టీచర్ కొలువుకు తొలి మెట్టు.. టెట్
టీచర్…ఉపాధ్యాయ కొలువు అంటే నోబుల్ ప్రొఫెషన్. ఈ పోస్టులో పొందినంత సంతృప్తి మరే వృత్తిలో లభించదని అంటారు పెద్దలు. విద్యార్థులను ఇంజినీర్లుగా, డాక్టర్లుగా, శాస్త్రవేత్తలుగా, నాయకుడిగా, బిజినెస్ మ్యాన్‌గా తయారుచేసి సమాజానికి అందించే అరుదైన అవకాశం కలిగిన వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఇలాంటి వృత్తిలో ప్రవేశించడానికి రకరకాల పరీక్షలు ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ఇంటర్/డిగ్రీ తర్వాత ఎంట్రన్స్ రాసి డీఈడీ/బీఈడీ చేయాలి. తర్వాత ఎలిజిబిలిటీ టెస్ట్‌లో అర్హత సాధించాలి. తర్వాత టీఆర్టీ/డీఎస్సీలో సాధించిన మార్కుల ఆధారంగా టెట్ స్కోర్ కలిపి ఉపాధ్యాయ పోస్టుకు ఎంపిక చేస్తారు. డీఈడీ/బీఈడీ చేసిన అభ్యర్థులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఒక అవకాశం. ప్రస్తుతం టెట్ ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు మీ కోసం..
ముఖ్య తేదీలు
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: ఏప్రిల్ 12
- ఫీజు చెల్లించడానికి చివరితేదీ: ఏప్రిల్ 11
- హాల్ టికెట్ డౌన్లోడింగ్: జూన్ 6 నుంచి
- పరీక్ష తేదీ: జూన్ 12
- పేపర్-I ఉదయం 9.30 నుంచి 12 వరకు
- పేపర్-II మధ్యాహ్నం 2.30 నుంచి 5 వరకు
- పరీక్ష ఫలితాల వెల్లడి: జూన్ 27
అర్హత మార్కులు..
జనరల్ – 60 శాతం, బీసీ-50 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ -40 శాతం మార్కులు సాధిస్తే టెట్‌లో క్వాలిఫై అయినట్లుగా పరిగణిస్తారు.
వ్యాలిడిటీ..
టెట్‌లో అర్హత సాధించిన వారికి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది.
టెట్ మార్కులకు వెయిటేజీ
టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్‌లో టెట్‌లో సాధించిన స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ ఇస్తారు.
పేపర్-II పరీక్ష విధానం
- మొత్తం 150 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు.
- పరీక్ష కాలవ్యవధి రెండున్నర గంటలు
- చైల్డ్ డెవలప్మెంట్ & పెడగాగి నుంచి 30 ప్రశ్నలు- 30 మార్కులు
- లాంగ్వేజ్-I నుంచి 30 ప్రశ్నలు-30 మార్కులు
- లాంగ్వేజ్-II నుంచి 30 ప్రశ్నలు -30 మార్కులు
- మ్యాథ్స్ అండ్ సైన్స్ టీచర్లకు అయితే మ్యాథ్స్, సైన్స్ నుంచి
- సోషల్ స్టడీస్ టీచర్లకు అయితే సోషల్ స్టడీస్ నుంచి
- ఇతర ఏ టీచర్ అయినా మ్యాథ్స్, సైన్స్/ సోషల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
- పైన పేర్కొన్న సబ్జెక్టుల నుంచి 60 ప్రశ్నలు- 60 మార్కులు
- నోట్: పేపర్-II మ్యాథ్స్& సైన్స్ సెక్టార్ వారికి మ్యాథ్స్ నుంచి 30 ప్రశ్నలు.
- వీటిలో 24 సబ్జెక్టు, 6 పెడగాగి ప్రశ్నలు ఇస్తారు. సైన్స్ నుంచి మొత్తం 30 ప్రశ్నలు.
- దీనిలో 24 సబ్జెక్టు నుంచి (ఫిజికల్ సైన్స్‌కు 12, బయాలజీ నుంచి 12), సైన్స్ పెడగాగి నుంచి 6 ప్రశ్నలు ఇస్తారు.
- సోషల్ స్టడీస్ సెక్టార్ నుంచి 48 మార్కులు కంటెంట్ (హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్), పెడగాగి నుంచి 12 మార్కులు ఇస్తారు.
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్
పిల్లల ఉచిత, నిర్బంధ విద్య (ఆర్టీఈ)-2009 చట్టంలో సబ్ సెక్షన్ (1) ఆఫ్ సెక్షన్ 23 ప్రకారం ప్రభుత్వ/ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేయాలంటే టెట్‌లో అర్హత తప్పనిసరి అని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) స్పష్టం చేసింది.
టెట్‌లో పేపర్-I, పేపర్-II ఉంటాయి.
టెట్ పేపర్-I
- ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించడానికి ఈ పేపర్లో అర్హత సాధించాలి.
- అర్హతలు: ఇంటర్/ తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులు అయితే 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- దీంతోపాటు రెండేండ్ల డీఈడీ/నాలుగేండ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
- లేదా కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీతోపాటు బీఈడీ/బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
టెట్ పేపర్-II
- ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులు ఈ పేపర్లో అర్హత సాధించాలి.
- అర్హతలు: బీఏ/బీఎస్సీ/బీకాంలో కనీసం 50 శాతం మార్కులతోపాటు బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
నోట్: 2015 కంటే ముందు డీఈడీ/బీఈడీ చేసిన వారికి ఇంటర్/డిగ్రీలో కనీసం 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. - నోట్: ప్రస్తుతం బీఈడీ/డీఈడీ చివరి ఏడాది చదువుతున్న వారు కూడా టెట్ పరీక్ష దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఇప్పటికే టెట్ అర్హత సాధించిన వారు ఎక్కువ మార్కులు సాధించడానికి టెట్ రాసుకోవచ్చు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు