హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారు?
గ్రూప్ – 4 స్పెషల్
1. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన హైదరాబాద్ దివాన్ ఎవరు?
A. మొదటి సాలార్జంగ్
B. మూడవ సాలార్జంగ్
C. మహమ్మద్ అలీ
D. దివాన్ అక్బర్ హైదర్
2. మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన వారు?
A. అంబేద్కర్, సరోజినీ నాయుడు
B. అంబేద్కర్, మహాత్మా గాంధీ
C. అంబేద్కర్, మహ్మద్ అలీ జిన్నా
D. B&C
3. ‘చిత్తు రాజ్యాంగ’ నిర్మాత ఎవరు?
A. B. N. రావు
B. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
C. గోపాలస్వామి అయ్యర్
D. A&B
4. ఏ చట్టాన్ని భారత రాజ్యాంగానికి నకలుగా అభివర్ణిస్తారు?
A. 1947 భారత ప్రభుత్వ చట్టం
B. 1773 రెగ్యులేటింగ్ చట్టం
C. 1784 పిట్ ఇండియా చట్టం
D. 1935 భారత ప్రభుత్వ చట్టం
5. ఏ చట్టాన్ని భారతదేశంలో కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడానికి చేయబడినదిగా మార్క్స్, ఎంగిల్స్ అభివర్ణించారు?
A. 1773 రెగ్యులేటింగ్ చట్టం
B. 1793 చార్టర్ చట్టం
C. 1861 కౌన్సిల్ చట్టం
D. 1784 పిట్ ఇండియా చట్టం
6. ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ను భారత గవర్నర్ జనరల్ గా మార్చారు?
A. 1813 చార్టర్ చట్టం
B. 1833 చార్టర్ చట్టం
C. 1861 కౌన్సిల్ చట్టం
D. 1853 చార్టర్ చట్టం
7. ఏ చట్టాన్ని భారతదేశంలో కేంద్రీకృత పాలనకు తుదిమెట్టుగా అభివర్ణిస్తారు?
A. 1833 చార్టర్ చట్టం
B.1853 చార్టర్ చట్టం
C. 1813 చార్టర్ చట్టం
D. A&B
8. రాజ్యాంగ పరిషత్‌కు ప్రాతినిధ్యం వహించిన ముస్లిం మహిళ ?
A. బేగం అజీజ్ రసూల్
B. షాజహాన్ బేగం C. నహీం భాను
D. A&B
9. రాజ్యాంగ పరిషత్ కు ఆంధ్ర ప్రాంతం నుంచి ఎన్నికైన మహిళ ఎవరు ?
A. సంగం లక్ష్మీబాయి
B. దుర్గాబాయి దేశ్‌ముఖ్
C. ఆరుట్ల కమలాదేవి D. A&B
10. ఈ క్రింది వారిలో రాజ్యాంగ పరిషత్ కు ఆంధ్ర ప్రాంతం నుంచి ఎన్నికైన వారు ఎవరు?
A. టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవరెడ్డి
B. నీలం సంజీవరెడ్డి ,గౌతు లచ్చన్న
C. నీలం సంజీవరెడ్డి, మర్రి చెన్నారెడ్డి
D. A&D
11. రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యులలో న్యాయవిద్యను అభ్యసించిన ఒకే ఒక సభ్యుడు?
A. సయ్యద్ మహమ్మద్ సదుల్లా
B. ఎన్ గోపాలస్వామి
C. అల్లాడి కృష్ణస్వామి
D. టి.టి. కృష్ణమాచారి
12. 1949 నవంబర్ 26న తక్షణం అమల్లోకి వచ్చిన అంశాలు?
A. పౌరసత్వం, ప్రమాణ స్వీకారాలు
B. రాష్ట్రపతి ఎన్నిక, తాత్కాలిక పార్లమెంటు
C. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక
D. A&B&C
13. ఉమ్మడి జాబితా అనే అంశాన్ని ఏ
దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
A. అమెరికా B. బ్రిటన్
C. ఆస్ట్రేలియా D. కెనడా
14. రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని వ్యాఖ్యానించింది ఎవరు?
A. మహావీర్ త్యాగి
B. డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్
C. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
D. సయ్యద్ సదుల్లా
15. వ్యక్తి స్వేచ్ఛకు గోడ లాంటిదని పిలవబడే రిట్ ఏది?
A. మాండమస్ B. కోవారెంటో
C. ప్రొహిబిషన్ D. హెబిఎస్ కార్పస్
16. కింది వానిలో ఏ ఆర్టికల్ పత్రికా స్వేచ్ఛను
పరిరక్షిస్తుంది?
A. ఆర్టికల్ 16 B. ఆర్టికల్ 22
C. ఆర్టికల్ 19 D. పైవేవీ కావు
17. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ను సుప్రీంకోర్టుకు తనకు ఇచ్చిన తీర్పును లేదా ఉత్తర్వును సమీక్షించు అంగీకారం ఇస్తుంది?
A. ఆర్టికల్ 137 B. ఆర్టికల్ 130
C. ఆర్థిక 138 D. ఆర్టికల్ 139
18. పార్లమెంటు సభ్యుడు కాకున్నా ఏ అధికారి పార్లమెంట్ ప్రోసిడింగ్ నందు పాల్గొనే హక్కు కలిగి ఉంటాడు?
A. ఉపరాష్ట్రపతి
B. ఎన్నికల కమిషనర్
C. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా
D. కంట్రోల్ ఆఫ్ ఆడిటర్ జనరల్
19. నూతన రాష్ర్టాల ఏర్పాటుకు, ప్రస్తుత రాష్ర్టాల సరిహద్దుల మార్పు ఎవరిచే జరుగుతుంది?
A. భారత రాష్ట్రపతి
B. రాష్ట్రం స్వయంగానే
C. రాష్ట్ర శాసనసభ్యులలో సగం కంటే తక్కువ కాకుండా సమ్మతి పొందిన తర్వాత పార్లమెంట్ చే గుర్తింపు పొందుట.
D. పార్లమెంట్ చట్టం ప్రకారం
20. ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందుటకు ఆ పార్టీ కనీసం ఎన్ని రాష్ర్టాల్లో గుర్తింపు కలిగి ఉండాలి?
A. మూడు రాష్ర్టాలలో
B. ఐదు రాష్ర్టాలలో
C. నాలుగు రాష్ర్టాలలో
D. ఆరు రాష్ర్టాలలో
21. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ హిందీ భాషను అధికార భాషగా ప్రకటించినది?
A. 343 ఆర్టికల్ B.344 ఆర్టికల్
C. 345 ఆర్టికల్ D. 346 ఆర్టికల్
22. ఏ రాజ్యాంగ సవరణ కింద గవర్నర్ ని ఒకటి లేదా ఒకటి కన్న ఎక్కువ రాష్ర్టాలకు నియమించవచ్చు?
A. ఎనిమిదవ రాజ్యాంగ సవరణ
B. ఆరవ రాజ్యాంగ సవరణ
C. ఏడవ రాజ్యాంగ సవరణ
D. ఐదవ రాజ్యాంగ సవరణ
23. 21వ రాజ్యాంగ సవరణ చట్టం 1967 ద్వారా భారత రాజ్యాంగంలో ఎనిమిదో షెడ్యూల్లో చేర్చబడిన భాష ఏది?
A. సింధి భాష B. నేపాలి భాష
C. మణిపురి భాష D. కొంకని భాష
24. జంతు హింస నిషేధం రాజ్యాంగంలో ఏ అధికారాల జాబితాలో ఉంది?
A. ఉమ్మడి జాబితా
B. రాష్ట్ర జాబితా
C. అవశేషాధికారాలు
D. కేంద్ర జాబితా
25. కేంద్ర మంత్రిమండలిలో ఎన్ని రకాల మంత్రులు ఉన్నారు?
A. 5 B. 3 C. 4 D. 2
26. భారత రాజ్యాంగంలో కొంకణి భాష ఏ సంవత్సరంలో చేర్చబడింది?
A. 1992 B. 2001
C. 1990 D. 2003
27. సభ్యుడు కాకున్నా పార్లమెంట్ కార్యక్రమాల్లో పాల్గొనేవారు?
A. అడ్వకేట్ జనరల్
B. ఉపరాష్ట్రపతి
C. ప్రధాన న్యాయమూర్తి
D. అటార్నీ జనరల్
28. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు ఉచిత న్యాయ సహాయాన్ని గూర్చి వివరిస్తుంది?
A. 14 ఆర్టికల్
B. 38A ఆర్టికల్
C. 39A ఆర్టికల్ D. 39C ఆర్టికల్
29. ప్రభుత్వమే పార్లమెంటు ఎన్నికలకు నిధులు సమకూర్చాలని సిఫారసు చేసింది?
A. వెంకట చెల్లయ్య కమిషన్
B. దినేష్ గోస్వామి కమిటీ
C. ప్రధాన ఎన్నికల కమిషన్
D. A&B
30. రాజ్యాంగం లోని పదో షెడ్యూల్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడింది?
A. 51 వ రాజ్యాంగ సవరణ
B. 53 వ రాజ్యాంగ సవరణ
C. 52వ రాజ్యాంగ సవరణ
D. 42వ రాజ్యాంగ సవరణ
31. ఏ రాజ్యాంగ సవరణను రెండవ మినీ రాజ్యాంగ సవరణ అని అంటారు?
A. 40 వ రాజ్యాంగ సవరణ
B. 42వ రాజ్యాంగ సవరణ
C. 41 వ రాజ్యాంగ సవరణ
D. 44వ రాజ్యాంగ సవరణ
32. హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారు?
A.భారత రాష్ట్రపతి
B. భారత సుప్రీంకోర్టు
C. భారత పార్లమెంటు
D. భారత అటార్నీ జనరల్
33. పార్లమెంటులో జీరో అవర్ మొదలయ్యే సమయం?
A. 11 గంటలకు
B. మధ్యాహ్నం ఒకటి గంటలకు
C. మధ్యాహ్నం మూడు గంటలకు
D. మధ్యాహ్నం 12 గంటలకు
34. ఆర్టికల్ 370 సమయంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర గవర్నర్ ఎవరు?
A. బండారు దత్తాత్రేయ
B. సత్యపాల్ మాలిక్
C. తమిళి సై
D. సీహెచ్ విద్యాసాగర్
35. జమ్మూకాశ్మీర్ రాజ్యాంగం లోని భాగాలు,షెడ్యూళ్ల్ల సంఖ్య?
A. 13 భాగాలు, ఏడు షెడ్యూళ్లు
B. 14 భాగాలు, ఏడు షెడ్యూళ్లు
C. 12 భాగాలు, ఏడు షెడ్యూళ్లు
D. 11 భాగాలు, ఏడు షెడ్యూళ్లు
36. తక్కువ కాలం ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారిగా పని చేసినవారు?
A. సుందరం B. రమాదేవి
C. టీఎన్ శేషన్ D. నాగేంద్ర సింగ్
37. ఓటర్ ఐడెంటిటీ కార్డును ప్రవేశపెట్టిన ఎన్నికల ప్రధాన అధికారి?
A. నాగేంద్ర సింగ్ B. వీ ఎస్ రమాదేవి
C. టీఎన్ శేషన్ D. కె. వి. కే సుందరం
38. భారత పార్లమెంట్ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకున్న తొలి రాష్ట్రపతి?
A. జ్ఞాని జైల్ సింగ్
B. ఏపీజే అబ్దుల్ కలాం
C. వి. వి. గిరి
D. కే ఆర్ నారాయణన్
39. 1971లో లోకాయుక్త వ్యవస్థను నెలకొల్పిన మొదటి రాష్ట్రం?
A. తమిళనాడు B. ఆంధ్రప్రదేశ్
C. ఒడిశా D. ఉత్తరప్రదేశ్
40. ఏ సాధారణ ఎన్నికల్లో మొట్టమొదట కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినది?
A. మూడవ సాధారణ ఎన్నికలు
B. ఎనిమిదవ సాధారణ ఎన్నికలు
C. పదవ సాధారణ ఎన్నికలు
D. ఆరవ సాధారణ ఎన్నికలు
41. దేశంలో సామ్యవాద తరహా సమాజాన్ని ఏర్పాటు చేడానికి నిర్దేశింపబడిన రాజ్యాంగంలోని అంశము/ భాగము?
A. మూడో భాగం B. రెండవ భాగం
C. నాలుగో భాగం D. ఐదో భాగం
42. మొట్టమొదటిసారిగా రాష్ర్టాల స్వయం
ప్రతిపత్తిని / స్వయం పాలన డిమాండ్ చేసిన ప్రాంతీయ పార్టీ?
A. తెలుగుదేశం పార్టీ
B. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ
C. డీఎంకే పార్టీ
D. అకాలీ దళ్ పార్టీ
43. కేంద్ర విద్యా సంస్థలలో ఇతర వెనుకబడిన తరగతులకు 27% సీట్లను, రిజర్వేషన్లు
కల్పించడానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ చట్టం?
A. 90వ రాజ్యాంగ సవరణ
B. 89వ రాజ్యాంగ సవరణ
C. 93వ రాజ్యాంగ సవరణ
D. 92వ రాజ్యాంగ సవరణ
44. కింది వారిలో భారత ప్రధానమంత్రుల అధికార క్రమానుగత శ్రేణి ఏది?
A. ఇందిరాగాంధీ B. రాజీవ్ గాంధీ
C. చరణ్ సింగ్ D. మొరార్జీ దేశాయ్
E. చంద్రశేఖర్ F. గుల్జారిలాల్ నంద
A. F, A, D, C, B, E
B. F, D, B, E, A, C
C. F, B,D,E, C, A
D. D, A, B,C, F, E
45. కింది రాజ్యాంగ పరిహారాల్లో దేనికి అక్షరాల ఆజ్ఞ అని అర్థం?
A. ప్రొహిబిషన్ B. కోవారెంట్
C. మాండమస్ D. A&B
46. కింది వానిలో ఏ రాష్ట్ర హైకోర్టు బంద్‌లు చట్ట వ్యతిరేకమని, రాజ్యాంగ వ్యతిరేకమని తీర్పునిచ్చింది?
A. పశ్చిమ బెంగాల్ హైకోర్టు
B. తమిళనాడు హైకోర్టు
C. కేరళ హైకోర్టు
D. కర్ణాటక హైకోర్టు
47. కింది వానిలో ద్వి శాసనసభలు ఏ రాష్ట్రంలో లేవు?
A. బీహార్ B. రాజస్థాన్
C. మహారాష్ట్ర D. ఉత్తర ప్రదేశ్
48. ఆర్టికల్ 21 లో జీవించే హక్కును విస్తరించి స్వచ్ఛమైన వాతావరణంలో నివసించే హక్కు గా దేని కారణంగా చేయబడింది ?
A. కేరళలోని గ్రామీణ కోర్టు దావాలు
B. ఏసియాడ్ కేసు
C. భోపాల్ కేసు
D. మేనకా గాంధీ
49. ఆర్థిక బిల్లు ఎవరి అనుమతి లేనిదే రాష్ట్ర శాసనసభలో ప్రవేశ పెట్టడానికి వీలు లేదు?
A. భారత రాష్ట్రపతి
B. రాష్ట్ర గవర్నర్
C. రాష్ట్ర ఆర్థిక మంత్రి
D.A&C
50. గవర్నర్ పదవి ఖాళీ అయితే తాత్కాలిక గవర్నర్‌గా వ్యవహరించేదెవరు ?
A. రాష్ట్రపతి
B. ప్రధానమంత్రి
C. రాష్ట్ర ముఖ్యమంత్రి
D. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
నరేష్ జాటోత్. లెక్చరర్ సిద్ధార్థ డిగ్రీ పిజి కళాశాల నల్లగొండ. 8247887267
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు