నిజజీవితానికి దగ్గరగా ప్రశ్నలు

జనరల్ సైన్స్
గత ప్రశ్నాపత్రాలను పరిశీలిస్తే జనరల్ సైన్స్ విభాగంలో సుమారు 25 నుంచి 35 ప్రశ్నలు వస్తున్నాయి. ఇందులో జీవశాస్త్రం, రసాయనశా స్త్రం, జీవ సాంకేతికశాస్త్రం-ఆధునిక విజ్ఞానశాస్త్రం, భౌతిక శాస్త్రం నుంచి ప్రశ్నలు అడుగుతుండగా ఎక్కువ ప్రశ్నలు జీవశాస్త్రం నుంచి అడుగుతున్నారు. కొద్ది అవగాహనతో చదివితే ఏ గ్రూపు విద్యార్థులైన మంచి మార్కులు సాధించవచ్చు. ప్రశ్నాపత్రాల నుంచి ప్రశ్నల సరళిని పరి శీలిస్తే నిజజీవిత వినియోగానికి దగ్గరగా ఉన్నవి అడుగుతున్నారు.
జీవశాస్త్రం, వృక్షశాస్త్రం
జీవశాస్త్ర పరిచయం, శాస్త్రవేత్తలు, వివిధ రంగాలలో పితామహులు, మన ఆహారంలో భాగంగా పోషణ విధానాలు, పోషక పదార్థాలు, పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పాలు తదితర అంశాలు. వీటిలో అతి ప్రధానమైనవి విటమిన్లు. సూక్ష్మజీవ ప్రపంచంలో సూక్ష్మజీవుల రకాలు, బ్యాక్టీరియా వ్యాధులు, వైరస్ వ్యాధులు, ప్రొటోజొవా వ్యాధులు, వ్యాధి నిర్థారణ పరీక్షలు, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు అనే అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు.
ప్రధానంగా వివిధ రకాల వ్యాధులు, వ్యాధి కారకాలు, వ్యాధిలక్షణాలు, నివారణ, నిర్ధారణ పరీక్షల గురించి అధ్యయనం చేయాలి. ఇక వృక్ష ప్రపంచంలో స్వరూపశాస్త్రం, వృక్షరాజ్యం వర్గీకరణ, మొక్కల ఆర్థిక ప్రాముఖ్యత, కిరణజన్య సంయోగక్రియ, మొక్కల్లో శ్వాసక్రియ, కణాంగాలు, మొక్కల హార్మోన్లు, మొక్కల్లో జరిగే భౌతిక చర్యలు, కణజాల సంవర్ధనం, మొక్కల శాస్త్రీయ నామాలు, మొక్కల్లో ప్రత్యుత్పత్తి, మొక్కల్లో అనుకూలనాలు, కీటక ఆహార మొక్కలు, మొక్కల్లో విసర్జన అనే అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు.
జంతు ప్రపంచంలో జంతువుల వర్గీకరణ, జం తువుల ఆర్థిక ప్రాముఖ్యత, వివిధ రకాల జీవుల గర్భావధి కాలాలు అనే అంశాలపై ప్రశ్నలు అడు గుతున్నారు. వాతావరణశాస్త్రంలో కాలుష్యం, వన్యప్రాణి కేంద్రాలు, గ్రీన్‌హౌజ్ ఎఫెక్ట్, ఆమ్లవర్షాలు, వివిధ అధ్యయన శాస్ర్తాలు, వివిధ రకాల ప్రొటీన్లు లభించే పదార్థాలు, యాంటీ బయోటిక్స్, ఆమ్లాలు, దేశీయ శాస్త్రీయ సంస్థలు, జీవరసాయన ఎరువులు, జన్యుశాస్త్రం, మానవ శరీరం ముఖ్యాంశాలు మొదలైన అం శాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశముంది. అంతేగాకుండా కణజీవశాస్త్రం అనే అంశంలో కణాంగాలు, కణవిభజన గురించి కూడా అవగాహన కలిగి ఉండాలి.
గతంలో వచ్చిన ప్రశ్నలు
1. తెల్లరక్తకణాల అతి చిన్న భాగం ఏది ? (డి)
ఎ. ఇస్నోఫిల్స్ బి. బేసోఫిల్స్
సి. లింఫోసైట్లు డి. మోనోసైట్లు
2. కింది వాటిలో ఏ వైరస్లు గవద బిళ్లలకు కారణం ? (సి)
ఎ.కోమోవైరస్ బి.క్లామాత్ వైరస్ సి. పారామిక్సోవైరస్ డి. బోట్రిటిస్ వైరస్
3. రక్షిత ఆహార పదార్థాలు అని కింది వాటిలో వేటిని అంటారు ? (ఎ)
ఎ. విటమిన్లు బి. ప్రొటీన్లు
సి. మినరల్సాల్ట్ డి. కార్బోహైడ్రేట్లు
4. కిరణజన్య సంయోగక్రియపై చేసిన పరిశోధనకు నోబెల్ బహుమతి పొందినవారు ఎవరు
? (ఎ)
ఎ. మెల్విన్కాల్విన్ బి. ఎం.డీ.హాచ్
సి. ఆర్నాన్ డి. ఎఫ్.బర్నెల్
5. అతి వేగవంతమైన జంతువు ఏది ? (సి)
ఎ. కంగారు బి. పెద్దపులి
సి. చిరుత డి. కుందేలు
6. నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది ? (ఎ)
ఎ. ఫుణె బి. పాట్నా
సి. ఢిల్లీ డి. హైదరాబాద్
7. పునరుజ్జీవ శక్తి ఆధారం ? (సి)
ఎ. బొగ్గు బి. చమురు
సి. గాలి డి. సహజవనరులు
భౌతిక శాస్త్రం
ఇందులో ఉష్ణశక్తి, కాంతిశక్తి, మనవిశ్వం, యాం త్రికశాస్త్రం, ధ్వని, విద్యుత్‌శక్తి, అతి ధ్వనులు, గతిశాస్త్రం, బలాలు రకాలు, కొలతలు – ప్రమాణా లు, ద్రవాలు-ధర్మాలు, ఆధునిక భౌతిక శాస్త్రం, సైన్స్ అండ్ టెక్నాలజీ, అయస్కాంత శక్తి మొదలగు అంశాల నుంచి 8 నుంచి 9 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
గతంలో వచ్చిన ప్రశ్నలు
1. ఎంకేఎస్ పద్ధతిలో శక్తికి ప్రమాణం ఏది ? (ఎ)
ఎ. జౌల్ బి. ఓల్ట్ సి. ఎర్గ్ డి. ఓం
2. ధ్వని దేనిగుండా వేగంగా ప్రయాణిస్తుంది? (డి)
ఎ. వాయుపదార్థం బి. ద్రవపదార్థం
సి. శూన్యం డి. ఘనపదార్థం
3. నీటిని సున్నా డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 10 డిగ్రీ సెంటిగ్రేడ్‌కు వేడి చేసినప్పుడు పరిమాణంలో ఎలాంటి మార్పు జరుగుతుంది ? (డి)
ఎ. పెరుగుతుంది బి. తగ్గుతుంది
సి. ముందు తగ్గి తరువాత పెరుగుతుంది డి. ముందు పెరిగి తరువాత తగ్గుతుంది
4. కాంతి దేనిగుండా అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది ? (ఎ)
ఎ. గాలి బి. నీరు
సి. వజ్రం డి. గాజు
రసాయన శాస్త్రం
ఇందులో ఆమ్లాలు, క్షారాలు, పదార్థాలు, మూలకాల వర్గీకరణ, ఔషధాలు, పరమాణు నిర్మాణం, రసాయన మూలకాలు-ఫార్మూలాలు, కొన్ని రసాయనాలు వాటి సాధారణ నామాలు, లోహ సంగ్రహణ శాస్త్రం, గాజు, సిమెంటు, డ్రగ్స్, సబ్బు లు, కార్బోహైడ్రేడ్స్, ప్రొటీన్లు కొవ్వులు అనే అం శాల నుంచి 7 – 8 ప్రశ్నలు అడుగుతున్నారు.
గతంలో వచ్చిన ప్రశ్నలు :
1. టార్పాలిక్ ఆమ్లం దేనిలో ముఖ్యభాగం ? (డి)
ఎ. వాషింగ్పౌండర్ బి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ సి. బ్లీచింగ్ పౌడర్ డి. బేకింగ్ పౌడర్
2. కింది వానిలో ఏది గాఢ ఆమ్లం ? (సి)
ఎ. సిట్రిక్ఆమ్లం బి. ఆక్సాలిక్ ఆమం సి. నైట్రిక్ ఆమ్లం డి. ఎసిటిక్ఆమ్లం
3. ఎల్పీజీ ముఖ్యంగా దేనిని కలిగి ఉంటుంది ? (బి)
ఎ. ఈథేన్ బి. బ్యూటేన్
సి. పెంటేన్ డి. ఏదీకాదు
RELATED ARTICLES
Latest Updates
Current Affairs | SBI నాలుగో స్టార్టప్ బ్రాంచిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
Indian Polity | జాతీయ బాలల పరిరక్షణ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది?
Telangana Government Schemes | ప్రజల పాలిట వరాలు.. అభివృద్ధికి ప్రతీకలు
TS EAMCET | టీఎస్ ఎంసెట్ -2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
Current Affairs | దేశంలో అతిపెద్ద అక్వేరియం ఏ నగరంలో రానుంది?
MSTC Recruitment | ఎంఎస్టీసీ లిమిటెడ్‌లో 52 మేనేజర్ పోస్టులు
Telangana Current Affairs | షీ భరోసా సైబర్ ల్యాబ్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
SSC CHSL Preparation 2023 | ఉమ్మడిగా చదివితే.. ఉద్యోగం మీదే!
GEOGRAPHY | పర్వతాల ఊయలగా వేటిని పేర్కొంటారు?
ISRO Recruitment | ఇస్రోలో 303 సైంటిస్ట్ ఇంజినీర్ పోస్టులు