‘పది’లమైన కామర్స్ కోర్సులు
రిజిస్ట్రేషన్
సీఏ ఫౌండేషన్ పరీక్ష నవంబర్‌లో రాయాలంటే అదే ఏడాది జూన్ 30లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మే నెలలో రాయాలంటే ముందు సంవత్సరం డిసెంబర్ 31లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రొవిజినల్ రిజిస్ట్రేషన్ అనే నూతన విధానాన్ని సీఏ ఇన్‌స్టిట్యూట్‌వారు ప్రవేశపెట్టారు. 2020, అక్టోబర్ 13న సీఏ ఇన్‌స్టిట్యూట్‌వారు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయకముందే సీఏ ఫౌండేషన్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీనిప్రకారం ఇంటర్ పరీక్షలు మార్చిలో రాసి మే లో నిర్వహించే సీఏ ఫౌండేషన్ పరీక్ష రాయవచ్చు. ఒకవేళ ప్రొవిజినల్ రిజిస్ట్రేషన్ చేసి మే లో పరీక్ష రాయడం ఇష్టంలేనివారు నవంబర్‌లో రాయవచ్చు.
సీఏ ఫౌండేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి పేపర్లో కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. అలాగే 4 పేపర్లు కలిపి 400 మార్కులకుగాను 50 శాతం మార్కులు అంటే 200 మార్కులు సాధించాలి.
రెండో దశ- సీఏ ఇంటర్
సీఏ ఫౌండేషన్ పూర్తిచేసినవారు సీఏ ఇంటర్ చదవడానికి అర్హులు.
సీఏ ఇంటర్లో గ్రూప్-1, గ్రూప్-2లుగా నాలుగు పేపర్ల చొప్పున మొత్తం 8 పేపర్లుగా సిలబస్ ఉంది.
విద్యార్థి వీలును బట్టి రెండు గ్రూపులు ఒకేసారి లేదా విడివిడిగా ఒక్కో గ్రూపు 6 నెలల వ్యత్యాసంతో రాయవచ్చు.
ఈ పరీక్ష ఏడాదికి రెండుసార్లు మే, నవంబర్ నెలలో నిర్వహిస్తారు. దీనిలో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి పేపర్లో 40 శాతం మార్కులు, గ్రూపు మొత్తంమీద 50 శాతం మార్కులు సాధించాలి.
సబ్జెక్టులు, మార్కులు
పేపర్ సబ్జెక్టులు మార్కులు వ్యవధి
గ్రూప్-1
1 అకౌంటింగ్ 100 3 గంటలు
2 కార్పొరేట్ లాస్ (60), అదర్ లాస్ (40) 100 3 గంటలు
3 కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ 100 3 గంటలు
4 ట్యాక్సేషన్- ఇన్‌కం ట్యాక్స్ (60), ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ (40) 100 3 గంటలు
గ్రూప్-2
5 అడ్వాన్స్ అకౌంటింగ్ 100 3 గంటలు
6 ఆడిటింగ్ అండ్ అస్యూరెన్స్ 100 3 గంటలు
7 ఎంటర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (50), స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ (50) 100 3 గంటలు
8 ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ (60), ఎకనామిక్స్ ఫర్ ఫైనాన్స్ (40) 100 3 గంటలు
సీఏ ఇంటర్ తర్వాత ఆర్టికల్‌షిప్‌లో భాగంగా సీఏ వద్ద గాని, ఆడిట్ సంస్థలో కాని మూడేండ్లపాటు ట్రైనింగ్ చేయాలి. ఇంకా 30 (15+15) రోజుల ఐసీఐటీఎస్ఎస్, ఏఐసీఐటీఎస్‌ఎస్ ట్రైనింగ్‌ను కూడా చేయాలి.
మూడో దశ- సీఏ ఫైనల్
సీఏ ఇంటర్ తర్వాత రెండున్నరేండ్ల ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తిచేసినవారు ఈ పరీక్షకు నమోదు చేసుకోవాలి.
సబ్జెక్టులు, మార్కులు
పేపర్ సబ్జెక్టులు మార్కులు వ్యవధి
గ్రూప్-1
1 ఫైనాన్షియల్ అకౌంటింగ్ 100 3 గంటలు
2 స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ 100 3 గంటలు
3 అడ్వాన్స్డ్ ఆడిటింగ్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ 100 3 గంటలు
4 కార్పొరేట్ లాస్ (70), ఎకనామిక్ లాస్ (30) 100 3 గంటలు
గ్రూప్-2
5 స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్ అండ్ పర్ఫామెన్స్ ఎవాల్యూషన్ 100 3 గంటలు
6 ఎలక్టివ్ పేపర్- రిస్క్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్, ఎకనామిక్ లాస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్, గ్లోబల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్, మల్టీ డిసిప్లీనరీ కేస్ స్టడీ 100 3 గంటలు
7 డైరెక్ట్ ట్యాక్స్ లాస్ (70), ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ (30) 100 3 గంటలు
8 ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్ లాస్- గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ 100 3 గంటలు
సీఎంఏ
నిర్వహణ సంస్థ: ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఎంఏఐ)
వెబ్సైట్: icmai.in
సీఎంఏ చదవాలంటే ఇంటర్లో ఏ గ్రూప్‌వారైనా అర్హులే. కానీ ఇంటర్ ఎంఈసీ, సీఈసీతో పాటు సమాంతరంగా సీఎంఏ చదివితే చాలామంచిది.
సీఎంఏ చదవాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇంటర్ చదువుతూనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
దశలు
సీఎంఏలో ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ ఉంటాయి.
సీఎంఏ ఫౌండేషన్: పదో తరగతి పూర్తిచేసినవారు ఇంటర్లో ఎంఈసీ, సీఈసీ చదువుతూ సీఎంఏ ఫౌండేషన్‌కు నమోదు చేసుకోవచ్చు. దీనిని ఇంటర్‌తోపాటు చదవవచ్చు.
సీఎంఏ ఫౌండేషన్ పరీక్ష డిసెంబర్లో రాయాలంటే అదే సంవత్సరం జూలై 31 లోగా, జూన్‌లో రాయాలంటే అదే సంవత్సరం జనవరి 31లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
సబ్జెక్టులు: ఫండమెంటల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్, ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్, ఫండమెంటల్స్ ఆఫ్ లాస్ అండ్ ఎథిక్స్, ఫండమెంటల్స్ ఆఫ్ బిజినెస్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ప్రతి సబ్జెక్టు 100 మార్కులకు ఉంటుంది. ప్రతి సబ్జెక్టులో కనీస ఉత్తీర్ణత మార్కులు 40.
సీఎంఏ ఇంటర్
సీఎంఏ ఫౌండేషన్ పూర్తిచేసినవారు ఒక సంవత్సరం తర్వాత సీఎంఏ ఇంటర్ పరీక్ష రాయడానిక అర్హులు. ఈ పరీక్ష డిసెంబర్లో రాయాలంటే అదే ఏడాది జూలై 31లోగా, జూన్‌లో రాయాలంటే అదే ఏడాది జనవరి 31లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ కోర్సు రెండు గ్రూపులుగా ఉంటుంది
గ్రూప్-1
సబ్జెక్టులు: ఫైనాన్షియల్ అకౌంటింగ్, లాస్ అండ్ ఎథిక్స్, డైరెక్ట్ ట్యాక్సేషన్, కాస్ట్ అకౌంటింగ్,
గ్రూప్-2
సబ్జెక్టులు: ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సేషన్
ప్రతి సబ్జెక్టు 100 మార్కులకు ఉంటుంది. ప్రతి సబ్జెక్టులో కనీస ఉత్తీర్ణత మార్కులు 40.
కంపెనీ అకౌంట్స్ అండ్ ఆడిట్
సీఎంఏ ఇంటర్ తర్వాత గుర్తింపు పొందిన సంస్థల్లో లేదా ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంటెంట్ వద్ద 15 నెలల పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందాలి. ఈ ట్రైనింగ్ పొందినవారే సీఎంఏ ఫైనల్ పరీక్ష రాయడానిక అర్హులు.
సీఎంఏ ఫైనల్
గ్రూప్-3
సబ్జెక్టులు: కార్పొరేట్ లాస్ అండ్ కైంప్లెన్స్, స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్ – డెసిషన్ మేకింగ్, డైరెక్ట్ ట్యాక్స్ లాస్ అండ్ ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్
గ్రూప్-4
సబ్జెక్టులు: కార్పొరేట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్ లాస్ అండ్ ప్రాక్టీస్, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆడిట్, స్ట్రాటజిక్ పర్ఫామెన్స్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ వ్యాల్యుయేషన్
ప్రతి సబ్జెక్టు 100 మార్కులకు ఉంటుంది. ప్రతి సబ్జెక్టులో కనీస ఉత్తీర్ణత మార్కులు 40.
కంపెనీ సెక్రటరీ (సీఎస్)
నిర్వహణ సంస్థ: ది ఇన్స్టిట్యూట్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ)
వెబ్సైట్: icsi.edu
ఈ కోర్సును కంపెనీ సెక్రటరీ ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ టెస్ట్ (సీఎస్ఈఈటీ), ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ అనే మూడు దశల్లో పూర్తిచేయాలి.
ఇంటర్లో ఎంఈసీ, సీఈసీ గ్రూపువారు ఇంటర్‌తోపాటు సీఎస్ చదవవచ్చు. ఇంటర్ పూర్తికాగానే సీఎస్ఈఈటీ పరీక్ష రాయవచ్చు.
సీఎస్ఈఈటీ పరీక్ష ఏడాదికి నాలుగుసార్లు మే, జూలై, నవంబర్, జనవరిలో నిర్వహిస్తారు. ఈ పరీక్ష రాయాలంటే పరీక్షకు ముందు నెల 15 తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
కంప్యూటర్ బేస్డ్గా నిర్వహించే ఈ పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. 50 శాతం మార్కులు సాధిస్తేనే ఉత్తీర్ణత అయినట్లు. దీనిలో నెగెటివ్ మార్కులు లేవు.
సీఎస్ఈఈటీ పరీక్ష ఉత్తీర్ణత సాధించినవారు 9 నెలల తర్వాత ఎగ్జిక్యూటివ పరీక్ష (రెండు మాడ్యూల్స్‌గా 8 పేపర్ల) రాయవచ్చు.
డాక్టర్, ఇంజినీరింగ్ కోర్సులతో సమానంగా కామర్స్ కోర్సులు కూడా పోటాపోటీగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా చాలామంది తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను కామర్స్ కోర్సుల్లో ఆసక్తి చూపుతున్నారు.
ఇంటర్ గ్రూపులు
ఇంటర్లో ఎంఈసీ, సీఈసీ గ్రూపు చదివితే కామర్స్‌పై మంచి పట్టు సాధింవచ్చు. వీటితో సీఏ, సీఎంఏ, సీఎస్ కోర్సులకు సుగమం చేసుకోవచ్చు.
ఎంఈసీ
ఇదొక ప్రత్యేకమైన గ్రూపు. సహజంగా మ్యాథ్స్ అంటే ఇష్టం ఉన్నవారు ఎంపీసీ తీసుకుంటారు. కామర్స్ చదవాలనుకునేవారు సీఈసీ తీసుకుంటారు. మాథ్స్ అంటే ఇష్టం ఉండి ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే భయపడేవారు, కామర్స్ అంటే ఇష్టం ఉండి లాజికల్‌గా ఉండే మ్యాథ్స్ కూడా చదవాలని ఉంటుంది. అలాంటివారికి ఎంఈసీ బెస్ట్ చాయిస్.
టీ తక్కువగా ఉండి భవిష్యత్తులో ఏ రంగంలో అయినా విశేష అవకాశాలు పొందాలనుకునేవారు ఎంచుకొనే మొదటి గ్రూపు ఎంఈసీ. ఎంఈసీ తీసుకోవడం వల్ల వ్యాపారానికి అవసరమైన ఆర్థిక, వాణిజ్య రంగాలకు సంబంధించిన అన్ని అంశాలపై పట్టు సాధించవచ్చు.
ఎంఈసీ తర్వాత చేయదగిన కోర్సులు
ప్రొఫెషనల్ కోర్సులు: సీఏ, సీఎంఏ, సీఎస్, లా
జనరల్ కోర్సులు: బీకాం, బీబీఎం, బీఏ, బీఎస్సీ, ఎంబీఏ, ఎంకాం, ఎంసీఏ, ఎమ్మెస్సీ
పోటీపరీక్షలు: గ్రూప్స్, సివిల్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, డీఎస్సీ
సీఈసీ
దీనిలో కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్టులు ఉంటాయి. సీఈసీ తరువాత డిగ్రీ చదివినవారికి కూడా అనేక రంగాల్లో అవకాశాలు లభిస్తాయి. లా పూర్తిచేయడానికి, సివిల్స్ రాయడానికి అన్ని రకాల కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయడానికి సీఈసీ గ్రూపులోని సబ్జెక్ట్సే కీలకం. జనరల్ నాలెడ్జ్, సమాజానికి, రాజ్యాంగానికి సంబంధించి, ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థ అంశాలతో కామర్స్‌ను కూడా అనుసంధానం చేయడంవల్ల సీఈసీ ప్రాధాన్యం మరింత పెరిగింది. సీఈసీ చదివినవారు సీఏ, సీఎంఏ, సీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు పూర్తిచేయవచ్చు. కామర్స్ కోర్సుల్లో సీఏ, సీఎంఏ, సీఎస్ కోర్సులు ప్రధానమైనవి.
సీఏ
నిర్వహణ సంస్థ: ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)
వెబ్సైట్: icai.org
పదో తరగతి తర్వాత సీఏకి నమోదు చేసుకొని ఇంటర్ పూర్తికాగానే సీఏ ఫౌండేషన్ పరీక్ష రాసే అవకాశం కల్పించాలనే ఆలోచనలో సీఏ ఇన్‌స్టిట్యూట్‌వారు ఉన్నారని సమాచారం. సీఏ చేయాలనుకునే చాలామంది ఇంటర్లో ఎంఈసీ, సీఈసీతో పాటు సీఏ కూడా ఏకకాలంలో చదవడానికే సుముఖత చూపిస్తున్నారు. ఇలా ఇంటర్‌తో పాటు సీఏ ఫౌండేషన్ సమాంతరంగా చదవడంవల్ల సీఏ ఫండమెంటల్స్‌పై పట్టు సాధించవచ్చు.
సీఏ దశలు
మొదటి దశ- సీఏ ఫౌండేషన్
ఇంటర్, 10+2 లేదా తత్సమాన పరీక్ష రాసినవారు ఎవరైనా సీఏ ఫౌండేషన్‌కు నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న 4 నెలలకు సీఏ ఫౌండేషన్ పరీక్ష రాయవచ్చు. ఈ పరీక్ష 50 శాతం మార్కులు డిస్క్రిప్టివ్, 50 శాతం మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో నిర్వహిస్తారు.
సబ్జెక్టులు, మార్కులు
పేపర్ సబ్జెక్టులు మార్కులు వ్యవధి
1 ప్రిన్సిపుల్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ అకౌంటింగ్ 100 3 గంటలు
2 బిజినెస్ లాస్ (60), బిజినెస్ కరస్పాండెన్స్
అండ్ రిపోర్టింగ్ (4) 100 3 గంటలు
3 బిజినెస్ మ్యాథమెటిక్స్ (40),
లాజికల్ రీజనింగ్ (20), స్టాటిస్టిక్స్ (40) 100 2 గంటలు
4 బిజినెస్ ఎకనామిక్స్ (60),
బిజినెస్ అండ్ కమర్షియల్ నాలెడ్జ్ (4) 100 2 గంటలు
సీఏ ఫౌండేషన్ ప్రతి ఏడాది మే, నవంబర్ నెలలో నిర్వహిస్తారు.
మట్టుపల్లి ప్రకాశ్
అకడమిక్ అడ్వైజర్
మాస్టర్ మైండ్స్, 9248733323
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు