నోటిఫికేషన్స్- సాహసికులకు.. త్రివిధ దళాల పిలుపు !

సీడీఎస్ (II)-2021
త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలు. సాహసానికి, దేశసేవకు అవకాశం ఉన్న ఉద్యోగాలు. మంచి జీతభత్యాలు, భరోసానిచ్చే కొలువుల సమాహారమే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఆఫీసర్ పోస్టులు. త్రివిధ దళాల్లో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల కోసం ఏటా రెండుసార్లు నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) ఎగ్జామినేషన్-II ప్రకటనను యూపీఎస్సీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ వివరాలు నిపుణ పాఠకుల కోసం..
- కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్)-II
- ఎగ్జామినేషన్-2021
- మొత్తం ఖాళీలు-339
దళాల వారీగా ఖాళీలు
- ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రాడూన్ (153వ డీఈ కోర్సు)- 100
- నోట్: దీనిలో 13 ఖాళీలను ఎన్సీసీ సీ సర్టిఫికెట్ ఉన్నవారికి కేటాయిస్తారు.
- ఇండియన్ నేవల్ అకాడమీ, ఎజిమల- 22
- ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్-32
- ఆఫీసర్ ట్రెయినింగ్ అకాడమీ, చెన్నై-169
- ఆఫీసర్ ట్రెయినింగ్ అకాడమీ, చెన్నై- 25వ ఎస్ఎస్సీ ఉమెన్ నాన్‌టెక్నికల్ కోర్సు- 16
అర్హతలు-వయస్సు
- ఐఎంఏ- అవివాహిత పురుష అభ్యర్థులకు మాత్రమే. 1998, జూలై 2 నుంచి 2003, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.
- విద్యార్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
- ఐఎన్ఏ- అవివాహిత పురుష అభ్యర్థులు. 1998, జూలై 2 నుంచి 2003, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.
- విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.
- ఎయిర్‌ఫోర్స్ అకాడమీ- 2022, జూలై 1 నాటికి 20-24 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1998, జూలై 2 నుంచి 2002, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి. డీజీసీఏ
- జారీచేసిన పైలట్ లైసెన్స్ ఉన్నవారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 25 ఏండ్లలోపు అభ్యర్థులు అవివాహితులై ఉండాలి. 25 ఏండ్ల కంటే ఎక్కువ ఉండి వివాహం అయినవారు కూడా పై అర్హతలు ఉంటే అర్హులే.
- విద్యార్హత: ఇంటర్‌స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి లేదా బీఈ/బీటెక్ ఉత్తీర్ణులు.
- ఆఫీసర్ ట్రెయినింగ్ అకాడమీ- అవివాహిత పురుషులై ఉండాలి. 1997, జూలై 2 నుంచి 2003, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.
- ఆఫీసర్ ట్రెయినింగ్ అకాడమీ (ఎస్ఎస్సీ ఉమెన్)- అవివాహిత మహిళలు లేదా విడాకులు తీసుకున్నవారు అర్హులు. వీరు 1997, జూలై 2 నుంచి 2003, జూలై 1
- మధ్య జన్మించి ఉండాలి.
- విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత.
- ఎంపిక విధానం: రెండుదశల్లో ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ఇంటెలిజెన్స్ టెస్ట్, పర్సనాలిటీ టెస్ట్.
పరీక్ష విధానం
మిలిటరీ అకాడమీ, నేవల్ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్ అకాడమీలకు సంబంధించిన పోస్టుల్లో ప్రవేశానికి 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
ఈ పరీక్షలో ఇంగ్లిష్- 2 గంటలు- 100 మార్కులు. జీకే- 2 గంటలు- 100 మార్కులు. ఎలిమెంటరీ మ్యాథ్స్- 2 గంటలు- 100 మార్కులు.
ఆఫీసర్ ట్రెయినింగ్ అకాడమీ పోస్టులకు
ఇంగ్లిష్-2 గంటలు- 100 మార్కులు. జీకే-2 గంటలు- 100 మార్కులు. మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
నోట్: పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. ప్రతి తప్పు జవాబుకు 0.33 మార్కులు (1/3) కోత విధిస్తారు.
ఇంటెలిజెన్స్ టెస్ట్, పర్సనాలిటీ టెస్ట్
దీనిలో రెండు స్టేజీలు ఉంటాయి. స్టేజ్-Iలో ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ టెస్టులు, పీపీ అండ్ డీటీ ఉంటాయి. వీటిలో అభ్యర్థులు చూపించిన ప్రతిభ ఆధారంగా స్టేజ్-IIకు ఎంపిక చేస్తారు.
స్టేజ్-IIలో ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టాస్క్స్, సైకాలజీ టెస్టులు, కాన్ఫరెన్స్ ఉంటాయి. ఇవి నాలుగురోజుల పాటు నిర్వహిస్తారు.
శారీరక ప్రమాణాలు: పురుష అభ్యర్థుల కనీస ఎత్తు – 157.5 సెం.మీ., మహిళలు కనీసం 152 సెం.మీ. ఎత్తు ఉండాలి.
నోట్: అన్ని పరీక్షల్లో అర్హత సాధించినవారిని షార్ట్‌లిస్ట్ చేసి ఆయా కోర్సులకు ఎంపికచేసి శిక్షణ ఇస్తారు. అనంతరం ఆయా దళాల్లో లెఫ్టినెంట్ హోదాలో పోస్టింగ్‌లు ఇస్తారు.
లెఫ్టినెంట్ పేస్కేల్: రూ.56,100-1,77,500/- వీటితోపాటు ఇతర అలవెన్సులు ఉంటాయి.
పదోన్నతులు: లెఫ్టినెంట్ నుంచి సీవోఏఎస్ అంటే లెవల్ 10 నుంచి 18 వరకు పదోన్నతులు పొందవచ్చు.
స్టయిఫండ్: శిక్షణ సమయంలో నెలకు రూ.56,100/- ఇస్తారు.
శిక్షణ కాలం
నేవల్ ఓరియంటేషన్ కోర్సు, ఎజిమల – 44 వారాలు, ఆఫీసర్స్ సీ ట్రెయినింగ్ ఆరునెలలు, సబ్ లెఫ్టినెంట్ (టెక్నికల్ కోర్సు)- ఆరు నెలలు, సబ్ లెఫ్టినెంట్- 33 వారాలు, ఫుల్ నేవల్ వాచ్ కీపింగ్ సర్టిఫికెట్- ఆరు నుంచి తొమ్మిది నెలలు.
నోట్: ఇదే విధంగా ఎయిర్‌ఫోర్స్, ఆర్మీల్లో శిక్షణ వేర్వేరుగా ఉంటాయి. వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ:
ఆగస్టు 24 (సాయంత్రం 6 వరకు)
వెబ్సైట్: www.upsc.gov.in
జేఎన్‌యూ

ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (2021-22)
దేశంలోని ప్రఖ్యాత
విశ్వవిద్యాలయాల్లో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఒకటి. దీన్ని 1969లో ప్రారంభించారు. ఈ యూనివర్సిటీలో 21 రకాల స్కూల్స్‌లో ఆయా కోర్సులను అందిస్తున్నారు.
జేఎన్‌యూ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్
జేఎన్‌యూలో ప్రవేశాల కోసం 2019 నుంచి జాతీయస్థాయిలో ఎంట్రన్స్ ఎగ్జామ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ స్కోర్ ఆధారంగా ప్రవేశాలను కల్పిస్తారు. పీహెచ్డీ కోర్సుకు మాత్రం ఎంట్రన్స్‌తోపాటు వైవా కూడా నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
కోర్సులు: ఎంఏ, పీహెచ్డీ, ఎమ్మెస్సీ, ఎంపీహెచ్, ఎంటెక్, పీజీడీ, బీఏ (ఆనర్స్)/ బీఎస్సీ-ఎమ్మెస్సీ ఇంటిగ్రేటెడ్ తదితరాలు.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: కంప్యూటర్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఆగస్టు 27
పరీక్ష తేదీలు:
సెప్టెంబర్ 20, 21, 22, 23
వెబ్సైట్: https://jnuexams.nta.ac.in
ఐఎంయూ సెట్-2021

ఇండియన్ మారిటైం యూనివర్సిటీ (ఐఎంయూ) 2021-22 విద్యా సంవత్సరానికిగాను కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఇండియన్ మారిటైం యూనివర్సిటీ
కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2021
కోర్సులు: అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్
అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు
బీటెక్ (మెరైన్ ఇంజినీరింగ్)
బీఎస్సీ (నాటికల్ సైన్స్)
బీటెక్ (నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజినీరింగ్)
బీబీఏ (లాజిస్టిక్స్, రిటైలింగ్ అండ్ ఈ-కామర్స్)
డీఎన్ఎస్ (డిప్లొమా ఇన్ నాటికల్ సైన్స్)
అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్ (ఎంపీసీ) లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
వయస్సు: 17- 25 ఏండ్ల మధ్య ఉండాలి.
పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు
ఎంబీఏ (పోర్ట్ అండ్ షిప్పింగ్ మేనేజ్మెంట్)
ఎంబీఏ (ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్)
ఎంటెక్ (మెరైన్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్)
ఎంటెక్ (నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజినీరింగ్)
ఎంటెక్ (డ్రెడ్జింగ్ అండ్ హార్బర్ ఇంజినీరింగ్)
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లోబీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
వయస్సు: వయో పరిమితి లేదు
పీహెచ్డీ అండ్ ఎంఎస్ (రిసెర్చ్) ప్రోగ్రామ్
సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా
(కామన్ ఎంట్రన్స్ టెస్ట్)
ముఖ్యతేదీలు
పరీక్ష తేదీ: ఆగస్టు 29
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఆగస్టు 20
పూర్తి వివరాల కోసం వెబ్సైట్: https://www.imu.edu.in
చూడవచ్చు
- Tags
- nipuna
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






