చంద్రమౌళీశ్వర శతకకర్త ఎవరు?
అధిక్షేప శతకాలు
– భగవంతుడిని అధిక్షేపిస్తూ విమర్శనాత్మకంగా రాసిన శతకాలకు అధిక్షేప శతకాలు అని పేరు.
– తెలుగు అధిక్షేప శతకాల్లో మొదటిది చౌడప్ప శతకం. ఈ శతకాన్ని రాసిన కవి చౌడప్ప.
– పది నీతులు, పది బూతులు, పది శృంగారాలు గల పద్యాలను సభలో చదివినవాడే అధికుడని చెప్పిన కవి చౌడప్ప.
కొన్ని అధిక్షేప శతకాలు
– భార్గవ శతకం, కుక్కుటేశ్వర శతకం, భక్త మందార శతకాలు – కూసుమంచి జగ్గకవి.
– రామలింగేశ శతకం – ఆడిదము సూరకవి. (ఈ శతకం 18వ శతాబ్ద కాలం నాటి సాంఘిక చరిత్రకు దర్పణం పడుతుంది)
– గువ్వలచెన్న శతకం – గువ్వలచెన్నడు
– సిరిసిరిమువ్వ శతకం – శ్రీశ్రీ
– నార్లవారి మాట శతకం – నార్ల వెంకటేశ్వరరావు
– దాశరథి శతకం – దాశరథి కృష్ణమాచార్యులు
– పిల్లి శతకం – బోయి భీమన్న
– సమ దర్శనం – సీ నారాయణరెడ్డి
– శ్రీనివాస శతకం – కృష్ణ కౌండిన్య
శృంగార శతకాలు
– శృంగార రసాత్మకమైన శతకాలకు శృంగార శతకాలు అని పేరు.
– శృంగార శతకాల్లో మొదటిది తాళ్లపాక అన్నమాచార్యులు రాసిన శ్రీవేంకటేశ్వర శతకం.
శృంగార శతకాల్లో ముఖ్యమైనవి
– నందనందన శతకం – పుసులూరి సోమరాజ కవి
– సుందరీమణి శతకం – గోగులపాటి కూర్మనాథ కవి
– బ్రహ్మానంద శతకం – గోపీనాథం వెంకట కవి
– కీరవాణి శతకం – గంగాధర కవి
– కృష్ణ శతకం – సెట్టి లక్ష్మీనరసింహ కవి
– శృంగార శతకం – మల్లాది శివరాం
హాస్య శతకాలు
– హాస్య శతకాలు అంటే హాస్యరస సంబంధమైనవి.
హాస్య శతకాల్లో ముఖ్యమైనవి
– పొగచుట్ట శతకం – కవి పేరు తెలియదు
– చీపురుపుల్ల శతకం – సామినేని వెంకటాద్రి కవి
– విసనకర్ర శతకం – హరిబ్రహ్మేశ్వర కవులు
ప్రకీర్ణ శతకాలు
– ప్రకీర్ణ శతకం అంటే వస్తు నియమాన్ని ఒక క్రమంగా పాటించక విభిన్న అంశాలను ఒకచోట చేర్చి రాసిన శత కం. ఈ శతకాన్ని రాసినవారిలో మొదటివాడు వేమన.
కొన్ని ప్రకీర్ణ శతకాలు
– శాంతానంద యోగిరామ శతకం – శాంతానందయోగి
– అహంకార శతకం – తోట వెంకట నర్సయ్య
– సర్వలోకేశ్వర శతకం – శేషాద్రి రమణ కవులు
– మందేశ్వర శతకం – దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి
విభిన్న వస్తుక శతకాలు
– విభిన్న వస్తువులతో కూడిన శతకాలకు విభిన్న వస్తుక శతకాలు అని పేరు.
ఈ శతకాల్లో ముఖ్యమైనవి
– వేంకటేశాంధ్రం అనే అచ్చ తెలుగు నిఘంటువు శతకం – గణపవరపు వెంకట కవి.
– ఆంధ్రనామ శేషం అనే నిఘంటువు – ఆడిదము సూరకవి.
– అలంకార వసంతం – చలమచర్ల రంగాచార్యులు.
– భాషా వ్యాకరణ శాస్త్ర విశేషాంశాలకు సంబంధించి గిడుగు సీతాపతి రాసిన శతకం – భారతీ శతకం.
– శతక రూపంలో వెలువడిన స్మృతి కావ్యాల్లో ప్రథమ గణ్యమైనది – విశ్వనాథ సత్యనారాయణ రాసిన వరలక్ష్మీ త్రిశతి.
– హరిజన శతకం – కుసుమ ధర్మన్న.
– అమృతాంజన శతకం – కరినారాయణాచార్యులు
కథాత్మక శతకాలు
– కథ ప్రధానంగా రాసిన శతకాలు.
కథాత్మక శతకాల్లో ముఖ్యమైనవి
– ముకుంద రాఘవ శతకం – జూలూరి లక్ష్మణ కవి.
– ప్రసన్న రాఘవ శతకం – వంగూరి ముద్దు నర్సకవి.
– రామాయణ సంగ్రహ శతకం – మంగిపూడి వీరయ సిద్ధాంతి.
– భారత కృష్ణ శతకం – భువనగిరి లక్ష్మీకాంతం
– ఆత్మకథా రూపంలో వెలువడిన శతకం – హరిహరేశ్వర శతకం. ఈ శతకాన్ని రాసినది మండపాక పార్వతీశ్వర శాస్త్రి.
– బిల్హేశ్వర శతకం – కొక్కొండ వెంకటరత్నం పంతులు.
– టెంకాయ చిప్ప శతకం – వావిలకొలను సుబ్బారావు.
– బాలకోటేశ్వర శతకం – తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి.
– దారుణ శతకం – చిదంబర శాస్త్రి
– చెళ్లపిల్ల వెంకటశాస్త్రి రాసిన శతకాలు – ఆరోగ్య కామేశ్వరి శతకం, ఆరోగ్య భాస్కరస్తవం, మృత్యుంజయ శతకం.
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






