ఒకేరోజు ఎంసెట్, సీయూఈటీ.. మెయిల్ ద్వారా మార్చుకొనే అవకాశం
- మెయిల్ ద్వారా ఎంసెట్ తేదీలు మార్చుకొనే అవకాశం
ఎంసెట్ విద్యార్థులకు కొత్త సమస్య తలెత్తింది. ఒకే రోజు ఎంసెట్‌తోపాటు సెంట్రల్ కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) కూడా ఉండటంతో రెండింటికి హాజరయ్యేవారు ఏదో ఒకటి కోల్పోవాల్సి వస్తున్నది. టీఎస్ ఎంసెట్ జూలై 14, 15, 18, 19, 20 తేదీల్లో జరుగనున్నది. సెంట్రల్ వర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సీయూఈటీని కూడా జూలై 15, 16, 19, 20 తేదీలతోపాటు, ఆగస్టు 4 నుంచి 10 వరకు నిర్వహించనున్నారు. జూలై 15, 19, 20 తేదీల్లో రెండు పరీక్షలు ఉంటాయి. ఈ విషయాన్ని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ దృష్టికి ‘నమస్తే తెలంగాణ’ తీసుకెళ్లగా.. సీయూఈటీ కారణంగా ఎంసెట్‌ను వాయిదా వేయబోమని చెప్పారు. రెండింటికి హాజరయ్యే వారుంటే మరో రోజు పరీక్ష రాసుకొనే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఇలాంటి వారు. convener.eamcet@tsche.ac.in కు మెయిల్ చేయాలని సూచించారు. టీఎస్ ఎంసెట్‌కు 2,65,547 దరఖాస్తులు వచ్చాయి. ఇంజినీరింగ్‌కు 1,71,500, అగ్రికల్చర్ అండ్ మెడికల్‌కు 94,047 దరఖాస్తులు వచ్చాయి. రూ.2,500 ఆలస్య రుసుముతో ఈ నెల 27 వరకు, రూ.5 వేల ఆలస్య రుసుముతో జూలై 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. హాల్‌టికెట్ల డౌన్లోడింగ్ శనివారం నుంచి ప్రారంభమైంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు