చండూరు సాహితీ మేఖలను స్థాపించింది?
టీఎస్పీఎస్సీ కొత్తగా రూపొందించిన గ్రూప్స్ సిలబస్‌లో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఇచ్చిన ప్రాధాన్యం మరే ఇతర సబ్జెక్టుకు ఇవ్వలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల నిర్వహించిన పలు పరీక్షల్లో అడిగిన ప్రశ్నల సరళిని చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో నిపుణ పాఠకుల కోసం తెలంగాణ చరిత్ర, సంస్కృతిపై నేటి ప్రత్యేకం..
సీఎం కేసీఆర్ జాతీయ జండాను తొలిసారిగా ఎక్కడ ఎగురవేశారు?
– గోలకొండ కోటపై, ఆగస్టు 15న
తెలంగాణలో జాతీయ రహదారుల పొడవు ఎన్ని కి.మీ.లు?
– 1586.09 కి.మీ. (6 జాతీయ రహదారులు)
తెలంగాణ లక్ష్మీబాయి అని ఎవరికి పేరు?
– సంగెం లక్ష్మీబాయి
హైదరాబాద్ ప్రకాశం అంటే ఎవరు?
– స్వామి రామానంద తీర్థ
1952-56 వరకు హైదరాబాద్ రాష్ట్ర స్పీకర్?
– కాశీనాథరావ్ వైద్య
ఇండియన్ తోరోదత్ అని ఎవరిని అంటారు?
– సరోజినీ నాయుడు
తెలంగాణ పటేల్ అంటే ఎవరు?
– బొమ్మకంటి సత్యనారాయణ రావు
హైదరాబాద్ సింహం?
– పండిత నరేంద్రజీ
ఇండియన్ మార్టిన్ లూథర్, ఇడియన్ ఐన్‌స్టీన్ ఎవరు?
– ఆచార్య నాగార్జునుడు
దాశరథి కృష్ణమాచార్యుని రచనలు?
– అగ్నిధార, రుద్రవీణ, మహాబోధి, కవితా పుష్పకం, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం
ఉమర్ ఖయ్యూం రచించిన తెలంగాణ కవి?
– బూర్గుల రామకృష్ణారావు
1921లో జరిగిన ఆంధ్రజనసంఘం సమావేశంలో తొలిసారిగా తెలుగులో మాట్లాడిన వ్యక్తి?
– అల్లంపల్లి వెంకట రామారావు
హైదరాబాద్ భారతదేశం అనే గుండెపై పుట్టిన రాచపుండు అన్నదెవరు?
– సర్దార్ పటేల్
పెద్దమనుషుల ఒప్పందంపై సంతకం చేసిన తెలంగాణ ప్రాంతానికి చెందిన నలుగురు సభ్యులు ఎవరు?
– కేవీ రంగారెడ్డి, జేవీ రంగారావు, బూర్గుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి
తెలంగాణలో ఒగ్గు కథా చక్రవర్తి అని ఎవరిని అంటారు?
– మిద్దె రాములు
హైదరాబాద్‌లోని ఫతే మైదాన్ నుంచి తెలంగాణ గడ్డపై ఒక్క కమ్యూనిస్ట్‌ని కూడా మిగలనివ్వను అని శపథం చేసింది ఎవరు?
– సర్దార్ పటేల్
నిజాం రాజ్యంలో నిర్మించిన తొలి ప్రాజెక్ట్?
– నిజాం సాగర్ ప్రాజెక్ట్ (మంజీరా నదిపై)
తెలంగాణ లెజిస్లేటివ్ ఫోరం కన్వీనర్ ఎవరు?
– చిన్నారెడ్డి
తెలంగాణ కోసం కేశవరావ్ జాదవ్ నాయకత్వంలో తెలంగాణ ఐక్యవేదిక ఎప్పుడు ఏర్పాటయ్యింది?
– 1997, అక్టోబర్ 28న
ఫలక్‌నుమా ప్యాలెస్‌ను ఎప్పుడు నిర్మించారు? ఫలక్‌నుమా అంటే అర్థం?
– 1884, మార్చి 3న నిర్మించారు. ఫలక్‌నుమా అంటే ఆకాశానికి ప్రతిబింబం అని అర్థం
నిజాం రాజు అధికార నివాసం?
– చౌమొహల్లా ప్యాలెస్
మా హైదరాబాద్ గ్రంథ రచయిత?
– శ్రీధర్ ధర్మాసనం
కులం అణచివేత మీద కంచె ఐలయ్య రాసిన పుస్తకం?
– State and Repressive Culture
నక్సలైట్లు దేశభక్తులు అని అన్నదెవరు?
– మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు
తొలిసారిగా నాలుగు వేదాలను తెలుగులోకి అనువదించిన తెలంగాణ కవి?
– దాశరథి రంగాచార్య
దగాపడ్డ తెలంగాణ రాసిందెవరు?
– గాదె ఇన్నయ్య
గద్దర్ అసలు పేరు? ఆయన ఎక్కడ జన్మించారు?
– విఠల్‌రావు, 1949లో మెదక్ జిల్లా తూప్రాన్‌లో జన్మించారు
తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు ఎవరు?
– అల్లం నారాయణ
నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిటర్?
– కట్టా శేఖర్‌రెడ్డి (నల్లగొండ జిల్లా)
తెలంగాణ డిమాండ్ డే ఎప్పుడు?
-1969, మే 1 (తెలంగాణ ప్రజాసమితి ప్రకటించింది)
తెలంగాణ సిద్ధాంత కర్త?
– ప్రొ. జయశంకర్
భాగ్యోదయం గ్రంథం రాసిన భాగ్యరెడ్డివర్మ కుమారుడు?
– ఎంబీ గౌతమ్
ఆది హిందూ ఉద్యమ పితామహుడు ఎవరు?
– భాగ్యరెడ్డి వర్మ
అచల పరిపూర్ణ సిద్ధాంతాన్ని ప్రచారం చేసిందెవరు?
– అరిగె రామస్వామి (దళిత ఉద్యమనేత)
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమైన తేదీ?
– 1947, సెప్టెంబర్ 11
కాకతీయులను శూద్రులుగా పేర్కొన్న శాసనం?
– వర్ధమానపుర శాసనం
తెలంగాణ బిల్లును రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది?
– 2014, ఫిబ్రవరి 20న
నిజామాబాద్ జైలు గోడలపై విప్లవ గీతాలు రాసిన తెలంగాణ కవి?
– దాశరథి కృష్ణమాచార్య
అందెశ్రీకి గౌరవ డాక్టరేట్ ఇచ్చిన యూనివర్సిటీ?
– కాకతీయ వర్సిటీ
కాళోజీ పూర్తి పేరు?
– రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రాంరాజా కాళోజీ నారాయణరావు
గేట్ వే టు తెలంగాణ అని ఏ పట్టణాన్ని పిలుస్తారు?
– కోదాడ
ఐక్యరాజ్య సమితిలోని (2015, సెప్టెంబర్) జనరల్ అసెంబ్లీలో ప్రసంగించే అవకాశం వచ్చిన తెలంగాణ విద్యార్థులు?
– మాలావత్ పూర్ణ (నిజామాబాద్ జిల్లా), సాదిక్ పాషా (ఖమ్మం)
తెలంగాణ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?
– నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి
బతుకమ్మా బతుకు రచయిత?
– శ్రీగిరిజామనోహరబాబు
పుట్టుక నీది, చావు నీది… బతుకంతా దేశానిది అన్నదెవరు?
– కాళోజీ
1968లో తొలి దశ ఉద్యమంలో తెలంగాణలో ఫ్లాగ్‌డేని ఎప్పుడు నిర్వహించారు?
– జూలై 12న
పింగళి జగన్మోహన్రెడ్డి కమిషన్ని దేనిగురించి నియమించారు?
– 1952లో ముల్కీ ఉద్యమం-పోలీసుల కాల్పుల గురించి
అక్కన్న మాదన్నల ఆలయం ఎక్కడ ఉంది?
– శాలిబండ, హైదరాబాద్
అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా పాట రాసి పాడింది ఎవరు?
– గద్దర్, 1997లో
2008లో 610 జీవో అమలు పర్యవేక్షణ కమిటీ చైర్మన్ ఎవరు?
– ఉత్తమ్‌కుమార్ రెడ్డి
తెలంగాణ కళాసమితి స్థాపకురాలు ఎవరు?
– బెల్లి లలిత
తెలంగాణ సంస్కృతి పరిరక్షణకు 2007లో ఏర్పడిన సంస్థ?
– తెలంగాణ జాగృతి
తెలంగాణ ప్రభుత్వ తొలి కార్యదర్శి?
– రాజీవ్ శర్మ
రాళ్లవాగు ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది?
– కరీంనగర్ జిల్లాలో
రావి నారాయణరెడ్డి ఆడిటోరియం ఎక్కడ ఉంది?
– హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి అయిన తెలంగాణకు చెందిన మొదటి వ్యక్తి?
– పీవీ నరసింహారావు
1968లో కాకతీయ యూనివర్సిటీ నుంచి ఆరుట్ల కమలాదేవి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అయితే ఆమెకు ఉన్న మరోపేరు?
– అభినవ రుద్రమ
సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితిని స్థాపించిందెవరు?
– ప్రొ. కేశవరావు జాదవ్ (1969లో)
తెలంగాణలో తొలి విశ్వవిద్యాలయం?
– ఉస్మానియా యూనివర్సిటీ
నాజీ నైజాం గ్రంథ రచయిత ఎవరు?
-అయ్యపు వెంకటరమణ
తెలంగాణలో నృత్య సంబంధ కళా రూపాల్లో ఒకటి?
– థింసా
1860లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా (ఆదిలాబాద్ జిల్లాలో) పోరాటం చేసిన గోండుల నాయకుడు?
– రాంజీ గోండు
పీవీ నరసింహారావు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి కారణమైన ఉద్యమం?
– జై ఆంధ్ర ఉద్యమం
హైదరాబాద్ సంస్థానంలో అల్తాఫ్ బల్దా అంటే ఏ జిల్లా?
– రంగారెడ్డి
రాష్ట్ర తొలి వైద్య ఆరోగ్య శాఖామంత్రి?
– టీ రాజయ్య
ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల విజ్ఞాన సర్వస్వం రాసిన చరిత్రకారుడు?
– బీఎన్ శాస్త్రి
ఏ తీరుగ నను దయచూసెదవో ఇన వంశోత్తమ రామా అన్న తెలంగాణ వాగ్గేయ కారుడు?
– భక్త రామదాసు
పేరిణి శివ తాండవ నృత్యాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చిన తెలంగాణ నృత్యకారుడు?
– నటరాజ రామకృష్ణ
నిజాం కాలంలో టంకశాలగా పేరొందిన వజీరాబాద్‌ను ప్రస్తుతం ఏమని వ్యవహరిస్తున్నారు?
– వాడపల్లి
ముల్కీ నిబంధనల అమలు గురించి ఐదు సూత్రాల పథకాన్ని తీసుకొచ్చిన ప్రధాని?
– ఇందిరాగాంధీ
విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి అందించిన మొదటి గ్రంథం?
– గాడిచర్ల హరిసర్వోత్తమరావు రాసిన అబ్రహం లింకన్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని అణచివేయాలని ప్రయత్నించిన మునగాల జమీందార్ ఎవరు?
– రాజా నాయని వెంకటరంగారావు బహద్దూర్
తెలంగాణలో తొలి రైతు కావ్యం?
– గంగుల శాయిరెడ్డి రాసిన కాపుబిడ్డ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భౌగోళికంగా చూస్తే తెలంగాణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకంటే పెద్దది
1. తెలంగాణ- 11,48,000 చ.కి.మీ.
2. కోస్తాంధ్ర- 9,28,000 చ.కి.మీ.
పాత తరం జర్మలిస్టు ధర్మవరపు సీతారాం స్వస్థలం? ఆయన ఏయే సంస్థలో పనిచేశారు?
– నల్లగొండ జిల్లా హుజూర్నగర్ సమీపంలోని లక్కవరం. ఆయన UNI Statesmen వార్త సంస్థలో, Economic Times, పేట్రియాట్, లింక్ పత్రికల్లో పనిచేశారు.
మునగాల రాజా నాయని వెంకట రంగారావుకు కళా ప్రపూర్ణ బిరుదు ఇచ్చిందెవరు?
– ఆంధ్ర విశ్వవిద్యాలయం (1953లో)
మన తెలంగాణము పేరుతో వ్యాసాలను సంకలనం చేసిందెవరు? ఎప్పుడు?
– వట్టికోట ఆళ్వారు స్వామి, 1956లో
హైదరాబాద్ రాష్ట్ర మంత్రివర్గంలో మొదటి డిప్యూటీ స్పీకర్?
– శ్రీపంపన గౌడ
హైదరాబాద్ రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి?
– బూర్గుల రామకృష్ణారావు
1997లో జై తెలంగాణ పార్టీని స్థాపించింది ఎవరు?
– ఇంద్రారెడ్డి
6 సూత్రాల పథకం ఏర్పాటు
– 1973, సెప్టెంబర్ 21
హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌ను నిజాం ప్రభుత్వం ఎప్పుడు నిషేధించింది?
– 1938, సెప్టెంబర్ 8న
హైదరాబాద్ చరిత్రలో నగర కొత్వాల్ (పోలీస్ కమిషనర్)గా పనిచేసిన మొదటి హిందువు?
– వెంకట్రామిరెడ్డి
విప్లవ రచయితల సంఘం (విరసం) ఎప్పుడు ఏర్పడింది?
– 1970, జూలై 4
తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు?
– దొడ్డి కొమరయ్య, 1946, జూలై 4న కడివెండిలో
కరీంనగర్ జిల్లాలో పశ్చిమ కనుమలకు ఏమని పేరు?
– రాఖీ గుట్టలు
తెలంగాణ రాష్ట్ర పుష్పమైన తంగేడు శాస్త్రీయనామం?
– ట్రెనర్స్ కాషియా
ప్రాణహిత నది గోదావరిలో ఎక్కడ కలుస్తుంది?
– చెన్నూరు వద్ద
తెలంగాణలో పటం సంప్రదాయ కళారూపాలు ప్రదర్శించేవారు?
– కాటిపడగలు, గౌడజెట్టి, ఏనూటి, గుర్రపు, అద్దపు, కొర్రాజుల, కూనపులి, మాసయ్యలు, పాండువలోల్లు, తెరచీరలు, పూజారి మొదలైనవారు.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు?
– కాసోజు శ్రీకాంతాచారి (పొడిచేడు గ్రామం), 2009, డిసెంబర్ 3
మునగాల ప్రాంతాన్ని సీమాంధ్రలో కలపాలన్నది ఎవరు?
– నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి
బర్మా దేశంలో బౌద్ధం వ్యాపించడానికి కారణమైన పాలకులు?
-శాలంకాయనులు
దగాపడ్డ తెలంగాణ అని ఎక్కడ జరిగిన సభకు పేరుపెట్టారు?
– భువనగిరి
తెలంగాణ శాసనమండలిలో నామినేటెడ్ సభ్యుల సంఖ్య?
– ఐదు
మొదటి రాష్ట్రపతి డా. బాబూ రాజేంద్రప్రసాద్ చేతులమీదుగా ఉత్తమ సంగీత దర్శకునిగా అవార్డు అందుకున్న తెలంగాణకు చెందిన వ్యక్తి?
– ఎంవీ రాజు (హుజూర్నగర్, నల్లగొండ జిల్లా)
భారతదేశంలోని ప్రసిద్ధ కట్టడాల్లో మక్కా మసీద్ ఒకటి అన్న ఫ్రెంచి యాత్రికుడు?
– ట్రావెర్నియర్
భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞ రాసింది ఎవరు?
– నల్లగొండ జిల్లా అన్నెపర్తికి చెందిన పైడిమర్రి వెంకట సుబ్బారావు
మలి దశ ఉద్యమకాలంలో కేసీఆర్ ఎక్కడ పాదయాత్ర చేశారు?
– కోదాడ నుంచి హాలియా వరకు (నల్లగొండ జిల్లా)
-వరంగల్ జిల్లాలో జనగాం సమీపంలోని ఎర్రిగొల్లిపాడుకు చెందిన పులి రామక్క రజాకార్లను నరికి చంపింది. ఈ సంఘటన చరిత్రలో మరువలేనిది.
భారతదేశపు బుడాపెస్ట్ అని ఏ నగరాన్ని అంటారు?
– హైదరాబాద్
ఫలక్‌నుమా ప్యాలెస్‌ను ఎవరు నిర్మించారు?
– నవాబ్ సర్ విఖారుల్ ఉలమా
పురానాపూల్‌ను పారిస్‌లోని ఫోర్ట్ న్యూఫ్తో పోల్చిన ఫ్రెంచి యాత్రికుడు ఎవరు?
– ట్రావెర్నియర్ (1645లో)
పురానాపూల్‌కు మరోపేరు?
– బ్రిడ్జ్ ఆఫ్ లవ్
హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలను కలిపే చెరువుకట్టను ఏమంటారు?
– హుస్సేన్‌సాగర్ ఆనకట్ట (ట్యాంక్‌బండ్)
హైదరాబాద్‌లో గోషామహల్‌ను ఎవరు, ఎందుకు నిర్మించారు?
– అంతఃపుర స్త్రీల సరససల్లాపాల కోసం అబుల్ హసన్ తానీషా నిర్మించాడు
పెద్దమనుషుల ఒప్పందంలో (1956 ఫిబ్రవరి 20న) ఉన్న ఉపముఖ్యమంత్రి పదవి ఆరో వేలుతో సమానం అన్నది?
– నీలం సంజీవరెడ్డి
610 జీవోను ఏ కమిటీల సిఫారసు ఆధారంగా ఎన్టీ రామారావు 1985, డిసెంబర్ 30న ప్రవేశపెట్టారు?
– జై భారత్‌రెడ్డి, సుందరేశన్ కమిటీలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని నాటి కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం పార్లమెంటులో ఎప్పుడు ప్రకటించారు?
– 2013, ఆగస్టు 5న
50 సంవత్సరాల హైదరాబాద్ రచయిత ఎవరు?
– ముందుముల నరసింగరావు
50 సంవత్సరాల జ్ఞాపకాలు రచయిత?
– దేవులపల్లి రామానుజరావు
బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర రాసిందెవరు?
– ఉమ్మెత్తల కేశవరావు
తెలంగాణ పోరాట స్మృతులు రచయిత?
– ఆరుట్ల రామచంద్రారెడ్డి
పులిజాల రంగారావు జీవిత చరిత్ర రచయిత ఎవరు?
– బీఎన్ శాస్త్రి
తెలంగాణ సాయుధ పోరాటం- నా అనుభవాలు రాసిందెవరు?
– నల్లా నర్శింహులు
తెలంగాణ ఉద్యమానికి తొలి వేదిక?
– ఖమ్మం జిల్లా పాల్వంచ
2002, ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్రసమితి ప్రథమ వార్షికోత్సవ సభ ఎక్కడ జరిగింది?
– నల్లగొండ
2011, జూలై 21న పార్లమెంటు ముందు ఆత్మహత్య చేసుకున్నది ఎవరు?
– యాదిరెడ్డి
తెలంగాణకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ చంచల్ గూడ జైల్లో ఎప్పుడు దీక్ష చేశారు?
– 2013, ఆగస్టు 25న
షేర్వానీ ధరించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టిన నిజాం?
– మీర్ ఉస్మాన్ అలీఖాన్ (ఆరో నిజాం)
ముల్కీ ఉద్యమ నేపథ్యంలో కుమార్ లలిత్ కమిటీని నియమించిన ముఖ్యమంత్రి?
– కాసు బ్రహ్మానందరెడ్డి
ఇటీవల 8 గంటలపాటు 18 దేవాలయాల్లో భక్తి గీతాలు పాడిన తెలంగాణ గాయకుడు?
– భళ్లిమూడి రాంప్రసాద్ శర్మ
2012లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత?
– పెద్దిబొట్ల సుబ్బరామయ్య
మేడార జాతర గ్రామం (సమ్మక్క సారక్క) వరంగల్ జిల్లా కేంద్రానికి ఎంత దూరంలో ఉంది?
– 110 కి.మీ. (తాడ్వాయి మండలం)
వీ6 న్యూస్ చానల్లో ప్రసారమవుతున్న తీన్మార్ కార్యక్రమంలో వచ్చే బిత్తిరి సత్తి అసలు పేరు?
– చేవెళ్ల రవి
ఇటీవల దాశరథి పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు?
– తిరుమల శ్రీనివాసాచార్య
తెలంగాణ చరిత్రను తెలిపే వెయ్యేండ్ల వీణవంక రాసింది ఎవరు?
– ఆవాల బుచ్చిరెడ్డి
తెలంగాణ భాషలో కైకిలి అంటే?
– కూలి
చారిత్రక అజంజాహి మిల్లు ఏ నగరంలో ఉంది?
– వరంగల్
మెదక్ జిల్లా పిత ఎవరు?
– జాకన్నగారి రాంరెడ్డి
భారతదేశంలో ఉన్న ఏకైక స్పాంజ్ ఐరన్ ఉక్కు కర్మాగారం తెలంగాణలో ఎక్కడ ఉంది?
– ఖమ్మం జిల్లా పాల్వంచ
తెలంగాణలో గ్రామీణ జనాభా ఎక్కువగా లేని జిల్లా ఏది?
– హైదరాబాద్
ప్రపంచంలోకెల్లా ఎత్తయిన ఏకశిలా బుద్ధ విగ్రహాన్ని హుస్సేన్ సాగర్‌లో ఏ శిలపై ప్రతిష్టించారు?
– జీబ్రాల్టర్ శిల
వజీర్ సుల్తాన్ కంపెనీని హైదరాబాద్‌లోని అజామాబాద్‌లో ఎప్పుడు నెలకొల్పారు?
– 1930లో
ఢిల్లీకి హైదరాబాద్‌కు మధ్య దూరం?
– 1680 కి.మీ.
తెలంగాణ సాయుధ పోరాటాన్ని మా భూమిగా సినిమా తీసిన దర్శకుడు?
– బీ నర్సింగరావు (1979) మెదక్ జిల్లాకు చెందిన ఆయన ఈ సినిమాకు గాను ఉత్తమ స్క్రీన్‌ప్లేకి నందీ అవార్డ్ అందుకున్నారు.
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత పైడి జయరాజ్ (హిందీ) ఏ జిల్లాకు చెందినవారు?
– కరీంనగర్
1975లో బాపు దర్శకత్వంలో వచ్చిన ముత్యాల ముగ్గు హీరోయిన్?
– సంగీత (హన్మకొండకు చెందినవారు)
తొలి తెలుగు సినీ కవి?
– చందాల కేశవదాసు (భక్త ప్రహ్లాద- 1931). ఆయన ఖమ్మం జిల్లా జక్కెపల్లికి చెందిన వారు.
మషీర్-ఏ-దక్కన్ పత్రికను నడిపించిందెవరు?
– మాడపాటి హన్మంతరావు
తెలంగాణలో తొలి తెలుగు దినపత్రిక?
– తెలంగాణ (1941-42), దీన్ని బుక్కపట్నం రామానుజాచార్యులు నిర్వహించారు.
తెలంగాణ జర్నలిజానికి పూజనీయుడనదగినవాడు?
– షోయబుల్లాఖాన్
వందేమాతరం గీతాన్ని ఆలపించిన రామచంద్రరావు ఇంటిపేరు?
– వావిలాల
ఆర్యసమాజానికి పోటీగా నిజాం స్థాపించిన పోటీ సంస్థలు ఏవి?
– దీన్దార్, తబ్లిక్, ఇత్తేహాదుల్ ముసల్మీన్
ఏడో నిజాంపై బాంబు విసిరింది ఎవరు?
– నారాయణరావు పవార్ (20 ఏండ్ల వయస్సులో), 1947, డిసెంబర్ 4న
హైదరాబాద్ సుల్తాన్ బజార్లో ఆర్యసమాజంను ఎప్పుడు స్థాపించారు?
– 1892లో
తెలంగాణ సాయుధపోరాట తొలి విప్లవ విజయం?
– చాకలి ఐలమ్మ పోరాటం (1945)
దేవరకొండ గాంధీ అంటే ఎవరు?
– మునగాల కొండలరావు
కోదాడ గాంధీ అని ఎవరిని అంటారు?
– గుడుగుంట్ల అప్పయ్య
తెలంగాణ సరిహద్దు గాంధీ ఎవరు?
– సర్దార్ జమలాపురం కేశవరావు
దిగంబర కవి నిఖిలేశ్వర్ అసలుపేరు?
– యాదవరెడ్డి
ప్రజానాట్య మండలిని ఎప్పుడు ప్రారంభించారు?
– 1943లో
గజల్ ప్రక్రియను తెలుగులో ప్రారంభించింది?
– డా. సి.నారాయణ రెడ్డి
తొలి తెలుగు శతావధానం 1285లో కాకతీయుల ఆస్థానంలో జరిగింది. మల్లినాధుడు (సిద్ధాంత గ్రంథం)
– రాళ్లబండి కవితా ప్రసాద్
తెలంగాణ ప్రథమ శతావధాని?
– శ్రీమాన్ శిరిశినగల్ కృష్ణమాచార్యులు
చండూరు సాహితీ మేఖలను స్థాపించింది ఎవరు?
– 1934లో నల్లగొండ జిల్లా చండూరులో అంబడిపూడి వెంకటరత్నం
తెలంగాణ నాటక సంప్రదాయ కళారూపాలు ఏవి?
– దాసరి బాగోతం, వీధి నాటకం, చెంచునాటకం, గంటి బాగోతం, గొండి బాగోతం
తెలంగాణ ఇంద్రజాల సంప్రదాయ కళా రూపాలు?
– కాటిపాపలు, యక్షిణి, పెద్దమ్మలు
రైతాంగ సాయుధ పోరాటం ఎప్పుడు ముగిసింది?
– 1951, అక్టోబర్ 21న
మా భూమి నాటకాన్ని రాసిందెవరు?
– 1947లో సుంకర సత్యనారాయణ
శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపన సభకు అధ్యక్షులు?
– పాల్వంచ జమీందారు పార్థసారధి అప్పారావు (1901, సెప్టెంబర్ 1)
శేషాద్రి రమణ కవులు ఎవరు?
– దూపాటి వెంకట రమణాచార్యులు, దూపాటి శేషాచార్యులు
1918లో సూర్యాపేటలో ఆంధ్ర విజ్ఞాన ప్రకాశినీ గ్రంథాలయాన్ని స్థాపించింది ఎవరు?
– పువ్వాడ వెంకటప్పయ్య
తెలంగాణలో మొదటి సాంఘిక నాటకం ఏది? రాసింది ఎవరు?
– కనక దాసు, చందాల కేశవదాసు
హైదరాబాద్ సంస్థానంలో ఉర్దూ మాట్లాడేవారి సంఖ్య?
– 12 శాతం
కాళోజీ సోదరులు అంటే ఎవరు?
– కాళోజీ రామేశ్వరరావు (ఉర్దూ), కాళోజీ నారాయణ రావు (తెలుగు)
తొలి తెలుగు కథకురాలు ఎవరు?
– బండారు అచ్చమాంబ
కలం అలలపై తేలేను మనసు మల్లెపూవై అనే సినిమా పాటను రాసిన తెలంగాణ కవి?
– డా. సి.నారాయాణ రెడ్డి (గులే భకావళి కథ)
శ్రీకృష్ణ కమిటీ నివేదిక వెల్లడైన రోజు?
– 2011, జనవరి 6న
రాష్ట్రంలో కల్యాణ లక్ష్మి పథకంను ఎప్పుడు ప్రవేశపెట్టారు?
– 2014, నవంబర్ 6న (ఎస్సీ, ఎస్టీల కోసం)
కోటిలింగాల బౌద్ధ ఆరాధనా స్థలమని తెలిపే జాతక కథ ఏది?
– శెరవనిజ (శ్రీవనిజ)
గౌతమ బుద్ధుడు చేర్చుకున్న (బౌద్ధ సంఘంలో) రాజ నర్తకి ఎవరు?
– ఆమ్రపాలి
దాశరథి కృష్నమాచార్య రాసిన జాతక కథల పద్యకావ్యం పేరు?
– మహాబోధి (1960)
బావరి (నిజామాబాద్ జిల్లా) శిష్యులు బుద్ధునితో సంభాషించిన పాళీ భాషలోని గ్రంథాలు
1. సుత్తనిపాత 2. పారాయణ వగ్గ
తెలుగు భాషలో తొలిసారిగా బౌద్ధంతో పరిచయం కలిగించిన గ్రంథం?
– పాల్కురికి సోమన రాసిన పండితారాధ్య చరిత్ర
బుద్ధుని జ్ఞాన సిద్ధాంతానికి పునాది ఏది?
– ప్రతీత్య సముత్పాద సిద్ధాంతం
తెలంగాణలో బౌద్ధమత వ్యాప్తికి కారణమైన తత్వవేత్తలు?
– ఆచార్య నాగార్జునుడు. ఆర్య దేవుడు, బుద్ధఘోషుడు, బుద్ధ పాలితుడు, వసు బంధుడు, అసంగుడు, ధర్మకీర్తి
తెలంగాణలో ఇక్షాకుల తర్వాత బౌద్ధాన్ని ఆదరించిన రాజులు?
– విష్ణు కుండినులు
నాగార్జునకొండలో నివసించిన బౌద్ధ శాఖ ఏది?
– మహా సాంఘిక శాఖ
డా. సి.నారాయణ రెడ్డి రాసిన పద్యకావ్యం (బౌద్ధం) ఏది?
– నాగార్జున సాగరం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు