తమ ఖాతాల్లో జమచేసుకోడానికి, ఇతర అవసరాలకు మళ్లించడానికి రాష్ర్టాలకు వెసులుబాటు ఉండదు. పథకాలన్నింటిని నాలుగు విడతలుగా విభజిస్తారు. తొలి విడతలో విడుదలైన 25% నిధుల్లో 75% వ్యయం చేస్తేనే రెండో విడత సొమ్మును చెల్లిస్తారు. ఇకపై ప్రతి కేంద్ర ప్రాయోజిత పథకానికి వేర్వేరుగా ప్రభుత్వ బ్యాంకుల్లో ఖాతాలను రాష్ర్టాలు తెరవాలి. ఆ ఖాతా ద్వారానే నిధులు అందుతాయి. పథకాల ద్వారా అందుతున్న ప్రయోజనాలు, వస్తున్న ఫలితాలను కేంద్రం పర్యవేక్షిస్తుంది. ఇందుకు ప్రత్యేక నోడల్ ఏజెన్సీలను ఏర్పాటు చేస్తుంది.
వి.రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ , వ్యోమా.నెట్
9849212411
- Tags
- Education News
Previous article
కరెంట్ అఫైర్స్
Next article
శబ్దాలే భాషోత్పత్తికి మూలం అని వాదించేవారు?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు