మొట్టమొదటిసారిగా స్త్రీలకు ఓటుహక్కు కల్పించిన దేశం?
- గవర్నర్ జనరల్‌కు ఆర్డినెన్స్ జారీచేసే అవకాశాన్ని కల్పించిన చట్టం?
1) 1909 2) 1861
3) 1935 4) 1919 - భారత ప్రభుత్వ చట్టం-1935లో సరికాని అంశం?
1) ఫెడరల్ న్యాయస్థానం ఏర్పాటు
2) సమాఖ్య వ్యవస్థ ప్రతిపాదన
3) ఆర్బీఐ ఏర్పాటు 4) ఏదీకాదు - సైమన్ కమిషన్ ముఖ్య ఉద్దేశం?
1) 1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టిన
సంస్కరణలను సమీక్షించడం
2) రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు
ప్రతిపాదనను పరిశీలించడం
3) డొమినియన్ ప్రతిపత్తిని సమీక్షించడం
4) పైవన్నీ - మహాత్మాగాంధీ హాజరైన రౌండ్ టేబుల్ సమావేశం?
1) 1వ రౌండ్ టేబుల్ సమావేశం
2) 2వ రౌండ్ టేబుల్ సమావేశం
3) 3వ రౌండ్ టేబుల్ సమావేశం
4) ఏదీకాదు - సీఆర్ ఫార్ములా దేనికి సంబంధించినది?
1) ప్రజాభిప్రాయం ద్వారా దేశవిభజన చేయడం
2) మైనార్టీలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడం
3) భాషా ప్రాతిపదికన రాష్ర్టాల ఏర్పాటు
4) ఏదీకాదు - లార్డ్లిన్లిత్గో ప్రతిపాదనకు గల మరొక పేరు?
1) ఆగస్ట్ ప్రతిపాదనలు 1940
2) సెప్టెంబర్ ప్రతిపాదనలు 1940
3) అక్టోబర్ ప్రతిపాదనలు 1940
4) ఏదీకాదు - కింది అంశాల్లో 1935 చట్టంలోని ముఖ్యాంశం ఏది?
1) రాజ్యాంగం ఏర్పాటు
2) సుప్రీంకోర్టు ఏర్పాటు
3) ఓటుహక్కు
4) ప్రొవిన్షియల్ స్వయంప్రతిపత్తి - ఈస్టిండియా కంపెనీ తన రాజకీయ, వ్యాపార విధులను వేరుచేస్తూ తెచ్చిన చట్టం?
1) 1773 రెగ్యులేటింగ్ చట్టం
2) 1784 పిట్స్ ఇండియా చట్టం
3) 1858 విక్టోరియా రాణి ప్రకటన
4) 1833 చార్టర్ చట్టం - 1935 చట్టానికి సరికాని వ్యాఖ్యలను గుర్తించండి?
1) స్వయం పాలనా పద్ధతిని ప్రవేశపెట్టారు
2) ఫెడరల్ కోర్టు తీర్పుపై అప్పీలుకు ఇంగ్లండ్‌లోని ప్రీవికౌన్సిల్‌కు వెళ్లాల్సి ఉంటుంది
3) ఈ చట్టం ఆధారంగా దేశంలో మొదటిసారిగా 1937 సాధారణ ఎన్నికలు జరిగాయి
4) గాంధీ నాయకత్వంలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడింది - బ్రిటిష్ ప్రభుత్వం సివిల్ సర్వీసుల వయోపరిమితిని 1878లో 19 ఏండ్లకు తగ్గించి… మళ్లీ ఎప్పుడు 24 ఏండ్లకు పెంచింది?
1) 1892 2) 1905
3) 1906 4) 1924 - ఏ ప్రణాళిక ఆధారంగా బ్రిటిష్ పార్లమెంట్ భారత స్వాతంత్య్ర బిల్లు 1947ను రూపొందించింది?
1) గొప్ప ప్రణాళిక
2) వేవెల్ ప్రణాళిక
3) మోతీలాల్ ప్రణాళిక
4) మౌంట్‌బాటన్ ప్రణాళిక - భారత్‌లో బ్రిటిష్ సివిల్ సర్వీసును ప్రవేశపెట్టింది ఎవరు?
1) మెట్కాఫ్ 2) లార్డ్ హార్డింజ్
3) లార్డ్ బెంటింక్ 4) లార్డ్ కారన్వాలిస్ - భారత పత్రికలపై పరిమితులను తొలగించింది ఎవరు?
1) చార్లెస్ మెట్కాఫ్ 2) డల్హౌసి
3) కారన్వాలిస్ 4) వెల్లస్లీ - 1833 ఛార్టర్ చట్టం ప్రకారం ప్రవేశపెట్టిన అంశాల్లో కింది వాటిలో సరికానిది?
1) ఈస్టిండియా కంపెనీ వాణిజ్య
కార్యకలాపాలను రద్దు చేసింది
2) కౌన్సిల్‌లోని ఉన్నతాధికారిని గవర్నర్
జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చింది
3) గవర్నర్ జనరల్ కౌన్సిల్‌లోని న్యాయమండలికి మొదటిసారిగా భారతీయుడిని నియమించారు
4) కౌన్సిల్ న్యాయచట్టాలను చేసే అధికారం గవర్నర్ జనరల్‌కు ఇచ్చారు - స్టాఫర్ట్ క్రిప్స్ కింది దేనిలో సభ్యుడు?
1) కన్జర్వేటివ్ పార్టీ 2) లేబర్ పార్టీ
3) లిబరల్ పార్టీ 4) అధికారశ్రేణి - మొట్టమొదటిసారిగా స్త్రీలకు ఓటుహక్కు కల్పించిన దేశం?
1) ఐస్లాండ్ 2) భారత్
3) న్యూజీలాండ్ 4) అమెరికా - భారత జాతీయకాంగ్రెస్ ఏర్పడినప్పుడు భారత వైశ్రాయ్ ఎవరు?
1) లార్డ్ డఫ్రిన్ 2) లార్డ్ కర్జన్
3) లార్డ్ లాన్స్డేన్ 4) లార్డ్ రిప్పన్ - భారత ప్రభుత్వ చట్టం 1919లోని ప్రధాన లక్షణాలు ఏమిటి?
ఎ. రాష్ర్టాల కార్యనిర్వాహక ప్రభుత్వంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం
బి. ముస్లింలను ప్రత్యేక మతపరమైన ఎలక్టోరేట్లను ప్రారంభించడం
సి. కేంద్ర, రాష్ర్టాలకు శాసన నిర్మాణ అధికారాన్ని సంక్రమింపజేయడం
1) ఎ 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి - మొదటిసారిగా ఏ బ్రిటిష్ చట్టం భారతీయులకు పాలనలో భాగస్వామ్యం కల్పించడానికి ఉద్దేశించింది?
1) ఇండియన్ కౌన్సిళ్ల చట్టం-1861
2) ఇండియన్ కౌన్సిళ్ల చట్టం-1892
3) ఇండియన్ కౌన్సిళ్ల చట్టం- 1909
4) గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ చట్టం-1919 - మౌంట్‌బాటన్ ప్రణాళిక లక్ష్యం?
1) సమాఖ్య ప్రభుత్వాన్ని ఏర్పరచడం
2) రాజ్యాంగసభ ద్వారా భారత రాజ్యాంగ రూపకల్పనకు మార్గదర్శకాలు ఇవ్వడం
3) బ్రిటిష్ వారి నుంచి భారతీయులకు
అధికారాన్ని బదిలీ చేసే పద్ధతి
4) ఆ కాలంలో చెలరేగిన మతకల్లోలాలను నివారించడానికి ప్రణాళిక - మతతత్వ నియోజకవర్గాల పితామహుడిగా ఎవరిని పిలుస్తారు?
1) లార్డ్ మింటో 2) లార్డ్ బెంటింక్
3) వారన్ హేస్టింగ్స్ 4) రాబర్ట్ ైక్లెవ్ - కింది వారిలో ఎవరు సతీసహగమనాన్ని చట్ట వ్యతిరేకంగా ప్రకటించారు?
1) లార్డ్ రిప్పన్
2) లార్డ్ కారన్ వాలిస్
3) లార్డ్ విలియం బెంటింక్
4) లార్డ్ లిన్లిత్గో - కింది వాటిలో ఏది ఉడ్స్ డిస్పాచ్ 1854 సిఫారసు కానిది?
1) సాంకేతిక విద్య, మహిళా విద్య కోసం స్కూల్స్ ఏర్పాటు చేయడం
2) ప్రైవేటు భాగస్వామ్యం కోసం గ్రాంట్లు ఇవ్వడం
3) బొంబాయి, బెంగాల్, మద్రాస్‌లలో యూనివర్సిటీ ఏర్పాటు
4) విద్యపై జాతీయ నియంత్రణ సంస్థ ఏర్పాటు - కింది వాటిలో సరికానిది?
1) 1800- ఫోర్ట్ విలియం కాలేజీ, కలకత్తా
2) 1806- ఈస్టిండియా కాలేజీ, కలకత్తా
3) 1813- ఛార్టర్ చట్టం
4) 1833- ఇండియన్ కౌన్సిల్ చట్టం - ద్వంద్వ పరిపాలన విధానంలో,ప్రాంతీయ ప్రభుత్వంలో ఎక్కువ అధికారాలు ఇచ్చింది?
1) ఇండియన్ కౌన్సిల్ చట్టం- 1892
2) భారత ప్రభుత్వ చట్టం- 1909
3) భారత ప్రభుత్వ చట్టం-1909
4) గాంధీ-ఇర్విన్ ఒడంబడిక
భారత రాజ్యాంగం స్వతహాగా ఏర్పాటు చేసుకున్న లక్షణాలు
రాష్ట్రపతిని ఎన్నుకునే నియోజకగణం (ఎలక్ట్ట్రోరల్ కాలేజీ), రాష్ట్రపతిగా ఒకే వ్యక్తిని గరిష్టంగా రెండు పర్యాయాలు మాత్రమే ఎన్నుకోవడం సాంప్రదాయంగా వస్తుంది.
పంచాయతీరాజ్ వ్యవస్థ
అఖిల భారత సర్వీసులు
అల్ప సంఖ్యాకవర్గాల వారికి ప్రత్యేక హక్కులు
రక్షిత వ్యవస్థ
ఆర్థిక సంఘం
కేంద్ర, రాష్ర్టాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు
భాషా సంఘాలకు సంబంధించిన ప్రత్యేకాంశాలు
భారత రాజ్యాంగం గ్రహించిన ప్రధాన అంశం
భారత ప్రభుత్వ చట్టం (1935) కేంద్ర రాష్ట్ర సంబంధాలు, గవర్నర్ విచక్షణాధికారాలు, ఫెడరల్ న్యాయస్థానం, అత్యవసర పరిస్థితికి సంబంధించిన విషయాలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, పరిపాలన విషయాలు, సమాఖ్య వ్యవస్థ, రాష్ట్రపతి పాలన (ప్రకరణ 356)
బ్రిటిష్ రాజ్యాంగం పార్లమెంటరీ ప్రభుత్వ విధానం, ద్విసభా విధానం, శాసనసభ సభ్యుల హక్కులు, కేబినెట్ ప్రభుత్వం, ఎన్నికల వ్యవస్థ,శాసననిర్మాణ ప్రక్రియ, స్పీకర్, డిప్యూటీస్పీకర్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అటార్నీ జనరల్, సమన్యాయపాలన,ఏకపౌరసత్వం, రిట్లు జారీ చేసే విధానం, సమీకృత, ఏకీకృత న్యాయవ్యవస్థ, దేశాధిపతి నామమాత్రపు అధినేతగా వ్యవ-రించడం, దిగువసభ ఆధిక్యత, మంత్రిమండలి దిగువసభకు బాధ్యత వహించడం.
అమెరికా సంయుక్త రాష్ర్టాలులిఖిత రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ ఆధిక్యత ప్రవేశిక, న్యాయసమీక్ష, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయశాఖ,(యూఎస్ఏ రాజ్యాంగం)రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం, న్యాయమూర్తుల తొలగింపు, ఉపరాష్ట్రపతి పదవి, వాణిజ్య, వ్యాపార-లావాదేవీలు, అంతర్రాష్ట్ర వ్యాపారం, రాజ్యాంగ సవరణ ప్రక్రియలో రాష్ర్టాలు పాల్గొనడం, దేశాధినేత పేరు మీద పరిపాలనను నిర్వహించడం.
ఆస్ట్రేలియా రాజ్యాంగం ఉమ్మడి జాబితా, ఉభయసభల సంయుక్త సమావేశం, స్వేచ్ఛా వాణిజ్య, వ్యాపార చట్టాలు దక్షిణాఫ్రికా రాజ్యాంగం రాజ్యాంగ సవరణ పద్ధతి (368), రాజ్యసభ సభ్యుల ఎన్నిక పూర్వపు U.S.S.R రాజ్యాంగం ప్రాథమిక విధులు, సామ్యవాద సూత్రాలు, ప్రవేశికలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, దీర్ఘకాలిక ప్రణాళిక ఐరిష్ రాజ్యాంగం ఆదేశిక సూత్రాలు, రాజ్యసభకు సభ్యులను నామినేట్ చేసే విధానం, నైష్పత్తిక ప్రాతినిథ్య పద్ధతి, రాష్ట్రపతి ఎన్నిక.
జపాన్ రాజ్యాంగం 21వ ప్రకరణ జీవించే హక్కు, ‘చట్టం నిర్ధారించిన పద్ధతి’
కెనడా రాజ్యాంగం అవశిష్టాధికారాలు కేంద్ర ప్రభుత్వానికివ్వడం, ప్రకరణ 143 ప్రకారం రాష్ట్రపతి, సుప్రీంకోర్టు సలహాను కోరడం, బలమైన కేంద్రం గల సమాఖ్య, కేంద్రం ద్వారా గవర్నర్ల నియామకం, సుప్రీంకోర్టు సలహా రూపక పరిధి.జర్మనీ (వైమర్) రాజ్యాంగం అత్యవసర పరిస్థితి సమయంలో ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయడంఫ్రెంచ్ రాజ్యాంగం ప్రవేశికలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆదర్శాలు, గణతంత్ర విధానం, తాత్కాలిక సభాధ్యక్షుల నియామకం.
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు