ఇంగ్లిష్‌పై పట్టుపెంచుకుందాం ఇలా!
అక్షరాలు దిద్దకముందే భాష మాట్లాడగలం. అందుకే భాషపై పట్టు ఉందని చెప్పడానికి మాట్లాడగలగడంతో పాటు చదవగలగడం, రాయగలడంపై కూడా పట్టుందా అనేది వివిధ భాషా సంబంధిత ప్రవేశ పరీక్షల్లో గమనిస్తారు. అక్షరాభ్యాసం తరువాత పదాలను గుర్తించడం, వాక్యాలను చదవగలడం, పేరాలు అర్థం చేసుకోవడం వరకు క్రమపద్ధతిలో విద్యార్థులు నేర్చుకుంటారు.
- అన్ని పుస్తకాలు ఒకేవిధంగా ఉండవు. అన్ని సందర్భాల్లో ఒక పదానికి ఒకే అర్థం ఉండదు. ఉదాహరణకు లెఫ్ట్ అనే పదం ఆంగ్లంలో వాక్యాలను బట్టి ఎన్నో అర్థాలు ఇస్తుంది. లెఫ్ట్ ఇన్ క్లాస్‌రూం, లెఫ్ట్ ది క్లాస్‌రూం, లెఫ్ట్ డైరెక్షన్, లెఫ్ట్ పార్టీస్. కాబట్టి చదవడం అంటే ఆయా వాక్యాల వెనుక అంతరార్థాన్ని కూడా అర్థం చేసుకోగలగడం. రీడింగ్ బిట్వీన్ ది లైన్స్ కూడా అవసరమే.
- ఆంగ్ల భాష విషయానికి వస్తే వేల మైళ్ల దూరం నుంచి అరువు తెచ్చుకున్న భాష పూర్తిగా భిన్నమైన దేశానికి చెందింది. కానీ ఇప్పుడు ఇది ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉంది. చారిత్రక రాజకీయ, ఆర్థిక కారణాల వల్ల ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు దీనిని మాట్లాడతున్నారు లేదా చదువుతున్నారు. 2021లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.35 బిలియన్ ప్రజలు ఇంగ్లిష్‌ను నేటివ్ లేదా రెండో భాషగా మాట్లాడుతున్నారని అంచనా. ఇది సర్వే చేసిన సమయంలో 1.12 బిలియన్ మాండరిన్ చైనీస్ మాట్లాడేవారు ఉన్నారు. అంటే మాండరిన్ కంటే ఆంగ్లం వాడేవారు కొంచెం ఎకువ. అలాగే, హిందీ, స్పానిష్ మూడు నాలుగు స్థానాల్లో అత్యంత విస్తృతంగా ఉపయోగించే భాషలుగా ఉన్నాయి.
- ఆంగ్లంలో రీడింగ్ సిల్స్ ఎలా పెంచుకోవాలో నేర్చుకుందాం.
- ఏం చదువుతాం?
- చిన్నతనంలో పిల్లలు మొదట చదివేది వారి తల్లిదండ్రుల ఒడిలోనే. పిల్లల అభివృద్ధిలో వారికి చదివే సామర్థ్యం కలిగి ఉండటం ఎంతో ముఖ్యమైనది. చిన్నవయస్సులోనే పిల్లలకు పుస్తకాలు చదవడం నేర్పడం చాలా అవసరం. వాస్తవానికి పిల్లలు కథలను బిగ్గరగా చదవడం అనేది తల్లిదండ్రులు, అమ్మమ్మలు, తాతయ్యలు, ఉపాధ్యాయులు, వారికి సంరక్షణ ఇచ్చేవారు చేయగలిగే ముఖ్యమైన కార్యకలాపాల్లో ఒకటి. చాలా కుటుంబాల్లో బెడ్ టైం స్టోరీ బుక్స్‌ని ఉపయోగిస్తూ ఉంటారు. అకడి నుంచి మొదలయ్యే ఆ అలవాటు వారికి ఎంతో ఉపయోగపడుతుంది.
- జ్ఞానం సంపాందించి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు పుస్తక పఠనం చేస్తారు. ఇంగ్లిష్ మీడియంలో చదివే ఏ సబ్జెక్టు పుస్తకమైనా ఆంగ్ల పదజాలం, గ్రామర్‌పై ఆధార పడి ఉంటుంది. కాబట్టి అన్ని కోర్సుల వారికి భాషపై పట్టు సాధించడం అవసరం.
- నవలలు, గ్రంథాలు, వార్తాపత్రికలను వివిధ విషయాలు తెలుసుకోవడం కోసం చదువుతారు. కానీ నచ్చితే చాలా శ్రద్ధతో చదువుతారు. నచ్చకపోతే వదిలేస్తారు. పాంప్లెంట్స్, బ్రోచర్ వంటివి సమాచారం కోసం చూస్తాం.
- డాక్యుమెంట్ రీడింగ్, పని, ప్రాజెక్ట్, ప్రాపర్టీ వంటి విషయాలకు సంబంధించిన పత్రాలు ఎంతో శ్రద్ధతో, ప్రతి పదం అర్థం చేసుకొని చదవాలి.
- గుర్తుపెట్టుకోవడం అనే విషయాన్ని పకనపెడితే ఏదైనా సరే సరిగా అర్థం చేసుకోవాల్సిందే. ఒక వాక్యంలో పదం ఉన్న పొజిషన్, విరామచిహ్నాల (పంక్చువేషన్) వల్ల కూడా అర్థాలు మారవచ్చు. కాబట్టి జాగ్రత్త గా చదవాలి.
- సరిగ్గా చదవడం ముఖ్యం
- టెక్స్‌బుక్స్ విషయానికి వస్తే దాదాపు అన్ని సబ్జెక్టుల్లో మనకు కావాల్సిన కాన్సెప్ట్స్‌తో పాటు ఇంట్రడక్షన్, ఫుడ్ ఫర్ థాట్ వంటివి ఉంటాయి. మొదటి సారి చదివినప్పుడు డిటెయిల్డ్గా అర్థం చేసుకొని ఇంపార్టెంట్ పాయింట్లు హై లైట్ చేయాలి. ఇలా చేయడం వల్ల మళ్లీ చదివినప్పుడు సమయం ఆదా అవుతుంది. అలాగే ఏవి గుర్తుపెట్టుకోవాల్సినవి, ఏవి ప్రతిసారి డిటెయిల్డ్గా రివిజన్ చేసుకోవాలని కూడా గ్రహించాలి.
- ముఖాముఖిగా మాట్లాడినప్పుడు, మన ముఖకవళికల ద్వారా కూడా మనం ఎన్నో విషయాలను తెలియచేస్తాం. అలాగే పదాల ఉచ్ఛారణ, ఇంటెన్సిటీతో మన టోన్ ఎంతో తెలియచేస్తుంది. పుస్తకాల్లో ఆ బాధ్యత కూడా పూర్తిగా పదాలదే కదా. ఫిక్షన్, నాన్ ఫిక్షన్, ఆటో బయోగ్రఫీ, వార్తా పత్రికలు వంటివి చదివినప్పుడు వివరణాత్మకంగా రచనల ద్వారా సిచ్యువేషన్‌ని, స్టోరీని దృశ్యంవలే ఊహించుకోవచ్చు. అందుకే కళ్లకు కట్టినట్టుగా వివరించారని ఊరికే అనరు.
- ఒక రచయిత ఉపయోగించిన పదాలు, వ్యాఖ్యల్లో వాటిని పొందుపరిచిన విధం కూడా ఎంతో అర్థవంతంగా ఉంటుంది. వాస్తవాలు, అభిప్రాయాలు, ఆలోచనలు, నిర్ణయాలను సరిగ్గా గ్రహించగలగాలి. ఉదాహరణకి ఒక బిల్లు ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నారు అనేదానికి, బిల్లు ఆమోదం పొంది అమలులో రావడానికి ఎంతో తేడా ఉంది. హడావుడిలో తప్పుగా అర్థం చేసుకుంటే కష్టం. వార్తలు చదివినప్పుడు రీడింగ్ పేరాలకు సంబంధించినప్పుడు ఇటువంటి విషయాల్లో ఎకువ తప్పులు జరిగే ఆసారం ఉంది.
- విద్యార్థులకు రీడింగ్ సిల్స్ నేర్చుకోవడం ఎంతో అవసరం. అలాగే పరీక్షల్లో కూడా ప్రశ్నను త్వరగా చదవగలిగితేనే కదా దానికి జవాబు త్వరగా రాయగలరు. ప్రశ్నలోని వివిధ అంశాలను గమనిస్తేనే కదా జవాబు పూర్తిగా రాయగలరు.
- సామాజిక-రాజకీయ, జనాదరణ పొందిన సైన్స్ గ్రంథాలు లేదా లిటరేచర్ వంటివి చదివి అర్థం చేసుకోగలిగే సామర్థ్యం కలిగి ఉండటం వల్ల, టెక్నికల్ టెక్స్ చదివినప్పుడు ఉపయోగకరంగా ఉంటుంది.
- ఎకువగా చదవడం వల్ల కొత్త పదాలను నేర్చుకోవవచ్చు. అలాగే విభిన్నంగా పదాలను ఉపయోగించవచ్చు. వాటిని వాడుకలో లేదా రచనలో ఉపయోగించవచ్చు.
- జాతీయ, అంతర్జాతీయ ప్రవేశ పరీక్షల్లో రీడింగ్ సిల్స్ ఆధారిత ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి సిల్ ఉంటే ఎటువంటి టాపిక్నైనా సరిగ్గా చదవగలరు. రీడింగ్ కోసం ఎకువగా చదవాలి.
- భాష ఏదైనా నేర్చుకోవాలంటే కాస్త కష్టపడాలి. మాతృభాష విషయానికి వస్తే ఇంట్లోనే మాట్లాడడం నేర్చుకుంటాం. దాంతోపాటు అందరూ మాట్లాడుతుంటే వింటాం. కాబట్టి రాయడం, చదవడం, కొంచెం సులభంగా అనిపిస్తుంది. కానీ ఫారిన్ లాంగ్వేజ్ అయిన ఇంగ్లిష్ వంటి వాటికి కొంచెం ఎకువ శ్రద్ధ పెట్టాలి.
- ఆంగ్ల భాషలో రీడింగ్ సిల్స్ పెంచుకోవడం ఎలా అనే ప్రశ్నకు ముఖ్యమైన సమాధానం ఎకువగా చదవాలి.
- రచయితల రచనాశైలి వైవిధ్యంగా ఉంటుంది. కాబట్టి విభిన్నమైన రచనలు చదవడం వల్ల అన్ని రకాల వ్యాసాలు చదవగలడం నేర్చుకుంటారు. ఒక కథలో ఎన్నో పాత్రలుంటాయి. ఒక రచనలో ఎన్నో విషయాలు ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవాలి.
- కొంతమంది వారికి నచ్చిన జానర్ పుస్తకాలు లేదా నచ్చిన రచయితల పుస్తకాలు మాత్రమే చదువుతారు. ఆ రైటింగ్ ైస్టెల్కి అలవాటు పడటం వల్ల వాటిని ఎకువ సులువుగా చదవడం నేర్చుకుంటారు. కానీ ఇతర ైస్టెల్లో ఉన్న పుస్తకాల విషయానికి వస్తే ఇబ్బందిపడే అవకాశం ఉంది. ఇది విద్యార్థులకు మంచిది కాదు. వారికి పరీక్షల్లో అన్ని రకాల టాపిక్ల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
- ఎంబీఏ చదవాలనుకునేవారికి వ్యాపారానికి సంబంధించిన వ్యాసాలు, ఎకనామిక్స్, బిజినెస్‌కి సంబంధించిన పుస్తకాలు చదవడం ఉపయోగ పడుతుంది. అలాగే ‘లా’ చదవాలనుకునేవారు లీగల్ జార్గాన్ ఉపయోగించినటువంటి ఆర్టికల్స్, నవలలు చదవడం ఉపయోగపడుతుంది.
- ప్రవేశ పరీక్షల్లో రీడింగ్ కాంప్రహెన్షన్‌లో మంచి మారులు తెచ్చుకోవాలను కునేవారు ఫిక్షన్, నాన్ ఫిక్షన్ అన్ని రకాలు చదవడం వల్ల అటువంటి రచనలతో ఒక పరిచయమేర్పడినట్టు ఉంటుంది. దానివల్ల రీడింగ్ స్పీడ్ పెరుగుతుంది.
- ఎటువంటి పుస్తకాలు చదవాలి, ఎన్ని పుస్తకాలు చదవాలనే దాంట్లో గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే రీడింగ్ భారం కావద్దు. ఉత్సాహంగా చదవండి. ఎంచుకునే పుస్తకాలు తగినవి అయి ఉండాలి. అంటే మరీ సులభంగా ఉండకూడదు, మరీ కష్టంగా ఉండకూడదు. ప్రతి లైన్లో డిక్షనరీ చూడాల్సిన అవసరమొస్తే అది కొంచెం కష్టమే.
రీడింగ్ టిప్స్
ఒక పుస్తకాన్ని లేదా ఆర్టికల్‌ని పలు కారణాల కోసం చదువుతామని తెలుసుకున్నాం. అలాగే బాగా చదవాలనుకునేవారు రీడింగ్‌కు సంబంధించిన స్ట్రాటజీలు నేర్చుకోవాలి.
రీడింగ్ ఫర్ జిస్ట్
జిస్ట్ అంటే ఒక రచనలోని మెయిన్ ఐడియా లేదా కోర్ పాయింట్. ఒక వ్యాసాన్ని త్వరగా పరిశీలించి దానిలోని మెయిన్ ఐడియా, ముఖ్య విషయాలను తెలుసుకోవడమే రీడింగ్ ఫర్ జిస్ట్ అని అంటాం. దీనినే సిమింగ్ టెక్నిక్ అంటారు. సిమింగ్ చేసినప్పుడు నౌన్స్, అడ్జెక్టివ్స్, వెర్బ్స్ పై ఎకువ ఫోకస్ చేస్తూ చదువుతారు.
రీడింగ్ ఫర్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్
ఒక పుస్తకం, ఆర్టికల్, పేరా ఎందులోనైనా ఒక సమాచారం కోసం వెదకడమే ఇది. డిక్షనరీలో ఒక పదం వెదికినట్టు, వార్తాపత్రికల్లో కావాల్సిన వార్త కోసం వెతికినట్టే. దీనినే సానింగ్ అంటారు.
సమయం తకువగా ఉన్నప్పుడు స్కిమింగ్ సానింగ్ ఉపయోగపడుతాయి.
రీడింగ్ ఫర్ డిటెయిల్స్
- రచయిత ఏదైనా విషయం చెప్పాలనుకుంటే దానిని తాను చెప్పాలనుకున్న విధంగా చెబుతాడు. చదివేవారు తెలుసుకోవాల్సింది మొదట ఆ ఆలోచన, విషయం గురించి. దీనినే మెయిన్ ఐడియా అంటారు. టెక్స్‌బుక్ చదివేటప్పుడు కూడా ప్రతి పేరాలో ఉన్న మెయిన్ పాయింట్ గురించి తెలుసుకుంటే అది గుర్తు పెట్టుకోవడం సులువుగా ఉంటుంది.
- మెయిన్ ఐడియా తరువాత ఆ పేరాగ్రాఫ్‌లోని ఇతర విషయాల గురించి అర్థం చేసుకోవాలి. పదాల అమరిక, ఉపయోగంపై కూడా దృష్టిపెట్టాలి.
- ఏదైనా చదివినప్పుడు కనిపించిన కొత్త పదాలను నోట్ చేసుకోండి. అలాగే ఏదైనా విభిన్నమైన లాంగ్వేజ్ స్ట్రక్చర్ కనిపించినా గుర్తుపెట్టుకోండి. రచయితలు వారి ఆలోచనలకు ఎలా జీవం పోస్తున్నారో గమనించండి. అలా చేయడం వల్ల రీడింగ్‌తో పాటు ఎప్పుడైనా మాట్లాడాలన్నా, రాయాలన్నా ఉపయోగపడుతుంది.
Sirisha Reddy
Director – Academics
Abhyaas Edu Technologies
+91 9100545452
www.abhyaas.in
GRE | IELTS | CAT
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు