‘శాట్’ ఉన్నత చదువులకు గేట్
అండర్ గ్రాడ్యుయేషన్ కోసం విదేశాలకు వెళ్లాలనుకునేవారు గతంలో శాట్ పరీక్ష రాసేవారు. కానీ ఇటీవలి సంవత్సరాల్లో దేశంలోఅండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల ప్రవేశానికి కూడా ఈ స్కోర్‌ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. శాట్‌ని కాలేజీ బోర్డు నిర్వహిస్తుంది.
శాట్‌లో ఎవిడెన్స్ బేస్డ్ రీడింగ్ అండ్ రైటింగ్ (రీడింగ్ టెస్ట్, రైటింగ్ అండ్ లాంగ్వేజ్ టెస్ట్) మ్యాథ్స్ టెస్ట్ ఉంటుంది. వ్యాసం కూడా రాయాలి. కాకపోతే ఇది ఆప్షనల్. శాట్‌లో వచ్చే ప్రశ్నల ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ కాలేజీల్లో అవసరమైన స్కిల్స్‌ని పరీక్షిస్తుంది.
శాట్ ప్యాటర్న్
రీడింగ్ టెస్ట్: విద్యాభ్యాసానికి, పుస్తక పఠనానికి విడదీయలేని సంబంధం ఉంది. ఈ రీడింగ్ సెక్షన్ కూడా మీరు ఇచ్చిన సమాచారాన్ని ఎలా చదువుతారు, ఎలా అర్థం చేసుకుంటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది.
రీడింగ్ సెక్షన్లో ప్యాసేజ్ (గద్యం) ఆధారంగా బహుళ ఎంపిక ప్రశ్నలు ఉంటాయి. గ్రాఫిక్స్ రూపంలో ఉంచిన సమాచారం, పట్టికలు, పటాలు కూడా ఉంటాయి. చరిత్ర, ఆర్థికశాస్త్రం, మనస్తత్వ శాస్త్రం, సామాజిక శాస్త్రం, సోషల్ సైన్స్, సైకాలజీ, సైన్స్‌కి సంబంధించిన ప్యాసేజ్‌లు ఉంటాయి. ఈ విషయాలు ముందే తెలియకపోయినా పర్వాలేదు. ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని సమాధానాలు రాయాలి. కొన్ని ప్రశ్నలకు సమాధానం నేరుగా ఇచ్చిన ప్యాసేజ్లో ఉన్న సమాచారాన్ని లేదా దాని వెనుక ఉన్న ఆలోచనను కనుగొనమని అడుగుతారు. రచయిత మాటలు ఏమి సూచిస్తాయన్నది కూడా అర్థం చేసుకోవాలి. వాక్యాల మధ్య దాగి ఉన్న అర్థాన్ని కనుగొనాలి. రచయిత తాను ఇచ్చిన సమాచారం ద్వారా తాను ఏమి చెప్పాలనుకుంటున్నాడు, దానిని ఎలా సమర్థించుకుంటున్నాడు అన్నది గమనించాలి.
రైటింగ్ అండ్ లాంగ్వేజ్ టెస్ట్: ఇందులో ఉన్న ప్యాసేజ్లని చదివి, వాటిలో ఏమైనా తప్పులు లేదా దోషాలు ఉంటే సరిదిద్దాలి. అంటే వాక్యాలు సరిగా ఉన్నాయా లేవా ఉపయోగించిన పదాలు మార్చాలా అని ఆలోచించాలి. ఇంకా వాక్య నిర్మాణం, ప్యాసేజ్ నిర్మాణం, వాడుక, పంక్చువేషన్, గ్రామర్ రూల్స్‌ని ఉపయోగించాలి.
మ్యాథ్స్
ఈ సెక్షన్లో ప్రశ్నలు మీరు అండర్ గ్రాడ్యుయేషన్‌లో నెగ్గుకు రావడానికి కావాల్సిన మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్‌ని పరీక్షిస్తుంది.ఇందులో రెండు భాగాలు ఉంటాయి. ఒక దాంట్లో మీరు లెక్కలు చేయడానికి క్యాలిక్యులేటర్ ఉపయోగించవచ్చు. ఇంకో విభాగంలో ఉపయోగించరాదు. కొన్ని మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఇంకొన్నిటికి జవాబు రాయాలి.
వ్యాసం
ఇచ్చిన వ్యాసం నుంచి రచయిత రాసిన విషయాన్ని అర్థం చేసుకొని, వాస్తవాలని పరిశీలించి, ఆ రచన వెనుక ఉన్న తర్కాన్ని గ్రహించి అది సరైనదా? కాదా? అని ఉదాహరణలతో జవాబు రాయాలి. వ్యాసం ఆప్షనల్. కానీ కొన్ని కళాశాలలు దీన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు.
శాట్ సమయం
రీడింగ్ సెక్షన్లో 52 ప్రశ్నలు ఉంటాయి. దీనికి 65 నిమిషాల సమయం ఉంటుంది. రైటింగ్ అండ్ లాంగ్వేజ్ 44 ప్రశ్నలు ఉంటాయి. 35 నిమిషాల సమయం ఉంటుంది. మ్యాథ్స్ 58 ప్రశ్నలు 80 నిమిషాల సమయం ఉంటుంది.
శాట్ పరీక్షలోని ఎవిడెన్స్ బేస్డ్ రీడింగ్ అండ్ రైటింగ్, మ్యాథ్స్ సెక్షన్లకు మొత్తం కలిపి 3 గంటల సమయం ఉంటుంది. వ్యాసం పూర్తిచేయడానికి 50 నిమిషాలు ఉంటాయి.
శాట్ స్కోర్
శాట్‌లో నెగిటివ్ మార్కింగ్ లేదు. కాబట్టి ఎన్ని ప్రశ్నలకు సమాధానం రాయగలరో అన్నింటినీ ధైర్యంగా రాయండి. కొంచెం నమ్మకం తక్కువగా ఉన్నా కూడా ప్రయత్నించండి.
మీరు రాసిన సమాధానాలు మొదట ఒక రా స్కోర్‌గా మార్చి ఆ తరువాత ‘ఈక్వేటింగ్’ ద్వారా శాట్ స్కోర్‌గా మారుస్తారు. అంటే మ్యాథ్స్‌లో 30/58 రా స్కోర్ వస్తే అది సుమారు 530 కి మార్చవచ్చు. ఇది పేపర్ని బట్టి ఉండవచ్చు.
రీడింగ్ అండ్ రైటింగ్ స్కోర్ 200 నుంచి 800, మ్యాథ్స్ 200 నుంచి 800. మొత్తం స్కోర్ 400 నుంచి 1600 ఉంటుంది. వ్యాసం మార్కులు విడిగా ఇస్తారు. శాట్ వ్యాసానికి రీడింగ్, రైటింగ్, అనాలిసిస్ కేటగిరీల్లో 2-8 మధ్యలో స్కోర్ ఇస్తారు.
వ్యాలిడిటీ
శాట్ పరీక్షలో వచ్చిన మార్కులకు 5 సంవత్సరాల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. 11, 12వ తరగతుల్లో కూడా పరీక్ష రాయవచ్చు. సంవత్సరానికి పలుమార్లు ఈ పరీక్ష నిర్వహిస్తారు. 2021-22, 2022-23 సంవత్సరాల కోసం శాట్ పరీక్ష ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్, మార్చి, మే నెలల్లో నిర్వహించవచ్చు. పరీక్ష వ్యాలిడిటీ అయిదు సంవత్సరాలు ఉన్నా కళాశాలలు ఏ సంవత్సరం నుంచి మార్కులను పరిగణనలోకి తీసుకుంటారన్నది వారి ఇష్టాన్ని బట్టి ఉంటుంది.
కళాశాలలవారు స్కోర్ రిపోర్ట్ శాట్ నుంచి పంపించమని అడుగుతారు. ప్రతి కాలేజీకి ఒక కోడ్ ఉంటుంది. శాట్ పరీక్షకు రిజిస్టర్ అయినప్పుడు ఎటువంటి ఫీజు లేకుండా స్కోర్‌ను 4 కళాశాలలకు పంపవచ్చు. ఇది స్కోర్ వచ్చిన 9 రోజుల వరకు పంపించవచ్చు. ఆ తర్వాత స్కోర్ పంపించాలంటే ప్రతి స్కోర్ రిపోర్ట్‌కి ఫీజు కట్టాలి. పరీక్ష రుసుం సుమారు 52-68 అమెరికన్ డాలర్లు. ఇంటర్నేషనల్ ఫీ అదనంగా 42 డాలర్లు. ఆ తర్వాత అడిషనల్ స్కోర్స్ పంపించాలంటే అదనపు రుసుం చెల్లించాలి.
రిజిస్ట్రేషన్
శాట్కి నమోదు చేసుకోవాలంటే ఈ వెబ్‌సైట్‌కు వెళ్లండి. https://collegereadiness.collegeboard.org/sat/register/international
l ప్రస్తుతం సంవత్సర ఆదాయం రూ.8 లక్షలు కంటే తక్కువ ఉన్నవారికి 90% పరీక్ష ఫీజు మాఫీ ఉంది. అలాగే రూ.8 లక్షల నుంచి 15 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి 50% శాతం వరకు మినహాయింపు ఉంది. శాట్ పరీక్షలో 1300 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ వచ్చిన వారికి స్కాలర్షిప్లు ఉన్నాయి. శాట్ పరీక్ష నిర్వహించే కేంద్రాల కోసం ఇక్కడ చూడవచ్చు.
వెబ్సైట్:
https://collegereadiness.collegeboard.org/sat/register/find-test-centers
దేశంలో కొన్ని కళాశాలలు శాట్ స్కోర్‌ను అడ్మిషన్ కోసం ఉపయోగిస్తున్నాయి. అలాగే దాంతో పాటు కొన్ని కళాశాలలు వ్యాసం లేదా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. కళాశాలలు ఆఫర్ చేస్తున్న ఏ కోర్సులకు శాట్ స్కోర్లను తీసుకుంటున్నారన్నది జాగ్రత్తగా ఆ కాలేజీ వెబ్సైట్లో చూసుకోవాలి.
ప్రస్తుతం ఆర్ట్స్, కామర్స్, సైన్స్, డిజైన్ వంటి వివిధ రంగాలకు చెందిన సుమారు 40 కాలేజీలు (https://international.collegeboard.org/students/sat/acceptance-india), శాట్ స్కోర్‌ని పరిగణనలోకి తీసుకుంటున్నాయి. అందులో నుంచి ముఖ్యమైన వాటి గురించి చూద్దాం.
l ‘అమృత విశ్వవిద్యాలయం వారు శాట్ స్కోర్‌ను ప్రవేశానికి పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇంజినీరింగ్ ప్రవేశానికి జేఈఈ మార్కులు, అమృత వారి ప్రవేశ పరీక్షతో పాటు శాట్ (7365 కాలేజీ కోడ్) పీయూఈ ప్రవేశ మార్గాలు ఉన్నాయి.
‘అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్‌కి నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్‌కి బదులుగా శాట్ స్కోర్‌ని స్వీకరిస్తుంది. కాలేజీ కోడ్ 7588. శాట్ ద్వారా ప్రవేశం పొందాలనుకునే వారు యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష డిస్క్రిప్టివ్ కాంపోనెంట్ని రాయాలి.
‘మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా వారి మణిపాల్ కాలేజ్ ఆఫ్ హెల్త్ ప్రొఫెషనల్స్లోని బీఎస్సీ కోర్సులు, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ వారి బీకామ్ కోర్సులకు శాట్ ద్వారా ప్రవేశం కల్పిస్తున్నారు. కాలేజీ కోడ్ 7555
‘నార్సిముంజి వారు నిర్వహించే ఎన్ఎంఐఎంఎస్- సీఈటీ, ఎన్పీఏటీ లేదా శాట్/ఏసీటీ స్కోర్లను పరిగణనలోకి తీసుకుంటున్నారు. కాలేజీ కోడ్ 7511. బీటెక్, బీకామ్, బీస్సీ ఎకనామిక్స్, బీఏ ఆనర్స్ లిబరల్ ఆర్ట్స్ వంటి కోర్సులకు అడ్మిషన్స్‌కి ఈ మార్గం కూడా ఉపయోగించవచ్చు.
‘శివ్ నాడార్ యూనివర్సిటీ వారి స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్, స్కూల్ ఆఫ్ నేచురల్ సైన్స్, స్కూల్ అఫ్ మేనేజ్మెంట్లో అడ్మిషన్ ప్రక్రియలో శాట్ స్కోర్‌ని కూడా స్వీకరిస్తున్నారు. ఈ మార్గం ద్వారా అడ్మిషన్ పొందాలనుకునే వారు ఇంటర్వ్యూకి హాజరుకావాలి.
‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాంచీ వారు 2021 నుంచి ఐపీఎం ప్రోగ్రాంని ప్రవేశపెట్టారు. వీరు ఐపీఎంఏటీ (ఇండోర్)/ ప్రవేశానికి శాట్ స్కోర్లని పరిగణనలోకి తీసుకుంటున్నారు. శాట్ కాలేజీ కోడ్ 9109
అడ్మిషన్ ప్రక్రియ 2020, 2021లో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఏ సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్ కాలేజీలో చేరాలనుకుంటున్నారో అప్పటి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే అధికారిక వెబ్‌సైట్‌ని క్షుణ్ణంగా చదివి సరైన నిర్ణయం తీసుకోండి.
Sirisha Reddy
Director – Academics
Gyanville Academy
+91 76759 62248
www.gyanville.in
IITJEE | CLAT | IIM IPM
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు