సివిల్స్‌కు సిద్ధమా
దేశంలో అత్యున్నత శ్రేణి బ్యూరోక్రాట్లను/ సివిల్ సర్వెంట్లను ఎంపిక చేసేందుకు యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (ఐఎఫ్ఓఎస్)కూ ఇదే నోటిఫికేషన్ వర్తిస్తుంది. కరోనా వల్ల పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేకపోయినవారి చివరి అటెంప్ట్‌కు సంబంధించి అదనపు అవకాశం ఇవ్వాలా? వద్దా? అనే వివాదంతో నోటిఫికేషన్ విడుదల ఆలస్యమైంది. ప్రిలిమ్స్ పరీక్ష తేదీ కంటే ముందే విడుదలైన యూపీఎస్సీ క్యాలెండర్‌కు అనుగుణంగా జూన్ 27న నిర్వహిస్తామని ముందుగానే తెలిపింది. అందుకు అనుగుణంగా నోటిఫికేషన్ విడుదలైంది. ప్రిలిమ్స్ పరీక్షకు దాదాపు 110 రోజుల వ్యవధి ఉంది.
నోటిఫికేషన్ వివరాలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: 24-03-2021
ప్రిలిమ్స్ తేదీ: 27-06-2021
వెబ్సైట్: https: //upsconline.nic.in
- వయో పరిమితి: జనరల్ 32 ఏండ్లు, ఓబీసీలు 3 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీలు 5 ఏండ్లు, దివ్యాంగులకే 10 ఏండ్ల సడలింపు ఉంటుంది.
- అటెంప్ట్‌ల పరిమితి: జనరల్ 6 సార్లు, ఓబీసీలు 9 సార్లు రాయవచ్చు. ఎస్సీ, ఎస్టీలు ఎన్నిసార్లయినా రాయవచ్చు (37 ఏండ్ల వయోపరిమితికి లోబడి), దివ్యాంగులు 9 సార్లు రాయవచ్చు.
గమనిక
1. కేవలం దరఖాస్తు చేసినంత మాత్రాన అటెంప్ట్‌గా పరిగణించరు. ప్రిలిమ్స్‌లో ఏదైనా ఒక పేపర్ హాజరైతే దానిని అటెంప్ట్‌గా పరిగణిస్తారు.
2. దరఖాస్తు చేస్తున్నప్పుడే అభ్యర్థి ఎగ్జామినేషన్ సెంటర్, ఆప్షనల్ సబ్జెక్ట్, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ (మెయిన్) ఎంచుకోవాలి. తరువాత వాటిని మార్చుకోవడానికి అవకాశం ఉండదు.
3. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి సిలబస్‌లో కాని, పరీక్ష విధానంలో కాని వయోపరిమితి, అటెంప్టుల సంఖ్యలో ఏ మార్పులు జరగలేదు. నోటిఫికేషన్‌కు సంబంధించి అభ్యర్థులను కాస్త నిరుత్సాహ పరిచే అంశం పోస్టుల సంఖ్య తగ్గడం.
పరీక్ష విధానం
- సివిల్ సర్వీసెస్ పరీక్షలో 3 దశలు ఉంటాయి. అవి ప్రిలిమ్స్, మెయిన్స్, వ్యక్తిత్త్వ పరీక్ష (ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ రూపంలో, మెయిన్స్ డిస్క్రిప్టివ్ రూపంలో ఉంటాయి).
ప్రిలిమ్స్: 2 పేపర్లు (పేపర్-1 జనరల్ స్టడీస్, 100 ప్రశ్నలు, 200 మార్కులు)
(పేపర్-2 సీశాట్, 80 ప్రశ్నలు, 200 మార్కులు)
గమనిక: పేపర్-1 కటాఫ్ ప్రతిఏడాది మారుతూ ఉంటుంది.
- సీశాట్ పేపర్-2 అర్హత సాధించాలంటే కనీసం 33% మార్కులు సాధించాలి. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది.
మెయిన్: 9 పేపర్లు
1. జనరల్ ఎస్సే 250 మార్కులు
2. జనరల్ స్టడీస్-1: హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ 250 మార్కులు
3. జనరల్ స్టడీస్-2: పాలిటీ, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ 250 మార్కులు
4. జనరల్ స్టడీస్-3: ఎకనామిక్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ 250 మార్కులు
5. జనరల్ స్టడీస్-4: ఎథిక్స్, ఇంటిగ్రిటీ ఆప్టిట్యూడ్
6. కంపల్సరీ ఇండియన్ లాంగ్వేజ్ (అర్హత పరీక్ష): 300 మార్కులు
7. ఇంగ్లిష్ (అర్హత పరీక్ష): 300 మార్కులు
8. ఆప్షనల్ పేపర్-1: 250 మార్కులు
9. ఆప్షనల్ పేపర్-2: 250 మార్కులు
వ్యక్తిత్త్వ నిర్ధారణ పరీక్ష: 275 మార్కులకు ముఖాముఖి పద్ధతిలో నిర్వహిస్తారు.
మరికొన్ని సూచనలు
గతంలో సీ శాట్ అనే పేపర్ నిర్లక్ష్యం చేయడంవల్ల అభ్యర్థులు దానిలో కనీస మార్కులు సాధించలేకపోయారు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉండటం వల్ల సమాధానాలు గుర్తించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. సమయ పాలన, సమయ స్ఫూర్తి రావాలంటే ముందుగా పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేసి వెళ్తే చాలా ఉపయోగం ఉంటుంది. తొందరపాటుతో సమాధానాలు గుర్తించి కూడా కొంతమంది పరీక్షలో విఫలమవుతుంటారు. కాబట్టి ముందే ప్రణాళిక వేసుకొని ఏ విధంగా ప్రశ్నపత్రాలను సమగ్రంగా అర్థం చేసుకొని రాయాలో తెలుసుకుంటే మంచిది.
లక్షల మంది పోటీపడే పరీక్షలో కేవలం 712 పోస్టులు ఉండటంతో ఈ ఏడాది ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే అభ్యర్థులు సుమారుగా 8500 మంది ఉండవచ్చు. మొత్తం పోస్టుల్లో 22 పోస్టులు దివ్యాంగులకు కేటాయించారు. కాబట్టి ప్రిలిమ్స్‌లో వడపోత (కటాఫ్ మార్కులు) కొంత కఠినంగా ఉండవచ్చు.
జూన్ 27న నిర్వహించే ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైతే సెప్టెంబర్ 17న నిర్వహించే మెయిన్స్‌కు అర్హత లభిస్తుంది. కానీ ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు మధ్య సమయం తక్కువగా ఉండటం వల్ల మెయిన్స్‌కు కూడా సమగ్రంగా ప్రిపేర్ అయి ప్రిలిమ్స్ రాయడం మంచిది. ఈ రోజు నుంచి రోజుకి 12 గంటల ప్రణాళిక వేసుకొని ప్రిలిమ్స్ కోసం ప్రత్యేక ప్రిపరేషన్ ఆరంభించాలి. దానిలో సగభాగాన్ని కాన్సెప్టువల్ క్లారిటీ కోసం మిగతా సగ భాగాన్ని ప్రాక్టీస్ చేయడం కోసం వినియోగించుకోవాలి.
మల్లవరపు బాలలత
సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ,
అశోక్‌నగర్, హైదరాబాద్,
9966436875
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు