మైనింగ్, ఏఐ-ఎంఎల్ల్లో యూజీ, పీజీ కోర్సులు
ఓయూ ఇంజినీరింగ్ కళాశాలలో మైనింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లర్నింగ్ (ఏఐ అండ్ ఎంఎల్) విభాగాల్లో ఇటీవలే ప్రవేశపెట్టిన యూజీ, పీజీ కోర్సులకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అనుమతి లభించింది. ఈ మేరకు ఏఐసీటీఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఆరు డిగ్రీ కోర్సులు, 18 పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సుల అనుమతుల పొడిగింపునకు ఆమోదముద్ర వేసింది. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ మాట్లాడుతూ ఈ గుర్తింపులో అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థుల పాత్ర కీలకమన్నారు వారందరకీ కృతజ్ఞతలు తెలిపారు. ఈసీఈ విభాగంలో యూజీ కోర్సులో విద్యార్థుల సంఖ్యను 50 నుంచి 60కి పెంచుకొనేందుకు అనుమతి లభించిందన్నారు. అదేవిధంగా, గేట్ అర్హత ఉన్న విద్యార్థులకు ఏఐసీటీఈ స్కాలర్షిప్ వచ్చేందుకు మార్గం సుగమమైందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు