ఆర్టికల్ 19(1)(F) ని తొలగించిన రాజ్యాంగ సవరణ చట్టం?
85. ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్స్ 19 నుంచి 22 మధ్య పేర్కొన్న ‘స్వేచ్ఛ, స్వాతంత్య్రపు హక్కు’ ను భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిదిగా ఎవరు అభివర్ణించారు?
1) డా.బి.ఆర్. అంబేద్కర్
2) జస్టిస్ మహ్మద్ హిదయతుల్లా
3) జస్టిస్ సిక్రీ
4) నళినీ రంజన్ సర్కార్
86. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19లో పేర్కొన్న స్వేచ్ఛ, స్వాతంత్య్రాలకు సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఆర్టికల్ 19(1)(ఎ) i) వివిధ సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు
బి) ఆర్టికల్ 19(1) (బి) ii) భావప్రకటనా, వాక్స్వాతంత్య్రపు హక్కు
సి) ఆర్టికల్ 19(1)(సి) iii) ఆయుధాలు ధరించకుండా,
శాంతియుతంగా సమావేశాలు నిర్వహణ
డి) ఆర్టికల్ 19(1)(డి) iv) దేశంలో స్వేచ్ఛగా సంచరించే హక్కు
1) ఎ-iii, బి-i, సి-iv, డి-ii 2) ఎ-ii, బి-iii, సి-i, డి-iv
3) ఎ-ii, బి-iii, సి-iv, డి-i 4) ఎ-iv, బి-iii, సి-i, డి-ii
87. కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఆర్టికల్ 19(1)(E) i) దేశంలో ఎక్కడైనా స్థిరనివాసం ఏర్పాటు చేసుకునే హక్కు
బి) ఆర్టికల్ 19(1)(F) ii) ఇష్టమైన వృత్తి వ్యాపారాన్ని నిర్వహించుకునే హక్కు
సి) ఆర్టికల్ 19(1)(G) iii) ఆస్తిని సంపాదించుకోవడం,
అనుభవించడం, అన్యాక్రాంతం చేయడం
1) ఎ-i, బి-ii, సి-iii 2) ఎ-iii, బి-i, సి-ii
3) ఎ-i, బి-iii, సి-ii 4) ఎ-ii, బి-i, సి-iii
88. ఆర్టికల్ 19(1)(ఎ)లో పేర్కొన్న భావ ప్రకటన స్వేచ్ఛలో అంతర్భాగంగా ఉన్న అంశాన్ని గుర్తించండి?
ఎ) పత్రికాస్వేచ్ఛ, వాణిజ్య ప్రకటనల స్వేచ్ఛ బంద్‌లకు వ్యతిరేకమైన స్వేచ్ఛ
బి) మౌనంగా ఉండే స్వేచ్ఛ, నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ
సి) ప్రభుత్వ కార్యకలాపాల గురించి తెలుసుకునే స్వేచ్ఛ
డి) టెలిఫోన్ సంభాషణలను ట్యాపింగ్ చేసే స్వేచ్ఛ
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, సి, డి
89. భావ ప్రకటన స్వేచ్ఛకు భౌగోళిక పరిమితులు లేవని విదేశాల్లో పర్యటించే భారతీయ పౌరుల భావప్రకటన స్వేచ్ఛపై భారత ప్రభుత్వం పరిమితులు విధించరాదని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది?
1) హరీష్ ఉప్పల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
2) టి.కె. రంగరాజన్ Vs స్టేట్ ఆఫ్
తమిళనాడు కేసు
3) సుబ్రహ్మణ్యస్వామి Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
4) మేనకాగాంధీ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
90. సాధారణ పౌరుడు సైతం ఏ సమయంలోనైనా జాతీయ పతాకాన్ని ఎగురవేయవచ్చునని అది అతని భావప్రకటనా హక్కులో అంతర్భాగమని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది?
1) శ్రియాసింఘాల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
2) నవీన్ జిందాల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
3) బాబులాల్ పరాటే Vs స్టేట్ ఆఫ్ బాంబే కేసు
4) దిగంబర ప్రసాద్ Vs స్టేట్ ఆఫ్ కర్ణాటక
91. ప్రజల ప్రాణాలకు, శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంటే మెజిస్ట్రేట్ కింది చర్యను చేపడతారు?
1) క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 ప్రకారం 144వ సెక్షన్ విధింపు
2) క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 ప్రకారం 147వ సెక్షన్ విధింపు
3) క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 ప్రకారం 171 సెక్షన్ విధింపు
4) క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1975 ప్రకారం 149 సెక్షన్ విధింపు
92. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని 141వ సెక్షన్ ప్రకారం ఐదుగురు(5) లేదా అంత కంటే ఎక్కువ మంది వ్యక్తులు సమావేశం కావడం ఏ పరిస్థితుల నేపథ్యంలో నేరం అవుతుంది?
ఎ) ప్రభుత్వాధికారులను చట్టవ్యతిరేకమైన పనులను చేయాలని ఒత్తిడి చేయడం భయపెట్టడం.
బి) శాసనాన్ని లేదా చట్టబద్ధ ప్రక్రియను ప్రతిఘటించడం
సి) వ్యక్తుల ఆస్తులను బలవంతంగా ఆక్రమించడం
డి) అల్లరిపనులు, ఆస్తుల ధ్వంసం
1) ఎ, బి, డి 2) ఎ, బి, సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, సి, డి
93. జాతీయ గీతాన్ని ఆలపించాలని ఏ ఒక్కరినీ ఒత్తిడి చేయరాదని, మౌనంగా ఉండటం కూడా భావ ప్రకటనా స్వేచ్ఛలో అంతర్భాగమేనని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది?
1) సుబ్రహ్మణ్యస్వామి యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
2) రమేష్థాపర్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసు
3) భరత్ కుమార్ సీపీఐ పార్టీ కేసు
4) బిజయ్ ఇమ్మాన్యుయేల్ స్టేట్ ఆఫ్
కేరళ కేసు
94. కింద అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయడాన్ని వారి ప్రాథమిక హక్కుగా పరిగణించవచ్చునని సుప్రీంకోర్టు పేర్కొన్నది
బి) బంద్‌లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది
సి) ఆటవిక జాతులు నివసించే ప్రాంతాల్లో నాగరికుల సంచార స్వేచ్ఛపై పరిమితులు విధించవచ్చు
డి) 1990 లో బీజేపీ నేత ఎల్.కె. అద్వానీ చేపట్టిన రథయాత్రను బీహార్‌లోని లాలూ ప్రసాద్‌యాదవ్ ప్రభుత్వం నిలిపి వేసింది
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి, డి 4) బి, సి, డి
95. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(F) ను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించారు?
1) ఇందిరాగాంధీ ప్రభుత్వం -26వ రాజ్యాంగ సవరణ చట్టం 1971
2) ఇందిరాగాంధీ ప్రభుత్వం – 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976
3) మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం – 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978
4) రాజీవ్‌గాంధీ ప్రభుత్వం- 56వ రాజ్యాంగ సవరణ చట్టం 1987
96. రాజ్యాంగంలోని ఆర్టికల్ 20కు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఆర్టికల్ 20(1) నేరం చేయనిదే ఏ వ్యక్తినీ శిక్షించరాదు
బి) ఆర్టికల్ (20)(2) ఒక వ్యక్తిని ఒక నేరానికి ఒకసారి మాత్రమే శిక్షించాలి
సి) ఆర్టికల్ 20(3) ఒక వ్యక్తిని బలవంతంగా తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి చేయరాదు
డి) ఆర్టికల్ 20(4) అరెస్ట్ చేసిన వ్యక్తిని 24 గంటల్లోగా సమీప మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలి
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) బి, సి, డి 3) ఎ, సి, డి
97. ఒక వ్యక్తిని శారీరకంగా, మానసికంగా హింసిస్తూ, బెదిరిస్తూ సమాచారాన్ని రాబడితే దానిని బలవంతపు సాక్ష్యంగా పరిగణిం చాలని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా పేర్కొన్నది?
1) నందినీ శతపతి Vs పి.ఎల్ దాని కేసు
2) టి.కె.రంగరాజన్ Vs స్టేట్ ఆఫ్
ఆంధ్రప్రదేశ్ కేసు
3) చరిత Vs స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు
4) మహర్షి అవథేష్ Vs స్టేట్ ఆఫ్
ఉత్తర ప్రదేశ్
98. రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(3)ను ఉల్లంఘిస్తున్న కారణంగా ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు నార్కో అనాలసిస్’ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది?
1) కోబాడ్‌గాంధీ కేసు
2) అతుల నాయక్ కేసు
3) సర్దార్ సజ్జన్ కేసు
4) రమేష్ థాపర్ కేసు
99. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) నార్కో అనాలసిస్ పరీక్షలో సోడియం పెంటథాల్, సోడియం అమైటాల్ అనే
పదార్థాలను వినియోగిస్తారు
బి) ఐపీసీలోని సెక్షన్ 309 ప్రకారం
ఆత్మహత్యాయత్నం నేరం
సి) వ్యక్తి స్వేచ్ఛకు, ప్రాణానికి చట్టబద్ధమైన పద్ధతిలో తప్ప, ఇతర పద్ధతుల్లో హాని
తలపెట్టరాదు.
డి) చట్టబద్ధమైన పద్ధతి అనే అంశాన్ని అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు
1) ఎ, బి, సి, డి 2) ఎ, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి
100. కిందిపేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) జైన మతస్థులు అనుసరించే ‘సల్లేఖన వ్రతం’ బలవంతపు మరణంగా పరిగణించరాదని సుప్రీంకోర్టు 2015లో ప్రకటించింది.
బి) భారత ప్రభుత్వం 1977లో ‘మేనకాగాంధీ’ పాస్‌పోర్ట్‌ను చేసుకున్నది.
సి) విదేశాలకు వెళ్లేహక్కు ఆర్టికల్ 21లో పేర్కొన్న జీవించే హక్కులో కాదని సుప్రీంకోర్టు పేర్కొన్నది
డి) Ex-Post Facto Law అంటే కార్యాంతర శాసనాలు అని అర్థం
1) ఎ, సి, డి 2) ఎ, బి, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి
101. మేనకాగాంధీ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాన్ని గుర్తించండి?
ఎ) జీవించే హక్కు ఉంటే కేవలం భౌతికంగా జీవించడం మాత్రమేగాక, మానవ మర్యాదలతో జీవించడం అని అర్థం
బి) రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 18, 21 ఒకదానితో మరొకటి పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి
సి) బ్రిటన్‌లో అమల్లో ఉన్న ‘Due Process of Law’ అనే శాసన ప్రక్రియను సుప్రీంకోర్టు పేర్కొన్నది
డి) భారత ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది.
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) బి, సి, డి 4) ఎ, బి, సి, డి
102. సహజ న్యాయసూత్రానికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఆర్టికల్ 21 ప్రకారం రూపొందించే శాసనం ‘సహజ న్యాయసూత్రాలను’ ఉల్లంఘించరాదు
బి) ప్రతివ్యక్తికి విన్నవించుకునే హక్కు ఉన్నది
సి) ఏ ఒక్కరూ తన సొంతకేసుకు తానే జడ్జిగా ఉండరాదు
డి) ప్రతి ఆధికార వ్యవస్థ న్యాయబద్ధంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.
1) ఎ, బి, సి, డి 2) ఎ, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి
103. మనదేశంలో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కు చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
1) 2009, ఏప్రిల్ 1
2) 2009 నవంబర్ 11
3) 2010 జనవరి 21
4) 2010 ఏప్రిల్ 1
104. ‘ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు’కు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఆర్టికల్ 21(ఎ)- ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కును తెలియజేస్తుంది
బి) 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా ఆర్టికల్ 21(ఎ) చేర్చబడినది
సి) డా. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 86వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేసింది
డి) భారత పార్లమెంటు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కు చట్టాన్ని 2009లో రూపొందింది
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) ఎ, బి, డి 4) బి, సి, డి
105. ‘ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కు చట్టం -2009’కి సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి
ఎ) ప్రాథమిక విద్య పూర్తయ్యేవరకు ఏ విద్యార్థినీ కూడా పాఠశాల నుంచి తొలగించరాదు.
బి) ప్రాథమిక విద్య అంటే 1 నుంచి 5 తరగతులు
సి) అన్ని ప్రయివేట్ విద్యా సంస్థల్లో బడుగు, బలహీన వర్గాల పిల్లలకు 25 శాతం సీట్లు కేటాయించాలి.
డి) ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 1:30గా ఉండాలి.
1) ఎ, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, బి, సి, డి 4) బి, సి, డి
106. ‘ఉచిత నిర్భంధ ప్రాథమిక విద్యాహక్కు చట్టం -2009’ కి సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి?
ఎ) అర్హతగల వారిని మాత్రమే
ఉపాధ్యాయులుగా నియమించాలి
బి) ప్రాథమిక విద్య అంటే 1 నుంచి
8వ తరగతులు
సి) బాలబాలికలను శారీరకంగా,
మానసికంగా హింసించరాదు
డి) 6 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల బాలలందరూ దీనికి అర్హులు
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి, డి
107. జాతీయోద్యమ సమయంలోనే 1911లో భారతీయులకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించి, అమలు చేయాలని ఆంగ్లేయులను డిమాండ్ చేసిన భారతీయుడు?
1. బాలగంగాధర్ తిలక్
2) మహాత్మాగాంధీ
3) గోపాలకృష్ణ గోఖలే
4) లాలాలజపతిరాయ్
108. కింది అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) భారత్‌లో పౌరస్వేచ్ఛకు సంబంధించి నమోదైన మొదటి కేసు- ఎ.కె.గోపాలన్ కేసు
బి) గోల్డెన్ ట్రయాంగిల్ ఆర్టికల్స్ లేదా గోల్డెన్ ట్రినిటీ ఆర్టికల్స్‌గా ఆర్టికల్ 14, 19, 21 పేరొందాయి
సి) ఎ.కె.గోపాలన్ తమిళనాడుకు చెందిన పర్యావరణవేత్త
1) ఎ, బి, 2) ఎ, బి, సి,
3) ఎ, సి 4) పైవేవీకావు
కె.శ్రీనివాసరావు పాలిటీ ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్ వికారాబాద్,

Capture
- Tags
RELATED ARTICLES
Latest Updates
Website publishing check 1cf3602aa119
MyStake casino: bezpečnost účtu a kontrola identity
Cryptomonnaies sur Onlyspins casino : paiements, bonus et retraits
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions






