ఎర మృత్తికలకు ఆ రంగు రావడానికి కారణం?
జాగ్రఫీ
1. ఒండ్రు మృత్తికలకు సంబంధించి కింది వాటిలో సరికానిది?
1) ఈ మృత్తికలు అధిక సారవంతమైనవి
2) వీటిలో నత్రజని, జీవసంబంధ పదార్థాలు తక్కువ మోతాదులో ఉంటాయి
3) ఇవి ప్రపంచంలో పురాతన సాంస్కృతిక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి
4) ఈ మృత్తికల్లో సున్నం, పొటాష్, భాస్వరం లోపించి ఉంటాయి
2. ‘భారతదేశ ధాన్యాగారాలు’ గా ఏ మృత్తికలను పేర్కొంటారు?
1) నల్లరేగడి 2) ఎర్రమృత్తికలు
3) ఒండ్రు 4) జేగురు
3. శివాలిక్ పాదాల దగ్గర హిమాలయ నదులతో విసనకర్ర ఆకారంలో నిక్షేపితమైన గులకరాళ్ల క్షేత్రాన్ని ఏమని పిలుస్తారు?
1) టెరాయి 2) బాబర్
3) భంగర్ 4) ఖాదర్
4. పంజాబ్‌లో సోడియం పొరతో కూడిన నిస్సారమైన ఒండ్రుమట్టి నేలలను ఏమని పిలుస్తారు?
1) కంకర్ 2) రేగర్
3) భంగర్ 4) ఉషర్
5. ‘సాయిల్ సర్వే ఆఫ్ ఇండియా’ ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1928 2) 1929
3) 1938 4) 1956
6. మృత్తికలోని పొరలను ఏమంటారు?
1) హార్డ్ ప్యాన్స్ 2) ప్రొఫైల్
3) ఫెడకల్స్ 4) హూరైజన్స్
7. కింది వాటిలో బసాల్ట్ శిలల శైథిల్యం వల్ల ఏర్పడే నేలలేవి?
1) ఒండ్రునేలలు 2) ఎర్రనేలలు
3) నల్లరేగడి నేలలు 4) పర్వతీయ నేలలు
8. భారతదేశంలోని ఏ నేలలను అమెరికాలోని అరిజోనా ప్రాంతంలో ఉన్న మృత్తికలతో పోలుస్తారు?
1) ఎర్ర మృత్తికలు
2) జేగురు మృత్తికలు
3) నల్లరేగడి మృత్తికలు 4) పీఠి మృత్తికలు
9. ఏ మృత్తికల్లో ‘హ్యూమస్’ అధికంగా ఉంటుంది?
1) ఒండ్రుమృత్తికలు
2) నల్లరేగడి మృత్తికలు
3) ఎర్రమృత్తికలు
4) పర్వతీయ (అటవీ) మృత్తికలు
10. నల్లరేగడి ప్రాంతం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది?
1) అసోం 2) బీహార్
3) పంజాబ్ 4) మహారాష్ర్ట
11. కింది వాటిలో చెర్నోజెమ్ రేగడి భూములు ఉన్న ప్రాంతం ఏది?
1) ఈజిప్టు 2) గంగా తీరం
3) ఉక్రెయిన్ 4) అమెజాన్ తీరం
12. ‘రేగర్’ నేలలు అని వేటిని పిలుస్తారు?
1) ఒండ్రు నేలలు 2) పీఠి నేలలు
3) ఎడారి నేలలు 4) నల్లరేగడి నేలలు
13. నదీ లోయ సమీపంలో ఉండే నూతన సారవంతమైన నేలలను ఏమంటారు?
1) ఖాదర్ 2) భంగర్
3) బాబర్ 4) టెరాయి
14. కేరళలోని అలెప్పీ, కొట్టాయం జిల్లాల్లో విస్తరించి ఉన్న నేలలు?
1) ఒండ్రునేలలు 2) పర్వతీయ నేలలు
3) క్షార నేలలు 4) పీఠి నేలలు
15. ‘బ్లాక్ కాటన్ సాయిల్స్’ అని ఏ నేలలను పిలుస్తారు?
1) క్షార నేలలు
2) పర్వతీయ నేలలు
3) నల్లరేగడి నేలలు
4) ఒండ్రు నేలలు
16. కింది వాటిలో పాస్ఫేట్ అధికంగా విస్తరించి ఉన్న నేలలు ఏవి?
1) ఎడారి నేలలు 2) పీఠి నేలలు
3) క్షార నేలలు 4) నల్లరేగడి నేలలు
17. పంజాబ్ నుంచి అసోం వరకు విస్తరించి ఉన్న ఇండో-గంగా మైదానంలో ఏ రకమైన నేలలున్నాయి?
1) బ్లాక్ నేలలు 2) రెడ్ నేలలు
3) లాటరైట్ నేలలు
4) అల్యూవియల్ నేలలు
18. పప్పు ధాన్యాలు, నూనె గింజలు అధికంగా ఏ మృత్తికల్లో పండుతాయి?
1) నల్ల రేగడి 2) జేగురు
3) ఎర్ర మృత్తికలు 4) ఒండ్రు మృత్తికలు
19. కింది వాటిలో ‘అజోనల్’ రకానికి చెందిన మృత్తికలు ఏవి?
1) నల్లరేగడి మృత్తికలు
2) ఒండ్రు మృత్తికలు
3) లాటరైట్ మృత్తికలు
4) పైవన్నీ
20. కింది వాటిలో తడిగా ఉన్నప్పుడు పొంగి, పొడిగా ఉన్నప్పుడు పగుళ్లు ఏర్పడే భూమి ఏది?
1) ఒండలి భూమి
2) లాటరైట్ భూమి
3) నల్లరేగడి భూమి
4) ఎర్ర భూమి
21. ఎర్ర మృత్తికలకు ఆ రంగు రావడానికి కారణం ఏది?
1) కాల్షియం కార్బోనేట్స్
2) ఫెర్రస్ ఆక్సైడ్
3) మెగ్నీషియం ఆక్సైడ్
4) అల్యూమినియం ఆక్సైడ్
22. భారత్‌లోని ఏ నేలలను ‘ఉష్ణమండల చెర్నోజెమ్’ నేలలు అని పిలుస్తారు?
1) ఎర్రనేలలు 2) నల్లరేగడి నేలలు
3) అటవీ నేలలు 4) క్షార నేలలు
23. ఊబి నేలలు ఏ రాష్ట్రంలో అధికంగా ఉన్నాయి?
1) పంజాబ్ 2) ఉత్తరప్రదేశ్
3) తమిళనాడు 4) కేరళ
24. కింది వాటిలో ఏ నేలలు ‘గాలి పారేటట్లు’ గా ఉంటాయి?
1) నల్లరేగడి నేలలు 2) ఎర్రనేలలు
3) ఒండ్రు నేలలు 4) జేగురు నేలలు
25. అధిక ఉష్ణోగ్రత, అత్యధిక వర్షపాతం ఉన్న ఎత్తైన ప్రాంతాల్లో విస్తరించి ఉన్న నేలలు?
1) లాటరైట్ నేలలు
2) పర్వతీయ నేలలు
3) ఒండ్రుమట్టి నేలలు
4) క్షార నేలలు
26. కింది వాటిలో ‘పోడ్జాల్’ నేల రకానికి చెందిన మృత్తికలు ఏవి?
1) నల్లరేగడి మృత్తికలు
2) పర్వతీయ మృత్తికలు
3) ఒండ్రు మృత్తికలు
4) లాటరైట్ మృత్తికలు
27. నల్లరేగడి నేలల పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది?
1) డెహ్రాడూన్ 2) నాగ్‌పూర్
3) బళ్లారి 4) పసద్
28. హిమాలయ నదులు తీసుకువచ్చిన బంకమట్టితో ఏర్పడిన నేలలను ఏమంటారు?
1) బాబర్ 2) టెరాయి
3) భంగర్ 4) ఖాదర్
29. నదీ లోయలకు దూరంగా ఉండే ప్రాచీన ఒండలి నేలలను ఏమంటారు?
1) ఖాదర్ 2) భంగర్
3) కంకర్ 4) ఉషర్
30. నల్లరేగడి భూములు ఏ పంట సాగుకు అధికంగా ఉపయోగపడతాయి?
1) పత్తి 2) గోధుమ
3) వరి 4) జనపనార
31. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐసీఏఆర్) ఎక్కడ ఉంది?
1) నాగ్‌పూర్ 2) కటక్
3) న్యూఢిల్లీ 4) హైదరాబాద్
32. మృత్తికల గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని ఏమని పిలుస్తారు?
1) పెడోజెనెసిస్ 2) పెడాలజీ
3) పాథాలజీ 4) లిమ్నాలజీ
33. భారతదేశంలో మృత్తికలను ఐసీఏఆర్ ఎన్ని భాగాలుగా విభజించింది?
1) 8 2) 9 3) 10 4) 11
34. కింది వాటిలో నదీ నిక్షేపాల కారణంగాఏర్పడిన నేలలు ఏవి?
1) ఎర్రనేలలు
2) ఒండ్రుమట్టి నేలలు
3) క్షార నేలలు
4) జేగురు నేలలు
35. గ్రానైట్, నీస్ శిలల శైథిల్యం వల్ల ఏర్పడే మృత్తికలు ఏవి?
1) నల్లరేగడి మృత్తికలు
2) ఎర్ర మృత్తికలు
3) క్షార మృత్తికలు
4) పర్వతీయ మృత్తికలు
36. కింది సమాచారాన్ని పరిశీలించి సరైన దాన్ని గుర్తించండి
ఎ.ఈ మండలంలో వేసవి కాలం పొడిగా, శీతాకాలంలో వర్షం సంభవిస్తుంది
బి. ఆలీవ్, ఓక్ వంటి వృక్షజాతులు పెరుగుతాయి
సి. ఈ మండలం ముఖ్యంగా పండ్ల తోటలకు ప్రసిద్ధి
1) ఉష్ణమండల పశ్చిక బయళ్లు
2) మధ్యదరా శీతోష్ణస్థితి మండలం
3) సమశీతోష్ణ మండల గడ్డిభూములు
4) టైగా మండలం
37. మహదాయి నదీ జలాల పెంపకంపై ఇటీవల అంతిమ తీర్పు వెలువడింది. ఈ నది ప్రవహించే రాష్ర్టాలు ఏవి?
ఎ. గుజరాత్ బి. కర్ణాటక
సి. గోవా డి. మహారాష్ట్ర
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, సి, డి
38. ఎవరెస్ట్ పర్వతం ఎక్కడ నెలకొని ఉంది?
1) మధ్య హిమాలయాలు
2) బాహ్య హిమాలయాలు
3) కేంద్ర హిమాలయలు
4) శివాలిక్ హిమాలయాలు
39. ప్రణాళిక వనరులు అంచనాతో కూడిన జాతీయ ప్రణాళిక రూపకల్పనకు తగిన నిర్దేశిక సూత్రాలను తయారుచేసే బాధ్యత ఎవరిది?
1) ప్రణాళిక సంఘం
2) జాతీయ అభివృద్ధి మండలి
3) ఆర్థిక మంత్రిత్వశాఖ
4) కేంద్ర మంత్రివర్గం
40. కింది వన్యపాణి సంరక్షణ కేంద్రాలు అవి ఉండే జిల్లాలతో జతపరచండి?
1. కౌండిన్య ఎ. నెల్లూరు
2. కండలేరు బి. కర్నూలు
3. కోరింగ సి. చిత్తూరు
4. రోళ్లపాడు డి. తూర్పుగోదావరి
1) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
2) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
3) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
4) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
41. జతపరచండి?
1. చిరుత్తోని డ్యాం ఎ. మధ్యప్రదేశ్
2. ఇందిరాసాగర్ డ్యాం బి. తమిళనాడు
3. శ్రీశైలం డ్యాం సి. ఆంధ్రప్రదేశ్
4. మెట్టూరు డ్యాం డి. కేరళ
1) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
2) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
3) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
42. కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానాన్ని తెలపండి?
ఎ.ఖాదర్- నూతనంగా ఏర్పడిన ఒండలి మైదానం
బి. భంగర్- వరద మైదానాల్లో పురాతన కాలంలో ఏర్పడిన ఒండలి మైదానం
సి. టెరాయి- నదుల వల్ల ఏర్పడిన చిత్తడి ప్రాంతం
1) ఎ, బి 2) బి, సి
3) సి మాత్రమే 4) పైవన్నీ సరైనవే
43. జతపరచండి?
1. మహాబలేశ్వర్ ఎ. నీలగిరి కొండలు
2. దూప్ఘర్ బి. పశ్చిమ కనుమలు (సహ్యాద్రి)
3. దొడబెట్ట సి. అన్నామలై కొండలు
4. పాల్ఘాట్ డి. సాత్పూరా పర్వతాలు
1) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
2) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
3) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
4) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
44. ఇటీవల భారత్, పాకిస్థాన్‌తో సింధూనది జలాల ఒప్పందం సమీక్షిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో ఏయే నదీ జలాలను భారత్ ఈ ఒప్పందంలో భాగంగా కలిగి ఉంది?
ఎ. రావి బి. బియాస్
సి. జీలం డి. సట్లెజ్ ఇ. చీనాబ్
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, సి, ఇ
45. జతపరచండి?
1. దచిగాం జాతీయ పార్క్ ఎ. అసోం
2. ఇంద్రావతి జాతీయ పార్క్ బి. కేరళ
3. గరంపానీ జాతీయ పార్క్ సి. జమ్ముకశ్మీర్
4. పాల్ఘాట్ డి. ఛత్తీస్‌గఢ్
1) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
2) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
3) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి
4) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు