ఐఐఎఫ్‌టీలో ఎంబీఏ


మంచి భవిష్యత్‌ను అందించే భిన్నమైన కోర్సులు. జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలకు అవకాశం. కార్పొరేట్ రంగంలో అత్యున్నత స్థానాలకు వెళ్లే ప్రత్యేకమైన కోర్సులు. ఇవన్నీ ప్రభుత్వ రంగ సంస్థలో అందిస్తూ వేలాదిమంది మేనేజ్మెంట్ రంగ నిపుణులను తయారుచేస్తున్న సంస్థ ఐఐఎఫ్‌టీ.
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ)లో ఎంబీఏ ప్రవేశానికి నిర్వహించే పరీక్ష నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.
ఐఐఎఫ్‌టీ
- అంతర్జాతీయ వ్యాపార సంబంధ రంగంలో ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్‌తోపాటు మోడ్రన్ మేనేజ్మెంట్ టెక్నిక్స్‌తో నిపుణులను తయారుచేయడానికి 1963లో స్థాపించిన విద్యా సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ). పరిశోధన, శిక్షణ, కోర్సులు అందించడం దీని ప్రధాన కర్తవ్యం. 2002లో డీమ్డ్ యూనివర్సిటీ స్థాయిని చేరుకుంది. గ్రేడ్ ఏ సంస్థగా న్యాక్ గుర్తించింది. ప్రస్తుతం జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా వేలాదిమంది ప్రొఫెషనల్స్‌ను అందిస్తున్న ప్రభుత్వ సంస్థగా ఢిల్లీ, కోల్‌కతా, కాకినాడలో క్యాంపసులు కలిగి ఉంది.
కోర్సు: ఎంబీఏ (ఇంటర్నేషనల్ బిజినెస్)
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. ఫైనల్ ఇయర్ పరీక్షలు రాయనున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), గ్రూప్ డిస్కషన్, రైటింగ్ స్కిల్స్ అసెస్మెంట్, ఇంటర్వ్యూ ఆధారంగా చేస్తారు.
పరీక్ష కేంద్రాలు: రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఉంది.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: అక్టోబర్ 15
పరీక్షతేదీ: డిసెంబర్ 5
వెబ్సైట్: https://iift.nta.nic.in
Previous article
Scholarships
Next article
ఇంటికి బీమా.. ఎంతో ధీమా!
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు