జాతీయాదాయం లో లేకుండా ఆదాయంలో ఉండేవి?

గత వారం తరువాయి
ఒక దేశంలోని ప్రజల సంవత్సర సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు.
తలసరి ఆదాయం= జాతీయాదాయం/దేశజనాభా
PCI = NNP fc/Population
తలసరి స్థూల దేశీయోత్పత్తి ప్రకారం-
PCI = GDP/Population
GSDP (Gross State Domestic Product)
రాష్ట్ర స్థూల ఉత్పత్తి/ స్థూల రాష్ట్రీయోత్పత్తి ఒక రాష్ట్రంలో (భౌగోళిక సరిహద్దుల్లో జరిగే ఉత్పత్తి) ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తుసేవల మొత్తం విలువనే ‘రాష్ట్ర స్థూల ఉత్పత్తి లేదా రాష్ట్రీయ ఆదాయం’ అంటారు.
రాష్ట్ర స్థూల ఉత్పత్తిని లెక్కించేటప్పుడు 2 రకాలుగా లెక్కిస్తారు.
ఆవిర్భవించే ఆదాయం
(Income Originating)
సిద్ధించే ఆదాయం (Income Acurity)
ఆవిర్భవించే ఆదాయం
రాష్ట్ర భౌగోళిక సరిహద్దులోపల జరిగే ఉత్పత్తి విలువను మాత్రమే లెక్కించడం అంటే రాష్ట్రం లోపల సృష్టించే ఆదాయం ఒక రాష్ట్ర ప్రజలు ఇతర రాష్ర్టాల్లో, ఇతర దేశాల్లో సంపాదించే ఆదాయాలు ఇందులో లెక్కించరు.
సిద్ధించే ఆదాయం
రాష్ట్ర భౌగోళిక సరిహద్దులతో సంబంధం లేకుండా రాష్ట్ర నివాసితులు రాష్ట్రంలోగాని, ఇతర రాష్ర్టాల్లోగాని, ఇతర దేశాల్లోగాని చేసిన వస్తుసేవల ఉత్పత్తి విలువను మొత్తంగా లెక్కిస్తే దానిని ‘సిద్ధించే ఆదాయం’ అంటారు.
జాతీయ స్థాయిలో ఆవిర్భవించే ఆదాయం అంటే జీడీపీ అని, సిద్ధించే ఆదాయం అంటే జీఎన్‌పీ అని అర్థం.
రాష్ట్ర స్థాయిలో ఆవిర్భవించే ఆదాయం అంటే జీఎస్డీపీ, సిద్ధించే ఆదాయాన్ని మాత్రం లెక్కించరు.
జీఎస్డీపీ నుంచి తరుగుదలను తీసివేస్తే ఎన్ఎస్డీపీ తెలుస్తుంది.
ఎన్ఎస్డీపీ= నెట్ స్టే డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే రాష్ట్ర నికర ఆదాయం.
ప్రాక్టీస్ బిట్స్
1 జాతీయాదాయానికి సంబంధించి సరైన నిర్వచనం?
ఎ. ఒక దేశంలో మొత్తం ఉత్పత్తి విలువనే జాతీయాదాయం అంటారు
బి. జాతీయాదాయం=
బాటకం+ వేతనాలు+ వడ్డీలు+లాభాలు
సి. జాతీయాదాయం అంటే ప్రజలందరి
ఆదాయాల మొత్తం
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
2. GNP అనేది GDP కంటే అధికంగా ఉన్నప్పుడు?
1) నికర విదేశీ కారక ఆదాయం శూన్యం
2) నికర విదేశీ కారక ఆదాయం రుణాత్మకం
3) నిరక విదేశీ కారక ఆదాయం ధనాత్మకం
4) నియమిత ఆర్థిక వ్యవస్థ కాబట్టి దేశాల మధ్య ఉత్పత్తి కారకాలకు గమనశీలత లేదు
3. GDP, GNPకి మధ్య తేడా?
1) విదేశాల నుంచి వచ్చిన కారక ఆదాయం
2) విదేశాలకు చేసే కారక ఆదాయం
3) నికర విదేశీ కారక ఆదాయం
4) నికర ఎగుమతులు
4. మార్కెట్ ధరల్లో జాతీయాదాయం, కారకాల ధరల్లో జాతీయాదాయం సమానం అంటే?
1) నికర పరోక్ష పన్నులు శూన్యం
2) నికర పరోక్ష పన్నులు రుణాత్మకం
3) నికర పరోక్ష పన్నులు ధనాత్మకం
4) ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు సమానం
5. మార్కెట్ ధరల్లో జాతీయాదాయానికి సంబంధించి సరైనవి?
1) పరోక్ష పన్నులు ఉండవు, సబ్సిడీలు ఉంటాయి
2) పరోక్ష పన్నులు ఉంటాయి, సబ్సిడీలు ఉండవు
3) పరోక్ష పన్నులు ఉంటాయి, సబ్సిడీలు ఉంటాయి
4) పరోక్ష పన్నులు ఉండవు, సబ్సిడీలు ఉంటాయి
6. మార్కెట్ ధరల్లో జాతీయాదాయాన్ని, కారకాల ధరల్లో జాతీయాదాయానికి తేడా ఏమిటి?
1) నికర విదేశీ కారక ఆదాయం
2) నికర విదేశీ కారక చెల్లింపులు
3) నికర పరోక్ష పన్నులు
4) పరోక్ష పన్నులు+ సబ్సిడీలు
7. కింది వాటిలో సరైనది?
1) GDP=C+/+ G+ (M-X)
2) GDP= C+/+ G+ (M-X)
3) GDP= C+/+ G+ (M-X)-d
4) GDP=C+/+ G+ (M-X)+d
8. కింది వాటిలో సరైనది?
1) నికర ఉత్పత్తి+ తరుగుదల=స్థూల ఉత్పత్తి
2) స్థూల ఉత్పత్తి-తరుగుదల= నికర ఉత్పత్తి
3) స్థూల ఉత్పత్తి- నికర ఉత్పత్తి= స్థిర మూలధన వినియోగం
4) పైవన్నీ
9. ఒక సంవత్సర కాలంలో వ్యక్తులు పొందిన ఆదాయాల మొత్తాన్ని ఏ విధంగా
పిలుస్తారు?
1) స్థూల దేశీయ ఆదాయం
2) నికర దేశీయ ఆదాయం
3) నికర జాతీయాదాయం
4) వ్యష్టి ఆదాయం
10. కింది వాటిలో వ్యయార్హ ఆదాయానికి సమానమైనది?
1) వ్యష్టి ఆదాయం- పరోక్ష పన్నులు
2) వ్యష్టి ఆదాయం-వ్యష్టి పన్నులు
3) వ్యష్టి ఆదాయం- సబ్సిడీ
4) వ్యష్టి ఆదాయం- వినియోగం
11. జాతీయాదాయంలో లేకుండా ఆదాయంలో ఉండేవి?
1) సాంఘిక భద్రతా చెల్లింపులు
2) పంచిపెట్టని లాభాలు
3) బదిలీ చెల్లింపులు
4) పైవన్నీ
12. కింది వాటిలో బదిలీ చెల్లింపు కానిది?
1) విద్యార్థుల స్కాలర్షిప్స్
2) వృద్ధాప్య పింఛన్లు
3) నిరుద్యోగ భృతి
4) బీమా ప్రీమియం
13. వ్యయార్హ ఆదాయానికి సమానమైనది?
1) వ్యష్టి పొదుపు- వినియోగం
2) వ్యష్టి పొదుపు+ సబ్సిడీ
3) వ్యష్టి పొదుపు- సబ్సిడీ
4) వ్యష్టి పొదుపు+ వినియోగం
14. వాస్తవ తలసరి ఆదాయం అంటే?
1) వాస్తవ జాతీయాదాయం జనాభా
2) స్థిర ధరల్లో తలసరి ఆదాయం
3) నామమాత్రపు తలసరి ఆదాయం ధరల సూచీ
4) పైవన్నీ
15. దేశంలో జాతీయ, తలసరి ఆదాయాలను మొదటిసారి గణించినది?
1) దాదాభాయ్ నౌరోజీ
2) పీసీ మహలనోబిస్
3) వీకేఆర్‌వీ రావు
4) విలియం డిగ్బీ
16. దాదాభాయ్ నౌరోజీ 1867-68 సంవత్సరానికి జాతీయాదాయాన్ని అంచనా వేసినప్పుడు జాతీయ, తలసరి ఆదాయాలు వరుసగా?
1) రూ.1689 కోట్లు , రూ.62
2) రూ.250 కోట్లు, రూ.30
3) రూ.240 కోట్లు, రూ.25
4) రూ.340 కోట్లు, రూ.20
17. వీకేఆర్‌వీ 1931-32 సంవత్సరానికి జాతీయాదాయాన్ని అంచనవేసినప్పుడు జాతీయ, తలసరి ఆదాయాలు వరుసగా?
1) రూ.1689 కోట్లు, రూ.62
2) రూ.8,710 కోట్లు, రూ.225
3) రూ.2364 కోట్లు, రూ.74
4) రూ.3400 కోట్లు, రూ.60
18. కింది వాటిలో దేని విలువ ఎక్కువగా ఉంటుంది?
1) స్థూల జాతీయోత్పత్తి
2) నికర జాతీయోత్పత్తి
3) వ్యయార్హ ఆదాయం
4) తలసరి ఆదాయం
19. కింది వాటిలో కేంద్ర గణాంక సంస్థ ప్రకటించిన ఆధార సంవత్సరాల్లో లేనిది?
1) 1948-49 2) 1960-61
3) 1970-71 4) 1993-94
20. స్వాతంత్య్రానంతర భారతదేశంలో జాతీయాదాయాన్ని అంచనా వేస్తున్న సంస్థ ఏది?
1) విత్త సంఘం
2) కేంద్రీయ గణాంక సంస్థ
3) నీతి ఆయోగ్
4) ప్రణాళికా సంఘం
21. ఐక్యరాజ్యసమితికి చెందిన UNOP సంస్థ ఏ సంవత్సరం నుంచి HDIని
రూపొందిస్తుంది?
1) 1992 2) 1990
3) 1980 4) 1999
22. ప్రజల ఎంపికలను విస్తృతం చేయడంతో పాటు ప్రజాశ్రేయస్సును పెంపొందించే క్రమాన్ని మానవాభివృద్ధి అంటారని పేర్కొన్న ఆర్థికవేత్త?
1) రిచర్డ్ జాలి 2) అమర్త్యసేన్
3) మేఘనాథ్ దేశాయ్
4) మహబూబ్ ఉల్ హక్
23. HDIని రూపొందించినది?
1) రిజర్డ్ జాలి
2) మహబూబ్ ఉల్ హక్
3) అమర్త్యసేన్
4) గుప్తావ్ రానిష్
24. HDIలో తీసుకునే అంశాలు?
1) ఆయుర్దాయం 2) అక్షరాస్యత
3) తలసరి ఆదాయం 4) పైవన్నీ
25. మానవాభివృద్ధి నివేదికలో ప్రస్తుతం ఎన్ని దేశాలను తీసుకుంది?
1) 190 2) 188
3) 189 4) 191
26. అత్యధిక మానవాభివృద్ధి గల దేశాల సగటు HDI విలువ ఎంత?
1) 0.700-0.799 2) 0.800-1
3) 0.100-1 4) 0.850-1
27. 2020 HDR ప్రకారం 2019లో భారత్ HDI విలువ ఎంత?
1) 0.645 2) 0.642
3) 0.643 4) 0.647
28. 2020 HDR ప్రకారం 2019లో అత్యధిక మానవాభివృద్ధిని సాధించిన మొదటి దేశం ఏది?
1) భారత్ 2) నార్వే
3) నైగర్ 4) ఐర్లాండ్
29. 2020 HDR ప్రకారం 2019లో భారత్ ర్యాంక్ ఎంత?
1) 129 2) 130
3) 131 4) 142
30. 2010లో HDIతో పాటు ఎలాంటి సూచీలను తీసుకొంటున్నారు?
1) బహుముఖ పేదరిక సూచీ
2) అసమానతల పేదరిక సూచీ
3) లింగ అసమానతల సూచీ
4) పైవన్నీ
Answers
1-4, 2-3, 3-3, 4-1, 5-3, 6-3, 7-2, 8-4, 9-4, 10-4 11-3, 12-4, 13-4, 14-4, 15-1, 16-4, 17-1, 18-1, 19-1, 20-2, 21-2, 22-4, 23-2, 24-4, 25-3, 26-2, 27-1, 28-2, 29-3, 30-4
సంతోష్ విషయ నిపుణులు కరీంనగర్
RELATED ARTICLES
-
Society QNS & ANSWERS | తెలంగాణలో పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి నోడల్ ఏజెన్సీ ఏది?
-
Scholarships 2023 | Scholarships for Students
-
Chemistry – IIT,NEET Special | Decrease in Energy.. Leads to Stability
-
Olympiad Registration 2023 | ప్రతిభకు పదును.. ఒలింపియాడ్స్
-
Scholarships | Scholarships for 2023 Students
-
Scholarships | Scholarships for 2023 students
Latest Updates
DSC Special – Social Studies | బ్యాంకులు పూచీకత్తులు లేకుండా రుణాలు ఎవరికి ఇస్తాయి?
General Studies | బ్రిటిషర్లు ‘కైజర్-ఇ-హింద్’ అనే బిరుదు ఎవరికి ఇచ్చారు?
Biology – JL / DL Special | ఆశ్రయం పొందుతాయి.. హాని తలపెడతాయి
Telangana Socio Economic Survey | ఆయిల్‌పామ్ పండించే రాష్ర్టాల్లో తెలంగాణ స్థానం?
Indian festivals and culture | భారతదేశంలో పండుగలు – ఉత్సవాలు
Women’s Reservation Bill | చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు
Geography – Groups Special | విన్సన్ మాసిఫ్ పర్వతాన్ని అధిరోహించినది ఎవరు?
CLAT 2024 | Common Law Admission Test Latest Updates
Current Affairs | కెంటకీ నగరం ఏ రోజు ‘సనాతన ధర్మ’ రోజుగా ప్రకటించింది?
SBI PO Preparation Plan | బ్యాంక్ కొలువు.. సాధించడం సులువు