రాష్ట్రకూట శాసనం ఏది?
అత్యంత ప్రాచీనమైన మహాప్రాంతం తెలంగాణ. అర్వచీన(ఆర్వాచీన) సంప్రదాయాల్లోనూ ఎన్నో శిలాశాసన ఆనవాళ్లు మనకు అగుపడుతునే ఉంటాయి.. ఎంతో మంది మహారాజులు పరిపాలించారు. వాళ్లలో రాష్ట్రకూట మహారాజులు కూడా చరిత్రలో చెప్పుకోతగ్గవారే. ఈ రాష్ట్రకూట మహారాజులు సుమారు రెండు వందల సంవత్సరాలు యావత్ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించారు. చరిత్ర ప్రకారం క్రీ.శ. 735 నుంచి 973 వరకు అయితే చరిత్రకారులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తున్నారు. ఏమైనప్పటికీ వీరి శాసనాలు మెదక్ జిల్లా (నేటి సంగారెడ్డి జిల్లా) మల్లికార్జునపల్లిలో లభ్యమయ్యాయి. వీరి హయాంలోనే శుక్రనీతి అనే మహాగ్రంథం వెలుగులోకి వచ్చింది. కవి, పండిత, పరిశోధకులను రాష్ట్రకూట రాజులు పోషించారు.
-వారణాశి (కాశీ) పురాతత్వశాఖ చరిత్ర ప్రకారం తెలంగాణలో ఎంతో ప్రాచీన చరిత్ర ఉన్నదనడానికి వెండికోలు, వర్గల్, వరంగల్ జిల్లాలోని జాఫర్‌గఢ్, ఆకునూరులలో శాసనచరిత్ర ప్రకారం రాష్ట్రకూట రాజుల చరిత్ర ఎంతో లభ్యమవుతున్నది. శంకరగండ తండ్రి స్థంబ. వారి పెద్ద సోదరుడు గోవింద అమోఘవర్షుల చరిత్రలు కూడా ఉన్నాయి.
-ఈ కన్నడ శాసనాన్ని మల్లికార్జునపల్లిలోని ప్రాచీన సిద్ధేశ్వర మల్లికార్జునస్వామి దేవాలయంలో ప్రతిష్ఠించారు. అన్ని దాన వివరాలతో కూడిన ఈ శిలాశాసనం రాష్ట్రకూట మహారాజు అమోఘవర్షుని కాలంలో సంవత్సరం, 17, శక సం॥ 768 ఆశ్వీయుజ పాడ్యమి ఆదిత్యవర అంటే శనివారం 25 డిసెంబర్ 846 సంవత్సరం అవుతుంది.
-ఈ శాసనాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పురావస్తుశాఖ మెదక్ జిల్లా సంపుటిలో ప్రచురించింది. అయితే పూర్తి దాన శాసన పాఠాన్ని ప్రచురించలేదు. మునిపల్లిలో కూడా అమోఘవర్షుడు సంచరించారని చరిత్ర. నాటి ప్రాచీన కోట శిథిలమై ఉన్నదని పరిశోధకులు చెబుతున్నారు. గద్వాణం అనే నాణెం, కళంజులు, బంగారు, వెండి నాణేలు వీరి పరిపాలనా కాలంలో ఉండేవని, కనక సువర్షుని క్రీ.శ. 821 నాటి సూరత్ శాసనంలో స్పష్టంగా ఉంది.
-రాష్ట్రకూట రాజులు మొదటి ఇంద్రరాజు, రెండో ఇంద్రరాజు, మొదటి గోవింద రాజు, దంతి వర్మ, కర్కరాజు కృష్ణరాజు, గోవింద వల్లభుడు, మూడో గోవిందుడు, ధృవరాజు, అమోఘవర్షుడు, రెండో కృష్ణుడు, రెండో అమోఘవర్షుడు, మూడో ఇంద్రవల్లభుడు, నాలుగో గోవిందుడు, బద్దెగుడు, మూడో కృష్ణుడు, ఖొట్టిగ, రెండో కర్కరాజు.
-వీరి సామ్రాజ్యం తెలంగాణ మొదలుకొని సూరత్ చివరి అంబు వరకు విస్తరించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. దండనాథులు, సామంతులు, కవులు, పండితులు, శాస్త్రజ్ఞులు, మహావిగ్రహిలు, సంధివిగ్రహిలు, సామంతాధిపతులు ఉండేవారు.
-అమోఘవర్షుని పాలన చక్కగా ఉండేదని చరిత్ర తెలుపుతున్నది. రన్న మహాకవి అజిత పురాణం రచించాడు. కొన్ని ప్రాచీన దాఖలాలు ఇప్పటికీ తెలంగాణలో ఉన్నాయి. ఉదా: అస సతతోమతః విసకట శకటాపతు అనే ప్రాచీన ప్రాకృతి (బ్రాహ్మీ) సంస్కృత భాషలు, తెలంగాణలో ఉండేవి. పైశాచీ (బట్టగాహకు సంస్కృతానువాదం) బృహత్కథోచ్చిష్టంజగత్సరం అభీరి శకారి చాండాలి శాబరి (జాతి) ప్రయుక్త భాషలన్నింటికంటే అర్వ ప్రాచీన భాషలు ఉన్నట్లు భూర్జర (భుజపత్రి) ఆకులపై జంతు చర్మాలపై రాసిన ఆనవాళ్లు, సమస్త చరిత్ర ఉంది. పల్లవ రాజ్య స్థాపకుడైన వీరకూర్చ మహారాజు నాగకన్యను వివాహం చేసుకుని, ఓంకార పట్టణం (నేటి కోహీర్), వ్యాఘ్ర (నగరి) పురి (నేటి పుల్లూరు) మొదలైన ప్రాంతాలను సంచరించిన చరిత్ర కూడా ఉంది.
-రాష్ట్రకూట రాజుల్లో అమోఘవర్షుడు కవిరాజమార్గం రచించినట్టు కాశీ పీఠం తెలుపుతుంది. వీరి పరిపాలనలో జైన మందిరాలు, స్థూపాలు కూడా ఉండేవి. నాటి పొట్లకేరే (నేటి పటాన్‌చెర్వు పట్టణ పరిసర గ్రామం)లో జైన స్థూపాలు ఉన్నాయి. వీరి హయాంలో ఇంద్రేశం-రామేశం వెలుగులో ఉండేది. అనంతసాగర్, మిట్టపల్లి, పెర్మాడిగూడ, మోతె, ప్రసిద్దపేట (సిద్దిపేట) మొదలైన ఎన్నో మహాప్రాంతాలు తెలంగాణలో ఉండేవి. మహబూబ్‌నగర్ ప్రాంతంలో జనసేనుని అసంపూర్తి కావ్యం ఆదిపురాణం, వర్ధమానుకోటలో శిలావిగ్రహాలు ఉండేవని ప్రాచీన తెలంగాణ చరిత్ర వెల్లడిస్తుంది.
మల్లికార్జునపల్లిలోని అమోఘవర్షుని శిలాశాసనం
శాసనపాఠం – లిపి – తెలుగు, భాష – కన్నడ
1.స్వస్త్య (మోఘ) వషదేవ (హది)నే ఱ వష మహారాజాధిరాజ
2.(పరమేస్వర) పరమభట్టారక దుత్తరోత్త రాభి వ్రిద్ధి
3.తి రాజ్యమాతిన లక సలుత్త మిరె
4……….. (ఎ)ఱు నూఱ అఱవతైన్టెయ……..
5…లు అశ్వయుజ సుద్దపాడిద ఆదిత్యార స్వస్తిన…
6.మధిగత పఞ్బ మహాశబ్ద మహాసామన్త పాణూరవా (డి)
7.యి గొమ్మన ప్రభు (శ్రీమత్సం) కరగణ్డ ఇప్పత్తేచ్ఛాసిరను
8.ళు నాళుత్తిరె పుడినగర… ఇ…
9.దారెమ్టవు… ఱ… పిఱియ పిప్పరిగెయ ఈశ్వరాలయ
10.(బం) కెయ… కాలకత్బి రాజమాన మత్త పన్నెర….
11.డు నీనేల మత్తరోన్దు ఇదక్కెద్రమ్మ సిద్దాయముం అస్మత్
12.వంశోద్భవ పెమ్మాడి పయపి (పెమ్మాన్ డి పర్య) పిప్పరిగె నాళుత్తిరెకొట్టరో
13.ళ బరెదోళ్ మునిపళ్లెయ జీయప్పర జినాల యక్కె వసు
14.దేవ భట్టారరున్మదిన్ద శ్రీముని పళెయు లొలెగళు…..
15.రోళరెల్లానుడి సల్వశ్రీ పెమ్మాయగి ఆచన్ద్రాభివృద్ధిః
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు