ఇలా చదువుదాం.. బెస్ట్ స్కోర్ సాధిద్దాం!
పరీక్షలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం పరీక్షల టైం టేబుల్ విడుదల చేసింది. ఏప్రిల్ 20 నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. సైన్స్ గ్రూప్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ప్రాక్టికల్ తేదీలు విడుదలయ్యాయి. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఎథిక్స్&హ్యూమన్ వ్యాల్యూస్, ఎన్విరాన్మెంట్కి సంబంధించినవి కూడా ఉంటాయి. పరీక్ష తేదీ రావడంతో ప్రిపరేషన్ హడావుడి పెరిగింది. సిలబస్ పూర్తి కాని చోట అదనపు క్లాసులు నిర్వహించి సిలబస్ కంప్లీట్ చేయాలని ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. కాబట్టి సరైన ప్రణాళికతో ప్రిపరేషన్ మొదలు పెట్టాలి.
ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులు గత అక్టోబర్‌లో పరీక్షలు రాయడం వల్ల కొంత వరకు పరీక్షలు ఎలా జరుగుతాయన్న అవగాహన ఉంటుంది. కానీ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇదే మొదటి బోర్డు పరీక్ష. కాబట్టి సరైన ప్లానింగ్‌తో బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలి.
సిలబస్
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 70% సిలబస్ ఆధారంగా పరీక్షలు ఉంటాయని ప్రకటించింది. దీంతో పాటు సాధారణంగా ఉండే చాయిస్ కన్నా ఇంకా ఎక్కువ చాయిస్‌తో అక్టోబర్‌లో పరీక్షలు జరిగాయి. మోడల్ పేపర్లు కూడా ఇంటర్ బోర్డు వెబ్సైట్లో ఉన్నాయి. ప్రాక్టికల్స్ కూడా 70% సిలబస్ ఆధారంగా ఉండనున్నాయి. చాయిస్ ఎంత ఉన్నా విద్యార్థులు తాము చదువుతున్న చాప్టర్లు పూర్తిగా చదవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఉదాహరణల్లో ఇచ్చిన ప్రశ్నలు లేదా ఒక చాప్టర్లో ఎక్కువ సార్లు అడగని ప్రశ్నలు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ధైర్యంగా పరీక్షలు రాయవచ్చు. ప్రభుత్వం బేసిక్ లెర్నింగ్ మెటీరియల్‌ని కూడా విడుదల చేసింది. కాబట్టి తెలుగు అకాడమీ పాఠ్య పుస్తకాలతో పాటు వీటిని కూడా రిఫర్ చేయవచ్చు. పేపర్ బ్లూ ప్రింట్ ఆధారంగా ఎక్కువ మార్కులు వచ్చే చాప్టర్లతో ప్రిపరేషన్ మొదలు పెట్టవచ్చు.
టైం మేనేజ్మెంట్
పరీక్షకు 3 గంటల సమయం ఉంటుంది. మీ ప్రిపరేషన్‌తో పాటు, మీరు ప్రాక్టీస్ చేసే మోడల్ పేపర్లు లేదా ప్రీ బోర్డు పరీక్షల్లో ఏ సెక్షన్‌కు ఎంత సమయం కేటాయించవచ్చని ఒక అవగాహన తెచ్చుకోవాలి. టాప్ స్కోర్లు టార్గెట్ చేసే విద్యార్థులు పేపర్లో ఉన్న అన్ని సెక్షన్లు రాసిన తరువాత చాయిస్ ప్రశ్నలకు కూడా జవాబులు రాయడం మంచిది. దీనివల్ల తొందరలో చేసే చిన్న పొరపాట్ల వల్ల నష్టపోయే మార్కుల విషయంలో సేఫ్‌గా ఉండవచ్చు.
పేపర్ మేనేజ్మెంట్
పరీక్షలో బుక్లెట్ ఉంటుంది. అన్ని ప్రశ్నలకు జవాబులు ఇచ్చిన బుక్‌లెట్‌లో రాయాలి. ఉదాహరణకు ఎకనామిక్స్, ఇంగ్ల్లిష్ సెకండియర్ పేపర్ వంటి వాటిలో విద్యార్థులు చివరికి వచ్చేసరికి ఇరికించి రాయడం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సరైన పెన్నులు వాడటంతో పాటు డయాగ్రమ్లకు మంచి హెచ్‌బీ పెన్సిల్, స్కేల్ ఉపయోగించాలి. ప్రశ్న నంబర్, సెక్షన్ జాగ్రత్తగా, కరెక్ట్‌గా క్లియర్‌గా వేయాలి.
సెకండియర్ విద్యార్థులు రాసే కెరీర్ పరీక్షలు మొదలయ్యాయి. ఇంజనీరింగ్
ఎస్ఆర్ఎం పరీక్ష రిమోట్ ప్రోక్టర్డ్ విధానంలో జరిగింది. ఎల్సాట్, అజీమ్ ప్రేమ్‌జీ వంటి మొదటి విడత పరీక్షలు, డిజైన్ కాలేజీల పరీక్షలు కూడా జరిగాయి. రానున్న కాలంలో ఇతర పరీక్షలు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ పరీక్షలు రాయాలి, ఏ ఫేజ్‌లో రాయాలి, ఏ రోజుల్లో స్లాట్ బుక్ చేసుకోవాలి, ఏ రోజుల్లో పరీక్షలున్నాయి అన్నది చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి.
ఇంటర్ గ్రూప్స్ సబ్జెక్టులు బాగా ప్రిపేర్ అయితే మీరు రాసే ఎంసెట్ వంటి పరీక్షలకు ఉపయోగపడుతుంది. కొన్ని అడ్మిషన్స్లో ఇంటర్ మార్కులను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు ఐఐఎంలు అందించే ఐపీఎం ప్రోగ్రామ్స్. అంతేకాకుండా కొన్ని అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్‌కు ఇంటర్వ్యూలు ఉంటాయి. అక్కడ కూడాఈ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది.
హ్యాండ్ రైటింగ్ అండ్ ప్రజంటేషన్
ఆన్లైన్ క్లాస్‌ల వల్ల చాలా మంది విద్యార్థులకు రాసే అలవాటు కొద్దిగా తగ్గింది. బోర్డ్ పరీక్షలో డిస్క్రిప్టివ్ ప్రశ్నలుంటాయి. పేపర్ వాల్యుయేషన్ మార్కింగ్ స్కీమ్‌ను దృష్టిలో పెట్టి జరుగుతుంది. కాబట్టి హ్యాండ్ రైటింగ్ మొదటి నుంచి చివరి వరకు చదవడానికి అనుకూలంగా ఉండాలి. ప్రతి ప్రశ్నకు రాసే జవాబు సరైన పద్ధతిలో రాయాలి. అలాగే రాయవలసిన అన్ని పాయింట్లు రాయాలి. కొన్ని పేపర్లు/ సెక్షన్లలో ఆ సెక్షన్‌కు సంబంధించిన ప్రశ్నలు అన్ని ఒకే దగ్గ్గర, ఒకే వరుసలో కూడా రాయవలసి ఉంటుంది. ఉదాహరణకు ఇంగ్లిష్ పేపర్. ఇలాంటి సూచనలు క్వశ్చన్ పేపర్లో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లాంగ్వేజ్‌లలో స్పెల్లింగ్ మిస్టేక్స్, మ్యాథ్స్‌తో పాటు ఇతర సబ్జెక్టుల్లో తప్పులు చేయకుండా ఉండాలంటే జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. వీటితో పాటు గ్రాఫ్స్, డెరివేషన్స్ క్లియర్‌గా ఉండాలి.
మ్యాథ్స్- 1 (A) ప్రిపరేషన్
2021లో విడుదలైన మోడల్ పేపర్స్ ఆధారంగా ఈ వెయిటేజీ ఇచ్చారు. అదనపు ప్రశ్నల్లో కొంత మార్పులు ఉండవచ్చు. లేటెస్ట్ మోడల్ పేపర్లు విడుదలయితే తప్పక చూడండి.
మ్యాట్రిసెస్ (~33 మార్కులు), అడిషన్ ఆఫ్ వెక్టర్స్ (~15 మార్కులు), ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ (~24 మార్కులు) లాంగ్ ఆన్సర్, షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్ ప్రశ్నలు వస్తాయి. వీటితో ప్రిపరేషన్ మొదలు పెట్టండి. వీటికి కాస్త ఎక్కువ సమయం రివిజన్‌కు పట్టే అవకాశం ఉంటుంది.
ఫంక్షన్స్- వెరీ షార్,్ట లాంగ్ ఆన్సర్ ప్రశ్నలు ఇందులో నుంచే వస్తాయి. కనీసం 11 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పై వాటితో పోలిస్తే ఇది త్వరగా కంప్లీట్ చేయవచ్చు.
హైపర్ బోలిక్ ఫంక్షన్స్- వెరీ షార్ట్, షార్ట్ ఆన్సర్ ప్రశ్నలు ఇందులో నుంచి వస్తాయి. ఇది చాలా త్వరగా చదవవచ్చు. ట్రిగ్నామెట్రీ రేషియో ట్రాన్స్ఫర్మేషన్- లాంగ్ ఆన్సర్, షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్ ప్రశ్నలతో కనీసం 19 మార్కులు ఇందులో నుంచి వస్తాయి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్- లాంగ్ ఆన్సర్, షార్ట్ ఆన్సర్ ప్రశ్నలతో కనీసం 22 మార్కులు ఇందులో నుంచి వస్తాయి. 70% సిలబస్‌కు అనుగుణంగా అవసరమైన బిట్లు ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ మార్కులు వచ్చే చాప్టర్లతో మొదటగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. క్షుణ్ణంగా అన్ని ప్రశ్నలు, ఉదాహరణలు ప్రాక్టీస్ చేయడానికి సమయం వెచ్చించండి. రోజుకు కనీసం రెండు గంటలు మ్యాథ్స్-ఏకు వెచ్చించండి . డెఫినేషన్స్ నేర్చుకోండి . ఫార్ములాస్ బాగా గుర్తు పెట్టుకోండి.
మ్యాథ్స్-1 (బి) ప్రిపరేషన్
లోకస్ (~8 మార్కులు)- షార్ట్ ఆన్సర్ ప్రశ్నలు సాధారణంగా ఇందులో నుంచి వస్తాయి. ఇది ఈజీ చాప్టర్‌గా కూడా విద్యార్థులు పరిగణిస్తారు.
ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ (~8 మార్కులు)- షార్ట్ ఆన్సర్ ప్రశ్నలు ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. లెర్నింగ్ మెటీరియల్‌లో వెరీ షార్ట్ కూడా ఉన్నాయి.
స్ట్రెయిట్ లైన్స్ (~22 మార్కులు)- ఇది చాలా ముఖ్యమైన చాప్టర్. లాంగ్ ఆన్సర్, షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్ ప్రశ్నలు వస్తాయి. పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ (~14 మార్కులు)- ఇందులో లాంగ్ ఆన్సర్ ప్రశ్నలు బాగా ప్రాక్టీస్ చేయాలి. 3డీ కో ఆర్డినేట్స్ (~6 మార్కులు)- వెరీ షార్ట్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. షార్ట్ ఆన్సర్ ప్రశ్నలు వచ్చే అవకాశం కూడా ఉంది. డైరెక్షన్ కోసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్ (~7 మార్కులు)- లాంగ్ ఆన్సర్ ప్రశ్నలు బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్లేన్ (~2 మార్కులు)- వెరీ షార్ట్ ఆన్సర్ ప్రశ్నలు వస్తాయి. లిమిట్స్ (~8 మార్కులు)- షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్ ప్రశ్నలు వస్తాయి.
డెరివేటివ్స్ (~22 మార్కులు), అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ (~33 మార్కులు)- లాంగ్ ఆన్సర్, షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్ ప్రశ్నలు వస్తాయి.
స్ట్రెయిట్ లైన్స్, అప్లికేషన్ అఫ్ డెరివేటివ్స్ అన్నింటికన్నా ఎక్కువ సమయం రివిజన్ కోసం అవసరమవుతుంది. లోకస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, ది ప్లేన్, 3డీలను చాలా త్వరగా రివిజన్ చేయవచ్చు. మొదట లాంగ్ ఆన్సర్ ప్రశ్నలు వచ్చే చాప్టర్లతో మొదలు పెట్టండి. అలాగే ఫుల్ మార్కులు రావాలనుకుంటే అన్ని వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. సాల్వ్ చేసిన ఉదాహరణ ప్రశ్నలు కూడా ప్రాక్టీస్ చేయండి.
ఫిజిక్స్- 1 ప్రిపరేషన్
వర్క్ ఎనర్జీ పవర్ (~10 మార్కులు), ఆసిలేషన్ (~10 మార్కులు), థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ (~10 మార్కులు) నుంచి లాంగ్ ఆన్సర్ ప్రశ్నలు వస్తాయి. వెరీ షార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎక్స్ట్రా చాయిస్ లాంగ్ ఆన్సర్ ప్రశ్నలు కూడా వీటిలో నుంచే వచ్చే అవకాశం ఉంది. ప్రాబ్లమ్స్ కూడా చెయ్యండి
ఫిజికల్ వరల్డ్ (~2 మార్కులు), యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ (~2 మార్కులు) నుంచి ఎక్కువగా వెరీ షార్ట్ ప్రశ్నలు వస్తాయి.
మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్ (~6 మార్కులు)- షార్ట్ ఆన్సర్ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయండి. వెరీ షార్ట్ ప్రశ్నలు వచ్చే అవకాశం కూడా ఉంది. మోషన్ ఇన్ ప్లేన్ (~6 మార్కులు), న్యూటన్స్ లా అఫ్ మోషన్ (6 మార్కులు), సిస్టం ఆఫ్ పార్టికల్స్ (~6 మార్కులు)- షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ప్రశ్నలు వస్తాయి. గ్రావిటేషన్ (~8 మార్కులు)- షార్ట్ ఆన్సర్ బాగా ప్రిపేర్ అవ్వండి. వెరీ షార్ట్ ప్రశ్నలు కూడా వస్తాయి. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ (~6 మార్కులు), మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ (~6 మార్కులు) నుంచి షార్ట్, వెరీ షార్ట్ ఆన్సర్ ప్రశ్నలు వస్తాయి. థర్మోడైనమిక్ (~10 మార్కులు)- షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్ ప్రశ్నలు వస్తాయి.
కైనటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ (~6 మార్కులు)- వెరీ షార్ట్ ప్రశ్నలు వస్తాయి. షార్ట్ ఆన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఫుల్ మార్క్స్ కావాలనుకునే వారు అన్ని చాప్టర్ల నుంచి వెరీ షార్ట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. అలాగే ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చెయ్యండి. అన్ని సెక్షన్స్‌లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. డెరివేషన్స్ క్లియర్‌గా రాయాలి. లాంగ్ ఆన్సర్ చాప్టర్లతో ప్రిపరేషన్ మొదలు పెట్టండి.
కెమిస్ట్రీ 1 ప్రిపరేషన్
అటామిక్ స్ట్రక్చర్ (~16 మార్కులు), క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ (~12 మార్కులు) నుంచి లాంగ్ ఆన్సర్ ప్రశ్నలు వస్తాయి. అలాగే షార్ట్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ ప్రశ్నలు కూడా వచ్చే అవకాశం ఉంది. కెమికల్ బాండింగ్ (~12 మార్కులు) షార్ట్ ఆన్సర్, లాంగ్ ఆన్సర్ అండ్ వెరీ షార్ట్ అన్సర్ ప్రశ్నలు కూడా వచ్చే అవకాశం ఉంది.
స్టాయికోమెట్రీ (~6 మార్కులు), స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ (~8 మార్కులు), థర్మోడైనమిక్స్ (~4 మార్కులు), కెమికల్ ఈక్విలిబ్రియమ్ (~8 మార్కులు), హైడ్రోజన్ అండ్ కాంపౌండ్స్ (~6 మార్కులు), ఎస్ బ్లాక్ (~4 మార్కులు), పీ బ్లాక్ (~8 మార్కులు)- వెరీ షార్ట్ ఆన్సర్ ప్రశ్నలు వస్తాయి.
ఆర్గానిక్ కెమిస్ట్రీ (~12-14 మార్కులు)- దీని నుంచి లాంగ్, షార్ట్, వెరీ షార్ట్ ఆన్సర్ ప్రశ్నలు వస్తాయి.
ఎక్కువ చాయిస్ ఉండటం వల్ల షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ప్రశ్నలు అన్నింటిలో ప్రిపేర్ అవడం చాలా మంచిది.
ఎకనామిక్స్- 1
డిమాండ్ అనాలసిస్ (~26 మార్కులు), థియరీస్ ఆఫ్ కన్జ్యూమర్ బిహేవియర్ (~24 మార్కులు), థియరీస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ పబ్లిక్ ఫైనాన్స్ (~24మార్కులు), నేషనల్ ఇన్‌కం (~19 మార్కులు), ప్రొడక్షన్ అనాలసిస్ (~19 మార్కులు), మార్కెట్ అనాలసిస్ (~19 మార్కులు) నుంచి లాంగ్ ఆన్సర్ ప్రశ్నలతో పాటు షార్ట్, వెరీ షార్ట్ ఆన్సర్ ప్రశ్నలు వస్తాయి. వీటితో ప్రిపరేషన్ మొదలు పెట్టండి.
మనీ బ్యాంకింగ్ అండ్ ఇన్ఫ్లేషన్, ఇంట్రడక్షన్ టు ఎకనామిక్స్, బేసిక్ స్టాటిస్టిక్స్ ఫర్ ఎకనామిక్స్ నుంచి షార్,్ట వెరీ షార్ట్ ఆన్సర్ ప్రశ్నలతో కనీసం చాప్టర్‌కు 16-18 మార్కుల ప్రశ్నలు వస్తాయి. థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి కనీసం 9 మార్కులు వస్తాయి.
టేబుల్స్, గ్రాఫ్స్, సమీకరణాలు ప్రాక్టీస్ చేయండి. తెలుగు అకాడమీ పుస్తకాలు, గత మోడల్ పేపర్లను రిఫర్ చేయండి. జవాబులు డిటైల్డ్‌గా రాయండి.
కామర్స్ అండ్ అకౌంట్స్- 1
ప్రిపరేషన్ అకౌంటెన్సీతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది.
అకౌంట్స్‌లో ఫైనల్ అకౌంట్స్ (~22 మార్కులు), క్యాష్ బుక్ (~22 మార్కులు)తో మొదలు పెట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. తరువాత జర్నల్ లెడ్జర్ (13 మార్కులు), బీ ఆర్ఎస్ (~20 మార్కులు), రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ (~7 మార్కులు), ట్రయల్ బ్యాలెన్స్ (~2 మార్కులు) ప్రిపేర్ అవ్వండి.
కామర్స్‌లో పార్ట్నర్షిప్ (~17 మార్కులు), జాయింట్ స్టాక్ కంపెనీ (~17 మార్కులు), సోల్ ప్రొప్రైటర్ (~15 మార్కులు), బిజినెస్ ఫైనాన్స్ (~12 మార్కులు) నుంచి లాంగ్, షార్ట్, వెరీ షార్ట్ ప్రశ్నలు వస్తాయి.
ఎంఎస్ఎంఈ (~9 మార్కులు), ఇంట్రడక్షన్ టు బిజినెస్ (~9 మార్కులు), బిజినెస్ యాక్టివిటీస్ (~7 మార్కులు), ఈ-బిజినెస్ (~7 మార్కులు), ఫార్మేషన్ ఆఫ్ కంపెనీ (~7 మార్కులు) నుంచి షార్ట్, వెరీ షార్ట్ ప్రశ్నలు వస్తాయి.
మొదట లాంగ్ ఆన్సర్ చాప్టర్ల నుంచి అన్ని ప్రశ్నలు ప్రిపేర్ అవ్వండి. క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ చేయకండి. ప్రొఫార్మా బాగా ప్రాక్టీస్ చేయండి.
సంస్కృతం– 1
ప్రిపరేషన్ గ్రామర్ కాన్సెప్ట్స్‌తో మొదలు పెడితే త్వరగా కొన్ని టాపిక్స్ పూర్తయ్యే అవకాశం ఉంది. సంవిత్ పరీక్ష (~5 మార్కులు), సంధులు విఘటనం, సంధానం (~16 మార్కులు), శబ్దాలు (~8 మార్కులు ), అనువాదాలు (~5 మార్కులు), ధాతువులు (~6 మార్కులు) వస్తాయి. గ్రామర్ చదివితే 40 మార్కులు.
పద్య భాగం: భర్తృహరి సుభాషితాలు (~13 మార్కులు)- శ్లోక పూర్ణం, భావం, లఘు సమాధాన ప్రశ్నలు, ఏక పద సమాధాన ప్రశ్నలు వస్తాయి.
రామో విగ్రహవాన్ ధర్మ: (~17 మార్కులు), గాన పరీక్ష (~17 మార్కులు) వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, సందర్భ సహిత వాక్యాలు, లఘు సమాధాన ప్రశ్నలు, ఏక పద సమాధాన ప్రశ్నలు వస్తాయి.
మాతృ గీతం (~4 మార్కులు) లఘు సమాధాన ప్రశ్నలు, ఏక పద సమాధాన ప్రశ్నలు వస్తాయి.
గద్య భాగం
దయాలు నాగార్జున (~16-17 మార్కులు), శరణా గతరక్షణం (~16-17 మార్కులు) వ్యాస రూప సమాధానం ప్రశ్నలు, సందర్భ సహిత వాక్యాలు, లఘు సమాధాన ప్రశ్నలు, ఏక పద సమాధాన ప్రశ్నలు వస్తాయి .
టి టి భ దంపతి కథ (~4 మార్కులు), జగదీష్ చంద్రబోస్ (~4 మార్కులు) లఘు సమాధాన ప్రశ్నలు, ఏక పద సమాధాన ప్రశ్నలు వస్తాయి .
ఉపవాచకం
ఉద్యోగినం పురుష సింహముపయితి లక్ష్మీః (~4 మార్కులు), భాగ్యచక్రం (~4 మార్కులు), కిమస్తి పేటికాయాం (~4 మార్కులు), విద్వాన్ కులీనో నకారోతి గర్వము (~4 మార్కులు) నుంచి లఘు సమాధాన ప్రశ్నలు వస్తాయి .
ఇంగ్లిష్ -1
పోయెట్రీలోని హ్యాపీనెస్, ఏ రెడ్ రోజ్, ది బెగ్గర్, దినోబెల్ నేచర్ నుంచి ఆనటేషన్, క్వొశ్చన్స్ వస్తాయి.
(~4+4 మార్కులు) ప్రతి లెసన్ నుంచి వచ్చే అవకాశం ఉంది.
ప్రోజ్లోని టూ సైడ్స్ ఆఫ్ లైఫ్, ఫాదర్, డియర్ ఫాదర్, ది గ్రీన్ చాంపియన్ తిమ్మక్క, ది ఫస్ట్ ఫోర్ మినిట్స్ నుంచి ఆనటేషన్, క్వశ్చన్స్ వస్తాయి. (~4+4 మార్కులు) ప్రతి పాఠం నుంచి వచ్చే అవకాశం ఉంది.
షార్ట్ స్టోరీస్: ప్లేయింగ్ ది గేమ్, ది షార్ట్ సైటెడ్ బ్రదర్స్, సంఘాల పంతులు నుంచి క్వశ్చన్స్ వస్తాయి. (~4 మార్కులు) ప్రతి లెసన్ నుంచి వచ్చే అవకాశం ఉంది.
అదనపు ప్రశ్నలు రావచ్చు.
గ్రామర్‌లోని ప్రతి టాపిక్ నుంచి కనీసం 4 మార్కుల ప్రశ్నలు వస్తాయి. ఈ కాన్సెప్ట్స్ జాగ్రత్తగా నేర్చుకుంటే తరువాత కూడా బాగా ఉపయోగపడుతుంది. గ్రామర్ సరిగా చేస్తే సులభంగా 60 మార్కుల స్కోర్ చేయవచ్చు.
స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా జవాబులు రాయండి. గ్రామర్‌లో చాయిస్ కూడా రాయండి.
సెకండియర్ సబ్జెక్టులు మ్యాథ్స్ -2 (A)
కాంప్లెక్స్ నంబర్స్ (~8 మార్కులు) షార్ట్, వెరీ షార్ట్ ప్రశ్నలు వస్తాయి.
ప్రాబబిలిటీ (~22 మార్కులు) లాంగ్, షార్ట్ ప్రశ్నలు వస్తాయి.
డిమోయర్ థీరం (~13 మార్కులు), క్వాడ్రాటిక్ ఎక్స్ ప్రెషన్స్ (~13 మార్కులు), పర్ముటేషన్, కాంబినేషన్ (~19 మార్కులు), థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ (~20 మార్కులు) లాంగ్, షార్ట్, వెరీ షార్ట్ ప్రశ్నలు వస్తాయి.
బైనామియల్ థీరం (~9 మార్కులు), ర్యాండమ్ వేరియబుల్స్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ (~16 మార్కులు) లాంగ్, వెరీషార్ట్ ఆన్సర్ ప్రశ్నలు వస్తాయి. మెజర్స్ ఆఫ్ డిస్పెర్షన్ (~2 మార్కులు) వెరీ షార్ట్ ఆన్సర్, పార్షియల్ ఫ్రాక్షన్స్ (~8 మార్కులు) షార్ట్ ప్రశ్నలు వస్తాయి.
ఎక్కువ మార్కులు ఉన్నవి లాంగ్ ఆన్సర్ చాప్టర్లతో ప్రిపరేషన్ మొదలు పెట్టవచ్చు. 70% సిలబస్‌కి అనుగుణంగా ఉన్నవి ప్రిపేర్ అవ్వండి.
మ్యాథ్స్-2 (B)
సర్కిల్స్ (~33 మార్కులు), సిస్టం ఆఫ్ సర్కిల్స్ (~13 మార్కులు)- లాంగ్, షార్ట్, వెరీ షార్ట్ ప్రశ్నలు వస్తాయి. పారబోల (~9 మార్కులు) వెరీ షార్ట్, లాంగ్ ఆన్సర్ ప్రశ్నలు. ఎలిప్స్ (~8 మార్కులు) షార్ట్ ఆన్సర్ ప్రశ్నలు వస్తాయి. హైపర్బోల (~6 మార్కులు) వెరీ షార్ట్, షార్ట్ ఆన్సర్ ప్రశ్నలు వస్తాయి. ఇంటిగ్రేషన్ (~25 మార్కులు) వెరీ షార్ట్, లాంగ్ ఆన్సర్ ప్రశ్నలు వస్తాయి. డెఫినిట్ ఇంటిగ్రల్స్ (~23 మార్కులు), డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ (~13 మార్కులు) లాంగ్, షార్,్ట వెరీ షార్ట్ ప్రశ్నలు వస్తాయి. సర్కిల్స్, క్యాలిక్యులస్తో ప్రిపరేషన్ మొదలు పెట్టండి. చాలా వరకు సిలబస్ కవర్ అవుతుంది. వీటికి ఎక్కువ సమయం ప్రేపరషన్కి కేటాయించండి. రోజు కనీసం రెండు గంటలు సమయం వెచ్చించండి.
ఫిజిక్స్- 2 (సెకండియర్)
వేవ్ మోషన్ (~10 మార్కులు), కరెంట్ ఎలక్ట్రిసిటీ (~10 మార్కులు), న్యూక్లియై (~10 మార్కులు), లాంగ్, వెరీ షార్ట్ ప్రశ్నలు వస్తాయి. ఎక్స్ట్రా లాంగ్ ఆన్సర్ కూడా మొదటి రెండిటి నుంచి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రే ఆప్టిక్స్ (~10 మార్కులు), వేవ్ ఆప్టిక్స్ (~6 మార్కులు), ఎలక్ట్రిక్ చార్జెస్, ఫీల్డ్స్ (~6 మార్కులు) ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కెపాసిటన్స్ (~10 మార్కులు) షార్ట్, వెరీ షార్ట్, మూవింగ్ చార్జెస్, మ్యాగ్నటిజం (~6 మార్కులు), మ్యాగ్నటిజం, మ్యాటర్ (~6 మార్కులు), ఈఎంఐ (~6 మార్కులు), ఆల్టర్నేట్ కరెంట్ (~6 మార్కులు), డ్యూయల్ నేచర్ రేడియేషన్, మ్యాటర్ (~6 మార్కులు), ఆటమ్స్ (6 మార్కులు), సెమీ కండక్టర్స్ (~6 మార్కులు), షార్ట్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు వస్తాయి. ఎలక్ట్రో మ్యాగ్నటిక్ వేవ్స్ (~2 మార్కులు), కమ్యూనికేషన్ సిస్టమ్స్ (2 మార్కులు) వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు వస్తాయి. లాంగ్ ఆన్సర్ చాప్టర్ ప్రశ్నలు ఉన్న చాప్టర్లతో ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ఫుల్ మార్క్స్ కావాలనుకునే వారు అన్ని చాప్టర్ల నుంచి వెరీ షార్ట్ క్వశ్వన్స్ ప్రిపేరవాలి. ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చెయ్యాలి.
కెమిస్ట్రీ -2 (సెకండియర్)
ఎలక్ట్రో కెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనటిక్స్ (~14 మార్కులు), పీ బ్లాక్ ఎలిమెంట్స్ (~16 మార్కులు), ఆర్గానిక్ కాంపౌండ్స్ CHO&N (~10-16 మార్కులు) నుంచి లాంగ్, వెరీ షార్ట్, షార్ట్ ప్రశ్నలు రావచ్చు. సొల్యూషన్స్ (~14 మార్కులు), వెరీ షార్ట్, షార్ట్ ఆన్సర్ క్వొశ్చన్స్ వస్తాయి. లాంగ్ ఆన్సర్ ప్రశ్నలు కూడా రావచ్చు. సాలిడ్ స్టేట్ (8 మార్కులు), సర్ఫేస్ కెమిస్ట్రీ (10 మార్కులు), బయో మాలిక్యూల్స్ (6మార్కులు), హాలో ఆల్కేన్స్, హాలో అరీన్స్ (6 మార్కులు) వెరీ షార్ట్, షార్ట్ ప్రశ్నలు రావచ్చు. D&F Co-ordination (~6 మార్కులు) జవాబులు రాసి చూసుకోండి. ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ ఎక్కువగా ప్రాక్టీస్ కావాలి. ఫుల్ మార్క్స్ రావాలంటే అన్ని చాప్టర్లలో వెరీ షార్ట్ చదవాలి. అలాగే ప్రాబ్లమ్స్ కూడా బాగా చేయాలి. లాంగ్ ఆన్సర్ చాప్టర్లతో ప్రిపరేషన్ మొదలు పెట్టండి.
ఎకనామిక్స్- 2
అగ్రికల్చర్ సెక్టార్ (28 మార్కులు), తెలంగాణ ఎకానమీ (26 మార్కులు), నేషనల్ ఇన్‌కం, పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ (24 మార్కులు), డెమోగ్రఫీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ (21 మార్కులు), ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ (19 మార్కులు), ఇండస్ట్రియల్ సెక్టార్ (19 మార్కులు) నుంచి లాంగ్, షార్ట్, వెరీ షార్ట్ ప్రశ్నలు అన్ని బాగా ప్రిపేర్ అవ్వండి. టెర్షియరీ సెక్టార్ (16 మార్కులు), ప్లానింగ్, నీతి ఆయోగ్ (14 మార్కులు), ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ (14 మార్కులు), ఫారిన్ సెక్టార్ (9 మార్కులు) నుంచి షార్ట్, వెరీ షార్ట్ ప్రశ్నలు వస్తాయి. డేటా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. టైమ్, పేపర్ మేనేజ్మెంట్ చాలా అవసరం.
కామర్స్- 2
అకౌంట్స్‌తో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ప్రాక్టీస్ బాగా చేయాలి. పార్ట్నర్షిప్ (24 మార్కులు)తో ప్రిపరేషన్ స్టార్ట్ చెయ్యండి. తరువాత నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ (24 మార్కులు), కంప్యూటరైజ్డ్ అకౌంట్స్ (14 మార్కులు), కన్సాయిన్మెంట్ (14 మార్కులు), డిప్రిసియేషన్ (12 మార్కులు) బాగా చదవండి. కామర్స్‌లో కూడా ఎక్కువ మార్కులు లేదా లాంగ్ ఆన్సర్ ప్రశ్నలు వచ్చే చాప్టర్లతో మొదలు పెట్టండి.
బ్యాంకింగ్ (19 మార్కులు), ప్రిన్సిపుల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ (15 మార్కులు), స్టాక్ ఎక్సేంజ్ (12 మార్కులు), ఎంట్రప్రెన్యూర్షిప్ (12 మార్కులు), ఇంటర్నల్ ట్రేడ్ (9 మార్కులు), ఫైనాన్సియల్ మార్కెట్స్ (7 మార్కులు), సెట్టింగ్ ఆఫ్ బిజినెస్ (7 మార్కులు), ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ (7 మార్కులు), ఇన్సూరెన్స్ (7 మార్కులు), ఇంటర్నేషనల్ ట్రేడ్ (2 మార్కులు) ఈ ఆర్డర్లో ప్రిపేర్ కావాలి.
సంస్కృతం-2
ప్రిపరేషన్ గ్రామర్ కాన్సెప్ట్స్‌తో మొదలు పెడితే త్వరగా కొన్ని టాపిక్స్ అయిపోయే అవకాశం ఉంది. సులభంగా అనిపిస్తుంది. పత్ర లేఖనం (5 మార్కులు), సంధులు (16 మార్కులు), శబ్దాలు (8 మార్కులు), సమాసాలు (6 మార్కులు), వాక్య శుద్ధీకరణం (5 మార్కులు). గ్రామర్ బాగా ప్రిపేర్ అయితే సులభంగా 40 మార్కులు వస్తాయి.
పద్య భాగం
విక్రమాంకస్య ఔదార్యం (16 మార్కులు), నృసింహ ఆవిర్భావం (16 మార్కులు) నుంచి వ్యాసరూప సమాధాన ప్రశ్నలు వస్తాయి. అలాగే సందర్భ సహిత వాక్యాలు, లఘు సమాధాన ప్రశ్నలు, ఏక పద సమాధాన ప్రశ్నలు వస్తాయి. సాధువర్తనం (~10 మార్కులు), గాయత్రి నీతి గీతావళి (~11 మార్కులు) నుంచి ప్రతి పదార్థ భావాలు, లఘు సమాధాన ప్రశ్నలు, ఏక పద సమాధాన ప్రశ్నలు వస్తాయి.
గద్య భాగం
భ్రాతృ వాత్సల్యం (~11 మార్కులు) వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, ఏక పద సమాధాన ప్రశ్నలు వస్తాయి. సుహృద్ భేదహ (~13 మార్కులు), భారత భూషా వీర యోషా (~14 మార్కులు) సందర్భ సహిత వాక్యాలు, లఘు సమాధాన ప్రశ్నలు, ఏక పద సమాధాన ప్రశ్నలు వస్తాయి. వృక్ష రక్షికా పితామహి (~13 మార్కులు) వ్యాస రూప సమాధాన ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, ఏక పద సమాధాన ప్రశ్నలు వస్తాయి.
ఉపవాచకం: న్యాస రక్షా (~4 మార్కులు), ఆనూరవం (~4 మార్కులు) వస్తాయి. జవాబులు రాసి చూసుకుంటే తప్పులు లేకుండా నేర్చుకోగలరు.
ఇంగ్ల్లిష్- 2
ప్రోజ్: డాన్సింగ్ ఇన్ ది రైన్, ఆపర్చునిటీస్ ఫర్ యూత్, టు సర్ విత్ లవ్ నుంచి ఆనటేషన్, క్వశ్చన్స్ వస్తాయి. ప్రతి చాప్టర్ నుంచి కనీసం 8 మార్కుల వరకు ప్రశ్నలు వస్తాయి. అదనపు ప్రశ్నలు కూడా వీటిలో ఏదో ఒక దాని నుంచి వస్తుంది.
పోయెట్రీ: ది మ్యాజికల్ ఎర్త్, పొలోనియస్ అడ్వైజ్ టు హిస్ సన్, ఫుట్ ప్రింట్స్ ఇన్ సౌండ్, వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్ నుంచి కూడా ఆనటేషన్, క్వశ్చన్స్ వస్తాయి. ప్రతి చాప్టర్ నుంచి కనీసం 8 మార్కుల వరకు ప్రశ్నలు వస్తాయి. అదనపు ప్రశ్నలు కూడా వీటిలో ఏదో ఒక దాని నుంచి వస్తుంది.
షార్ట్ స్టోరీస్: ది బాయ్ హూ బ్రోక్ ది బ్యాంక్, పరిగె, మై ఎల్డర్ బ్రదర్, ది అవేక్నింగ్ నుంచి ప్రశ్నలు వస్తాయి. రెండు ప్రశ్నలకు జవాబు రాయాలి. అదనపు చాయిస్ ఉండటం వల్ల, ప్రతి చాప్టర్ నుంచి కనీసం ఒక ప్రశ్న (~4 మార్కులు) వచ్చే అవకాశం ఉంది.
గ్రామర్ బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. లెటర్ రైటింగ్, ఫార్మల్ లెటర్స్ ప్రాక్టీస్ చేయండి. రెజ్యూమె/ సీవీ/ బయోడేటా/అండర్స్టాండింగ్ జాబ్ యాడ్స్, ప్రాసెస్ రైటింగ్, నోట్ మేకింగ్, డైలాగ్ రైటింగ్ రాసి చూసుకోండి. వొకాబులరీ, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ రోజు కొన్ని నేర్చుకోండి. ఇతర నాన్ వెర్బల్ డేటా, అడ్వైర్టెజ్‌మెంట్, ఫారమ్ ఫిల్లింగ్ చూసుకోవాలి. వెర్బ్, పాట్రాన్స్, వర్డ్ స్ట్రెస్ టెక్ట్స్బుక్లో ఉన్నవి చేయండి. రీడింగ్ కాంప్రహెన్షన్ ప్రాక్టీస్ చేయండి. ప్రతి జవాబుకు రాసే పద్ధతి, రాయవలసినన్ని విషయాలు జాగ్రత్తగా నేర్చుకోండి. బేసిక్ లెర్నింగ్ మెటీరియల్, సిలబస్, మోడల్ పేపర్ల కోసం https://tsbie.cgg. gov.in/home.do వెబ్‌సైట్‌ను చూడండి.
నోట్: పై మార్కుల విశ్లేషణ అనేది 2021 పరీక్ష పేపర్ల/మోడల్ పేపర్ ఆధారంగా ఊహించి అధ్యాపకులు చేసిన విశ్లేషణ. ఇది కేవలం విద్యార్థుల అవగాహనకు మాత్రమే. మార్కులు, ప్రశ్నల విషయంలో కొంత అటు ఇటుగా ఉండవచ్చు. తుది నిర్ణయం ఐపీఈ బోర్డు నిర్ణయం మేరకే.
Academics Team Gyanville Academy
+91 76759 62248
www.gyanville.in,IITJEE | CLAT | IIM IPM
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు