రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలు .. వాటి వివరాలు
రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఆయా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ తేదీలతోపాటు కొన్ని ఎంట్రన్స్ నోటిఫికేషన్స్ కూడా విడుదలయ్యాయి. పదోతరగతి నుంచి డిగ్రీ పూర్తి చేస్తున్నవారి వరకు ఏదో ఒక ఎంట్రన్స్ రాస్తుంటారు. వారందరి కోసం ఆయా సెట్లకు సంబంధించి సంక్షిప్త సమాచారం..
టీఎస్ పాలిసెట్
- పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్)-2022
- అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత. సప్లమెంటరీ పరీక్ష/ కంపార్ట్మెంట్లో ఉత్తీర్ణులైన వారు, 2022లో పదోతరగతి పరీక్ష రాయనున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- ప్రవేశాలు కల్పించే కోర్సులు: డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, పీజీటీఎస్ఏయూ, ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూ, పీవీఎన్ఆర్టీవీయూ అందించే పలు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: జూన్ 4
- పరీక్ష తేదీ: జూన్ 30
- వెబ్సైట్: https://www.sbtet.telangana.gov.in
టీఎస్ ఎంసెట్
- రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్‌ను జేఎన్టీయూహెచ్ విడుదల చేసింది.
- టీఎస్ ఎంసెట్-2022
- అర్హతలు: ఇంటర్ (ఎంపీసీ/బైపీసీ) లేదా తత్సమాన కోర్సు
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: మే 28
- పరీక్ష తేదీలు: అగ్రికల్చర్, మెడిసిన్: జూలై 14, 15
- ఇంజినీరింగ్: జూలై 18, 19, 20
- వెబ్సైట్: https://eamcet.tsche.ac.in
టీఎస్ ఐసెట్
- తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐసెట్) నోటిఫికేషన్ విడుదలైంది.
- టీఎస్ ఐసెట్-2022
- అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణత. ఎంసీఏ చేయాలనుకుంటే ఇంటర్లో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
- వయస్సు 19 ఏండ్లు నిండి ఉండాలి.
- ప్రవేశాలు కల్పించే కోర్సులు: ఎంసీఏ, ఎంబీఏ
- దరఖాస్తు: ఆన్లైన్లో.. చివరితేదీ: జూన్ 27
- పరీక్ష తేదీ: జూలై 27
- వెబ్సైట్: https://icet.tsche.ac.in
టీఎస్ పీజీఈసెట్
- రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఇంజినీరింగ్ పీజీ చేయడానికి నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ ప్రకటన విడుదలైంది.
- ప్రవేశాలు కల్పించే కోర్సులు: ఎంటెక్, ఎంఈ, ఎంఫార్మసీ, ఎంఆర్క్ తదితరాలు
- దరఖాస్తు: ఆన్లైన్లో
- పరీక్ష తేదీలు: జూలై 27 నుంచి ఆగస్టు 1 వరకు
- వెబ్సైట్: https://pgecet.tsche.ac.in
లాసెట్-2022
- ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లాసెట్, పీజీలాసెట్ ప్రకటన విడుదలైంది.
- తెలంగాణ స్టేట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్‌లాసెట్/టీఎస్ పీజీఎల్‌సెట్)-2022
- కోర్సులు: ఎల్ఎల్బీ (మూడేండ్లు/ఐదేండ్లు),ఎల్ఎల్ఎం (రెండేండ్లు)
- దరఖాస్తు: ఆన్లైన్లో.. చివరితేదీ: జూన్ 6
- పరీక్ష తేదీలు: జూలై 21, 22
- వెబ్సైట్: http://lawcet.tsche.ac.in
Previous article
ప్రకృతి సోయగాలు-భౌగోళిక విశేషాలు
Next article
గురిపెడితే.. గ్రూప్స్ ఈజీనే!
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు